TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వలన కలిగే ఉపయోగాలు
శ్వాస అనునది మనకిమనమే తెలియకుండా చేసే ప్రక్రియ. శ్వాస అనే ప్రక్రియ జరుగుతుందనే విషయాన్ని సమస్య వచ్చేదాకా పట్టించుకోము అనేది జగమెరిగిన సత్యం. తెలియకుండా తీసుకుంటున్న శ్వాస వలన శరీరానికి కావలసిన ప్రాణవాయువుని అందించలేము. కాని శ్వాస, మనకే తెలీకుండా శరీర జీవక్రియలను నిరంతరం జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కాని శ్వాస మీద రోజులో కొంత సమయం వెచ్చించి అభ్యాసం చేయడం మూలంగా శరీర జీవక్రియలకు కావలసినంత ప్రాణవాయువుని అందించగలుగుతాము.
శ్వాసపై ద్యాస ఉంచి ఊపిరి తీసుకోవడం మూలంగా శరీరానికి కావలసిన ప్రాణవాయువుని ఎక్కువ మోతాదులో తీసుకుని జీవక్రియలు ఉత్తేజితమవుతాయి. లోతుగా శ్వాసని తీసుకోవడంవలన ఆక్సిజన్ మరింత సరఫరా అవుతుంది.
ఇలా శ్వాసను లోతుగా తీసుకుని వదలడం(డీప్ బ్రీథ్) వలన మానసిక ప్రశాంతతతో పాటు దీర్ఘాయువు కలిగేలా చేస్తుంది. డీప్ బ్రీథ్ వలన కలిగే మరికొన్ని ఉపయోగాలు మీకోసం.
మొదటి ఉపయోగం:
అధికమోతాదులో తీసుకునే ఆక్సిజన్, శరీరంలోని విషపదార్ధాలను మూత్రవిసర్జన, చమటల రూపాన బయటకు వెళ్ళగొడుతుంది. అదేవిధంగా నిశ్వాస నందు వదిలివేయబడే కార్బన్ డై ఆక్సైడ్ ద్వారా కూడా విషపదార్ధాలు తొలగింపబడుతాయి. కావున ఎంత ప్రాణవాయువుని ఇవ్వగలుగుతామో, అన్ని విషకారకాలను తొలగించగలుగుతాము. ఆవిధంగా మనం ఎంత ప్రాణవాయువుని పొందుతామో అంతకు మించి కార్బన్ డై ఆక్సైడ్ ని పంపగలుగుతాము.
రెండవ ఉపయోగం:
డీప్ బ్రీథ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రశాంతతని పెంచడం ద్వారా వ్యక్తి ఆలోచన స్థాయిలను పెంచడంలో సహకరిస్తుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు తీసుకునే శ్వాస శరీరం యొక్క కండరాలకు సైతం సహకరించక చాల ఇబ్బందికి గురిచేస్తుంది, ఇలాంటి సమయాల్లో తీసుకునే డీప్ బ్రీథ్ శరీరాన్ని సడలించి కండరాలకు కొత్త శక్తిని ఇవ్వడంలో తోడ్పడుతాయి.
మూడవ ఉపయోగం:
డీప్ బ్రీథ్, ప్రోస్టేట్ గ్రంధికి రక్తసరఫరా పెంచుట మూలముగా, స్కలన సమస్యలు లేకుండా చూస్తుంది. శరీరం లో అత్యధిక స్థాయిలో రక్తం సరఫరా జరుగుతుంది. దీని ద్వారా జీవక్రియలు పెరుగుతాయి.
నాల్గవ ఉపయోగం:
డీప్ బ్రీథ్ శక్తిని పెంచుటలో సహాయం చేస్తుంది, తద్వారా శారీరిక శ్రమ చేయనప్పుడు లేదా పరుగెత్తునప్పుడు ఊపిరితిత్తులపై భారం పడకుండా చూసి విషకారకాలను చమట రూపంలో బయటకు పారద్రోలడంలో సహాయం చేస్తుంది.
మీకు డీప్ బ్రీథ్ అలవాటు ఉన్నట్లయితే, ఊపిరితిత్తులు వాటికవే ఆక్సిజన్ ఎక్కువ సరఫరా అయ్యేలా శిక్షణనిచ్చుకుంటాయి. తద్వారా మీరు శారీరక శ్రమ చేయునప్పుడు, అలసిపోకుండా సహాయం చేస్తుంది.
అయిదవ ఉపయోగం:
కొందరు యోగా గురువులు చెప్పిన మాటలను అనుసరించి, 6నెలలు డీప్ బ్రీథ్ కు అలవాటుపడిన శరీరం ధూమపానాన్ని సైతం దూరం చెయ్యగలదు.
అరవ ఉపయోగం:
ప్రతిరోజూ ఖచ్చితంగా డీప్ బ్రీథ్ చెయ్యడం వలన ఊపిరితిత్తులకు ఒక వ్యాయామంలా ఉంటుంది. తద్వారా గుండె పనితీరు మెరుగవుతుంది. జలుబు, ఉబ్బసం వంటి రోగాలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతాయి.
ఏడవ ఉపయోగం:
డీప్ బ్రీథ్ రక్తం యొక్క నాణ్యతను పెంచుతుంది. రక్తకణాలు ఆక్సిజన్ ను తీసుకుని శరీరానికి సరఫరా చేస్తాయి, డీప్ బ్రీథ్ తీసుకున్నప్పుడు ఎక్కువ మోతాదులో ప్రాణవాయువుని శరీరానికి అందించవచ్చు.