వెల్లుల్లి లైంగికపటుత్వాన్ని పెంచడంతో పాటు అక్కడ వెంట్రులకను కూడా మొలిపించగలదు

Written By:
Subscribe to Boldsky

మనం నిత్యం పలు వంటల్లో వేసుకునే వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. వెల్లుల్లిని వంటల్లో వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. ఈ క్రమంలో వెల్లుల్లిని అలా వంటల్లో తినడం వల్ల పలు ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

ఇక వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లు మరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లి తినడం వల్ల పొందే లాభాలు ఎలాంటివో తెలుసుకుందాం. వెల్లుల్లి మీ బ‌రువును ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది. రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మ‌లు తింటే జిమ్‌కెళ్లినంత లాభం. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతాం.

వివిధ వ్యాధులను తగ్గించే శక్తి

వివిధ వ్యాధులను తగ్గించే శక్తి

వెల్లుల్లి నుంచి విడుదలయ్యే అల్లిసిన్, వివిధ వ్యాధులను తగ్గించే శక్తిని కలిగి ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీ-బయాటిక్. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకోవటం వలన జీర్ణాశయ సమర్థతను పెంచుతుంది.

అధిక రక్త పీడనం

అధిక రక్త పీడనం

జలుబు, ఫ్లూ, జ్వరం, అధిక రక్త పీడనం, అధిక కొవ్వు పదార్థాల స్థాయిలు, విస్తారిత ప్రోస్టేట్, మధుమేహం, ఆస్టియో ఆర్థరైటిస్, ప్రయాణాలలో కలిగే విరేచనాలకు, ప్రీఎక్లంప్సియా, కరోనరీ ఆర్టేరీ డిసిజేస్, గుండెపోటు, ధమనుల గట్టిపడటం వంటి సమస్యలను నుంచి వెల్లుల్లి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

ముఖ్య పాత్ర పోషిస్తుంది

ముఖ్య పాత్ర పోషిస్తుంది

వెల్లుల్లి పెద్దప్రేగు క్యాన్సర్, పురీషనాళ, స్టమక్, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లను నిరోధించటంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉదయనా ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తింటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

ఒత్తిడి నుంచి ఉపశమనం

ఒత్తిడి నుంచి ఉపశమనం

మీరు ఒత్తిడికి గురైనపుడు, కడుపులో ఆసిడ్ లు అధిక మొత్తంలో విడుదల అవుతాయి. అలాంటి సమయంలో వెల్లుల్లి తింటే ఈ ఆసిడ్ ల స్థాయిలను తగ్గించి, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లి జ్వరం, దగ్గు, తలనొప్పి, కడుపు నొప్పి, సైనస్ సమస్యలు, గౌట్, కీళ్ళవాతం, ఉబ్బసం, బ్రోన్కైటిస్, శ్వాస ఆడకపోవుట, అల్ప రక్తపోటు, రక్త అల్ప చక్కెర స్థాయిలు, రక్తంలో అధిక చక్కెర స్థాయిలు, పాముకాట్ల వంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది.

ఫ్యాట్ ను బయటకు పంపేస్తుంది

ఫ్యాట్ ను బయటకు పంపేస్తుంది

వెల్లుల్లి జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్‌ చేయడమే కాదు అనవసరమైన ఫ్యాట్‌ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. వెల్లుల్లిని తినడం వల్ల ఆకలి వేయదు. జిహ్వచాపల్యం బాగా తగ్గుతుంది. అంతేకాదు వెల్లుల్లి అడ్రినలైన్‌ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. క్యాలరీలను కరిగిస్తుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది

రక్తపోటును నియంత్రిస్తుంది

శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది.

రక్తాన్ని శుద్ది చేసే గుణం

రక్తాన్ని శుద్ది చేసే గుణం

వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. అంతేకాదు శరీరం లోపలి భాగాల్ని కూడా శుద్ధిచేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. ప్రమాదకరమైన విషపదార్థాల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది.

గుండెను కాపాడుతుంది

గుండెను కాపాడుతుంది

ప‌చ్చి వెల్లుల్లి గుండెను కాపాడ‌తుంది. రోజూ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గుండె సంబంధిత బబ్బులు రావు. వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్‌ ప్రాపర్టీస్‌ వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టుకోవడంలాంటివి (బ్లడ్‌ క్లాట్స్‌) సంభవించవు. పచ్చి వెల్లుల్లిని తినలేకపోతే ఆహారపదార్థాలలోనైనా వేసుకొని తప్పనిసరిగా వెల్లుల్లి తినడం మంచిది.

లైంగికపటుత్వం పెరుగుతుంది

లైంగికపటుత్వం పెరుగుతుంది

బట్టతల ఏర్పడిన ప్రదేశంలో కొద్దిగా వెల్లుల్లి రసం రాస్తే అక్కడ జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కాస్త వెల్లుల్లి రసాన్ని కలిపి రోజూ ఉదయం తాగితే సెక్స్ సంబంధిత సమస్యలు తలెత్తవు. ఇక మగవారిలో సెక్స్ సామర్ధ్యం సన్నగిల్లడం, నరాల బలహీనత, శీఘ్రస్ఖలనం తదితర సెక్స్ సంబంధ సమస్యలుంటే తరచుగా వెలుల్లిని ఆహారంలో తీసుకోవడం వల్ల లైంగికపటుత్వం పెరుగుతుంది.

వెల్లుల్లి టీతో అద్భుతమైన ప్రయోజనాలు

వెల్లుల్లి టీతో అద్భుతమైన ప్రయోజనాలు

అలాగే వెల్లుల్లితో తయారు చేసే టీని కూడా తాగవచ్చు. ఆ టీని తాగినా పలు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లి టీని ఈ విధంగా తయారు చేయాలి. ముందుగా ఒక గ్లాస్ నీటిని తీసుకుని మరిగించాలి. మరుగుతున్న నీటిలో కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని నలిపి వేయాలి. అవసరం అనుకుంటే ఆ నీటిలో కొద్దిగా అల్లం తురుం కూడా వేయవచ్చు. అలా ఆ నీటిని 20 నిమిషాల పాటు మరిగించాలి.

అందులో కొద్దిగా తేనే, నిమ్మరసం..

అందులో కొద్దిగా తేనే, నిమ్మరసం..

అనంతరం స్టవ్ ఆర్పి ఆ నీటిని అలాగే 10 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత వచ్చే ద్రవాన్ని వడకట్టి అందులో కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలిపితే వెల్లుల్లి టీ తయారైనట్టే. వెల్లుల్లి టీని ఇలా తయారు చేసుకుని రోజూ పరగడుపునే తాగితే దాంతో ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయి.

వెల్లుల్లి టీ ఉపయోగాలు

వెల్లుల్లి టీ ఉపయోగాలు

పైన చెప్పిన విధంగా వెల్లుల్లి టీని తయారు చేసుకుని తాగితే అధిక బరువు తగ్గుతారు. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. శరీర మెటబాలిజం పెరుగుతుంది. ఆకలి అనిపించదు. తిండిపై యావ తగ్గుతుంది. ఫలితంగా ఆహారం తీసుకోవడం తగ్గి అధిక బరువు తగ్గుతారు.

కొవ్వు కరిగిపోతుంది

కొవ్వు కరిగిపోతుంది

శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. రోజూ వెల్లుల్లి టీ తాగితే రక్త సరఫరా మెరుగు పడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరిగిపోతుంది. ఆ నాళాల్లో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. హైబీపీ తగ్గుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్‌ల వంటివి రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

ఉపశమనం

ఉపశమనం

రోజూ ఒక కప్పు వెల్లుల్లి టీని తాగితే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం, ముక్కు దిబ్బడ తగ్గిపోతాయి. వాపులు తగ్గుతాయి. గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. వెల్లుల్లి టీని తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.

English summary

15 amazing benefits of garlic for skin hair and health

15 amazing benefits of garlic for skin hair and health
Story first published: Wednesday, May 16, 2018, 15:00 [IST]