For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా చేస్తే నరనరాల్లో ఉండే డ్రగ్స్ వ్యర్థాలు బయటకు పోతాయి, డ్రగ్స్ బాబులు ఇలాగే చేస్తారు

విరుగుడుకు డీటాక్సిఫికేషనూ ఓ అస్త్రంలా పని చేస్తుంది. హైపో థెరపీ.. చిలేషన్‌ లాంటి ప్రక్రియలు ద్వారా చాలా మంది డ్రగ్స్‌ అవశేషాల తొలగించుకుంటుూ ఉంటారు. రీరంలోని మలినాలను తొలగించుకోవడం, డీటాక్సిఫికేషన్.

|

విరుగుడుకు డీటాక్సిఫికేషనూ ఓ అస్త్రంలా పని చేస్తుంది. హైపో థెరపీ.. చిలేషన్‌ లాంటి ప్రక్రియలు ద్వారా చాలా మంది డ్రగ్స్‌ అవశేషాల తొలగించుకుంటుూ ఉంటారు. ఆ మధ్య డ్రగ్స్‌ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైన కొందరు తెలుగు సినీ ప్రముఖులు కలబంద జ్యూస్ తాగారని చాలా పుకార్లు వచ్చాయి. అవి ఎంత వరకు నిజమో కాదో తెలియదు కానీ కలబందకు మాత్రం డ్రగ్స్‌ అవశేషాలు దొరక్కుండా చేసే శక్తి ఉంది. కలబంద రసం (అలోవీరా జ్యూస్‌) తాగితే చాలా ప్రయోజనాలుంటాయి.

మలినాలను బయటకు పోతాయి

మలినాలను బయటకు పోతాయి

బాడీని‘డిటాక్సిఫికేషన్‌' చేయించుకుంటే శరీరంలోని మలినాలను మొత్తం బయటకు వెళ్లి పోతాయి. బాడీ ఫ్రెష్ గా మారుతుంది. కొన్ని పద్ధతుల ద్వారా డిటాక్సిఫికేషన్‌ చేసుకుంటే జీర్ణాశయం, పేగుల్లోని మలినాలు శుద్ధి అవుతాయి.

డీటాక్సిఫికేషన్‌ అంటే ఇదే

డీటాక్సిఫికేషన్‌ అంటే ఇదే

డీటాక్సిఫికేషన్‌ అంటే... శరీరంలోని మలినాలు, ఇతర విష పదార్థాలను తొలగించే ప్రక్రియ. కొన్ని జీవక్రియల ద్వారా మలినాలు, విష పదార్థాలు వాటంతట అవే తొలగిపోతాయి. అవసరమనుకుంటే కృత్రిమ ప్రక్రియల ద్వారా కూడా తొలగించవచ్చు.

విషపదార్థాలను తొలగించడం

విషపదార్థాలను తొలగించడం

ఫుడ్‌పాయిజన్‌ సందర్భాల్లో డాక్టర్లు విష పదార్థాలను తొలగించడం ఇదే కోవలోకి వస్తుంది. నోటిద్వారా తీసుకున్న ఆహారం జీర్ణాశయంలో జీర్ణం అవుతుంది. వ్యర్థాలన్నీ మలమూత్రాలు, స్వేదం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. మత్తు పదార్థాలు తీసుకున్నవారిలో కొన్ని టాక్సిన్లు, డ్రగ్స్‌ అవశేషాలు చాలారోజులు శరీరంలోనే ఉండిపోతాయి. వాటిని డీటాక్సిఫికేషన్‌ ద్వారా బయటకు పంపిస్తారు.

స్టీమ్ బాత్

స్టీమ్ బాత్

స్టీమ్‌ బాత్‌ ద్వారా శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమట ఎక్కువ మోతాదులో బయటకు వస్తుంది. శరీరంలో ఏమైనా టాక్సిన్లు ఉంటే చెమట ద్వారా వెళ్లిపోతాయి. ఎఫ్‌ఐఆర్‌(ఫార్‌ ఇన్‌ఫ్రారెడ్‌) ప్రక్రియలోనూ కార్బన్‌ హీటర్స్‌తో శరీర ఉష్ణోగ్రత పెంచుతారు. ఈ పద్ధతిలోనూ చెమట రూపంలో విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

హైపోథెరపీ

హైపోథెరపీ

కొన్ని సందర్భాల్లో ‘హైపోథెరపీ' చేస్తుంటారు. అంటే.. ‘కొలోన్‌(మల మార్గం)' ద్వారా ట్యూబ్‌ను పంపించి కడుపు, పేగుల్లోని మలినాలను తొలగించి శుభ్రం చేస్తారు.

చిలేషన్

చిలేషన్

ఇక రక్త నమూనాల్లో డ్రగ్స్‌ అనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు కొందరు ‘చిలేషన్‌' అనే ఒక ప్రక్రియను కూడా అనుసరిస్తుంటారు. ఈ ప్రక్రియలో సెలైన్‌ బాటిళ్ల ద్వారా రసాయనాన్ని బాడీలోకి ఎక్కిస్తారు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

కలబంద రసం తాగడం

కలబంద రసం తాగడం

ఇక కలబంద రసం తాగడం వల్ల కడుపు, పేగుల్లోని మలినాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. మార్కెట్లో రకరకాల ఫ్లేవర్లతో అలోవీరా జ్యూస్‌ దొరుకుతోంది. దీనిలో సహజంగా ఉండే చేదు గుణం పోవడానికి స్ట్రాబెర్నీ, యాపిల్‌ వంటి ఫ్లేవర్లను కలుపుతున్నారు. ఇలాంటి జ్యూస్‌లను ఏ ఇబ్బంది లేకుండా తాగేయవచ్చు. దీంతో రక్తం నమూనాలను సేకరించినా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల 90 శాతం మేర ఫలితాలుంటాయి.

వివిధ రకాల డిటాక్సిఫికేషన్‌ ప్రక్రియలు

వివిధ రకాల డిటాక్సిఫికేషన్‌ ప్రక్రియలు

వివిధ రకాల డిటాక్సిఫికేషన్‌ ప్రక్రియలతో శరీరంలోని డ్రగ్స్‌ అవశేషాలను తొలగించుకోవచ్చు. ఆ మధ్య చాలా మంది తెలుగు సినీ ప్రముఖులు ఇలాంటి ప్రక్రియలను అనుసరించి విచారణకు హాజరయ్యారని రూమర్లు కూడా వచ్చింది. అది ఎంత వరకు నిజమో కాదో మనకు మాత్రం తెలియదు.

నీటి ద్వారా

నీటి ద్వారా

నిమ్మ, నారింజ, పుచ్చ లాంటి ఫలాలను నీటిలో కలుపుకొంటే వాటి రసం నీటిలో కలిసి మంచి వాసన, రుచి వస్తాయి. అంతేకాదు... ఈ రకమైన నీరు శరీరాన్ని శుభ్రం చేసేందుకు డీటాక్సిఫయర్‌గా పనిచేస్తుందట. మన శరీరంలో పేరుకుపోయే ఆమ్ల పదార్థాలన్నీ విషతుల్యమైనవే. వీటికి క్షార గుణం కలిగిన నీరు మంచి అస్త్రంగా పనిచేస్తుంది. అందుకే నీరు ఆమ్ల పూరితమైన హానికర పదార్థాలను శరీరం నుంచి బయటికి పంపించివేస్తుంది. తద్వారా శరీరం శుభ్రపడుతుంది. అయితే దీని ద్వారా డ్రగ్స్ కారకాలను మొత్తం బయటకు పంపడం సాధ్యం కాకపోవొచ్చు.

English summary

10 easy ways to detox your body in just 24 hours

10 easy ways to detox your body in just 24 hours
Story first published:Saturday, May 19, 2018, 12:42 [IST]
Desktop Bottom Promotion