For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెవిపోటును తగ్గించే పది అద్భుతమైన హోమ్ రెమెడీస్

చెవిపోటును తగ్గించే పది అద్భుతమైన హోమ్ రెమెడీస్

|

చెవినొప్పి అత్యంత బాధను కలిగిస్తుంది. చెవిపోటు అనేది చెవిలో ముల్లుతో గుచ్చినట్టు షార్ప్ గా ఉండవచ్చు. కాబట్టి, చెవిపోటును తగ్గించేందుకు ఉపయోగకరంగా ఉండే అద్భుత చిట్కాలను ఇక్కడ వివరించాము.

చెవిపోటుకు అనేక అంశాలు దారితీస్తాయి. సైనస్ ఇన్ఫెక్షన్స్, కేవిటీస్, ఇయర్ వాక్స్, టాన్సిలైటిస్ మరియు కేవిటీస్ వలన చెవినొప్పి సమస్య వేధించవచ్చు. చెవిలో ద్రవం చేరి ఇయర్ డ్రమ్ లో నిలువ ఉండటం వలన కూడా చెవిపోటు సమస్య తలెత్తవచ్చు.

10 Home Remedies For Earaches In Adults

అమెరికన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ ప్రకారం చెవి ఇన్ఫెక్షన్స్ తలెత్తిన సమయంలో యాంటీ బయోటిక్స్ ను వాడే బదులు నొప్పి తగ్గేందుకు ప్రయత్నించాలి.

ఎందుకంటే, యాంటీ బయోటిక్స్ ను ఎక్కువగా వాడటం వలన యాంటీ బయోటిక్ కు కూడా నివారించబడని ఇన్ఫెక్షన్స్ తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంటివద్ద, కిచెన్ ప్యాంట్రీలో లభించే వాటిలో చాలా మటుకు మీకు చెవిపోటును అలాగే చెవి ఇన్ఫెక్షన్స్ ను నిర్మూలించేందుకు తోడ్పడతాయి.

1. కోల్డ్ లేదా వార్మ్ వాటర్ కంప్రెస్

1. కోల్డ్ లేదా వార్మ్ వాటర్ కంప్రెస్

వార్మ్ హీటింగ్ ప్యాడ్స్ లేదా ఐస్ ప్యాక్స్ అనేవి చెవి పోటు నుంచి ఉపశమనం అందించేందుకు తోడ్పడతాయి. ఈ పద్దతి అత్యంత సురక్షితం అలాగే సాధారణం కూడా. మీరు కేవలం ఐస్ ప్యాక్ ను లేదా వార్మ్ కంప్రెస్ ను చెవిపై అమర్చి ప్రతి పది నిమిషాలకు ఒకసారి చల్లటి లేదా హాట్ వాటర్ కంప్రెస్ అప్లై చేస్తూ ఉండాలి.

 2. వెల్లుల్లి:

2. వెల్లుల్లి:

వెల్లుల్లిలో అనాల్జేసిక్ ప్రాపర్టీస్ గలవు. ఇది, సహజసిద్ధమైన యాంటీబయోటిక్. నొప్పినుంచి ఉపశమనం కలిగించేందుకు తోడ్పడుతుంది.

కొన్ని వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి వాటిలోంచి జ్యూస్ ను సేకరించి నొప్పితో బాధపడుతున్న చెవిలో ఈ వెల్లుల్లి జ్యూస్ ను వేయండి.

అర టీస్పూన్ దంచిన గార్లిక్ లో రెండు టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనెను జోడించండి. నూనెను చల్లార్చి ఫిల్టర్ చేసి రెండు నుండి మూడు చుక్కలను నొప్పితో బాధకలుగుతున్న చెవిలో వేయండి.

3. తులసి ఆకులు:

3. తులసి ఆకులు:

తులసి ఆకులలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లేమేటరీ మరియు అనాల్జేసిక్ ప్రాపర్టీస్ కలవు. ఇది చెవినొప్పిని తగ్గించేందుకు చక్కటి హోమ్ రెమెడీగా పనిచేస్తుంది.

కొన్ని తులసి ఆకులను క్రష్ చేసి జ్యూస్ ను సేకరించండి.

అందులోంచి జ్యూస్ ను సేకరించండి. ఈ రసాన్ని నొప్పితో ఇబ్బందిపడుతున్న చెవిలో పోయండి.

4.ఆలివ్ ఆయిల్:

4.ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ అనేది చెవి నొప్పిని తగ్గించేందుకు అత్యంత పాపులర్ రెమెడీగా పేరొందింది. అమెరికన్ అకాడెమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం, కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ను చెవిలో వేయడం సురక్షితం. ఇది చెవి నొప్పిని తగ్గించేందుకు అమితంగా ఉపయోగపడుతుంది.

కొన్ని రోజులవరకు, గోరువెచ్చటి ఆలివ్ ఆయిల్ ను చెవిలో మూడు లేదా నాలుగు చుక్కలను వేస్తూ ఉండాలి.

5. టీ ట్రీ ఆయిల్:

5. టీ ట్రీ ఆయిల్:

టీ ట్రీ ఆయిల్ లో శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ అలాగే యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ కలవు. టీ ట్రీ ఆయిల్ ను ఇయర్ డ్రాప్స్ గా వాడి నొప్పినుంచి అలాగే అసౌకర్యం నుంచి ఉపశమనం పొందవచ్చు.

రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ లో నాలుగు చుక్కల గోరువెచ్చటి ఆలివ్ ఆయిల్ ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ఇయర్ బడ్ సహాయంతో కొన్ని చుక్కలు చెవిలో పోయాలి.

6, ఆవ నూనె:

6, ఆవ నూనె:

చెవి నొప్పిని తగ్గించేందుకు ఆవనూనె అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే, ఇది వెచ్చటి ఎఫక్ట్ ను ఇస్తుంది కాబట్టి. ఇది కొంచెం జిగటగా అలాగే చిక్కగా ఉండే నూనె. దీని వెచ్చ చేయడం వలన దీని జిగట తగ్గుతుంది. ఈ ఆయిల్ అనేది ఇయర్ వ్యాక్స్ ఎమ్మెల్సీఫయర్ గా పనిచేస్తుంది.

రెండు నుంచి మూడు చుక్కల ఆవనూనెను చెవినొప్పి కలిగిన చెవిలో పోస్తే ఫలితం ఉంటుంది.

నూనె కిందికి ఒలాగని పొజిషన్ లో కూర్చుని నొప్పిని తగ్గించేందుకు ఈ ఆయిల్ సుగుణాలను ఉపయోగించుకోవాలి.

7. ఉల్లిపాయ:

7. ఉల్లిపాయ:

ఉల్లిపాయలో ఫ్లెవనాయిడ్స్ మరియు ఆల్కేనిల్ సిస్టెయిన్ సల్ఫాక్సయిడ్స్ కలవు. ఈ రెండు అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగిస్తాయి. అలాగే, ఉల్లిపాయతో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బయోటిక్ మరియు యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ కలవు.

ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసాన్ని సేకరించి తక్కువ వేడిలో దాన్ని హీట్ చేయాలి.

రెండు లేదా మూడు చుక్కల జ్యూస్ ను నొప్పి కలిగిన చెవిలో పోయాలి.

8. అల్లం :

8. అల్లం :

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కలవు. వెచ్చటి అల్లం రసం వలన చెవి నొప్పి తగ్గుతుందని ఆయుర్వేదం వెల్లడిస్తోంది.

అల్లం రసాన్ని సేకరించి దాన్ని వెలుపటి ఇయర్ కెనాల్ లో పోయాలి. చెవిలోపలికి వెళ్లకుండా జాగ్రత్తపడండి.

ఒక టీస్పూన్ తాజాగా తురిమిన అల్లంలో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను జోడించండి.

ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచండి ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చెవిలో పోయండి.

9. ఆపిల్ సైడర్ వినేగార్:

9. ఆపిల్ సైడర్ వినేగార్:

ఇయర్ కెనాల్ లోని పీ హెచ్ ని తగ్గించి బాక్టీరియాకు అనువుగాని ప్రదేశాన్ని క్రియేట్ చేసేందుకు ఆపిల్ సిడర్ వినేగార్ తోడ్పడుతుంది.

వెచ్చటి ఆపిల్ సిడర్ వినేగార్ ను తీసుకుని దాన్ని ఒక కాటన్ బడ్ సహాయంతో ఇన్ఫెక్ట్ అయిన చెవిలో పోయాలి.

గమనిక: ఆర్గానిక్ ఆపిల్ సిడర్ వినేగార్ ను వాడితే కెమికల్స్ చెవిలోకి ప్రవేశించే ఆస్కారం లేదు.

10.ఉప్పు :

10.ఉప్పు :

చెవినొప్పిని వేగవంతంగా ఎలా తగ్గించుకోవాలో ఆలోచిస్తున్నారా? ఈ రెమెడీ చెవిలోని ఇంఫ్లేమేషన్ ను తొలగిస్తుంది.

ఒక టీస్పూన్ సాల్ట్ ను వేడి చేసి ఒక కాటన్ ఇయర్ బడ్ సహాయంతో దీనిని చెవిలో అప్లై చేయండి. పది నిమిషాల పాటు అలాగే ఉంచండి.

వైద్యున్ని ఎప్పుడు సంప్రదించాలి?

రక్తం లేదా చీము అనేది చెవి నుంచి కారేటప్పుడు,

తలనొప్పితో పాటు డిజ్జీనెస్ అలాగే హై ఫీవర్ ఉన్నప్పుడు,

చెవి వెనకాల వాపు ఉన్నప్పుడు,

ఈ లక్షణాలు 24 నుంచి 48 గంటలలో నార్మల్ గా మారకపోతే మీరు తక్షణమే వైద్యున్ని సంప్రదించాలి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి.

English summary

10 Home Remedies For Earaches In Adults

The common ear infection is acute otitis media, also called middle ear infection. The other causes are sinus infections, cavities, earwax, tonsillitis, and cavities. The home remedies for treating ear pain are cold or warm water compress, garlic, olive oil, basil leaves, tea tree oil, apple cider vinegar, mustard oil, etc.
Desktop Bottom Promotion