For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ తొమ్మిది స్పష్టమైన సంకేతాలు అపెండిసైటిస్ సమస్యను సూచించగలవు, విస్మరించకండి.

ఈ తొమ్మిది స్పష్టమైన సంకేతాలు అపెండిసైటిస్ సమస్యను సూచించగలవు, విస్మరించకండి.

|

అపెండిసైటిస్ ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ప్రభావితం చేసే ఒక సాధారణ వ్యాధి. కొందరైతే ఇప్పటికీ ప్రాణాలు కోల్పోతున్నారు, సరైన సమయంలో చికిత్సలను పాటించకపోవడం కారణంగా. సగటున, ఈ అపెండిసైటిస్ ప్రతి వేయిమందిలో కనీసం 6 మందికి సంభవిస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి కూడా. 11 మరియు 35 సంవత్సరాల వయస్సు మధ్యనున్న పిల్లలు మరియు యువకులు ఎక్కువగా ప్రభావితమయ్యే సమస్య ఇది.

అపెండిసైటిస్ అనేది రోగి యొక్క జీవితాన్నిసైతం అయోమయంలోకి నెట్టగలిగే ఒక తీవ్రమైన పరిస్థితి. ఈ సమస్య తలెత్తినప్పుడు, మీరు ఎపిగాస్ట్రియమ్ భాగంలో తీవ్రమైన నొప్పిని అనుభవించడం జరుగుతుంది. క్రమంగా నొప్పి ఉద్దీపన చెంది, కడుపు నొప్పిగా రూపాంతరం చెందుతుంది. నిజానికి శరీరంలోని ప్రధాన రక్షణ కవచాలలో ఒకటిగా ఈ అపెండిసైటిస్ ఉంటుంది.

9 Signs Your Appendix is About to Burst!

తరచుగా వచ్చే జలుబులు, తీవ్రమైన ప్రేగు సంబంధిత అంటువ్యాధులు మరియు ఆహార రుగ్మతల అనుబంద సమస్యలు, అపెండిక్స్ కుహరం లోపల తాపజనక ప్రక్రియను రేకెత్తిస్తాయి.

సరైన సమయంలో చికిత్సను తీసుకోని ఎడలమ సమస్య తీవ్రమై, వాపు అధికమై అపెండిక్స్ విచ్చిన్నంగావించబడి ఉదర కుహరంలోకి ప్రవేశించి, ప్రాణాలకే హానిని తలపెట్టవచ్చు. ఇది పెరిటిటోనిటిస్, ప్రేగులలో వాపు, మరియు పెరిటోనియం సమస్యకు దారితీస్తుంది.

కొన్ని సందర్భాల్లో, అపెండిక్స్ చీలిక రోగి మరణానికి దారితీస్తుంది. అపెండిసిటిస్ సంకేతాలను మరియు ప్రతికూల పరిణామాలను నివారించే క్రమంలో అవగాహన కల్పించడం దృష్ట్యా ఈ వ్యాసం మీకు సహాయం చేయగలదు.

ఈ వ్యాధిని సూచించే 9 స్పష్టమైన లక్షణాలు

ఈ వ్యాధిని సూచించే 9 స్పష్టమైన లక్షణాలు

# 1. మీరు మీ కడుపు మధ్యభాగంలో బాధ పెరుగుతున్నట్లుగా అనుభూతి చెందుతారు.

ఇది మొట్టమొదటి మరియు అతి ముఖ్యమైన లక్షణం. మీరు దిగువ కుడిభాగాన పొత్తికడుపులో మరియు వెన్ను దిగువ భాగంలో తిమ్మిరితో కూడిన పదునైన నొప్పిని ఎదుర్కొంటారు.

# 2. దగ్గుతున్నప్పుడు బాధ తీవ్రత పెరగడం అనుభవిస్తారు

# 2. దగ్గుతున్నప్పుడు బాధ తీవ్రత పెరగడం అనుభవిస్తారు

కదిలేటప్పుడు, శ్వాస తీసుకునేటప్పుడు, మరియు దగ్గుతున్నప్పుడు, మీకు నొప్పి పెరిగినట్లుగా భావించడం జరుగుతుంది.

# 3. వికారాన్ని అనుభవిస్తారు.

# 3. వికారాన్ని అనుభవిస్తారు.

శరీరం అపెండిక్స్ చీమును వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంది. తరచుగా వాంతులు, వికారం కూడా అపెండిసైటిస్ యొక్క తీవ్రమైన లక్షణాలుగా ఉంటాయి.

# 4. మలబద్ధక సమస్యలు తలెత్తవచ్చు.

# 4. మలబద్ధక సమస్యలు తలెత్తవచ్చు.

అపెండిక్స్ వాపు మలబద్ధకానికి దారితీయవచ్చు.

# 5. అజీర్ణం పెరుగుతుంది.

# 5. అజీర్ణం పెరుగుతుంది.

మీ శరీరంలోని రోగనిరోధకత, మీ ప్రేగులలో తలెత్తిన చికాకు సంబంధిత కారణాలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు అజీర్ణం అనుభూతికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి.

# 6. ఆకలి వేయదు.

# 6. ఆకలి వేయదు.

కడుపు నొప్పి, ఆకలిని కోల్పోవడం వంటివి కూడా అపెండిసైటిస్ సమస్య అనుమానాస్పద సంకేతాలుగా ఉంటాయి.

# 7. జ్వరం కలుగుతుంది.

# 7. జ్వరం కలుగుతుంది.

చలి లేదా వణుకుతో కూడిన జ్వరం ఉంటుంది. మీ అపెండిక్స్ విచ్చిన్నం గావించబడితే, మీ శరీర ఉష్ణోగ్రత 38.2 సెంటీగ్రేడ్ (100.76 ఫారన్ హీట్) లేదా అంతకన్నా ఎక్కువగా పెరుగుతుంది.

# 8. గ్యాస్ ఆధారిత నొప్పి కలగడం.

# 8. గ్యాస్ ఆధారిత నొప్పి కలగడం.

మీరు మలబద్ధకాన్ని మాత్రమే కాకుండా, గాస్ ఆధారిత నొప్పి వంటి సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు.

# 9. కడుపులో ఏదో తప్పు జరుగుతుంది అని ఖచ్చితంగా భావిస్తారు.

# 9. కడుపులో ఏదో తప్పు జరుగుతుంది అని ఖచ్చితంగా భావిస్తారు.

అపెండిసైటిస్ సమస్యతో బాధపడుతున్న అనేక మంది వారి ఆరోగ్యం పరంగా జరిగే మార్పులను క్షుణ్ణంగా గమనించగలుగుతారు. మీ శరీరం మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటుంది, విస్మరించకండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

9 Signs Your Appendix is About to Burst!

The appendix is a small pouch-like organ that is attached to your large intestine right at the junction between it and the small intestine. It is a vestigial organ in our body. That means it has no function! And while most of us go through our entire lives without a single peep from it, in some of us (roughly 5% of the world), it causes a severe medical emergency called appendicitis.
Desktop Bottom Promotion