For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టంగ్ పియర్సింగ్ గురించి మీరు తెలుసుకోవలసిన వాస్తవాలు.

|

ఎందరో స్నేహితులు, పరిచయస్తులు లేదా సెలెబ్రిటీలు నాలిక మీద పూసల వంటి వస్తువులను కలిగి ఉండడం మనం తరచూ చూస్తూనే ఉంటాము. నిజానికి ఇది నాలికతో మాత్రమే ఆగలేదు, కనురెప్పలు నుండి జననాంగాల వరకు రకరకాల ప్రదేశాలలో ఇటువంటి చర్యలకు ఉపక్రమిస్తూ ఉంటారు. ఈ పద్దతిని పియర్సింగ్ అని వ్యవహరిస్తారు. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోని ఎడల కోరి కొత్త సమస్యలు తెచ్చుకున్నట్లే. ఇవి హెపటైటిస్ లేదా ఎండోకార్డిటిస్ వంటి తీవ్రమైన అంటురోగాలకు సైతం దారితీస్తుంది.

మీ నాలుక, పెదవులు, బుగ్గ లేదా ఇతర అవయవాలలో ఒక చిన్న రంధ్రం చేయడం ద్వారా ఓరల్ పియర్సింగ్ చేయబడుతుంది, తద్వారా ఆభాగంలో లోహపు వస్తువును లేదా పూసవంటి వస్తువును చేర్చవచ్చు. మీరు “స్టైలిష్”గా కనిపించే సంగతి పక్కన పెడితే, అత్యంత ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలే ఎక్కువ, బాక్టీరియా ప్రభావం ఎక్కువవడం చేత సంక్రమణ వ్యాధులు మరియు వాపుకు దారితీస్తుంది. టంగ్ పియర్సింగ్ వలన నోటిసంక్రమణ వ్యాధులు మాత్రమే కాకుండా, నోటి ద్వారా బాక్టీరియా కడుపులోనికి చేరి, ఊహకు అందని సమస్యలను తెచ్చిపెడుతుంటాయి.

Tongue Piercing Dos and Donts: Everything You Need To Know

అంతేకాకుండా, ఇటువంటి చర్యలు మీ గుండె కవాటాలను దెబ్బతీయడం, మరియు శ్వాసని కష్టతరం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ నాలుక ప్రాంతంలో రక్తనాళాలు అధికంగా చిట్లడం కారణంగా అధిక రక్తస్రావం జరుగుతుంటే, పైన చెప్పిన సమస్యలు పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

మీ నోటిలో కుట్టిన ఈ లోహపు వస్తువులు మీరు తినేటప్పుడు, మాట్లాడేటప్పుడు లేదా నిద్రలో ఉన్నప్పుడు, మీ నాలుకను, చిగుళ్ళను లేదా మీ పళ్ళను సైతం గాయపరచగలదు. లోహ సంబంధిత అలెర్జీలకు కూడా కారణమవడమే కాకుండా, గమ్ వ్యాధి, హెపటైటిస్-బి మరియు హెపటైటిస్-సి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సైతం దారితీస్తుంది.

ఈ ఆరోగ్య సమస్యలు కారణంగా, అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ఈ ఓరల్ పియర్సింగ్(అంతర్గత అవయవాలలో పియర్సింగ్)ఆమోదించదు.

టంగ్ పియర్సింగ్ అసలు ఎవరు చేసుకోకూడదు?

1. గుండెజబ్బులు, స్వీయరోగనిరోధక వ్యాధులు, మధుమేహం మరియు హీమోఫీలియా వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్నవారు.

2. చిన్న నాలికలు ఉన్న ప్రజలు.

3. కొందరు సిరలను తప్పు ప్రాంతాలలో కలిగి ఉంటారు, ముఖ్యంగా నాలిక మద్య భాగాలలో సిరను కలిగి ఉన్న వ్యక్తులు. ఇది పియర్సింగ్ మరింత కష్టతరం చేస్తుంది. వీరు ఎక్కువ సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది.

4. సాధారణంగా 14-16 ఏళ్ళ వయస్సు వరకు ఉన్న పిల్లలకు పియర్సింగ్ అనుమతి ఉండదు. దీనికి కారణం, వీరి నాలిక అత్యంత సన్నగా బలహీనంగా ఉండడమే.

నాలుక కుట్టడం ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు:

నాలిక పియర్సింగ్ చేయాలి అంటే భద్రత ముఖ్యం మరియు మీరు టెటానస్, హెపటైటిస్-బి టీకాలు వేస్కుని ఉన్నారని నిర్ధారించుకోండి.

1. మొట్టమొదట, శుద్ధమైన, అనుభవం కలిగిన పియర్సింగ్ దుకాణాన్ని ఎంచుకోవలసి ఉంటుంది మరియు వారికి పియర్సింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి.

2. పియర్సింగ్ చేసేవారు తన చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి, తాజాగా వాడిపారేసే చేతితొడుగులు ధరించాలి మరియు క్రిమిరహిత ఉపకరణాలను ఉపయోగించాలి.

3. దుకాణంలో పనిచేసే వ్యక్తులు హెపటైటిస్-బి టీకాలు వేస్కుని ఉండాలి.

4. దుకాణంలో పియర్సింగ్ గన్ ఉపయోగించకూడదు మరియు వాడే సూది క్రొత్తగా ఉండాలి.

5. సూదిని ఉపయోగించిన తర్వాత ఒక మూసివున్న కంటైనర్లో ఉంచాలి.

6. ఆభరణాలుగా ధరించే లోహాలు ఘనమైన బంగారం, ప్లాటినం, సర్జికల్ స్టీల్ వంటి వాటితో తయారు చేసి ఉండాలి.

7. మీరు ఏ విధమైన ఔషధాలకైనా వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉన్న ఎడల, మరియు మీకేమైనా అలెర్జీలు ఉన్న ఎడల మీ పియర్స్కు తెలియజేయాలి.

8. మీరు దగ్గు, జలుబు భాదితులై ఉండి, లేదా మీరు యాంటీబయాటిక్స్ వాడుతూ ఉన్న ఎడల “పియర్సింగ్” కు కొంత వాయిదా వేయడం మంచిది. లేదా పియర్సింగ్ సమయాల్లో సమస్యలు ఎదుర్కొనవలసి రావొచ్చు.

9. మీ నోటిని తరచుగా బ్రష్ చేయడం, యాంటిసెప్టిక్ మౌత్ వాష్ ఉపయోగించి శుభ్రం చేయడం ద్వారా నోటిలో బ్యాక్టీరియా తగ్గుముఖం పడుతుంది.

Tongue Piercing Dos and Donts: Everything You Need To Know

ఒక లైసెన్స్ పియర్స్ చెక్ చేయవలసిన ప్రధాన అంశాలేమిటి?

మీ సిరల ప్రాంతాలను గుర్తించడానికి ఒక నీలం రంగు కాంతిని ఉపయోగించి తనిఖీ చేయవలసి ఉంటుంది. ఇది మీ సిరల స్థానమును తెలుసుకోవటానికి వారికి సహాయపడుతుంది.

కుట్లు మీ దంతాలకు దగ్గరగా ఉండకూడదు మరియు నాలుక మధ్యలో నేరుగా ఉండాలి.

అలాగే, నోటిలో మాటలకు ఆటంకం మరియు అసౌకర్యం కలిగించేలా, నాలుక యొక్క కొనకు దగ్గరగా పియర్సింగ్ చేయకూడదు.

పియర్సింగ్ తరువాత జాగ్రత్తగా ఉండుటకై చిట్కాలు:

మీరు బయటకు వచ్చిన తర్వాత, పియర్సింగ్ వలన మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాలేదని నిర్ధారించుకోండి. ఈ నొప్పి తగ్గడానికి సుమారుగా 3 నుండి 4 వారాల సమయం పడుతుంది మరియు ఈ సమయంలో ఈ క్రింది చిట్కాలను మనసులో ఉంచుకోవాలి.

1. మీరు తినే ప్రతి భోజనం లేదా అల్పాహారం తర్వాత మీ నాలుకని శుభ్రపరచుకోండి.

2. ఒక యాంటీ బాక్టీరియల్, ఆల్కహాల్ లేని మౌత్ వాష్ మరియు ఒక శుభ్రమైన టూత్ బ్రష్ను ఉపయోగించడం మంచిది.

3. ఆరోగ్యకరమైన ఆహారాన్ని బాగా నమిలి తినండి. మసాలా, ఉప్పు లేదా అధిక ఘాడత కలిగిన ఆహారాలు మరియు శీతల పానీయాలను నివారించండి.

4. మీరు నొప్పితగ్గే దశలో ఉన్నప్పుడు ఎవరినీ ముద్దు పెట్టుకోకండి.

5. టీ, కాఫీ, హాట్-చాక్లెట్ వంటి వేడి పానీయాలు త్రాగవద్దు.

6. మీరు పారాసెటమాల్ లేదా ఆస్పిరిన్ వంటి మాత్రలను తీసుకోవాల్సిన అవసరం లేదు.

7.మద్యపానం లేదా ఫిజ్జీ పానీయాలు తీసుకోరాదు.

8. అలాగే, మీరు అసౌకర్యం, ఇన్ఫెక్షన్లు మరియు వాపులు కలిగించే ధూమపానానికి దూరంగా ఉండాలి.

9. తరచుగా నోటిలో మీచేతిని ఉంచడం మానుకోండి, ఎందుకంటే జెర్మ్స్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతాయి.

10. ప్రత్యేకంగా ఉదయం మరియు రాత్రివేళలో రోజులో రెండు సార్లు దంతాలను, నోటిని శుభ్రపరచండి.

11. మీ దంతాలను శుభ్రపరచే క్రమంలో మంచినీటిని లేదా గోరువెచ్చని నీటిని వాడవచ్చు.

మీరు సహాయం పొందాల్సిన అవసరం:

నొప్పి, వాపు మరియు అదనపు లాలాజల ఉత్పన్నం వంటి స్వల్పకాలిక లక్షణాలు సాధారణమైనవి. కానీ, తీవ్రంగా ఎర్ర బడడం, అధిక రక్తస్రావం, నోటి దుర్వాసన, ఓవర్ బ్లడ్ డిశ్చార్జ్, జ్వరం, దద్దుర్లు, మరియు ఒక స్టింగింగ్ సెన్సేషన్ వంటి చిహ్నాలు ఉంటే మాత్రం జాగ్రత్తపడడం మంచిది.

English summary

Tongue Piercing Dos and Dont's: Everything You Need To Know

Oral piercing is done by making a small hole in your tongue, lips, cheek or uvula, so that you can insert a piece of jewellery. The jewellery pierced in your mouth can cause issues like chipping your teeth, damaging your tongue, allergic reaction to the metal in the jewellery, health problems like gum disease, hepatitis B, and hepatitis C.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more