For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పరగడుపున అరటిపండ్లు, టమోటా తీసుకుంటే ఏమవుతుంది?

అరటిపండ్లను పరగడుపున తినరాదు. అరటిపండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. పరగడుపున తినకూడని ఆహారాలు, పరగడుపున వీటిని తినకూడదు.

|

అరటిపండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వాటి వల్ల మన శరీరానికి కావల్సిన శక్తి, పోషకాలు అందుతాయి. పొటాషియం ఉండడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణసమస్యలు కూడా పోతాయి. అయితే అరటిపండ్లను తినడంలో చాలా మందికి ఎదురయ్యే సందేహం ఒకటుంది. అదేమిటంటే.. పరగడుపునే అరటిపండ్లను తినవచ్చా ? తింటే ఏమవుతుంది ? అని సతమతమవుతుంటారు. మరి దీనికి వైద్యులు చెబుతున్న సమాధానం ఏమిటంటే...

సహజసిద్ధమైన చక్కెరలు

సహజసిద్ధమైన చక్కెరలు

వైద్యులు చెబుతున్న ప్రకారమైతే అరటిపండ్లను పరగడుపున తినరాదు. ఎందుకంటే అరటిపండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు అవి మనకు బాగా శక్తిని ఇస్తాయి. కానీ తరువాత వెంటనే ఆ శక్తి ఖర్చవగానే నీరసంగా అనిపిస్తుంది.

నిద్ర వస్తుంది

నిద్ర వస్తుంది

అలాగే అరటిపండ్లను తినడం వల్ల కడుపు నిండిన భావన కలిగి నిద్ర వస్తుంది. ఉదయాన్నే నిద్ర మబ్బుతో ఉండాల్సి వస్తుంది. దీంతోపాటు అరటిపండ్లు సహజసిద్ధంగానే యాసిడిక్ గుణాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల వాటిని ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి అరటిపండ్లను ఖాళీ కడుపుతో తినరాదు. అరటిపండ్లలో ఉండే మెగ్నీషియం ఉదయం పూట ఎక్కువ మోతాదులో శరీరానికి అందటం మంచిదికాదు.

టమోటాలు తీసుకోకూడదు

టమోటాలు తీసుకోకూడదు

పరగడుపున టమోటాలు తీసుకోకూడదు. పుల్లటి పదార్థమైన టమోటాలను పరగడుపున తీసుకుంటే అల్సర్ సమస్య తప్పదు. చాలామంది టొమాటో రైస్ వంటివి కూడా ఉదయం పూట తీసుకుంటారు. కానీ ఇలాంటి వాటిని తీసుకునేముందు.. ఏదైనా వేరొక ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. టమోటాలు తీసుకోకూడదు.

అరటి పండును తీసుకుంటే

అరటి పండును తీసుకుంటే

టమోటాల్లోని పులుపు ద్వారా ఎసిడిటి సమస్య పెరిగే అవకాశం ఉంది. అలాగే అరటి పండును పరగడుపున తీసుకుంటే.. అందులోని మెగ్నీషియం మెగ్నీషియం అందడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నూడుల్స్, మసాలా పదార్థాలు

నూడుల్స్, మసాలా పదార్థాలు

అలాగే అల్పాహారంలో నూడుల్స్, మసాలా పదార్థాలు, వేపుళ్లు వంటివి తీసుకోకూడదు. అదీ పరగడుపున అస్సలు తీసుకోకూడదు. వీటిలోని మసాలాలూ, నూనెలు జీర్ణవ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఇలా ఎక్కువ కాలం తీసుకుంటే అల్సర్‌ బాధించే ఆస్కారం ఉండొచ్చు. కాబట్టి ఇలాంటివి తగ్గించి తేలిగ్గా జీర్ణమయ్యే ఇడ్లీ, అటుకుల ఉప్మా, పండ్లు లాంటివి ఎంచుకోవాలి.

గ్రీన్ టీ తాగడం మేలు

గ్రీన్ టీ తాగడం మేలు

ఇకపోతే.. పరగడుపున ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది. అలాగే మీకు కాఫీ అలవాటు ఉన్నప్పటికీ గంట ముందు కప్పు గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రెండుమూడుసార్లు కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉన్నవారు ఒకసారి రాగిజావ తీసుకోవచ్చు. తద్వారా శరీరానికి తగిన పోషకాలు అందుతాయి.

టీ, కాఫీలు తాగడం మంచిది కాదు

టీ, కాఫీలు తాగడం మంచిది కాదు

ఉదయం పూట పరగడుపున టీ, కాఫీలు తాగడం మంచిది కాదు. ఇలా తాగితే హార్మోన్లు అన్‌ బ్యాలెన్స్‌ అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాఫీ, టీలు తప్పక తాగాల్సి వస్తే.. ముందుగా ఒక గ్లాస్‌ మంచి నీటిని తాగిన తర్వాతే కాఫీ, టీ లు తాగటం మంచిది. అలాగే కూల్‌డ్రింక్స్ తాగకూడదు. తాగితే వాటిలోని ఆమ్లాల కారణంగా వికారం, వాంతులు వంటి రుగ్మతలతో ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టమోటా రైస్‌, టమోటా బాత్‌ వద్దు

టమోటా రైస్‌, టమోటా బాత్‌ వద్దు

అలాగే ఘాటైన మసాలా కూరల్ని పరగడుపున తినకూడదు. అలా తింటే పొట్టలో తిప్పడమే కాక రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే అల్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. అల్పాహారం సులభంగా జీర్ణమయ్యేలా చూసుకోవాలి. చాలా మంది పరగడుపున టమోటా రైస్‌, టమోటా బాత్‌ లాంటివి తింటుంటారు. కానీ ఖాళీ కడుపుతో పుల్లని పదార్థాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది.

పేగుల్లో మంట

పేగుల్లో మంట

ఉదయం లేవగానే... సోడా, కూల్‌డ్రింక్స్‌ను తాగడం వల్ల పేగుల్లో మంట కలిగి వాంతులు, వికారం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు. పరగడుపున స్పైసీ ఫుడ్స్ తీసుకుంటే అల్సర్ రావడానికి ప్రమాదముంది.

పుల్లని పండ్లు వద్దు

పుల్లని పండ్లు వద్దు

పుల్లని పండ్లలో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఎసిడిటీ, గ్యాస్ట్రీక్ అల్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే పచ్చి కూరగాయల్లో ఫైబర్, అమీనో యాసిడ్స్ ఉంటాయి. వీటిని పరగడుపున తింటే పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. చాక్లెట్లు/క్యాండీలలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది క్లోమంపై దుష్ప్రభావం చూపుతుంది. భవిష్యత్తులో కాలేయాన్ని బలహీనం చేసే ప్రమాదం కూడా పొంచివుంది.

మద్యం, లిచీ పండ్లు

మద్యం, లిచీ పండ్లు

పరగడుపున మద్యం తాగడం కూడా ప్రమాదకరం. దీని వల్ల రక్తనాళాలు ఉబ్బుతాయి. గుండె, మెదడు పాడవుతాయి. ఉదయాన్నే అధిక కారం లేదా మిరపకాయలు తింటే గ్యాస్ట్రీక్ సమస్య ఏర్పడుతుంది. శ్లేష్మ పొరలు దెబ్బతిని గుండెల్లో మంట వస్తుంది. పరగడుపున లిచీ పండ్లు తింటే బ్లడ్ సుగర్ స్థాయి తగ్గుతుంది. దీనివల్ల తీవ్ర జ్వరం వస్తుంది. ఇది మరణానికి దారి తీసే ప్రమాదం కూడా ఉంది.

English summary

foods you should never eat on an empty stomach

foods you should never eat on an empty stomach
Story first published:Monday, May 7, 2018, 11:50 [IST]
Desktop Bottom Promotion