మాంసాహారంతో వచ్చే బలం కంటే వీటిలో ఉండే పవర్ చాలా ఎక్కువ

Written By:
Subscribe to Boldsky

ఆదివారం వచ్చిందంటే.. ప్రతి ఇంటా నోరూరించే మాంసాహార వంటకాలు ఘుమఘుమలాడుతుంటాయి. మన శరీరానికి ప్రోటీన్లు ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. వీటి వల్ల శరీర నిర్మాణం జరుగుతుంది. కొత్త కణాలు నిర్మాణమవుతాయి. కండరాలకు బలం చేకూరుతుంది. శక్తి వస్తుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. అందుకని మనం నిత్యం ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలి.

అయితే కొందరు మాంసాహారం తినలేరు. దీంతో తమకు ప్రోటీన్లు ఎలా అందుతాయని వారు ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారు కింద సూచించిన పలు వెజిటేరియన్ ఆహారాలను తీసుకుంటే దాంతో మాంసాహారం కన్నా ఎక్కువగా ప్రోటీన్లను పొందవచ్చు. మరి ఆ వెజిటేరియన్ ఫుడ్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

క్వినోవా

క్వినోవా

ఇవి చిరుధాన్యాల జాతికి చెందుతాయి. చూసేందుకు సజ్జల్లా ఉంటాయి. కానీ వీటిల్లో ప్రోటీన్లు అమోఘంగా ఉంటాయి. క్వినోవా గింజలు మనకు మార్కెట్‌లో ప్రస్తుతం విరివిగా లభిస్తున్నాయి. వీటిని రోజూ తింటే మన శరీరానికి కావల్సినంత ప్రోటీన్లు లభిస్తాయి. అలాగే 9 రకాల అమైనో ఆమ్లాలు కూడా మన శరీరానికి అందుతాయి. ఇవి బ్లడ్ షుగర్‌ను అదుపు చేస్తాయి. మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. అధిక బరువు తగ్గుతారు.

పనీర్

పనీర్

పాలను విరగ్గొట్టి తయారు చేసే పనీర్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మాంసాహారం తినలేని వారికి పనీర్ మంచి రుచిని అందిస్తుంది. దీనికి తోడు పోషకాలు కూడా లభిస్తాయి. అయితే కొవ్వు తక్కువగా ఉండే పనీర్‌ను ఎంపిక చేసుకుని తింటే ఇంకా మంచిది.

పప్పులు, చిక్కుడు జాతి గింజలు

పప్పులు, చిక్కుడు జాతి గింజలు

పెసలు, కందిపప్పు, శనగప్పు లాంటి పప్పు ధాన్యాలు, చిక్కుడు, రాజ్మా, సోయా, బఠానీ లాంటి చిక్కుడు జాతి గింజల్లోనూ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్, ఫొలేట్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు కూడా వీటిల్లో ఉంటాయి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి కావల్సినన్ని ప్రోటీన్లు అందుతాయి. శరీర నిర్మాణం సరిగ్గా జరుగుతుంది.

పాలు

పాలు

నిత్యం 1-2 గ్లాసుల కొవ్వు తీసిన పాలను తాగినా చాలు మన శరీరానికి కావల్సిన ప్రోటీన్లు అందుతాయి. పాలు మనకు అందుబాటులో ఉన్న సంపూర్ణ పౌష్టికాహారం. పాలను రోజూ తాగడం వల్ల ఇంకా అనేక లాభాలు కలుగుతాయి. కండరాలు దృఢంగా మారుతాయి. ఎముకలు బలంగా తయారవుతాయి.

నట్స్

నట్స్

జీడిపప్పు, బాదం, పిస్తా పప్పు, వాల్ నట్స్ తదితర నట్స్‌ను నిత్యం తీసుకుంటే మన శరీరానికి కావల్సిన ప్రోటీన్లు, మాంగనీస్, విటమిన్ ఇ లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి. ఎదుగుతున్న పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి.

పప్పు దినుసులు

పప్పు దినుసులు

పప్పు దినుసులు మాత్రమే అధిక పోషణ కలిగిస్తాయి. పప్పులలో ఉండే 60 శాతం కార్బోహైడ్రేట్లు మరియు 5 శాతం క్రొవ్వు, 2 శాతం ఖనిజ లవణాలు మానవ శరీర పోషణకు సమతూకంగా ఉంటాయి.

అలాగే ఒక కోడి గుడ్డు కంటే కూడా ఐదారు ఖర్జూరపు పళ్ళు లేక 50 గ్రాముల బెల్లం ఎక్కువ శక్తిని ఇస్తాయి. తోటకూర, గోంగూర, బచ్చలి వంతి ఆకు కూరలు, టొమటో, చిక్కుళ్ళు, మునగ వంటివి అత్యుత్తమ పోషక విలువలున్న శాకాహారం.

బలంగా ఉంటారనుకుంటారు

బలంగా ఉంటారనుకుంటారు

ఇక కూరగాయలు తినడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, మాంసాహారం తీసుకుంటేనే బలంగా ఉంటాం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ మాంసహారం కంటే వెజిటేరియన్ డైట్‌తోనే ఎక్కువ ప్రయోజనాలున్నాయంటున్నారు పోషకహార నిపుణులు. శాకాహారం తీసుకోవడం వల్ల ఈ లాభాలుంటాయి.

డీటాక్సిఫై

డీటాక్సిఫై

వెజిటబుల్ డైట్‌లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అంటే పీచుపదార్థాలు. పాలకూర, క్యాబేజీ, సొరకాయ గుమ్మడి వంటి కూరగాయలలో పీచుపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. పీచుపదార్థాలు శరీరానికి చాలా అవసరం. మలబద్ధకం రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండాల్సిందే. శరీరంలో నుంచి టాక్సిన్స్‌ను బయటకు పంపించడానికి ఈ ఫైబర్ చక్కగా ఉపయోగపడుతుంది. నాన్ వెజ్‌లో ఫైబర్ లభించదు.

బలమైన ఎముకలు

బలమైన ఎముకలు

మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ప్రొటీన్ శాతం పెరిగిపోతుంది. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా శరీరం కాల్షియం గ్రహించడం తగ్గిపోతుంది. ఎముకలు బలహీనంగా మారతాయి. శాకహారుల్లో ఇలాంటి సమస్యలు తక్కువే.

కార్బోహైడ్రేట్స్‌ లోపం

కార్బోహైడ్రేట్స్‌ లోపం

నాన్-వెజిటేరియన్ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా లభిస్తాయి. శరీరానికి తగినంత కార్బోహైడ్రేట్స్ లభించనపుడు అది కెటొసిస్‌కు దారితీస్తుంది. అంటే శరీరం తనకు అవసరమైన ఎనర్జీ కోసం కొవ్వును కలిగించుకొంటుంది. అంతేకాకుండా వెజిటేరియన్ ఫుడ్‌లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా జీర్ణం అవుతూ శరీరానికి అవసరమైన గ్లూకోజ్‌ను మెల్లగా అందిస్తాయి. అయితే నాన్‌వెజ్‌లో ఫ్యాట్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఆగ్యకరమైన చర్మం

ఆగ్యకరమైన చర్మం

బీట్‌రూట్, టమోట, గుమ్మడి, కాకరకాయ వంటి కూరగాయలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆపిల్స్, పియర్స్, జామకాయ లాంటి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. మాంసాహారం తీసుకోవడం వల్ల చర్మానికి ఎలాంటి ఉపయోగం లేదు.

బరువు నియంత్రణ

బరువు నియంత్రణ

కొవ్వును తగ్గించుకోవాలంటే సులభమైన మార్గం నాన్‌వెజ్‌కు దూరంగా ఉండటమే. మాంసాహారం తీసుకునే వారు బరువును తగ్గించుకోలేరు. అయితే నాన్‌వెజ్‌కు బదులుగా తృణధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, నట్స్, ఫ్రూట్స్ తీసుకొంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటుంది. వెజిటేరియన్ డైట్ వల్ల అధిక రక్తపోటు, అధిక బరువు నియంత్రణలో ఉంటాయి.

ఫైటో న్యూట్రియెంట్స్

ఫైటో న్యూట్రియెంట్స్

డయాబెటిస్, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, స్ట్రోక్, బోన్ లాస్ వంటి వ్యాధులను ఫైట్రోన్యూట్రియెంట్స్ తీసుకోవడం ద్వారా నివారించవచ్చు. ఇవి వెజిటేరియన్ డైట్‌లో మాత్రమే లభిస్తాయి. నాన్‌వెజ్‌ తీసుకునే వారిలో వీటికి కొరతేవుంటుంది.

సులభంగా నమలడం

సులభంగా నమలడం

మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడం లాలాజలంతో మొదలవుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడే ఈ ప్రక్రియ మరింత బాగా జరుగుతుంది. అంతే కాకుండా కూరగాయలతో తీసుకునే ఆహారాన్ని సులభంగా నమలవచ్చు.

శాకాహారం

శాకాహారం

పోషకాహారం కోసమంటూ మాంసాహారం కోసం పాకులాడడం కంటే శాకాహారం ఎంతో బెటర్. దృష్టి కోసమే కాకుండా శరీరానికి పుష్టిని సమృద్ధిగా కలగజేసే శాకాహారమే ఉత్తమమని న్యూట్రీషన్లు అంటున్నారు.

English summary

15 vegetables that pack more protein than meat

15 vegetables that pack more protein than meat
Story first published: Wednesday, May 16, 2018, 9:00 [IST]