మోకాళ్ళనొప్పులు, కీళ్ళనొప్పులును ఎఫెక్టివ్ గా తగ్గించే ఎప్సమ్ సాల్ట్

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ఒకప్పుడు ఉప్పు విలువై వస్తువు..దేశాలను సంపన్నం చేసిన ధనం...సైనికులకి అదే జీతం. అబ్బో...చెప్పుకోవాలంటే ఉప్పు గొప్ప ఒప్పుకోక తప్పనిదే ! ఒకప్పుడు అది డబ్బుతో సమానం. ఇది దేశాల ఆర్థిక స్థితిగతులనే మార్చింది. 'జీతం' అనే పదం పుట్టడానికి కారణమయ్యింది. కొన్ని దేశాల్లో సైనికులకు ఉప్పునే జీతంగా ఇచ్చేవారు మరి పురాతన కాలంలో 'తెల్ల బంగారం' అని పిలుచుకునే వారు. ఇక మనదేశంలో ఉప్పు సత్యాగ్రహం ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో మనందరికీ తెలిసిన విషయమే... కదా?

ఉప్పుతినాలా? వద్దా? ...ఉప్పు తప్పనిసరిగా ఆహారములో తీసుకోవాలి. నార్మల్‌ గా ఏవ్యాధ్యులు లేనివారు రోజుకి 6(ఆరు) గ్రాములు అన్ని విధాలా మొత్తముగా తీసుకోవాలి. గుండెజబ్బులు, బి.పి. ఉన్నవారు ఇందులో సగము... సుమారు 2.5.-3.0 గ్రాములు వాడాలి.

ఉప్పులో రకాలు : ఉప్పులో సోడియం, క్లోరైడ్‌ అను రెండు పదార్థాలు ఉంటాయి. ఉప్పులో రకాలు వాటి ప్రయోజనాలు తెలుసుకుందాం..

కామన్‌ స్టాల్‌ :

కామన్‌ స్టాల్‌ :

ఇది మనము కిచెన్‌ లో వాడే రకము. సముద్రపు నీటినుండి తయారుచేసి శుభ్రం చేస్తారు. కొన్ని రసాయనాలు కలిపి ఫ్రీగా పొడుముగా ఉండేలా చేస్తారు.

అయోడైజ్జ్‌ సాల్ట్‌ :

అయోడైజ్జ్‌ సాల్ట్‌ :

కామన్‌ సాల్ట్‌కు అయోడిన్‌ కలుపుతారు. ఉప్పును శుభ్రము చేసినపుడు అయోడిన్‌ పోతుంది. అయోడిన్‌ వల్ల థైరాయిడ్‌ వ్యాధులు వస్తాయి. అందువల్ల ఉప్పుకు అయోడిన్‌ కలిపి తయారు చేస్తారు.

సీ సాల్ట్‌ :

సీ సాల్ట్‌ :

సమద్రపు నీటినుండి తయారుచేసి ఉప్పుస్పటికాలు. దీనిలో కొద్దిగా అయోడిన్‌, పోటా షియం, మెగ్నీషియం ఉంటాయి. పూర్వము వంటలలో దీనిలో కొద్దిగా అయోడిన్‌, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. పూర్వము వంటలలో దీనినే వాడేవారు.

రాక్‌స్టాల్‌ :

రాక్‌స్టాల్‌ :

పింక్‌ రంగులో ఉంటుంది. ఇది రిఫైన్‌ చేసింది కాదు. కాబట్టి అన్ని మినరల్స్‌ యదాతదంగా ఉంటాయి. ఎసిడిటీని తగ్గిస్తుంది.

ఎప్సమ్‌ సాల్ట్‌ :

ఎప్సమ్‌ సాల్ట్‌ :

మెగ్నీషియం సల్ఫేట్ దీన్ని వంటకాలలో వాడరు. మందులషాపులలో దొరుకుతుంది. స్నానము చేసి నీటిలో కలిపి వాడితే శారీరక నొప్పులు తగ్గుతాయి. కండరాలను సడలిస్తుంది. చర్మముపై మృతకణాలను తొలగిస్తుంది.

టాక్సిన్స్ ను నివారిస్తుంది:

టాక్సిన్స్ ను నివారిస్తుంది:

ఎస్పమ్ సాల్ట్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల అందులో ఉండే మెగ్నీషియం సల్ఫేట్ శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. హానికరమైన టాక్సిన్స్ ను తొలగించి ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.

ఎప్సమ్ సాల్ట్ లోని మెగ్నీషియం సల్ఫెట్ స్ట్రెస్ తగ్గిస్తుంది:

ఎప్సమ్ సాల్ట్ లోని మెగ్నీషియం సల్ఫెట్ స్ట్రెస్ తగ్గిస్తుంది:

ఎప్సమ్‌ సాల్ట్‌లో మెగ్నీషియం సల్ఫేట్‌ ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఒత్తిడిని అరికడుతుంది. ఎప్సమ్‌ సాల్ట్‌ ఆందోళనను తగ్గించి, మనస్సును రెగ్యులేట్‌ చేస్తుంది. ప్రశాంతత పరుస్తుంది. గోర్చువెచ్చని నీటిలో ఎప్సమ్‌ సాల్ట్‌ వేసి, స్నానం చేస్తే ఆందోళన తగ్గి, ఉపశమనం కలుగుతుంది.

ఎప్సమ్ సాల్ట్ (మెగ్నీషియం సల్ఫేట్) మోకాళ్ళనొప్పులను చాలా ఎఫెక్టిగ్ నివారిస్తుంది:

ఎప్సమ్ సాల్ట్ (మెగ్నీషియం సల్ఫేట్) మోకాళ్ళనొప్పులను చాలా ఎఫెక్టిగ్ నివారిస్తుంది:

ఎప్సమ్ సాల్ట్ లో ఉండే హైలెవల్స్ మెగ్నీషియం మోకాళ్ళనొప్పులను చాలా ఎఫెక్టిగ్ నివారిస్తుంది. ఈ సాల్ట్ ను నీళ్ళలో వేసి, కరిగిన తర్వాత ఈ నీటిలో కాళ్ళను డిప్ చేయాలి . ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. ఇంకా మీరు ఈ ఎప్సమ్ సాల్ట్ యొక్క నీటితో స్నానం కూడా చేయవచ్చు.

ఎప్సమ్‌ సాల్ట్‌ ముఖ్యంగా పాదాల వాపును తగ్గించటంలో దీని పాత్ర కీలకం:

ఎప్సమ్‌ సాల్ట్‌ ముఖ్యంగా పాదాల వాపును తగ్గించటంలో దీని పాత్ర కీలకం:

ఎప్సమ్‌ సాల్ట్‌ ముఖ్యంగా పాదాల వాపును తగ్గించటంలో దీని పాత్ర కీలకం. గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా ఎప్సమ్‌ సాల్ట్‌ను వేసి దాంట్లో కాటన్‌ టవల్‌ను ముంచి పాదాలపై నెమ్మదిగా మర్దన చేస్తే సరిపోతుంది. ఇలా రోజుకు ఓ సారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మలబద్దకం నివారిస్తుంది:

మలబద్దకం నివారిస్తుంది:

ఎస్సమ్ సాల్ట్ లోని మెగ్నీషియం సల్ఫేట్ ను తీసుకోవడం వల్ల మంచి జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్దకం సమస్యను వారిస్తుంది.జీర్ణ సమస్యలను దూరం చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

English summary

Incredible Health Benefits Of Epsom Salt

The main difference between table salt and Epsom salt is the fact that table salt consists of sodium and chloride, whereas Epsom salt is purely made up of magnesium sulphate.
Subscribe Newsletter