కడుపులో మంట, గ్యాస్ ఇంకేదైనా సరే.. ఇలా చేస్తే మటాష్

Written By:
Subscribe to Boldsky

కడుపు మంట.. పక్క వారు ఎదిగిపోతుంటే చూసి ఈర్ష్యపడే వారికి వచ్చేది. కానీ పాపం కొందరికీ అలాంటి కడుపు మంట ఉండదు. అయినా కడుపులో మంటతో బాధపడుతుంటారు. దాన్నే ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం అంటారు. చాలా మంది గ్యాస్, కడుపులో మంటతో ఎక్కువమంది బాధపడుతుంటారు. టైంకు భోజ‌నం చేయ‌కపోవడం, కారం, మ‌సాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తిన‌డం... ఇలా కార‌ణాలు ఏమున్నా క‌డుపులో మంట‌, గ్యాస్ స‌మ‌స్య‌లు మ‌నల్ని బాధిస్తుంటాయి.

గొంతులోకి తన్నుకు వస్తుంది

గొంతులోకి తన్నుకు వస్తుంది

ఇక కడుపులో మొదలైన ఈ మంట క్రమంగా గొంతులోకి తన్నుకు వస్తున్నట్లు బాధ కలుగుతుంది. పైకి మామూలుగానే కనిపించినా కడుపులో తట్టుకోలేని మంట... అగ్నిపర్వతాలు రగులుతున్నాయా? అన్నంత బాధ... కంటి నిండా నిద్ర పట్టదు.. స్థిమితంగా కూర్చోనివ్వదు.. ఇదంతా యాసిడిటి మహిమ.

కారం ఉన్న పదార్థాలు తిన్నప్పుడు

కారం ఉన్న పదార్థాలు తిన్నప్పుడు

సాధారణముగా మసాల ఉన్న పదార్దాలు తిన్నప్పుడు, ఎక్కువ కారం ఉన్న పదార్దాలు తిన్నప్పుడు కడుపులో మంట వస్తుంది. మసాల పదార్ధాలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది. లేకుంటే కడుపులో అల్సర్ వ్యాధి వస్తుంది,ఇదే కాలక్రమములో కేన్సర్ గా మారుతుంది. కడుపులో వచ్చే మంట గ్యాస్ గా మారి అది గుండెల్లొ నొప్పిగా కూడ మారుతుంది.

మసాలాలు అవసరం

మసాలాలు అవసరం

ఈరోజుల్లో రుచికరమైన ఆహారం కావాలంటే మసాలాలు ఉండక తప్పట్లేదు,కనుక మసాల ఉన్న ఆహారం తినేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వాటినుంచి ఉపశమనం పొందవచ్చు.

పొట్టలో గ్యాస్, నొప్పి, మంట ఏదో ఒకటిరెండుసార్లు ఎదురయితే ఫర్వాలేదు కానీ తరచూ ఇబ్బంది వస్తుంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఉండే ప‌లు ప‌దార్థాల‌తోనే ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు.

గోరువెచ్చని నీటితో తేనే

గోరువెచ్చని నీటితో తేనే

ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ తేనెను కలపాలి. దీన్ని భోజనానికి గంట ముందుగా లేదా భోజనం అనంతరం గంట తర్వాత తాగాలి. లేదంటే రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు తాగాలి. అయితే దీన్ని తాగిన తరువాత దాదాపు 20 నిమిషాల వరకు ఏమీ తీసుకోకూడదు. లేదంటే తేనె తన ప్రభావాన్ని చూపించదు.

దాల్చిన చెక్క పొడి

దాల్చిన చెక్క పొడి

ఒక టేబుల్ స్పూన్ తేనె, 3/4 టీస్పూన్ల దాల్చిన చెక్క పొడిని కలిపి భోజనం తరువాత తీసుకుంటే గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యల ఉండవు . కప్పు నీటిని మరిగించి అందులో 1 టీస్పూన్ అల్లం మిశ్రమాన్ని వేయాలి. అనంతరం వేడి తగ్గించి సిమ్మర్‌లో 5 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత ఈ ద్రవానికి 1 టీస్పూన్ తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని తరచూ తీసుకోవాలి.

అల్లం, నిమ్మరసం, తేనే

అల్లం, నిమ్మరసం, తేనే

ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ అల్లం, కొద్దిగా నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల తేనెను వేసి బాగా కలిపి దీన్ని గ్యాస్ సమస్య ఉన్నప్పుడు తీసుకోవాలి. ఒక టీస్పూన్ తేనె, 200 గ్రాముల పెరుగును కలిపి భోజనం అనంతరం తీసుకోవాలి. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.

లవంగ పొడి

లవంగ పొడి

ఒక టీస్పూన్ తేనె, కొద్దిగా లవంగ పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో వేసి కలిపి ఆ ద్రవాన్ని తాగాలి. కడుపులో మంటగా ఉన్నప్పుడు లేదా భోజనం తరువాత దీన్ని తాగవచ్చు.

పరగడుపునే తాగాలి

పరగడుపునే తాగాలి

రెండు టీ స్పూన్ల నిమ్మరసం, 1 టీస్పూన్ తేనెలను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కలపాలి. దీన్ని భోజనానికి గంట ముందు లేదా ఉదయాన్నే పరగడుపునే తాగాలి. తరచూ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

తేనె, యాపిల్ సిడర్ వెనిగర్‌

తేనె, యాపిల్ సిడర్ వెనిగర్‌

రెండు టేబుల్ స్పూన్ల తేనె, యాపిల్ సిడర్ వెనిగర్‌లను ఒక కప్పు నీటిలో బాగా కలిపి ఆ ద్రవాన్ని సమస్య ఉన్నప్పుడు తీసుకోవాలి.

ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ బేకింగ్ సోడాను వేసి పూర్తిగా కలిసేంత వరకు కలియతిప్పాలి. అనంతరం ఆ ద్రవాన్ని తాగితే గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలు తొలగిపోతాయి.

గ్రీన్ టీలో తేనె

గ్రీన్ టీలో తేనె

ఒక కప్పు గ్రీన్ టీలో 1 టీస్పూన్ తేనెను కలిపి తీసుకుంటే గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. కొవ్వు లేని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో 1 టీస్పూన్ తేనెను కలిపి తరచూ తీసుకుంటే గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి.

తేనె, బేకింగ్ సోడా, యాపిల్ సిడర్ వెనిగర్‌

తేనె, బేకింగ్ సోడా, యాపిల్ సిడర్ వెనిగర్‌

తేనె, బేకింగ్ సోడా, యాపిల్ సిడర్ వెనిగర్‌లను 1 టీస్పూన్ మోతాదులో తీసుకుని మిశ్రమం అయ్యేంత వరకు బాగా కలపాలి. అర లీటరు గోరు వెచ్చని నీటికి ఈ మిశ్రమాన్ని కలపాలి. దీన్ని భోజనానికి ముందుగా లేదా సమస్యలు ఉన్నప్పుడు తీసుకోవచ్చు.

చెక్ చేసుకోవాలి

చెక్ చేసుకోవాలి

అలాగే ఎలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఇలా కడుపులో మంట వస్తుందో చెక్ చేసుకోవాలి. ఆ పదార్థాలను గమనించాక వాటికి కొంతకాలం దూరంగా వుండాలి. అప్పుడు సమస్య తగ్గిన తర్వాత ఈ విషయాన్ని వైద్యుని దృష్టికి తీసుకెళ్లాలి.

నాలుగైదు సార్లు తీసుకోవడం మంచిది

నాలుగైదు సార్లు తీసుకోవడం మంచిది

జీర్ణ సంబంధమైన సమస్యలుంటే స్వల్పంగా ఆహారం నాలుగైదు సార్లు తీసుకోవడం మంచిది. ఆహారం నోట్లో వేసుకుని ఎక్కువసేపు నమిలి తినాలి. ఇలా చేయడం వల్ల తినే ఆహారం సుళువుగా జీర్ణమవుతుంది.

కూల్ డ్రింక్సుకు స్వస్తి చెప్పాలి

కూల్ డ్రింక్సుకు స్వస్తి చెప్పాలి

జీర్ణసమస్యలతో సతమతమయ్యేవారు ఆహారాన్ని వేగంగా తినడం మానుకోవాలి. ఇలా చేస్తే గాలి లోపలికి వెళ్లి గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. అలాగే కూల్ డ్రింక్సుకు స్వస్తి చెప్పాలి. తిన్న వెంటనే కొందరు వ్యాయామం చేస్తుంటారు. ఇలాంటి అలవాటును మానుకోవాలి. ఐతే వారంలో మూడుసార్లు ప్రాణాయామం చేయడం మంచిది. ఇలా చేస్తే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది.

బయటి ఆహారానికి దూరంగా వుండాలి

బయటి ఆహారానికి దూరంగా వుండాలి

ముఖ్యంగా ఉదర సంబంధ సమస్యలతో బాధపడేవారు బయటి ఆహారానికి దూరంగా వుండాలి. మంచినీళ్లు సైతం ఇంట్లోవే తాగడం మంచిది. అలా కాకుండా బయటవి తీసుకుంటే ఉదర సమస్య తిరగబెట్టడం ఖాయం. ఇలా ఉదర సమస్యలను జాగ్రత్తగా పరిశీలిస్తూ వాటిని దూరం చేసుకోవాలి.

నీళ్లు తాగాలి

నీళ్లు తాగాలి

మసాల ఉన్న ఆహారం తిన్నవెంటనే నీళ్ళు ఎక్కువగా తాగాలి లేదా జీర మజ్జిగ ను తీసుకున్నా సరిపోతుంది. జీలకర్ర ను బాగా వేయించి పొడి చేసి దానిని నీళ్ళలో కలిపి తాగితే కొంతవరకు ఉపశమనం పొందవచ్చు.

పుదీన ఆకులు

పుదీన ఆకులు

పుదీన ఆకులను తీసుకొని నమిలినా లేదా తినే ఆహారంలో దానిని కలిపి తీసుకున్నా ఫలితముంటుంది. ఒక పచ్చడి రుపంలో గాని, పూదీన టీ గాని తీసుకొన్న కొంతవరకు కడుపు మంటను తగ్గించుకోవచ్చు.

మాంసాహారం తింటే..

మాంసాహారం తింటే..

మాంసాహారం తిన్నప్పుడు కూడా కడుపులో మంట వస్తుంది. అప్పుడు తిన్న వెంటనే సోడా గాని ఇతర పానియాలు సేవించడం వలన కడుపులో మంట రాకుండా ఉంటుంది. విందు భోజనాలకు వెళ్ళినపుడు కూడ కడుపులో నొప్పి, మంట వంటివి వస్తాయి.

స్వీట్ పాన్

స్వీట్ పాన్

అప్పుడు స్వీట్ పాన్ తీసుకొవడం వలన కడుపులో ఉన్న ఆహారాన్ని అరిగేలా చేయటమే కాక కడుపులో వచ్చే మంట, గ్యాస్ వంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.పైన మేము తెలిపిన చిట్కాల వలన తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. అప్పటికీ, మార్పు రాకపోతే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం శ్రేయస్కరం.

English summary

15 home remedies for acidity and gas problem

15 home remedies for acidity and gas problem
Story first published: Wednesday, May 16, 2018, 11:00 [IST]