For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ లక్షణాలు కిడ్నీ ఫెయిల్యూర్ కు సంబంధించినవి, వెంటనే డాక్టర్ ను కలవండి..

By Inspiration
|

కిడ్నీలు అనేవి మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆకారంలో ఉండాలి. అటువంటి కిడ్నీలు చెడిపోయాయి అని చెప్పటానికి 10 సంకేతాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. వ్యవస్థ నుంచి వచ్చే వ్యర్ధాలు మరియు అదనపు ద్రవాలను బయటకు ఫ్లషింగ్ చేస్తుంది. రక్తపోటు మరియు ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాక ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి మరియు ఆరోగ్యకరమైన ఎముకలకు భరోసా ఇస్తుంది.

కిడ్నీ సమస్యలు శాశ్వతంగా దూరం చేసుకోవాలంటే..తినాల్సిన పండ్లు

అటువంటి ముఖ్యమైన అవయవంనకు ఇబ్బంది కలిగితే మొత్తం శరీర వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. అందువల్ల కిడ్నీల పట్ల సరైన శ్రద్ద వహించాలి. శరీరం యొక్క కీలకమైన భాగం అయిన కిడ్నీల సమస్య ఉన్నప్పుడు ఇచ్చే సంకేతాలను పట్టించుకోవాలి.

ఇక్కడ కిడ్నీ సమస్య ఉన్నప్పుడు చూపే 10 సంకేతాలు ఉన్నాయి.

1. మూత్రవిసర్జన రంగులో మార్పు

1. మూత్రవిసర్జన రంగులో మార్పు

మూత్రవిసర్జనకు కిడ్నీలకు సంబంధం ఉంటుంది. అందువల్ల మూత్రం రంగు మారిన, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్టు గుర్తించాలి.

2. నోటిలో చెడు రుచి

2. నోటిలో చెడు రుచి

కిడ్నీలు సరిగా పనిచేయకపొతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్థమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్ధాలు రక్తంలో కలుస్తాయి. దాంతో నోటిలో చెడు రుచి కలుగుతుంది. కిడ్నీలు తీవ్రంగా చెడిపోతే రుచి సామర్ధ్యం మరియు ఆకలి బాగా తగ్గిపోతుంది.

3. వాంతులు

3. వాంతులు

తరచుగా వికారం మరియు వాంతులు వస్తాయి. ఇది రక్తంలో వ్యర్ధాల ఫలితంగా జరుగుతుంది. ఈ వికారం ఆకలిని తగ్గిస్తుంది. దాంతో అది బరువు నష్టానికి దారి తీస్తుంది.

4. శరీరం ఉబ్బటం

4. శరీరం ఉబ్బటం

కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం వలన అదనపు ద్రవాలను బయటకు పంపే ఫ్లషింగ్ విధానం దెబ్బతింటుంది. దాంతో అవి శరీరంలో పెరిగిపోయి ముఖం మరియు శరీర భాగాలు ఉబ్బినట్టు కన్పిస్తాయి.

5. అలసట

5. అలసట

కిడ్నీలు ఎరిత్రో పయోటిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తాయి. అవి శరీరంలో ఆక్సిజన్ సరఫరా చేసే ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని చేస్తాయి. ఒకేవేళ కిడ్నీల పనితీరు తగ్గితే ఎర్ర రక్తకణాల ఉత్పత్తి మీద ఆ ప్రభావం పడుతుంది. అలసట మరియు మెదడు మరియు కండరాలకు ప్రమాదం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. తీవ్రమైన సందర్భంలో రక్తహీనత కూడా వస్తుంది.

6. చర్మం మీద దద్దుర్లు

6. చర్మం మీద దద్దుర్లు

కిడ్నీల పనితీరు సరిగా లేనప్పుడు దద్దుర్ల వంటి చర్మ సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్యకు బయట పూతలు ఏమి పనిచేయవు. ఎందుకంటే అసలు మూల కారణం చాలా లోతుగా ఉంది.

కిడ్నీ స్టోన్స్ ను శాస్వతంగా నివారించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

7. నొప్పి

7. నొప్పి

కిడ్నీలు ఉండే వీపు ప్రాంతంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలు చెడిపోయినప్పుడు కనిపించే సాధారణ సంకేతం. ఈ నొప్పితో పాటు కిడ్నీలలో ఇన్ ఫెక్షన్ మరియు రాళ్లకు కూడా కారణం అవుతుంది.

8. శ్వాసలో తేడా

8. శ్వాసలో తేడా

కిడ్నీలు చెడిపోయినప్పుడు ఆ ప్రభావం రక్తకణాల ఉత్పత్తి మీద పడుతుంది. దాంతో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి శ్వాస సమస్యలకు కారణం అవుతుంది. అంతేకాక ఊపిరితిత్తులలో టాక్సిన్లు చేరి మరో పెద్ద సమస్య ఉత్పన్నం అవుతుంది.

9. బలహీనమైన మెమొరీ

9. బలహీనమైన మెమొరీ

ఆక్సిజన్ సరఫరా తగ్గటం అనేది మెదడు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. దాంతో ఏకాగ్రత లోపించటం,తలనొప్పి మరియు జ్ఞాపకశక్తి తగ్గటం జరుగుతుంది.

10. కోల్డ్ ఫీలింగ్

10. కోల్డ్ ఫీలింగ్

వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కూడా కోల్డ్ ఫీలింగ్ ఉంటుంది. ఇది కిడ్నీలు సరిగా పనిచేయటం లేదని చెప్పటానికి సంకేతం. కిడ్నీ సమస్యల కారణంగా రక్తహీనత వస్తుందని చెప్పుకున్నాం కదా. దాని వలనే కోల్డ్ ఫీలింగ్ కలుగుతుంది.

English summary

Signs that your Kidney is in Danger: Dial A Doctor If You Notice These 10 Signs

Here are 10 signs that hint at a possible malfunctioning of the kidney and one should waste no time to see a specialist for a timely treatment. Take a look.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more