For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవారు రెడ్ వైన్ ఎనిమిది ఔన్సులకు మించి తాగకూడదు.. ఎందుకో తెలుసా? రెడ్ వైన్ తాగితే ప్రయోజనామా!నష్టమా

వైన్ అయినా మగవాళ్లయితే రెండు డ్రింకు (ఎనిమిది ఔన్సులు)లకు మించి తాగకూడదు. ఆడవాళ్లయితే రోజుకు ఒక డ్రింకే (నాలుగు ఔన్సులే) తీసుకోవాలి. రెడ్ వైన్ ఉపయోగాలు, రెడ్ వైన్ ప్రయోజనాలు, రెడ్ వైన్ లాభాలు

|

రెడ్‌వైన్‌ మద్యం కదా? అది తీసుకుంటే హాని తప్ప మేలు ఎలా చేస్తుంది? అనే అనుమానం రావడం సహజమే! రెడ్ వైన్ పై చాలా పరిశోధనలు జరిగాయి. ఒక్కో పరిశోధనలో ఒక్కో విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. కొన్ని పరిశోధనల్లో రెడ్ వైన్ తాగితే మంచి ప్రయోజనాలున్నాయని తేలితే.. మరికొన్ని పరిశోధనల్లో రెడ్ వైన్ తో చాలా నష్టాలున్నాయని తేలింది.

రక్తంలో గ్లూకోజు అదుపులో

రక్తంలో గ్లూకోజు అదుపులో

రెడ్ వైన్ తగు మోతాదులో తీసుకుంటే గుండెకు ఆరోగ్యం అన్న సంగతి గతంలోనే రుజువైంది. అయితే టైప్‌-2 డయాబెటీస్‌ వ్యాధిగ్రస్తులు రెడ్‌వైను తక్కువగా తీసుకుంటే రక్తంలో గ్లూకోజు అదుపులో ఉంటుందన్న విషయం ఇజ్రాయెల్‌ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. వైన్‌ను పండ్ల నుంచి తయారు చేస్తారు కనుక ఇది రక్తంలో చక్కెర శాతాన్ని ఎక్కువ చేస్తుందన్న అనుమానం పలువురికి ఉంది.

దీర్ఘకాలం పరిశోధనలు నిర్వహించి

దీర్ఘకాలం పరిశోధనలు నిర్వహించి

అయితే ఇది కేవలం అపోహ మాత్రమే తప్ప నిజం కాదని సుమారు రెండువేల మంది టైప్‌-2 డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తుల మీద దీర్ఘకాలం పరిశోధనలు నిర్వహించిన అనంతరం నిర్ధారించారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి రెడ్‌ లేదా వైట్‌ వైన్‌ను, కొద్దిగా మినరల్‌ వాటర్‌ కలిపి కొన్ని నెలల పాటు ఇచ్చారు.

వైన్‌ తీసుకోని వారిలో గ్లూకోజ్‌ స్థాయి అధికం

వైన్‌ తీసుకోని వారిలో గ్లూకోజ్‌ స్థాయి అధికం

అనంతరం వీరిలో గ్లూకోజ్‌ స్థాయిని పరిశీలించగా, వైన్‌ను తీసుకున్న వారికన్నా తీసుకోని వారిలో గ్లూకోజ్‌ స్థాయి అధికంగా ఉందన్న విషయం వీరు గమనించారు. కేవలం రెడ్‌ వైన్‌ తీసుకోవడం వల్లే గ్లూకోజ్‌ శాతం స్థిరంగా ఉందా? దీనికి మరేదైనా కారణం ఉందా? అన్న విషయాన్ని పరిశోధకులు పరిశీలించారు. రెడ్ వైన్ వల్లే అలా జరిగిందని నిర్దారించారు.

గంట సేపు వ్యాయామం చేసినంత మేలు

గంట సేపు వ్యాయామం చేసినంత మేలు

ఇక ఒక గ్లాసు రెడ్‌వైన్ తాగితే గంట సేపు వ్యాయామం చేసినంత మేలు కలుగుతుందట. ఎర్ర ద్రాక్షలో ఉండే రెస్‌వెరెట్రాల్ అనే యాంటీఆక్సిడెంట్ పదార్థం ఎక్సర్‌సైజుల మాదిరిగానే గుండె, కండరాల పనితీరును మెరుగుపరుస్తుందట. అందుకే అనారోగ్యం కారణంగా వ్యాయామం చేయలేని రోగులకు రెస్‌వెరెట్రాల్ ఉపయోగపడుతుందని కెనడా పరిశోధకులు ఈ మధ్య చెప్పారు.

జ్ఞాపకశక్తి మెరుగుదలకు

జ్ఞాపకశక్తి మెరుగుదలకు

ప్రయోగశాలలో జంతువులకు రెస్‌వెరెట్రాల్ ఇచ్చి ప్రయోగాలు జరపగా.. వాటి శారీరక పనితీరు మెరుగుపడిందని యూనివర్సిటీ ఆఫ్ ఆల్బెర్టా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా, రెస్‌వెరెట్రాల్ జ్ఞాపకశక్తి మెరుగుదలకు, కేన్సర్ ముప్పును తగ్గించేందుకు కూడా తోడ్పడుతుందని గతంలో జరిగిన పరిశోధనల్లో తేలింది.

పరిమితంగానే తీసుకోవాలి

పరిమితంగానే తీసుకోవాలి

ఇక రెడ్‌వైన్ ఆరోగ్యానికి మంచిదని చాలా పరిశోధనల్లో తేలడంతో అందరూ అందరూ అది మంచిదనుకుంటున్నారు. అది నిజమే కానీ రెడ్‌ వైన్ ని కూడా పరిమితంగానే తీసుకోవాలంటున్నారు అధ్యయనకారులు. దీన్ని రెడ్‌, పర్పుల్‌ రంగుల్లో ఉండే ద్రాక్షపళ్ల నుంచి తయారుచేస్తారు.

రక్తపోటును తగ్గిస్తుంది

రక్తపోటును తగ్గిస్తుంది

రెడ్‌వైన్ కొలెస్ట్రాల్‌ని, రక్తపోటును తగ్గిస్తుంది. ఊబకాయం రాదు. క్యాన్సర్‌ రిస్కు ఉండదు. మిగతా ఆల్కహాల్‌ డ్రింక్స్‌ అన్నింటిలో కెల్లా దీనిలో చక్కెర మోతాదు కూడా తక్కువే. బీర్‌ కన్నా కూడా లైటర్‌ ఛాయిస్‌. వైనని మెల్లగా సిప్‌ చేస్తూ తాగుతారు కాబట్టి ఎక్కువ తాగే అవకాశం ఉండదు.

ఆడవాళ్లకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌

ఆడవాళ్లకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌

రెడ్‌ వైన్ మంచిదంటున్నప్పటికీ దాని మీద అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైన్ తో ఆడవాళ్లకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. వివిధ స్టడీలు చెపుతున్నదేమిటంటే రెడ్‌ వైన్ తో సహా అన్ని రకాల ఆల్కహాల్‌ డ్రింకులు పరిమితంగా తాగితేనే గుండెకు మంచిది.

మూడు డ్రింక్ లకు మించి

మూడు డ్రింక్ లకు మించి

రెండు లేదా మూడు డ్రింక్ లకు మించి తాగకూడదు. అలాగే రకరకాల వైన్స్ లో పోలిఫెనాల్‌ కంటెంట్‌ ఒకే తీరులో ఉండదు. ఏ రకమైన ద్రాక్షపళ్లతో ఆ వైన్ తయారు చేశారన్నదాన్ని బట్టి వాటి పరిమాణం వైన్లో ఉంటుంది.

ఎనిమిది ఔన్సులకు మించి తాగకూడదు

ఎనిమిది ఔన్సులకు మించి తాగకూడదు

కాబట్టి ప్రతి వైన్ మీకు కావాల్సినన్ని ఆరోగ్యకరమైన యాంటాక్సిడెంట్లు ఇస్తాయనుకుంటే పొరబడ్డారన్న మాటే. ఏ వైన్ అయినా మగవాళ్లయితే రెండు డ్రింకు (ఎనిమిది ఔన్సులు)లకు మించి తాగకూడదు. ఆడవాళ్లయితే రోజుకు ఒక డ్రింకే (నాలుగు ఔన్సులే) తీసుకోవాలి. దీని కన్నా మించి తీసుకుంటే హృద్రోగ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అధిక రక్తపోటు తలెత్తవచ్చు. స్ట్రోక్ రావచ్చు. ఆల్కహాల్‌ ఎక్కువ తీసుకోవడం వల్ల కాలేయం జబ్బు, బహిష్టు సమస్యలు, నరాలు, కండరాలు దెబ్బతినడం, వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

కీళ్లనొప్పులు మటుమాయం

కీళ్లనొప్పులు మటుమాయం

కూర్చోవాలన్నా, కాసేపు నిల్చోవాలన్నా ఇబ్బంది పెట్టేసే కీళ్ల నొప్పులకు "ఆపిల్స్, అవకాడో, రెడ్‌వైన్"లతో టాటా చెప్పేయొచ్చని అప్పట్లో ఒకటి పరిశోధనల్లో వెల్లడించింది. ఆపిల్, అవకాడో (బేరికాయ), నూనె ఎక్కువగా ఉండే చేపలతో పాటు రెడ్‌వైన్‌ను ఆహారంగా తీసుకున్నట్లయితే కీళ్లనొప్పులు మటుమాయమవుతాయని ఈ అధ్యయనంలో పాల్గొన్నపరిశోధకులు అభిప్రాయపడ్డారు.

ఆర్థరైటిస్

ఆర్థరైటిస్

కీళ్లనొప్పులు (ఆర్థరైటిస్) రోగుల్లో నొప్పి తీవ్రతకు, ఆహారపు అలవాట్లకు గల సంబంధంపై నిశితంగా పరిశోధకులు అధ్యయనం చేయగా, పై విషయం వెలుగుచూసింది. సాధారణంగా మృదులాస్థి అరిగిపోవటం వల్ల కీళ్ల కదలిక కష్టతరంగా, బాధాకరంగా మారిపోతుంది. ఈ పరిస్థితినే ఆర్థరైటిస్ అని అంటారన్న సంగతి మనకు తెలిసిందే.

రెడ్ వైన్ ను తాగడం మానేయండి

రెడ్ వైన్ ను తాగడం మానేయండి

ఇక కొందరేమో రెడ్ వైన్ ను తాగడం మానేయండి అని కూడా చెప్పారు. అధిక మోతాదులో రెడ్‌ వైన్‌ తీసుకోవడం వల్ల క్యాన్సర్‌, హృద్రోగంతో పాటు డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు వైద్యులు. ఈ మేరకు తన పరిశోధనల్లో పలు విషయాలు వెల్లడయ్యాయంటూ అప్పట్లో డాక్టర్‌ మార్క్‌ మెనోలాసినో ఇక ఆర్టికల్‌లో పేర్కొన్నారు.

కాలేయం దెబ్బతింటుంది

కాలేయం దెబ్బతింటుంది

అంతేకాకుండా శుద్థిచేయని, చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ద్రాక్షరసం తాగటం వల్ల కాలేయం దెబ్బతింటుందని తెలిపారు. ఈ పరిణామాల వల్ల శరీరంలోని చెడు కొవ్వు శాతం పెరుగుతుందని కూడా పేర్కొన్నారు.

చర్మవ్యాధులు వచ్చే అవకాశం

చర్మవ్యాధులు వచ్చే అవకాశం

రెడ్‌ వైన్‌ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో పాటు చర్మ సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల మొటిమలు వస్తాయని, చర్మం కళ కోల్పోతుందని డాక్టర్‌ ఇసాబెల్‌ షార్కర్‌ తెలిపారు.

నల్లటి వలయాలు

నల్లటి వలయాలు

కళ్లకింద నల్లటి వలయాలు కూడా ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. మొటిమలు, చర్మంపై గల మృత కణాల వల్ల రంధ్రాలు ఏర్పడతాయి గనుక సాధ్యమైనంత వరకు రెడ్‌వైన్‌ను తాగకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

English summary

benefits of red wine and its Side effects

benefits of red wine and its Side effects
Story first published:Monday, May 7, 2018, 9:36 [IST]
Desktop Bottom Promotion