Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
మీ భార్య చేసే వంటకాల్లో ఇంగువను తప్పకుండా వేయించుకోండి.. ఇంగువతో ఎన్నో లాభాలు
అసెఫీటిడా అంటే ఏంటి? ఇంగువ అనో హింగ్ అనో చెబితే మన రోజువారీ వంటకాల్లో ఉపయోగించే పదార్థం గుర్తుకువస్తుంది. ఇంగువ ఉపయోగాలు, ఇంగువ ప్రయోజనాలు, ఇంగువ లాభాలు.
అసెఫీటిడా అంటే ఏంటి? అని ఎవరన్నా అడిగితే కాసేపు ఆలోచించాల్సి ఉంటుంది. అదే ఇంగువ అనో హింగ్ అనో చెబితే మన రోజువారీ వంటకాల్లో ఉపయోగించే పదార్థం గుర్తుకువస్తుంది. ఫెరూలా అనే వృక్షజాతి నుంచి సేకరించిన పాలతో రూపొందించే ఇంగువని విడిగా తినడం కష్టమే.

రుచీ, పరిమళం వేరు
కానీ అదే ఇంగువని వంటల్లో వేసుకుంటే వచ్చే రుచీ, పరిమళం వేరు. భారతీయుల వంటకాల్లో, మరీ ముఖ్యంగా దక్షిణాది వంటకాల్లో ఇంగువ లేకుండా పని జరగదు. వెల్లుల్లి, ఉల్లి వంటి పదార్థాలకు దూరంగా ఉండే సనాతనవాదులు సైతం... వాటికి బదులుగా ఇంగువని చిలకరించి వంటకాల్లో అనూహ్యమైన రుచిని సాధిస్తుంటారు.

ఉబ్బరాన్ని తగ్గిస్తుంది
మరి వందల సంవత్సరాలుగా మన వంటకాల్లో చేరిపోయిన ఈ ఇంగువను కేవలం రుచి, పరిమళానికేనా... లేదా మరేదన్నా ఆరోగ్యపరమైన కారణంతో వాడుతుంటారా? అంటే జవాబులు ఇవిగో... చాలామందికి ఆహారం తిన్న తరువాత కడుపు ఉబ్బరంగా మారిపోతుంది. ఇలాంటి ఉబ్బరాన్ని తగ్గిస్తుంది ఇంగువ. ఇలా కడుపు ఉబ్బరాన్ని తగ్గించే పదార్థాలని యాంటీ ఫ్లాట్యులెంట్స్ అంటారు. ఇంగువ అలాంటి యాంటీ ఫ్లాట్యులెంట్స్‌లో ఒకటి.

జీర్ణసంబంధమైన సమస్యలుండవు
కేవలం కడుపు ఉబ్బరాన్నే కాదు! జీర్ణసంబంధమైన సమస్యలెన్నింటిలోనో ఇంగువ అమోఘంగా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం పిత్తదోష కారణంగా ఏర్పడే అరుచి, అజీర్ణం, ఆకలి లేకపోవడం లేకపోవడం వంటి సమస్యలకు ఇంగువ దివ్యౌషధం. ఆఖరికి కడుపు లోపల అయిన గాయాలను మాన్పే శక్తి కూడా ఇంగువకు ఉందని పరిశోధనల్లో తేలింది.

ఫిట్స్ కు మంచి మందు
అటు ఆయుర్వేదంలోనే కాకుండా ఇటు యునానీలో కూడా ఇంగువ ప్రాధాన్యత అంతాఇంతా కాదు. ముఖ్యంగా ఫిట్స్ వంటి మానసిక సంబంధమైన వ్యాధులకు మందుగా యునానీ వైద్యులు ఇంగువను వాడుతుంటారు.

రుతుసంబంధ సమస్యలకు పరిష్కారం
ఆడవారిలో రుతుసంబంధమైన సమస్యలకు ఇంగువ విరుగుడుగా పనిచేస్తుందని నమ్ముతారు. రుతుచక్రం సరిగా లేకపోవడం, రుతుక్రమ సమయంలో కడుపునొప్పి వంటి ఇబ్బందులను ఇంగువ సరిచేస్తుంది. అందుకే కొంతమంది బాలింతలకు ఇంగువను ఇస్తుంటారు.

దగ్గులకు ఉపశమనం
ఇంగువ ఇటు పొడిదగ్గు, అటు కఫంతో వచ్చే దగ్గులకు ఉపశమనంగా నిలుస్తుంది. ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులలోనూ ఉపయుక్తంగా ఉంటుంది. ఇక తీవ్ర పడిశాన్ని కలిగించే హెచ్ వన్ ఎన్ వన్ అనే వైరస్‌ను ఇంగువ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తేలింది.

అదుపులో షుగర్
ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా షుగర్ వ్యాధి బాధలు కనిపిస్తున్నాయి. ఈ చక్కెర వ్యాధిని అదుపుచేయడంలో ఇంగువ తనదైన పాత్రను పోషించగలదంటున్నారు. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇంగువ, రక్తంలో చక్కెర నిల్వలని అదుపు చేస్తుందని చెబుతున్నారు.

కౌమరిన్
ఇంగువలో కౌమరిన్ అనే రసాయనాలు ఉన్నాయట. ఈ కౌమరిన్‌లకు రక్తాన్ని పలచన చేసే ప్రభావం ఉంటుంది. దీని వల్ల రక్తం గడ్డకట్టి గుండెపోటుకి దారితీసే పరిస్థితి నుంచి బయటపడవచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకోకుండా నివారించవచ్చు.

ఒంటి నొప్పులను నివారించగలదు
ఇంగువకి ఒంటి నొప్పులను నివారించే గుణం ఉందంటున్నారు. ముఖ్యంగా ఓ పట్టాన మందులకు లొంగని మైగ్రెయిన్ తలనొప్పులు, రుతుక్రమంతో పాటు వచ్చే కడుపునొప్పులను ఇది హరిస్తుంది.

గ్యాస్ సమస్య ఉండదు
ఇంగువ వేసిన ఆహారం తింటే గ్యాస్ సమస్య ఉండదు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్ణ సమస్య బాధించదు. మలబద్దకం, అసిడిటీ ఉండదు. ఇతర జీర్ణ సమస్యలున్నా పోతాయి. క్యాబేజీ, బంగాళాదుంప లాంటి కూరలు తిన్నప్పుడు కడుపులో గ్యాస్ చేరి ఇబ్బంది పెడుతుంది. దీని వల్ల ఒక్కోసారి కడుపునొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని నుంచి బయటపడాలంటే ఇవి వండేటప్పుడు చిటికెడు ఇంగువ వేస్తే చాలు.

అల్సర్లను నయం చేస్తుంది
పలు రకాల అల్సర్లను నయం చేసే శక్తి ఇంగువకు ఉందని పలు పరిశోధనలు తేల్చి చెప్పాయి. అంతేకాదు, ఆకలి లేకున్నా దీంతో చేసిన పదార్థాలను తింటే బాగా ఆకలి పుడుతుంది.

గొంతులో మంట
బాలింతలకు ఇచ్చే ఆహారాల్లో ఇంగువు ముఖ్యమైంది. ఓ టేబుల్ స్పూన్ తేనె లో కొద్దిగా ఇంగువ, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి తీసుకుంటే గొంతులో మంట తగ్గుతుంది.

లైంగిక పటుత్వం తగ్గితే
ఇంగువతో శ్వాసకోశ సంబంధి సమస్యలు కూడా తగ్గుతాయి. 2 లేదా 3 సెంటీ గ్రాముల ఇంగువ, కాస్తా వెల్లుల్లి, తమలపాకుల రసాన్ని రెండు చెంచాల తేనెతో కలిపితీసుకుంటె శ్వాసకోశవ్యాధులు దూరమవుతాయి. హిస్టీరియా వ్యాధిగ్రస్తులకు ఇంగువ వాసనని చూపిస్తే ఫలితం ఉంటుంది. లైంగిక పటుత్వం తగ్గినవారు మర్రిపాలలో తేనె, కొద్దిగా ఇంగువ కలిపి 40 రోజుల పాటు తీసుకుంటే మునుపటి ఫామ్ కొనసాగిస్తారు.

అద్భుత ఫలితాలు
చెప్పుకొంటూ పోవాలే కానీ ఇంగువ ఇచ్చే అద్భుత ఫలితాల జాబితా చాంతాడంత ఉంటుంది. అందుకే దీనిని ఆయుర్వేదం, హోమియోపతి, యునాని వంటి అన్ని సంప్రదాయ వైద్యాలలోనూ వాడుతుంటారు. ఇంగువని మన వంటకాల్లో చేర్చడం వల్ల పైన పేర్కొన్న లాభాలన్నీ ఎంతో కొంత కలుగుతూనే ఉంటాయి. అందువల్ల ఈ రోజు నుంచి మీ భార్య చేత ఆమె చేసే వంటకాల్లో ఇంగువను తప్పకుండా వేయించుకోండి. ఈ లాభాలన్నీ మీరూ పొందండి.

మజ్జిగలో కలిపి తీసుకుంటే..
అలా కాకుండా చిటికెడంత ఇంగువని గోరువెచ్చటి నీళ్లలోనో, మజ్జిగలోనో తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది. ఇంగువను ప్రత్యేకించి ఒక ఔషధిగా తీసుకోవాలంటే మాత్రం ఎవరన్నా తెలిసిన ఆయుర్వేద వైద్యుని సంప్రదించడం మంచిది.



Click it and Unblock the Notifications
