For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక గోవాలో నిపా వైరస్ పై అప్రమత్తం

  |

  కేరళలో మొదలైన 'నిపా' కలవరం చూసి దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిపా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి ఇది చాలా వేగంగా విస్తరిస్తుంది. పైగా సోకితే మరణావకాశాలు చాలా ఎక్కువ. కేరళలో దీని బారిన పడి పది మందికి పైగా చనిపోవడంతో ఇప్పుడు దక్షిణాది ప్రజల్లో భయాందోళనలు రేగుతున్నాయి.

  కొత్తదేం కాదు

  కొత్తదేం కాదు

  నిపా వైరస్‌ కొంత అరుదైనదేగానీ మరీ అంత కొత్తదేం కాదు. ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. జంతువులకూ, మనుషులకు కూడా జబ్బు తెచ్చిపెడుతుంది. మనుషుల్లోనైతే ప్రాణాంతకమనే చెప్పుకోవాలి. అందుకే కేరళ ప్రభుత్వం కూడా వేగంగా స్పందించి, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తోంది.

  గబ్బిలాల్లో ఎక్కువగా ఉంటుంది

  గబ్బిలాల్లో ఎక్కువగా ఉంటుంది

  నిపా వైరస్‌ గబ్బిలాల్లో, వాటిలోనూ ప్రధానంగా పండ్లు తినే గబ్బిలాల్లో ఎక్కువగా ఉంటుంది. గత రెండు దశాబ్దాలుగా అప్పుడప్పుడు విజృంభించి, కలవరం సృష్టిస్తున్న వైరస్‌ ఇది. దీన్ని తొలిగా 1998లో మలేషియా, సింగపూర్‌లలో గుర్తించారు. అప్పట్లో ఇది పందుల ద్వారానే వ్యాపిస్తోందని భావించారుగానీ తర్వాత దీనిపై అవగాహన మరింతగా పెరిగింది.

  గబ్బిలాల స్రావాలతో కలుషితమైంది

  గబ్బిలాల స్రావాలతో కలుషితమైంది

  2004లో పశ్చిమ బెంగాల్లో ఈత, ఖర్జూర కల్లు తాగిన వారిలో ఈ వ్యాధి కనిపించింది. లోతుగా పరిశోధిస్తే ఆ కల్లు గబ్బిలాలకు సంబంధించిన స్రావాలతో కలుషితమైందనీ, దాని ద్వారానే వ్యాధి మనుషులకు సంక్రమించిందని గుర్తించారు. ఈ వైరస్‌ మనుషుల్లో చేరితే ఒకరి నుంచి మరొకరికి కూడా వేగంగా వ్యాపిస్తోంది.

  అనుమానం బలంగా ఉంటే

  అనుమానం బలంగా ఉంటే

  నిపా వైరస్‌ కారణంగా జ్వరం బారినపడిన వారిలో సగటున నూటికి 70 మంది మృత్యువాతపడుతున్నారంటే దీని తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముందే అనుమానించటం ముఖ్యం. కేవలం లక్షణాల ఆధారంగానే దీన్ని నిర్ధారించటం కూడా కష్టం. అనుమానం బలంగా ఉంటే రక్తం సేకరించి పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ వంటి సంస్థలకు పంపిస్తే వాళ్లు పరీక్షించి నిపా వైరస్‌ ఉందేమో నిర్ధారిస్తారు.

  పూర్తి శుభ్రంగా కడుక్కుని తినటం ముఖ్యం

  పూర్తి శుభ్రంగా కడుక్కుని తినటం ముఖ్యం

  గబ్బిలాల కొరికిన పండ్లు తినటం ఈ వైరస్‌ వ్యాప్తికి దోహదం చేసే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఎలాంటి గాట్లు లేని పండ్లు ఎంచుకోవటం, వాటిని పూర్తి శుభ్రంగా కడుక్కుని తినటం ముఖ్యం. రెండోది- పందుల వంటి జంతువులకు దూరంగా ఉండటం మంచిది. ప్రస్తుతానికి ఈ సమస్య కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కనబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతంలో దీని ఆనవాళ్లేం లేవు. కాబట్టి ఆందోళన అవసరం లేదుగానీ అప్రమత్తంగా ఉండటం మాత్రం చాలా అవసరం.

  పొరుగు రాష్ట్రాల్లో భయం

  పొరుగు రాష్ట్రాల్లో భయం

  ఇప్పటి వరకు దక్షిణ భారతదేశంలో ఎప్పుడూ వెలుగులోకి రాని నిపా వైరస్‌ కేరళలో విజృంభిస్తుండటంతో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, గోవా కూడా అప్రమత్తమయ్యాయి. కేరళలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి.

  18 రోజుల పాటు వైద్యపరీక్షలు

  18 రోజుల పాటు వైద్యపరీక్షలు

  నిపా వైరస్ భయంతో పొరుగు రాష్ట్రమైన కేరళ నుంచి కర్ణాటక రాష్ట్రానికి వచ్చిన యాత్రికులకు 18 రోజుల పాటు వైద్యపరీక్షలు నిర్వహించాలని కర్ణాటక రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ పీఎల్ నటరాజ్ జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. కేరళ రాష్ట్రం నుంచి కర్ణాటకలోని మంగళూరుకు వచ్చిన ఇద్దరు రోగులకు నిపా వైరస్ లక్షణాలున్నాయని వైద్యులు అనుమానిస్తున్నారు.

  కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి

  కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి

  కర్ణాటకలోని చామరాజనగర్, మైసూర్, కోడగు, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి, శివమొగ్గ, చిక్ మంగళూరు ప్రాంతాల్లో వైద్యాధికారులను సర్కారు అప్రమత్తం చేసింది. కేరళ సరిహద్దుల్లో నిపా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ డాక్టర్లను ఆదేశించింది. ఫ్లూ జ్వరం లక్షణాలుంటే వారిని వెంటిలేటర్లున్న ఐసీయూలకు తరలించి అత్యవసర వైద్యం అందించాలని డైరెక్టర్ఆదేశాలు జారీ చేశారు.

  గోవాలో పరిస్థితి

  గోవాలో పరిస్థితి

  కేరళలో నిపా వైరస్ కలకలం నేపథ్యంలో, గోవా ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో ఈవ్యాధి గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదు. అయితే కేరళనుంచి వచ్చే పర్యాటకులకు స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయాల్సిన అవసరం లేదని గోవా అధికారులు భావిస్తున్నారు. పండ్లు తినే గబ్బిలాలు, నిపా వైరస్‌కు ప్రాథమిక అతిథేయిలు. వీటి ద్వారా ఇతర జంతువులు, మానవులకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.

  టీకాల్లేవు.. నివారణ ఒక్కటే మార్గం

  టీకాల్లేవు.. నివారణ ఒక్కటే మార్గం

  ఇక కేరళను వణికిస్తున్న నిపా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణలో ప్రభుత్వం సూచనులు చేస్తుంది. వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి నిపా వైరస్‌పై వైద్యశాఖ అప్రమత్తంగా ఉన్నదని, ఈ వ్యాధికి టీకాలు లేవని, నివారణ ఒక్క టే మార్గమమని అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే పుణెలోని ఎన్సీడీసీ, మణిపాల్‌లోని ఎంసీవీఆర్ కేంద్రాలతో మాట్లాడామన్నారు. ఐపీఎం ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.

  అవగాహన చాలా అవసరం

  అవగాహన చాలా అవసరం

  ప్రజల్లో అవగాహన, చైతన్యంతో ఇలాంటి వ్యాధులను అదుపు చేయడం, నివారించడం సాధ్యమన్నారు. నిపా వైరస్ 1998-99లోనే మలేషియా, సింగపూర్‌లో వ్యాప్తి చెందింద ని, ఇండియాలో కూడా గతంలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయని, బంగ్లాదేశ్‌లో ఏటా కనిపిస్తూనే ఉం టుందన్నారు. ఈ వైరస్ ఓ జునోటిక్ వైరస్ అని, గబ్బిలాలను తాకడం లేదా అవి కొరికిన పండ్లు తిన డం ద్వారా సోకుతుందని, మనుషులకు గాలి లేదా లాలాజలం ద్వారా వ్యాపిస్తుందన్నారు.

  కోమాలోకి వెళ్తారు

  కోమాలోకి వెళ్తారు

  నిపా వైరస్ ముదరడానికి 7 నుంచి 14 రోజులు పడుతుందని, తర్వాత శరీరంలో చాలా వేగంగా మార్పులు కనిపిస్తాయని, శ్వాస ఆడకపోవడం, లోబీపీతో కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదముందని తెలిపారు. ఈ వైరస్‌పై వైద్యశాఖ అప్రమత్తంగా ఉన్నదని, ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఫీవర్ దవాఖానలు, వరంగల్‌లోని ఎంజీఎంలో 5 నుంచి 8 పడకలతో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేశామని వివరించారు.

  ఆనవాళ్లు లేవు

  ఆనవాళ్లు లేవు

  నిపా వైరస్ ఆనవాళ్లు హైదరాబాద్‌లో లేవని జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ కూడా చెప్పారు.ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.

  వరంగల్ లో

  వరంగల్ లో

  నిపా వైరస్ విషయంలో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు అప్రమత్తమయ్యారు. కేసులు నమోదైతే నిర్థారణకోసం శాంపిల్‌ను సేకరించేందుకు సిద్దమయ్యారు. ఆ వెనువెంటనే ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసే యోచనలో ఎంజీఎం జనరల్‌ మెడిసిన్‌ అధికారులు ఉన్నారు. వ్యాధి నిర్థారణ కోసం గొంతులోంచి స్పాబ్‌ద్వారా రియల్‌ టైకు పాలమైరేజ్‌ రియాక్షన్‌, సెరిబ్రోస్పైనల్‌ ప్లూ యిడ్‌ (వెన్నుపూస నీరు), మూత్ర, రక్త పరీక్షల ద్వారా వ్యాధి ని గుర్తించవచ్చు.

  English summary

  ap telangana tn karnataka goa is closely monitoring the nipah virus after outbreak of virus in kerala

  ap telangana tn karnataka goa is closely monitoring the nipah virus after outbreak of virus in kerala
  Story first published: Wednesday, May 23, 2018, 17:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more