For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లవంగాలతో నరాల బలహీనత పోతుంది.. ఇంకా బోలెడన్నీ ప్రయోజనాలు

ల‌వంగాల‌ను నిత్యం మ‌నం వంట‌ల్లో వేస్తుంటాం. వీటి వ‌ల్ల వంట‌ల‌కు మంచి వాస‌న మాత్ర‌మే కాదు, చ‌క్క‌ని రుచి కూడా వ‌స్తుంది. ఎక్కువ‌గా నాన్ వెజ్ వంటల్లో ల‌వంగాల‌ను వాడుతారు.

|

ల‌వంగాల‌ను నిత్యం మ‌నం వంట‌ల్లో వేస్తుంటాం. వీటి వ‌ల్ల వంట‌ల‌కు మంచి వాస‌న మాత్ర‌మే కాదు, చ‌క్క‌ని రుచి కూడా వ‌స్తుంది. ఎక్కువ‌గా నాన్ వెజ్ వంటల్లో ల‌వంగాల‌ను వాడుతారు. అయితే ల‌వంగాల‌తో చేసే టీ గురించి మీరెప్పుడైనా విన్నారా..? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో, దాన్ని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లవంగం టీ

లవంగం టీ

కావాల్సినవి : లవంగాలు - 1 టీ స్పూన్, నీళ్ళు - ఒక గ్లాసు, తేనె - 1 టీ స్పూన్.

తయారు చేసే విధానం : ఒక పాత్ర తీసుకుని అందులో ఒక గ్లాస్‌ నీళ్ళు పోసి మరిగించాలి. తర్వాత లవంగాల పొడి వేసి 10 నిముషాలు బాగా మరిగించాలి. స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకునే వారు 20 నిముషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, వడగట్టి , అందులో రుచికి సరిపడా తేనె మిక్స్ చేసి తాగితే సరిపోతుంది. ఇంకా ఇతర ఫ్లేవర్ కావాల‌ని కోరుకునే వారు పుదీనా, తులసి వంటి ఆకులను లవంగం పొడి ఉడికించేటప్పుడు వేసుకోవచ్చు. దీంతో చక్కటి రుచితో పాటు కాస్త ఘాటుగా కూడా ఉండే లవంగం టీ త‌యార‌వుతుంది. దీన్ని తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

దంతాల నొప్పి తగ్గుతుంది

దంతాల నొప్పి తగ్గుతుంది

ల‌వంగం టీని తాగితే దంతాలు, చిగుళ్ల నొప్పి త‌గ్గుతుంది. నోట్లో ఉండే బాక్టీరియా న‌శిస్తుంది. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది.

ల‌వంగం టీని రోజుకు 3 పూట‌లా తాగితే జ్వ‌రం త‌గ్గుతుంది.

వెంటనే ఉపశమనం

వెంటనే ఉపశమనం

ఫ్లూ, జ‌లుబు, ద‌గ్గుల నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం కావాలంటే లవంగం టీని తాగ‌వ‌చ్చు. దీని వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. సైన‌స్ ఉన్న వారు ఈ టీని తాగితే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

జీర్ణ సమస్యలు మాయం

జీర్ణ సమస్యలు మాయం

జీర్ణ సమ‌స్య‌లు మాయ‌మ‌వుతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్‌, అసిడిటీ వంటివి పోతాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగుప‌డుతుంది. క‌డుపు నొప్పి త‌గ్గుతుంది.

నొప్పులు మాయం

నొప్పులు మాయం

ల‌వంగం టీని చ‌ల్లార్చి ఫ్రిజ్‌లో ఉండే ఐస్ ట్రేల‌లో పోయాలి. కొంత సేప‌టికి క్యూబ్స్ త‌యార‌వుతాయి. వీటిని శ‌రీరంలో నొప్పులు ఉన్న చోట మ‌ర్ద‌నా చేసిన‌ట్టు రాస్తే వెంట‌నే నొప్పులు త‌గ్గుతాయి. కీళ్ల‌నొప్పులు, కండ‌రాలు వాపు, నొప్పి త‌గ్గుతాయి.

దురదలు తగ్గుతాయి

దురదలు తగ్గుతాయి

ల‌వంగం టీని చల్లార్చి చ‌ర్మంపై రాసుకుంటే దుర‌ద‌లు త‌గ్గుతాయి. చ‌ర్మం మృదువుగా మారుతుంది. చ‌ర్మంపై ఉండే బాక్టీరియా, వైర‌స్‌లు పోతాయి. చ‌ర్మానికి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

దగ్గుకు మంచి మందు

దగ్గుకు మంచి మందు

దగ్గుకు సహజమైనా మందు లవంగం .దగ్గుకు , శ్వాస సంబంధింత సమస్యలకు కూడా లవంగం చాలావరకు పని చేస్తుంది. లవంగం మన తినే ఆహారం లో తీసుకుంటే మంచిది. వాంతులు ,కడుపు లో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనె ను తీసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది.

జలుబుకు ఉపశమనం

జలుబుకు ఉపశమనం

తేనె ,కొన్ని లవంగాల నూనె ను గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు తాగితే జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు. లవంగాలు ఏ వంటకంలోనైన వేసుకోవచ్చు . వంటకాలకు మంచి సువాసన రుచినీ కూడా ఇస్తుంది. వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పని చేస్తుంది.

నరాలకు శక్తి

నరాలకు శక్తి

తులసి, పుదీనా ,లవంగాలు ,యాలకుల మిశ్రమం టీ లా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది . లవంగాలను పొడి చేసి నీళ్ళలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్ తగ్గి ఉపశమనం కలుగుతుంది.

కడుపుబ్బరం

కడుపుబ్బరం

మనం ప్రతి రోజు తాగే టీ లో లవంగం వేసుకొని తాగితే కడుపుబ్బరం తగ్గుతుంది. 10 లేక 12 లవంగాలను తీసుకొని వాటికి పసుపు ,చక్కెర కలిపి మిక్సీలో పొడి చేసుకొవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తాగితే శరీరానికి మంచిది. క్రమం తప్పకుండా ఆహారం లో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది

గొంతులో కురుపులు

గొంతులో కురుపులు

లవంగాల్ని వేడి చేసి చప్పరించితే గొంతులో కురుపులు నయమవుతాయి. కూరల్లో వాడితే జీర్ణశక్తిని పెంచుతుంది. చిగుళ్ళు గట్టిపడతాయి. లవంగాలు, నేల వేము రసం సమపాళ్ళలో కలిపి రోజుకు రెండు సార్లయినా తాగితే నీరసం, ఆకలి లేకపోవటం, జ్వరం వచ్చి కళ్ళు తిరిగి పడిపోవటం లాంటివి తగ్గుతాయి.

విరేచనాలు తగ్గుతాయి

విరేచనాలు తగ్గుతాయి

లవంగ పొడి, శొంఠి, నాగకేసర పొడి, నల్లమిరియాలు, తోక మిరియాలు సమపాళ్ళుగా కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే పైత్యం, మందం, వాంతులు, విరేచనాలు తగ్గిపోతాయి. లవంగాలు, శొంఠి, వాము, శిలా ఉప్పు సమపాళ్ళుగా కలిపి రోజుకు రెండు స్పూన్లు చొప్పున తీసుకుంటే అజీర్తి, ఊపిరి వ్యాధులు తగ్గిపోతాయి.

మద్యం తాగాలనే కోరిక ఉండదు

మద్యం తాగాలనే కోరిక ఉండదు

రెండు లవంగాల్ని బుగ్గనపెట్టుకుని నమిలితే మద్యం తాగాలన్న కోరిక కలగదు. లవంగాలను నీళ్లలో మరిగించి తాగడం వల్ల అజీర్తి, తలతిరగడం, వాంతులు, అలసట వంటివి తగ్గుతాయి. అంతేకాదు, ఫ్లూ, జలుబు, సైనసైటిస్, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి.

నులిపురుగులు చనిపోతాయి

నులిపురుగులు చనిపోతాయి

లవంగనూనెలో దూదిని ముంచి దంతాలు, చిగుళ్లులో నొప్పి వచ్చేచోట పెడితే ఇట్టే తగ్గిపోతుంది. పెద్ద పేగులోని పరాన్నజీవుల్నీ సూక్ష్మ జీవుల్నీ లవంగంలోని 'యుజెనాల్' నాశనం చేస్తుంది. అందుకే డయేరియా, నులిపురుగులు, జీర్ణసంబంధిత రుగ్మతలకి లవంగం మంచి మందుగా ఉపయోగపడుతుంది.

గుండెల్లో మంట

గుండెల్లో మంట

రెండుమూడు లవంగాలకు కొంచెం పంచదార చేర్చి నూరి చల్లటినీళ్లలో కలిపి తాగితే గుండెల్లో మంట వెంటనే తగ్గుతుంది. ఏడు మొగ్గల్ని కొద్దినీళ్లలో మరిగించి దాని నుంచి వచ్చే ఆవిరిని పీల్చి చల్లారిన తరవాత ఆ నీటిని తాగేస్తే జలుబుతో మండిపోతున్న ముక్కుకి హాయిగా ఉంటుంది. లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకోవటడంతో బాటు క్యాన్సర్లు, హృద్రోగాలు, డయాబెటిస్, ఆర్థ్రైటిస్, అల్జీమర్స్‌ను నిరోధిస్తాయట.

కఫం, పిత్తం

కఫం, పిత్తం

లవంగాల్లో ఇనుము, కార్బోహైడ్రేట్లు, కాల్సియం, ఫోస్ఫరాస్, పొటాసియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్, మంగనీష్, విటమిన్ లు... ఎ,సి , ఉంటాయి. ఎవరైనా కఫం, పిత్త రోగాల బారిన పడినవారుంటే ప్రతి రోజు లవంగాలను సేవిస్తుంటే ఈ జబ్బులు మటుమాయమౌతాయి. ఎక్కువగా దప్పిక వేసినప్పుడు లవంగ పలుకులు తింటే దప్పిక తీరి ఉపశమనం కలుగుతుంది.లవంగాలను తింటే ఆకలి బాగా వేస్తుంది. వీటి వలన జీర్ణక్రియకు అవసరమైన రసాలు ఉదరంలో ఊరుతాయంటున్నారు వైద్యులు.

తెల్లరక్తకణాలు

తెల్లరక్తకణాలు

లవంగాలు తెల్ల రక్త కణాలను పెంపొదిస్తుంది. అలాగే జీవిత కాలాన్ని పెంపొందించే గుణాలు ఇందులో ఉన్నాయి.ఇది వ్యాధి నిరోధక శక్తిగా కూడా ఉపయోగపడుతుంది. ఎలాంటి చర్మ వ్యాధినైనా లవంగాలు ఇట్టే మాయం చేసేస్తాయి. దీనిని చందనంతోపాటు రుబ్బుకుని లేపనంలా చర్మానికి పూస్తే చర్మ వ్యాధులు మటుమాయమంటున్నారు వైద్యులు.

చైనీయులు బాగా ఉపయోగిస్తారు

చైనీయులు బాగా ఉపయోగిస్తారు

లవంగాలను చైనీయులు వెక్కిళ్ల నివారణా ఔషధంగా ఉపయోగిస్తారు. అంతేగాకుండా వీటితో తామర లాంటి చర్మ సంబంధ వ్యాధులు. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు బాగా తగ్గుతాయని వారు చెబుతుంటారు. లవంగ నూనెను పొట్టుపై రాస్తే జీర్ణ సంబంధ సమస్యలు దూరమవు తాయని మనదేశీయులు భావిస్తారు. పంటినొప్పిని నివారించటంలోనూ లవంగాలు కీలకపాత్ర పోషిస్తాయి.

కీటకాల సమస్య ఉండదు

కీటకాల సమస్య ఉండదు

పాలలో లవంగం పొడి, ఉప్పు కలిపి నుదుటమీద ప్యాక్ వేసినచో తలనొప్పి తగ్గుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరంతో బాధపడేవారు లవంగాలను పెనం మీద వేయించి, పొడిగా చేసుకుని రోజూ తేనెతో తీసుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి లవంగాలు మంచి చేస్తుంది. ఇది బ్లడ్, షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. మీ గార్డెన్లో లవంగాలు మొక్కలు వేసుకుంటే.. కీటకాల సమస్య ఉండదు .

ఈగల సమస్య ఉంటే..

ఈగల సమస్య ఉంటే..

కిచెన్ లో ఈగల సమస్య ఎక్కువగా ఉంటే ఒక గిన్నె నిండ లవంగాలు తీసుకుని గది మధ్యలో ఉంచండి . చీమల సమస్య ఎక్కువగా ఉంటే దాల్చిన చెక్క, లవంగాల పొడి మిశ్రమాన్ని నీటిలో కలిపి స్పే చేయండి

English summary

30 amazing clove benefits that you didn’t even know

30 amazing clove benefits that you didn’t even know
Story first published:Tuesday, May 15, 2018, 10:06 [IST]
Desktop Bottom Promotion