ప్రతి మగాడు ఉల్లి కచ్చితంగా తినాలి.. ఏమీ లేకపోయినా అదొక్కటి ఉంటే చాలు, డాక్టర్ అవసరం లేదు

Written By:
Subscribe to Boldsky

మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ దగ్గర ఏమీ లేకపోయినా ఫర్వాలేదు. ఒక్క ఉల్లిపాయ ఉంటే చాలు. అంత పవర్ ఉంది ఉల్లిగడ్డకు. ఉల్లిపాయ ఒక ఆంటీబయాటిక్. దీనిని తింటే చాలా లాభాలుంటాయి. ఇక తినకుండా మన పక్కన ఉంచుకున్నా కూడా చాలా ఉపయోగాలుంటాయి. వైరస్, బాక్టీరియాల వలన వచ్చే జబ్బులను మన దగ్గరకు రానివ్వదు. వచ్చిన జబ్బులను కూడా నయంచేస్తుంది. అంత పవర్ ఉంది ఉల్లికి.

తల్లి కూడా చేయదు

తల్లి కూడా చేయదు

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు! నిజంగా ఇది అక్షర లక్షలు విలువచేసే మాట. పొట్టనిండా విటమిన్లు నింపుకున్న పాయ, మన ఉల్లిపాయ. రక్తపుష్టి, కేశవృద్ధి, గుండె వ్యాధుల నివారిణి, కీళ్ళనొప్పుల నివారిణి, కీటక సంహారిణి, నిద్రకారిణి, ఉష్ణ నివారిణి, నొప్పి నివారిణి, రక్త ప్రసరణ వాహినీ.. అబ్బో! ఇలా ఉల్లిదండకం చదివితే ఎంతకీ తెమల్దు.

ఫ్లూ జ్వరం వచ్చి 40 మిల్లియన్ల ప్రజలు చనిపోతే..

ఫ్లూ జ్వరం వచ్చి 40 మిల్లియన్ల ప్రజలు చనిపోతే..

వెనుకటికి ఒక కథ భాగా ప్రచరంలో ఉండేది. ఇది కథ కాదు నిజం అని చాలా మంది ఇప్పటికి అంటారు.1919 లో ఫ్లూ జ్వరం వచ్చి 40 మిల్లియన్ల ప్రజలు చనిపోయారు. గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారని తెలుసుకున్న ఒక డాక్టర్ అక్కడున్న ప్రజలను కాపాడాలని నిర్ణయించుకుని గ్రామాలకు వెళ్ళాడు. ఆయన వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ ఉన్న ప్రజలలో చాలామందికి ఈ జబ్బు వచ్చి చనిపోయారు. అయితే ఒక గ్రామంలో ఒక కుటుంబం మొత్తం సంతోషంగా, ఆరొగ్యంగా ఉండటం చూసిన డాక్టర్ ఆశ్చర్యపడి "ఇది ఎలా సాధ్య పడింది" అని ఆ కుటుంబీకులను అడిగాడు.

ఉల్లి వారిని కాపాడింది

ఉల్లి వారిని కాపాడింది

ఇంతలో అక్కడున్న ఒక రైతు భార్య "ఇదుగో దీని వలన" అంటూ ఒక పెచ్చుతీయని ఉల్లిపాయను చూపించింది. "ఉల్లిపాయలను ఒక గిన్నెలో ఉంచి ప్రతి గదిలోనూ ఉంచాము... ఇది మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతోంది" అని చెప్పింది. డాక్టర్ వారి దగ్గరున్న ఉల్లిపాయను తీసుకుని తన మైక్రోస్కోప్ లో చూసేడు. ఆ ఉల్లిపాయ నిండా ఆ ఫ్లూ వైరస్ ఉన్నది.

ఉల్లిని వెంట తీసుకుపొమ్మంటారు

ఉల్లిని వెంట తీసుకుపొమ్మంటారు

ఎప్పుడైన మన పెద్దవారు మనం బయటికి వెల్లే సమయంలో ఒక ఉల్లిని వెంట తీసుకుపొమ్మంటారు దానికి కారణం ఉల్లి మన శరీరానికి చల్లధనం ఇస్తుంది. తెల్ల ఉల్లిపాయలను చిన్నగా తరిగి నీళ్లలోవేసి మరిగించి తాగుతూ ఉంటే మూత్రంలో మంట తగ్గుతుంది.

ఉల్లిపాయలను గుజ్జుగా దంచి

ఉల్లిపాయలను గుజ్జుగా దంచి

ఉల్లిపాయలను గుజ్జుగా దంచి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్‌కు కలిపి తింటే ఆమాశయం, జీర్ణ అవయవాలు శక్తివంతం అవుతాయి.

చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజుకు అవసరాన్నిబట్టి రెండూ లేదా మూడుసార్లు చప్పరించి మింగుతూ ఉంటే పొట్ట ఉబ్బరింపు, పొట్ట నొప్పి, గ్యాస్ తగ్గుతాయి.

నీళ్ల విరేచనాలు అదుపులోకి

నీళ్ల విరేచనాలు అదుపులోకి

ఉల్లిపాయ రసాన్ని, సున్నం నీళ్లను కలిపి పూటకు రెండు టీస్పూన్ల వంతున తాగితే కలరాలో నీళ్ల విరేచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి. పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటూ ఉంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది.

వాంతులు తగ్గుతాయి

వాంతులు తగ్గుతాయి

ఉల్లిపాయల్ని రుబ్బి దాంట్లోంచి రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ‘స్ట్రాంగ్ పుదీనా టీ' రెడీగా ఉంచుకోవాలి. ముందుగా రెండు చెంచాల ఉల్లిరసం తాగి, ఐదు నిమిషాల విరామం తర్వాత రెండు చెంచాల చల్లటి పుదీనా టీ తాగాలి. మరో ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఇదే పద్ధతిలో ఉల్లిరసం, పుదీనా టీ రెండు చెంచాల చొప్పున విరామంతో సేవించాలి. ఇలా చేస్తే వాంతులు తగ్గిపోతాయి. అజీర్తి వల్ల వాంతులు, విరోచనాలు వస్తే అరకప్పు ఉల్లిపాయరసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి అప్పుడప్పుడు తాగితే వాంతులు, విరోచనాలు తగ్గుముఖం పడతాయి.

వీర్యకణాలు అభివృద్ది చెందుతాయి

వీర్యకణాలు అభివృద్ది చెందుతాయి

పచ్చి ఉల్లిపాయను పురుషులు తీసుకుంటే వీర్యకణాలు అభివృద్ది చెందుతాయి. అందుకే ప్రతి మగాడు కచ్చితంగా పచ్చి ఉల్లిపాయ తినాలి. రక్తపోటు , గుండె జబ్బులు , ఆస్తమా , అల్లెర్జి , ఇన్ఫెక్షన్ , దగ్గు , జలుబు , నిద్రలేమి , ఉబకాయము వంటి జబ్బులు రాకుండ చేస్తుంది. కాలిన గాయాలపై పచ్చి ఉల్లిపాయను మర్దనా చేసినట్టు రాయాలి. దీంతో ఆ ప్రదేశంలో ఏర్పడే మంట, నొప్పి తగ్గుతాయి. అంతేకాదు ఇన్‌ఫెక్షన్లు కూడా దరిచేరవు.

వైరస్, బాక్టీరియాల నుంచి రక్షణ

వైరస్, బాక్టీరియాల నుంచి రక్షణ

ఉల్లి పాయలో బ్యాక్టీరియాను, వైరస్ లను ఆకర్షించే మాగ్నేట్ ఉంటుంది. దానితో బ్యాక్టీరియా ఉల్లిలో చేరిపోతుంది ఇక ఉల్లి నుండి వచ్చే వాసనతో ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. దాని వలనే ఉల్లిపై నల్లని మచ్చలాగ కనిపిస్తుంది.

డయాబెటిస్

డయాబెటిస్

ఇక నేడు ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. టైప్-1 లేదా టైప్-2 అని తేడా లేకుండా చాలా మందిని షుగర్ ఇబ్బంది పెడుతోంది. అయితే ఏ రకమైన డయాబెటిస్ అయినా దాన్ని కేవలం ఒక్క ఉల్లిపాయతో కంట్రోల్ చేయవచ్చు. పచ్చి ఉల్లిపాయను నిత్యం 50 గ్రాముల మోతాదులో తింటే దాంతో షుగర్ కంట్రోల్ అవుతుంది.

20 యూనిట్ల ఇన్సులిన్‌తో సమానం

20 యూనిట్ల ఇన్సులిన్‌తో సమానం

50 గ్రాముల ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్‌తో సమానమని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పచ్చి ఉల్లిపాయను నిత్యం ఏదో ఒక విధంగా తింటుంటే షుగర్ గణనీయంగా తగ్గుతుంది. ఒకేసారి తినకున్నా రోజులో 3 సార్లు 50 గ్రాముల ఉల్లిపాయను విభజించుకుని తిన్నా ఫలితం ఉంటుందట.

పచ్చి ఉల్లిపాయలను తింటే

పచ్చి ఉల్లిపాయలను తింటే

పచ్చి ఉల్లిపాయలను అలా తింటే కేవలం షుగర్ మాత్రమే కాదు, ఇంకా ఇతర అనేక అనారోగ్య సమస్యలు కూడా త‌గ్గిపోతాయి.

ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటివి తగ్గుతాయి. మూత్రాశయ సమస్యలు పోతాయి. మూత్రంలో మంట తగ్గుతుంది.

విటమిన్ల సముదాయం

విటమిన్ల సముదాయం

యాంటీసెప్టిక్‌, యాంటీ బయాటిక్‌, యాంటీ మైక్రో బాక్టీరియల్‌ లక్షణాల నిలయం ఉల్లిపాయ. విటమిన సీ, బీ 12, బీ 6, విటమిన కె, బయోటిన, క్రోమియం, కాల్షియం, ఫోలిక్‌ యాసిడ్‌, డైటరీ ఫైబర్‌ ఫుష్కలంగా ఉల్లిలో ఉంటాయి. అందువల్ల రోజూవారి ఆహారంలో ఉల్లిపాయ తింటే మనకు ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి.

ఉల్లిని వెంట ఉంచుకుంటే

ఉల్లిని వెంట ఉంచుకుంటే

తినడం వల్ల మాత్రమే కాదు, ఉల్లిని మనవెంట ఉంచుకుంటే చాలట! వైరస్‌, బాక్టీరియా వల్ల వచ్చే జబ్బులను మనదరిజేరనీయదట. టెస్టోస్టిరాన, ఇన్సులిన, గ్రోత హార్మోన వంటి హార్మోన్ల లక్షణాలు ఉల్లిలో ఉన్నాయి. అందుకే రక్తశుద్ధికీ, రక్తవృద్ధికీ ఉల్లి దోహదపడుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గుతుంది

కొలెస్ట్రాల్ తగ్గుతుంది

శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసేకంటే, రోజూ పచ్చి ఉల్లిపాయ తింటే చాలు కొలెస్ర్టాల్‌ తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

దగ్గు మాయం

దగ్గు మాయం

ఉల్లిపాయను రెండు ముక్కలు చేసి ప్రతి పొరలోనూ ఒక టేబుల్‌స్పూన బ్రౌన షుగర్‌ అప్లయి చేయాలి. తర్వాత ఆ ముక్కల్ని పాయరూపంలో దగ్గరకు నొక్కి ఒక జార్లో గంటసేపు ఉంచాలి. దాన్ని రోజుకు రెండుసార్లు వాసన చూస్తుంటే దగ్గు తగ్గుముఖం పడుతుంది. లేకపోతే ఉల్లిపాయ రసం, తేనె రెంటినీ సమభాగాల్లో తీసుకుని బాగా గిలక్కొట్టి తాగితే గొంతునొప్పి, దగ్గు తగ్గిపోతాయి. ఇతర ఇన్ఫెక్షన్లను కూడా ఇది నివారిస్తుంది.

చెవినొప్పి నివారణ

చెవినొప్పి నివారణ

చెవినొప్పి నివారణకు ఉల్లి బాగా పనిచేస్తుంది. చెవులు గింగురుమంటున్నప్పుడు దూదిమీద ఉల్లిరసం పిండి దాన్ని చెవిలో ఉంచుకుంటే నొప్పి తగ్గుతుంది లేదా ఉల్లి రసం వేడిచేసి చల్లార్చి చెవిలో వేస్తే చిన్నపిల్లలకు చెవినొప్పి తగ్గిపోతుంది. ఉల్లిపాయ పేస్ట్‌ను నొప్పి ఉన్న ప్రదేశంలో పూసి, ఒక గుడ్డ చుట్టిఉంచడంవల్ల కూడా నొప్పి క్రమంగా నయమవుతుంది.

గుండెకు మేలు

గుండెకు మేలు

గుండె, రక్తనాళాలకు ఉల్లికాడలు ఎంతో మేలు చేస్తాయి. కొలెసా్ట్రల్‌ ఆక్సీకరణను తగ్గిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని రక్తాన్ని పల్చగా చేసి కణాలన్నింటికీ ప్రసరణ చేసేందుకు ఉపయోగపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే గుండె లోపాలు లేదా కార్డియో వాస్కులార్‌ వ్యాధులకు దారి తీయవచ్చు. గుండె జబ్బులు, బీపీతో బాధపడే వారు రోజూ 100 గ్రాముల ఉల్లి తీసుకోవడం చాలా మంచిది. ఉల్లిపాయలోని సల్ఫర్‌ కాంపౌండ్‌ బ్లడ్‌ ప్రెజర్‌ స్థాయిని నియంత్రించి, బ్లడ్‌ కొలెస్ర్టాల్‌ లెవల్స్‌ను తగ్గిస్తుంది.

జ్వర నివారిణి

జ్వర నివారిణి

జ్వరంగా ఉన్నప్పుడు ఉల్లిపాయ తింటే జ్వరం ఎక్కువవుతుందనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఉల్లిపాయ హై బాడీ టెంపరేచర్‌ను తగ్గిస్తుంది. రెండు బాగాలుగా కట్‌చేసిన ఉల్లిపాయను గుజ్జుగా కానీ లేదా ఆ రెండుముక్కల్నిగానీ పాదాలకింద ఉంచుకోవాలి. సాక్సులు వేసుకుని రాత్రంతా అలాగే పడుకోవాలి. ఇలా చేస్తే జ్వరం త్వరగా తగ్గుతుంది. ఉల్లిపాయలు శరీరంలోని టాక్సిన్స జబ్బులను నివారిస్తుంది.

రక్తస్రావాన్ని అరికట్టే ఉల్లి

రక్తస్రావాన్ని అరికట్టే ఉల్లి

ముక్కులోంచి రక్తం కారుతున్న వారు ఉల్లిపాయను కోసి ముక్కుదగ్గర పెట్టుకుని వాసన పీలిస్తే వెంటనే రక్తస్రావం ఆగిపోతుంది. పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటూ ఉంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది. ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కీటకాలు కుట్టినప్పుడు ఉల్లిపాయ రసాన్ని ఆ ప్రదేశంలో అప్లయి చేయాలి. ఇది రక్తస్రావాన్ని వెంటనే తగ్గిస్తుంది. గాయంచుట్టూ క్రిములు చేరకుండా కాపాడుతుంది. ఉల్లిపాయలు తినడంవల్ల రక్తపుష్టి కూడా కలుగుతుంది. ఉల్లిలోని ఐరనని మన శరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడే వాళ్లకు ఉల్లిపాయ చాలా మంచిది.

పొట్టనొప్పి నివారణ

పొట్టనొప్పి నివారణ

పిల్లల్లో పొట్టనొప్పి నివారించడానికి ఉల్లి మంచి దోహదకారి. అందుకు మనం చేయాల్సిందల్లా, కొంచెం నీళ్ళల్లో ఉల్లిపాయను వేసి ఉడికించాలి. ఆ ఉల్లినీటిని చల్లార్చి పిల్లలకు ఒక చెంచాడు తాగిస్తే తక్షణ రిలీఫ్‌ లభిస్తుంది. ఇలా గంటకొక్కసారి చెంచాడు ఉల్లినీరు తాగిస్తే నొప్పి నివారణవుతుంది. ఉల్లికాడలలో పెక్టిన (నీటిలో కరిగే కొల్లాయిడల్‌ కార్బోహైడ్రేట్‌) ముఖ్యంగా పెద్దపేగు కేన్సర్‌ అభివృద్ధి అవకాశాలను తగ్గిస్తుంది. ఉల్లిపాయలో స్థూలపోషకాలు ఉండడంవల్ల ఇది జీవక్రియ క్రమబద్దీకరణకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయను నీళ్లలో వేడిచేసి ఆ నీటికి కొంచెం చక్కెర చేర్చి పిల్లలకు తాగిస్తే వారికి మంచి నిద్ర పడుతుంది.

ఉల్లితో అందమైన జుట్టు

ఉల్లితో అందమైన జుట్టు

జుట్టు సంబంధిత సమస్యల ఉపశమనానికి ఉపయోగపడే మెరుగైన పదార్థాల్లో ఉల్లి ఒకటి. ఇందులోని పోషకాలు జట్టును మరింత బలంగా మార్చి వాటి పెరుగుదలకు దోహదపడుతాయి. ముఖ్యంగా ఉల్లిలో ఉండే సల్ఫర్‌ మూలకం తలభాగంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా తలలో మూసుకుపోయిన రంధ్రాలు తిరిగి తెరుచుకుంటాయి. ఇక ఉల్లిరసరం తలకు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. జుట్టులో ఉన్న ఫంగ్‌సని ఉల్లి హరింపజేస్తుంది. చుండ్రును నివారించి తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది. అలాగే జుట్టు ఊడిపోకుండా కాపాడుతుంది.

English summary

25 Magical Benefits of Onions That Keep the Doctor Away

20 Magical Benefits of Onions That Keep the Doctor Away
Story first published: Friday, May 18, 2018, 9:00 [IST]