For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  కొందరి శరీరం బయటకు బాగున్నా.. మలబద్దకంతో లోపలంతా కంపు కంపు ఉంటుంది.. దాన్ని ఇలా క్లీన్ చేసుకోండి

  |

  మనిషి శరీరం పైకి చాలా శుభ్రంగా, మంచి వాసనతో ఉన్నప్పటికీ లోపలి శరీరం మాత్రం భూమి మీద ఏ జంతువు శరీరంలో లేనంత అపరిశుభ్రత ఉంటుంది. మనలో పేరుకున్న కంపునకు మనమే బాధ్యులం కాబట్టి దాన్ని వదిలించుకొని శుభ్రం చేసుకునే బాధ్యత కూడా మనదే కావాలి. మన అలవాట్లు మంచిగా ఉంటే చాలు అదే శుభ్రం అయిపోతుంది.

  వారంలో కనీసం మూడు సార్లయినా పేగుల్లో కదలికలు లేకపోతే దాన్ని మలబద్ధకం అని అనవచ్చు. మలబద్ధకం ఏర్పడినపుడు మలం చాలా గట్టిగా తయారవుతుంది. విసర్జనకు చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని సార్లు మలవిసర్జన సమయంలో నొప్పిగా కూడా ఉంటుంది. మలబద్ధకంగా ఉన్న వారికి కడుపు ఉబ్బరంగా ఉన్న భావన కలుగుతుంది.

  పెద్దపేగు ఎక్కువ నీటిని పీల్చుకోవడం

  పెద్దపేగు ఎక్కువ నీటిని పీల్చుకోవడం

  పెద్దపేగు ఎక్కువ నీటిని పీల్చుకోవడం లేదా పెద్దపేగు కండరాలలో కదలికలు తగ్గిపోవడం వల్ల పేగులో మలం కదలికలు చాలా నెమ్మదిగా కదులుతుంది అందువల్ల మలబద్దకం ఏర్పడుతుంది. ఫలితంగా మలం గట్టిగా తయారవుతుంది.

  నీళ్లు తగినంత తీసుకోకపోవడం

  నీళ్లు తగినంత తీసుకోకపోవడం

  నీళ్లు తగినంత తీసుకోకపోవడం, ఆహారంలోఎక్కువ ఫైబర్ లేకపోవడం, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండడం. తగినన్ని నీళ్లు తీసుకోకుండా, ఆహారంలో చక్కెరల శాతం పెరిగితే పెరిస్టాలిక్ కండరాలలో కదలికలు చాలా నెమ్మదిస్తాయి. మలపదార్థం కూడా గట్టి పడి గరుకుగా తయారవుతుంది. ఇలాంటి గరుకు మలం వల్ల విసర్జన సమయంలో మలద్వారం దగ్గర చర్మం చిట్లి పోవడం వల్ల ఫిషర్ ఏర్పడుతుంది. అందువల్ల నొప్పిగా ఉంటుంది.

  కొన్ని ఇతర కారణాలు

  కొన్ని ఇతర కారణాలు

  ఎక్కువ కొవ్వులు కలిగిన ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం లేకపోవడం, మలవిసర్జనను వాయిదా వేయడం, ఎక్కువ ఒత్తిడి కలిగిన జీవనశైలి, కొన్ని రకాల ఆహార పదార్థాలు పడకపోవడం, కొన్ని రకాల మందులు వాడడం, ఉదాహారణకు ఐరన్ మందులు, యాంటాసిడ్స్, పెయిన్ కిల్లర్లు, యాంటి డిప్రెసియెంట్స్ వాడడం వల్ల కూడా మలబద్దకం ఏర్పడుతుంది.

  కాలేయసమస్యలు ఉన్నపుడు

  కాలేయసమస్యలు ఉన్నపుడు

  థైరాయిడ్ సమస్య ఉన్నపుడు, ఐబీఎస్ సమస్య ఉన్నపుడు, కాలేయసమస్యలు ఉన్నపుడు, పక్షవాతం వచ్చినపుడు నాడులు దెబ్బతినడం జీర్ణవ్యవస్థలో సమతౌల్యం లోపించడం, మెగ్నిషియం, ఫోలిక్ యాసిడ్ లోపించడం, పరాన్న జీవుల వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. గర్భం దాల్చడం, వయసు పెరగడం, ప్రయాణాల వంటివి కూడా కొన్ని సార్లు మలబద్ధకానికి కారణమవుతాయి.

  ఆకలి కూడా మందగిస్తుంది

  ఆకలి కూడా మందగిస్తుంది

  మలబద్ధకం వలన శరీరం సోమరితనము ఆవరించుకుంటుంది. పొట్ట, తల బరువుగా వుంటాయి. వళ్ళంతా పొడిబారి పెళుసుగా తయారవుతుంది.నిద్ర సరిగా పట్టదు. మెదడు మొద్దు బారినట్లంటుంది. ఆకలి కూడా మందగిస్తుంది. అంతే కాదు ఈ లక్షణాలతోపాటు అనేక రోగాలు తలెత్తడానికి అవకాశం కలుగుతుంది.

  పురుగులు పుడతాయి

  పురుగులు పుడతాయి

  మలబద్ధకం వలన అది బయటకు పోనట్లయిన మలము అక్కడే వుండి కుళ్ళడం మొదలు పెడుతుంది. పురుగులు పుడతాయి. దుర్వాసనతో కూడిన గ్యాస్(అపాన వాయువు) ఉత్పన్నమవుతుంది. గ్యాస్ పైకి లేవడం వ్యాపించడం దాని సహజ గుణం. ఆ గ్యాస్ శరీరంలోని అన్ని భాగాలకు వ్యాపించి రక్తమును విషపూరితము చేస్తుంది. ఇది వ్యాధులకు నాంది అన్నమాట.

  నివారణ మార్గాలు

  నివారణ మార్గాలు

  ఆహారంలో ఎక్కువ పండ్లు, కూరగాయలు, గింజధాన్యాలు ప్రతి రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజు తగినన్ని నీళ్లు తాగాలి. నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మలం మృదువుగా అవుతుంది. శారీరక శ్రమ వల్ల పేగుల్లో కదలికలు చురుకుగా ఉంటాయి. ఉదయం నిద్రలేవగానే రెండు గ్లాసుల నీళ్లు తాగి అటు ఇటు కొద్ది సమయం పాటు నడిస్తే కడుపులో కదలికలు పెరుగుతాయి. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మలబద్ధకానికి దూరంగా ఉండొచ్చు.

  యాంటిబయాటిక్స్ వంటి రసాయనాల వల్ల

  యాంటిబయాటిక్స్ వంటి రసాయనాల వల్ల

  నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణమయ్యేవి, జీర్ణంకానీ పీచు పదార్థాలు నీటిని ఎక్కువగా నిల్వ చేసి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతాయి. ఫలితంగా జీర్ణవ్యవస్థలోని మేలు చేసే సూక్ష్మజీవులు చురుకుగా ఉంటాయి. యాంటిబయాటిక్స్ వంటి రసాయనాల వల్ల అవి నశిస్తాయి. ఫలితంగా జీర్ణవ్యవస్థ ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఇప్పుడు డాక్టర్లు కూడా యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించాడానికే ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇప్పుడందరు కూడా ప్రోబయాటిక్/ప్రిబయాటిక్ మందులనే సూచిస్తున్నారు.

  చికిత్సా విధానాలు

  చికిత్సా విధానాలు

  కొన్ని మూలీకా ఔషధాలు, ఎనిమా, ఉపవాసం, ఎక్కువ ఫైబర్ కలిగిన ఆహారం, పండ్లు ఎక్కువగా తీసుకోవడం, చల్లని మడ్ ప్యాక్, తొట్టి స్నానం, యోగాసనాలు, ప్రాణాయామాలు, దీర్ఘశంఖ ప్రక్షాలన వంటి యోగక్రియలు వంటివి ఉపయోగించి ప్రకృతి వైద్యులు చికిత్సలు చేస్తారు.

  వెచ్చని నీటిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి

  వెచ్చని నీటిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి

  ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపి తాగితే చాలు వెంటనే విరేచనం అవుతుంది. పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు నెట్టి వేయబడతాయి. నెయ్యికి బదులుగా కొబ్బరినూనెను కూడా వాడవచ్చు. రోజూ ఇలా చేస్తే మలబద్దకం ఎన్నటికీ బాధించదు.

  ఆలివ్ ఆయిల్‌ను తీసుకుంటే

  ఆలివ్ ఆయిల్‌ను తీసుకుంటే

  రోజూ పరగడుపునే ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్‌ను తీసుకుంటే మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. విరేచనం సాఫీగా అవుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి ఆ నీటిని తాగితే విరేచనం అవుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది.

  బేకింగ్ సోడాను కలుపుకుని తాగితే

  బేకింగ్ సోడాను కలుపుకుని తాగితే

  ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను కలుపుకుని తాగినా ఫలితం ఉంటుంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా ఎప్సం సాల్ట్‌ను కలుపుకుని తాగినా మలబద్దకం నుంచి తప్పించుకోవచ్చు. ఎప్సం సాల్ట్‌లో ఉండే మెగ్నిషియం పేగుల్లో కదలికలను నియంత్రిస్తుంది. దీంతో విరేచనం సులవుగా అవుతుంది.

  పీచు పదార్థాలు

  పీచు పదార్థాలు

  పీచు పదార్థాలు అధికంగా ఉన్న అరటి పండ్లు, పైనాపిల్, బత్తాయి, సపోట పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు నిత్యం తీసుకోవడం వలన మలవిసర్జన త్వరలోగా సాఫీగా జరుగుతుంది. ముఖ్యం మెంతి కూర రోజూ తినాలి.

  ఆయిల్ ఫుడ్స్

  ఆయిల్ ఫుడ్స్

  ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు మానివేయాలి. ఆల్కహాలు మానివేయాలి. నిలువ పచ్చళ్లు తినడం మానాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. టీ, కాఫీలు మానివేయాలి. ఒక పద్ధతిలో వ్యాయామం చేయడం వలన మలబద్దకం కలుగదు. మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి.

  ముక్కకూడదు

  ముక్కకూడదు

  మలవిసర్జన చేసేటప్పుడు బలవంతంగా ముక్కకూడదు. ఇందువలన అర్శమొలలు తయారయి, తిరిగి మలబద్దకాన్ని కలుగజేస్తాయి. ప్రతి రోజూ ఓ చిన్నగ్లాసుడు క్యారట్ జ్యూస్ లేదా క్యాబేజీ రసం, ద్రాక్షరసం లాంటివి , బీట్ రూట్ రసం, అరటి పండ్లు తీసుకోవాలి.

  టొమాటో రసంలో..

  టొమాటో రసంలో..

  టొమాటో రసంలో కాసింత ఉప్పు, మిరియాల పొడి కలిపి ప్రతిరోజూ ఉదయం సేవిస్తే... మలబద్ధకం, అజీర్తితో పాటు గ్యాస్ వల్ల కలిగే మంట కూడా తగ్గుతుంది.బాగా వేడిచేసి ఇబ్బంది పడుతుంటే... తమలపాకులో కాసింత పచ్చ కర్పూరం, కొంచెం మంచి గంధం, కొద్దిగా వెన్న వేసి చుట్టి నమిలి, ఆ రసాన్ని మింగితే మంచి ఫలితముంటుంది.

  త్రిఫలచూర్ణం

  త్రిఫలచూర్ణం

  రాత్రి పడుకునే ముందు ఒక చెంచా త్రిఫలా చూర్ణం నీళ్లలో కలుపుకుని తాగాలి. అల్లం, స్వచ్ఛమైన బెల్లం ఒక్కోటి 5 గ్రాములు తీసుకుని రెండూ కలిపి ర్రాతి పడుకోబోయే ముందు నమిలి తినాలి.

   యాపిల్

  యాపిల్

  రోజుకో యాపిల్ తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాదు అనే మాట మ‌న‌కు తెలిసిందే. అయితే రోజుకో యాపిల్‌ను తింటే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఎందుకంటే యాపిల్‌లో 4.5 గ్రాముల ఫైబ‌ర్ ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరిస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌క స‌మ‌స్య‌ను దూరం చేస్తుంది. దీంతో సుల‌భంగా విరేచ‌నం అవుతుంది.

  నారింజ

  నారింజ

  నారింజ పండ్ల‌లో విట‌మిన్ సి మాత్ర‌మే కాదు ఫ్లేవ‌నాల్ అనే ప‌దార్థం ఉంటుంది. ఇది నాచుర‌ల్ లాక్సేటివ్‌గా ప‌నిచేస్తుంది. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య పోతుంది. ఒక నారింజ పండులో 4 గ్రాముల వ‌ర‌కు ఫైబ‌ర్ ఉంటుంది. క‌నుక ఈ పండును రోజూ తింటే చాలు మ‌ల‌బ‌ద్ద‌కం అన్న మాటే ఉండ‌దు.

  పాప్ కార్న్

  పాప్ కార్న్

  ఒక క‌ప్పు పాప్ కార్న్‌లో ఒక గ్రామ్ ఫైబ‌ర్ ఉంటుంది. క‌నుక రోజుకు 4 క‌ప్పుల వ‌ర‌కు పాప్ కార్న్ తిన్నా చాలు. దాంతో 4 గ్రాముల వ‌ర‌కు ఫైబ‌ర్ అందుతుంది. త‌ద్వారా జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. అయితే పాప్ కార్న్‌ను అలాగే తినాలి. అందులో ఫ్లేవర్ కోసం ఏ ప‌దార్థాన్ని క‌ల‌ప‌కూడ‌దు. క‌లిపితే క్యాల‌రీలు అధికంగా చేరుతాయి.

  ఓట్స్

  ఓట్స్

  రోజుకు రెండు క‌ప్పుల ఓట్స్ తిన‌డం అల‌వాటు చేసుకున్నా చాలు. దాంతో 4 గ్రాముల వ‌ర‌కు ఫైబ‌ర్ అందుతుంది. అది మ‌ల‌బ‌ద్ద‌క స‌మ‌స్య‌ను దూరం చేస్తుంది.

  అవిసె గింజ‌లు

  అవిసె గింజ‌లు

  రోజుకు రెండు స్పూన్ల అవిసె గింజ‌ల‌ను తిన్నా చాలు. ఫైబ‌ర్ పుష్క‌లంగా అందుతుంది. మ‌ల‌బ‌ద్ద‌క స‌మ‌స్య‌ను దూరం చేసుకోవ‌చ్చు. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

  అలోవెరా

  అలోవెరా

  రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున 30 ఎంఎల్ మోతాదులో క‌ల‌బంద గుజ్జును తింటే దాంతో మ‌ల‌బ‌ద్ద‌క స‌మ‌స్య దూర‌మ‌వుతుంది. ఇందులో ఉండే ఫైబ‌ర్ జీర్ణ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మై, విరేచ‌నం సాఫీగా అయ్యేలా చూస్తుంది.

  యోగాసనాలు

  యోగాసనాలు

  చిన్న పాటి యోగాసానాలను సుఖమవ్యాయామ అంటారు. పవనముక్తాసనం, వజ్రాసనం మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. శంఖప్రక్షాలన అనేది ఒక చికిత్సా పద్ధతి. ఇది పేగుల్లో కదలికలను పెంచుతుంది. అనులోమ విలోమాలు, భస్త్రిక వంటివి కొన్ని జీర్ణక్రియ బావుండడానికి తొడ్పడే క్రియలు. ఒత్తిడిని దూరంగా ఉంచడం వల్ల కూడా సమస్య నుంచి దూరంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది.

  ఔషధాలు

  ఔషధాలు

  ఈసాబ్గుల్ వంటి కొన్ని ఔషదాలు పీచు పదార్థాల మాదిరిగా పనిచేస్తుయి. ఫలితంగా మలవిసర్జన సులభమవుతుంది. త్రిఫల చూర్ణం, ఉసిరిక పొడి కూడా పెగుల్లో కదలిక లు పెంచడానికి ఉపయోగపడుతుంది.

  క్రౌంచాసనం సాధన చేస్తే మేలు

  క్రౌంచాసనం సాధన చేస్తే మేలు

  అజీర్తి, గ్యాస్ సమస్యలు, మలబద్ధకం తగ్గడానికి మందులు వాడేకన్నా క్రౌంచాసనం సాధన చేస్తే మేలు. క్రౌంచాసనం ఎలా వేయాలంటే...రెండు కాళ్లను ముందుకు చాపి రెండు అరచేతులను రెండు తొడల మీద బోర్లించి సమస్థితిలో కూర్చోవాలి.ఎడమకాలును మోకాలి దగ్గర మడిచి కూర్చోవాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుని రెండు చేతులతో కుడికాలిని పట్టుకుని (వీలైనంత వరకు మాత్రమే) నిటారుగా పైకి లేపాలి. ఈ స్థితిలో మోకాలుని వంచకుండా గడ్డాన్ని మోకాలికి తాకించాలి.

  మంచి ప్రయోజనాలు కలుగుతాయి

  మంచి ప్రయోజనాలు కలుగుతాయి

  ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి. అలాగే రెండవ కాలితోనూ చేయాలి. ఇలా రోజుకు పది నిమిషాల సేపు చేస్తే పైన చెప్పుకున్న సమస్యలతోపాటు బీజ కోశం, గర్భకోశాలకు శక్తి చేకూరడం, రుతుక్రమ సమస్యలు తొలగిపోవడం, ఏకాగ్రత పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి.

  English summary

  30 Quick Home Remedies To Get Relief From Constipation Naturally

  30 Quick Home Remedies To Get Relief From Constipation Naturally
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more