గ్రీన్ టీ లో కంటే అద్భుతమైన ప్రయోజనాలున్న చామంతి టీ ..!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

నిద్ర లేచింది మొదలు నిద్రపోయేవరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. నిస్సత్తువగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ తాగడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపడం జీవితంలో ఓ అంతర్భాగమైంది. మ‌నిషికి ప్ర‌శాంతంగా ఉండ‌టంతో పాటు ఆరోగ్యం కాపాడుకోవ‌డానికి హెర్బ‌ల్ టి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

హెర్బల్ ట్రీట్మెంట్సే బెటర్ సాధారణంగా టీ, కాఫీలు అనారోగ్యమని చెబుతుంటారు. కానీ హెర్బల్ టీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మూసుకుపోయిన రక్తనాళాలను వ్యాకోచం చెందేలా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉత్తేజాన్ని కల్గించే ఆహార పదార్థాలలో టీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.

Top Health Benefits Of Chamomile Tea

అలసటగా అనిపించినప్పుడు చాలా మంది టీ తాగాలనుకుంటారు. అయితే సాధారణ టీకి బదులు హెర్బల్ టీ తాగితే రిలాక్సేషన్ తో పాటు, హెల్త్ కి కూడా చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. హెర్బల్ టీలో రకరకాల వనమూలికలు ఉంటాయి. ఇది రుచికరమే కాక అనేక ఔషధాలు మెండుగా ఉంటాయి. హెర్బల్ టీ తాగడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

సాధారణంగా తేయాకుతో తయారు చేసిన టీలతో పాటు గ్రీన్‌ల టీల గురించే ఎక్కువగా తెలుసు. కానీ, ఇపుడు చామంతి టీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ చామంతి పూల తేనీరు సేవించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పలువురు పరిశోధకులు చెపుతున్నారు. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం.

నొప్పి తగ్గిస్తుంది:

నొప్పి తగ్గిస్తుంది:

చమోమెలీ టీలోమజిల్ రిలాక్స్ చేసే లక్షణాలు అధికంగా ఉన్నాయి. మహిళల్లో మెనుష్ట్రువల్ క్రాంప్స్ యూట్రస్ కండరాలన నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి, చామంతి టీని పెయిన్ రిలీఫ్ గా ఉపయోగిస్తుంటారు.

 మైగ్రేన్ తో పోరాడుతుంది:

మైగ్రేన్ తో పోరాడుతుంది:

చామంతి టీని రెగ్యులర్ గా తాగడం వల్ల పెద్దవారిలో దీర్ఘకాలంగా వేధిస్తున్న మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

జలుబు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది:

జలుబు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది:

చామంతి టీ వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జలుబు, దగ్గుకు సంబంధించిన లక్షణాలను నివారించే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఇందులో అధికంగా ఉన్నాయి.

డయాబెటిస్ ను నివారిస్తుంది:

డయాబెటిస్ ను నివారిస్తుంది:

ఈ టీ బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. దాంతో డయాబెటిస్ క్రమబద్దం అవుతుంది. హెల్తీ డైట్ లో చామంతి టీ తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది.

ఇన్ఫ్లమేషన్ ను నివారిస్తుంది:

ఇన్ఫ్లమేషన్ ను నివారిస్తుంది:

చామంతి టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది. కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది.

. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

చామంతి టీని రెగ్యులర్ గా తాగుతుంటే, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వివిధ రకాల సమస్యలను దూరం చేస్తుంది. గ్యాస్ , కడుప్పబ్బరం, కోలిక్, డయోరియా, ఐబియస్ వంటి సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది.

 క్యాన్సర్ నివారిణి:

క్యాన్సర్ నివారిణి:

ఈ టీ క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేస్తుంది. క్యాన్సర్ సంబంధిత లక్షణాలు, వ్యాధులతో పోరాడే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. చామంతి టీని రెగ్యులర్ గా తాగడం వల్ల క్రోనిక్ డిసీజ్ ను తగ్గించుకోవచ్చు.

డిప్రెషన్ తగ్గిస్తుంది:

డిప్రెషన్ తగ్గిస్తుంది:

రోజంతా పనిఒత్తిడితో అలసిపోయినప్పుడు ఒక కప్పు చామంతి టీ తాగడం వల్ల ,ఈ టీలో ఉండే కొన్ని గుణాలు నాడీవ్యవస్థను ప్రశాంత పరుస్తుంది. డిప్రెషన్, ఆందోళన తగ్గించడంలో మరియు స్ట్రెస్ తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది. ఈ చామంతి టీ తాగడం వల్ల మనస్సు ప్రశాంతగా ఉంటుంది

 చర్మం ఆరోగ్యం మెరుగుపరుస్తుంది:

చర్మం ఆరోగ్యం మెరుగుపరుస్తుంది:

చామంతి టీలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బమైక్రోబయల్ లక్షణాలు చర్మానికి మేలు చేస్తాయి. రాషెస్ తగ్గించి చర్మకాంతిని, స్కిన్ ఎలాసిటిని పెంచుతాయి.

English summary

Top Health Benefits Of Chamomile Tea

Chamomile tea was found to have the strongest concentrations of beneficial compounds and nutrients, as per a study, that are extremely good for those who consume it on an everyday basis.
Story first published: Thursday, March 9, 2017, 14:00 [IST]
Subscribe Newsletter