For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హ్యాంగోవర్ సమయంలో ఈ 10 ఆహారాలు మరియు పానీయాలు తీసుకుంటే పరిస్థితి మరింత హానికరంగా మారుతుంది

By R Vishnu Vardhan Reddy
|

కొన్ని గ్లాసుల మద్యాన్ని సేవించిన వెంటనే, దాదాపు ప్రతి ఒక్క వ్యక్తి ఒక చెడ్డ హ్యాంగోవర్ ని అనుభవించే ఉంటారు. మీరు ఎంతగా మద్యపానీయాన్ని తాగకుండా ఉండాలని మిమ్మల్ని మీరు నియంత్రించుకున్నప్పటికీ కూడా. మీలో ఉన్న కోరిక ఆ పనిచేయనివ్వదు. ఎదో బాధ్యతగా రెండు నిమ్మకాయ ముక్కలు పెట్టుకొని మద్యం తాగేస్తే అది అస్సలు మంచిది కాదు.

ఒక గుర్తించబడ్డ అధ్యయనం ప్రకారం, దాదాపు 76% మంది పెద్దలు మద్యం త్రాగిన తర్వాత ఎదో ఒక రకమైన హ్యాంగోవర్ ని అనుభవిస్తారట. శరీరంలో నీరు శాతం తగ్గిపోవడం, కండరాల నొప్పులు, తల నొప్పి, కళ్ళు తిరుగుతున్నట్లు ఉండటం, మత్తుగా ఉండడటం, వాంతులు అయ్యేలా ఉండటం, గుండె విపరీతంగా కొట్టుకోవడం, వికారంగా ఉండటం మరియు వెలుగుని అస్సలు స్వీకరించలేకపోవడం లాంటి ఎన్నో లక్షణాలు హ్యాంగోవర్ సమయంలో ఒక వ్యక్తిలో కనపడతాయి.

మీరు ఎప్పుడైతే విపరీతమైన హ్యాంగోవర్ కి లోనవుతారో అటువంటి సమయంలో మీ శరీరంలో నీరు అంతా బయటకు వెళ్ళిపోతుంది మరియు మీరు ఎక్కువగా అలసిపోయినట్లు ఉంటారు. అంతేకాకుండా రోజంతా నిద్రపోతూనే ఉంటారు. దీనికితోడు మీకు ఆహారం అస్సలు తినాలి అని అనిపించదు. ఎందుకంటే, మీరు విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతూ ఉంటారు. ఈ అన్నింటి వల్ల మీరు మరింతగా అలసిపోతారు.

ఈ రోజు ఈ వ్యాసంలో హ్యాంగోవర్ సమయంలో ఏ ఏ ఆహారాలను మరియు పానీయాలను తీసుకుంటే, పరిస్థితి మరింతగా దిగజారుతుందో తెలుసుకోబోతున్నాం. హ్యాంగోవర్ సమయంలో ఈ పది ఆహార పానీయాలను పూర్తిగా నిషేధించాలి.

1. వేయించిన ఆహారాలు :

1. వేయించిన ఆహారాలు :

వేయించిన మరియు నూనెతో చేసిన ఆహారాలు ఏవైతే ఉన్నాయో, వాటిల్లో విపరీతమైన కేలరీలు మరియు కార్బో హైడ్రేట్లు ఉంటాయి. వాటిని తినాలి అనే కోరిక మీలో చాలా ఎక్కువగా ఉండవచ్చు. కానీ, మిమ్మల్ని ఏమని హెచ్చరించరించ దలిచారంటే, ఇటువంటి వేయించిన ఆహారాలను తీసుకోవడం అస్సలు మంచి ఆలోచన కాదని చెబుతున్నారు. ఒకవేళ మీరు గనుక ఆ ఆహారాలను తింటే మరింత అలసిపోయి శక్తి హీనులుగా మారుతారు. వేయించిన మరియు నూనెతో చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల, అవి మీ పొట్టలో ఇబ్బందిని కలిగిస్తాయి మరియు జీర్ణ సంబంధిత సమస్యలకు కారణం అవుతాయి.

2. కాఫీ :

2. కాఫీ :

చాలా మంది హ్యాంగోవర్ సమయంలో కొన్ని కప్పుల కాఫీ తాగితే సమస్య పరిష్కారం అవుతుంది అని భావిస్తారు మరియు ఆలా త్రాగినప్పుడు వారికి కొద్దిగా సాధారణ స్థితికి వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ, ఇలా చేయడం చాలా తప్పు. హ్యాంగోవర్ సమయంలో కాఫీ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ పరిస్థితి మరింతగా దిగజారుతోంది. ఎందుకంటే, ఎప్పుడైతే కెఫిన్ మీ శరీరంలో విచ్ఛిన్నం అవుతుందో అటువంటి సమయంలో మీరు అనూహ్యంగా శక్తిని కోల్పోతారు మరియు నీరసం విపరీతంగా పెరిగిపోతుంది.

3. బర్గర్ :

3. బర్గర్ :

రుచికరమైన బర్గర్ తినాలని ఎవరికి ఉండదు? దాదాపు ప్రతి ఒక్కరికి తినాలని అనిపిస్తుంది. ఉదయాన్నే మాంసాహారంతో చేసిన బర్గర్ తినడం అనేది చాలా చెడ్డ ఆలోచన. ఎందుకో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ? ఎందుకంటే, బర్గర్ లో విపరీతమైన కేలరీలతో పాటు, కొవ్వు పదార్ధాలు కూడా ఉంటాయి. దీని వల్ల మీ కడుపు బాగా ఉబ్బిపోయినట్లు అయిపోతుంది మరియు గ్యాస్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో మీరు మరింత అసౌకర్యంగా భావిస్తారు.

4. నారింజ పండు రసం :

4. నారింజ పండు రసం :

కొంతమంది హ్యాంగోవర్ సమయంలో నారింజ పండు రసం తీసుకోవడం వల్ల హ్యాంగోవర్ పూర్తిగా నయం అవుతుంది అని భావిస్తారు. అదే సరైన పద్దతి అని అనుకుంటారు. కానీ, అది తప్పు. నారింజలలో ప్రకృతి సిద్దమైన చక్కెర పదార్ధాలు ఉంటాయి మరియు అందులో ఆమ్ల స్వభావం కూడా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ పండు రసాన్ని త్రాగుతారో, అప్పుడు వీటి వల్ల మీ కడుపులో చికాకు విపరీతంగా పెరిగిపోతుంది మరియు మీకు దాహం కూడా విపరీతంగా వేస్తుంది. దీనికి బదులుగా మీ శరీరాన్ని నిర్జీలకారణ నుండి కాపాడుకోవడానికి మంచినీటిని త్రాగండి.

5. మాంసాహారం తినడం :

5. మాంసాహారం తినడం :

చాలామందికి కోడి, పంది మరియు బీఫ్ మాంసాన్ని ఎక్కువ మోతాదులో తినాలని కోరికగా ఉంటుంది. కానీ హ్యాంగోవర్ సమయంలో వాటిని గనుక తింటే, విపరీతమైన తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. హ్యాంగోవర్ సమయంలో వీటిని తినడం వల్ల చక్కెర శాతం బాగా తగ్గిపోతుంది మరియు మాంసాహారం తినడం వల్ల మీ శరీరంలో ప్రోటీన్లు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. కానీ, అవసరమైన కార్బో హైడ్రేట్లు మీ శరీరానికి అందవు.

6. చక్కెర పానీయాలు :

6. చక్కెర పానీయాలు :

హ్యాంగోవర్ సమయంలో చక్కెర పానీయాలు మీకు సహాయం చేస్తాయి అని భావించినట్లైతే ఆలా అస్సలు జరగదని మీరు గుర్తుపెట్టుకోండి. చక్కెర పానీయాల్లో చక్కెర పదార్ధాలు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. దీని వల్ల మీ పరిస్థితి మరింత దిగజారుతోంది మరియు పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయి. వీటిని స్వీకరించడం వల్ల మీ సమస్యలు మరింతగా పెరుగుతాయి.

7. ఊరగాయలు :

7. ఊరగాయలు :

హ్యాంగోవర్ భారి నుండి తప్పించుకోవడానికి స్వీకరించే అత్యంత చెత్త ఆహార పదార్ధాల్లో ఊరగాయలు కూడా ఒకటి. ఎందుకంటే ఊరగాయల్లో సాధారణంగానే ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉంటుంది మరియు అందులో విపరీతంగా ఉన్న నూనె మీ శరీరంలో గ్యాస్ ని పెంచేస్తుంది మరియు మీ కడుపుని ఉబ్బిపోయేలా చేస్తుంది. మీ కడుపు గోడలను విపరీతంగా చికాకు పెడతాయి మరియు ఒకరకమైన వికారాన్ని కలిగిస్తాయి ఈ ఊరగాయలు. దీనికి బదులుగా మీరు దోసకాయ ఊరగాయను తినండి. ఇది మీ కడుపుని శాంతపరుస్తుంది.

8. సొయా పోషకాలతో చేసిన పానీయాలు :

8. సొయా పోషకాలతో చేసిన పానీయాలు :

సొయా పోషకాలతో చేసిన పానీయాలు తాగటం వల్ల ఎటువంటి హాని లేదు. కానీ, మీరు హ్యాంగోవర్ లో ఉన్న సమయంలో ఈ ఆహారాన్ని నిషేధించండి. ఎందుకంటే, సొయా లో పోషకపదార్ధాలు చాలా ఎక్కువగా ఉంటాయి మరియు ఎప్పుడైతే మీ శరీరంలోకి పోషక పదార్ధాలు ఎక్కువగా, కార్బో హైడ్రేట్లు తక్కువగా అందుతాయో అటువంటి సమయంలో మీ శరీర వ్యవస్థ చిన్నా భిన్నం అవుతుంది. కాబట్టి, మీరు సొయా పోషకాలతో చేసిన పానీయాలు తీసుకోవడం పూర్తిగా నిషేధించండి.

9. క్రీడా పానీయాలు :

9. క్రీడా పానీయాలు :

క్రీడా పానీయాలను ఆంగ్లంలో స్పోర్ట్స్ డ్రింక్స్ అని అంటారు. ఎన్నో రకాల స్పోర్ట్స్ డ్రింక్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి మరియు సోడాలలో ఉండే 2 వ వంతు చక్కెర పదార్ధాలు కూడా ఉంటాయి. వీటిని హ్యాంగోవర్ సమయంలో త్రాగడం వల్ల పరిస్థితి మరింతగా దిగజారుతోంది మరియు క్రీడా పానీయాల్లో ఫ్రూక్టోజ్ శాతం అధికంగా ఉండే మొక్క జొన్న సిరప్, కృతిమ రుచులు మరియు కృత్రిమ ఆహార రంగులు వాడతారు. దీని వల్ల హ్యాంగోవర్ సమయంలో మీరు మరింత శక్తిహీనులుగా మారతారు.

10. వేయించిన చిరు తిళ్ళు :

10. వేయించిన చిరు తిళ్ళు :

వేయించిన చిరు తిళ్ళ లో పోషణ పదార్ధాలు బాగా లోపిస్తాయి. అందువల్ల హ్యాంగోవర్ సమయంలో తీసుకొనే చెత్త ఆహారాల్లో ఇది కూడా స్థానం సంపాదించుకుంది. చాక్లెట్ బార్లు, కుక్కీస్, పేస్ట్రీస్ మరియు ఇతర చాక్లెట్ సంబంధిత చిరు తిళ్ళల్లో కేలరీలు మరియు చక్కెరను జోడించిన రిఫైన్డ్ కార్బో హైడ్రాట్స్ అధికంగా ఉంటాయి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మీ శరీరానికి అందవలసిన పోషక పదార్ధాలు అందవు. దీనితో మీ హ్యాంగోవర్ పరిస్థితి మరింత దిగజారుతోంది.


English summary

10 Foods And Drinks That Could Worsen A Hangover

10 Foods And Drinks That Could Worsen A Hangover,When you have a terrible hangover, you body tends to dehydrate and you feel tired and sleepy the whole day. Know about the foods and drinks that can worsen a hangover.
Story first published:Thursday, February 22, 2018, 18:20 [IST]
Desktop Bottom Promotion