For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలివ్ ఆయిల్ ని భర్తీ చేసే కొన్ని హెల్తీ ఆయిల్స్

|

ప్రాచీన కాలంలో, నెయ్యి మరియు వెన్నలు లేనిదే వంట పూర్తయ్యేది కాదు. ఈ రెండిటినీ వంటలలో విరివిగా వినియోగించేవారు. ఇవి వంటలకు రిచ్ నెస్ ను అలాగే ఫ్లేవర్ ని అందించడంలో ఉపయోగపడతాయి. అయితే, వీటిలో అనారోగ్యకరమైన ఫ్యాట్ ఉందన్న విషయం తెలిసిందే. అయితే, ఈ రోజుల్లో ఈ పదార్థాలని వంటలలో ఆచితూచి వాడుతున్నారు.

ఆలివ్ ఆయిల్ ప్రాముఖ్యత తెలిసినప్పటి నుంచి వీటి వినియోగం తగ్గింది. ఒబెసిటీతో పాటు గుండె సమస్యల బారిన పడే ప్రమాదం ఈ రోజులలో ఎక్కువగా ఉంది. అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి వంటివి ఈ సమస్యలకు దారితీసే కొన్ని కారకాలు. కాబట్టి, ఆహారంపై శ్రద్ధ ఎక్కువైంది. అందువలన, ఆరోగ్యకరమైన ఆలివ్ ఆయిల్ ను వంటలలో వినియోగించడానికి ఎక్కువమంది ప్రాధాన్యతనిస్తున్నారు.

ఆలివ్ ఆయిల్ ను ఎన్నో రకాల రెసిపీలలో వాడతారు. డ్రెస్సింగ్స్, మెరినేడ్స్ అలాగే సాటింగ్ లలో ఆలివ్ ఆయిల్ వినియోగం ఎక్కువ. ఎక్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనేది ఫ్లేవర్ ఎక్కువగా కలిగి ఉండటంతో పాటు హెల్తీ ఫ్యాట్స్ ను కలిగి ఉంటుంది. అయితే, ఈ ఆయిల్ ఖరీదైనది.


ఆలివ్ ఆయిల్ లో మూడు రకాలు ఉన్నాయి. వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనేది ప్రాచుర్యం చెందిన వంటనూనె. ఇందులో యాసిడ్ కంటెంట్ చాలా తక్కువగా లభిస్తుంది. ఇది ఖరీదైనది. ఇందులో ఆరోగ్యానికి మంచి చేసే గుణాలు అధికంగా లభిస్తాయి. స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ లో ఎసిడిక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది వాడుకకు ఉపయోగకరం కాదు.

ఆలివ్ ఆయిల్ ద్వారా లెక్కలేనన్ని హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాదులను అరికడుతుంది. అలాగే బోన్స్ ను బలపరుస్తుంది. వెయిట్ లాస్ కి తోడ్పడుతుంది.

ఆలివ్ ఆయిల్ ఖరీదైనది కావడం వలన చాలా మంది ప్రత్యామ్న్యాయాలకై ఆలోచిస్తున్నారు. ఈ ఆర్టికల్ లో ఆలివ్ ఆయిల్ ను సబ్స్టిట్యూట్ చేసే కొన్ని ఆయిల్స్ గురించి వివరించాము.

పీనట్ ఆయిల్:

పీనట్ ఆయిల్:

వేపుళ్లకు నట్టీ పీనట్ ఆయిల్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇతర కుకింగ్ ఆయిల్స్ తో పోలిస్తే దీనిని హై టెంపెరేచర్ కు వేడి చేయవచ్చు.పీనట్ ఆయిల్ లో ఆహారాలు త్వరగా కుక్ అవుతాయి. అందువలన, ఎక్కువ కేలరీలను అలాగే ఫ్యాట్ ను గ్రహించవు. పీనట్ ఆయిల్ లో రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ లభిస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ అనేది రెడ్ వైన్ లో అలాగే గ్రేప్స్ లో లభ్యమవుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ కు కార్డియోవాస్క్యూలర్ డిసీస్ ను అలాగే క్యాన్సర్ ను అరికట్టే సామర్థ్యం కలదు.

చికెన్ ను, పొటాటోస్ ను ఈ ఆయిల్ తో సులభంగా ఫ్రై చేసుకోవచ్చు. అలాగే వెజిటబుల్స్ ను అలాగే రైస్ ను స్టిర్ ఫ్రై చేయడానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

సాఫ్లార్ ఆయిల్:

సాఫ్లార్ ఆయిల్:

వెయిట్ లాస్ కై సాఫ్లార్ ఆయిల్ తోడ్పడుతుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. రోజువారీ డైట్ లో రెండు టీస్పూన్ల సాఫ్లావర్ ఆయిల్ ను జోడించిన నాలుగు నెలలకు అబ్డోమినల్ ఫ్యాట్ అనేది తగ్గుతుందని అలాగే మజిల్ మాస్ పెరుగుతుందని ఓహియో యూనివర్సిటీ రీసెర్చర్స్ స్పష్టం చేస్తున్నారు. ఈ ఆయిల్ ఫ్లేవర్ లేనిది. దీనిని వివిధ ప్రయోజనాలకు వాడతారు. సాఫ్లావర్ ఆయిల్ లో విటమిన్ ఈ అధికంగా లభిస్తుంది. ఇందులో వ్యాధులపై పోరాడే యాంటీ ఆక్సిడెంట్స్ కలవు.

వెజ్జీస్ ను గ్రిల్ చేయడానికి అలాగే ఫ్రై చేయడానికి తోడ్పడుతుంది

నువ్వుల నూనె:

నువ్వుల నూనె:

నువ్వుల నూనె అనేది ఫ్రేగ్రంట్ ఆయిల్. ఇందులో విటమిన్ ఈ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు బ్లడ్ ప్రెషర్ ని తగ్గించే గుణాలు కలవని ఒక అధ్యయనం తెలుపుతోంది. నువ్వుల గింజల లోంచి సేకరించబడిన నూనెలో మోనో అన్ శాచురేటెడ్ అలాగే పోలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ కలవు. డార్క్ సెసేమ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా కలవు. అలాగే ఇది నట్టీ ఫ్లేవర్ కలిగి ఉంటుంది.

స్టిర్ ఫ్రైయింగ్ కి, సూప్స్ లో స్టీమ్డ్ వెజ్జీస్ లో అలాగే సలాడ్ డ్రెస్సింగ్స్ కి ఈ ఆయిల్ ఉపయోగకరంగా ఉంటుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో శాచురేటెడ్ ఫ్యాట్, లారిక్ యాసిడ్ లు కలవు. ఇవి ఆరోగ్యకరమైన HDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంపొందించడానికి తోడ్పడతాయి. కొబ్బరి నూనె అనేది LDL (బ్యాడ్) కొలెస్ట్రాల్ ను మంచి కొలెస్ట్రాల్ గా మారుస్తుంది. శరీరంలోని HDL ని పెంచడం ద్వారా కొబ్బరి నూనె గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. గుండె వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బేకింగ్ కి వాడవచ్చు. అలాగే, వెన్నకి బదులుగా వాడవచ్చు.

గ్రేప్ సీడ్ ఆయిల్:

గ్రేప్ సీడ్ ఆయిల్:

గ్రేప్ సీడ్స్ నుంచి సేకరించబడిన ఆయిల్ లో 70 శాతం పోలీ అన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి LDL (బ్యాడ్) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు తోడ్పడతాయి. ఈ ఆయిల్ లో లైనోలీక్ యాసిడ్ అనే ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. అలాగే, ఈ ఆయిల్ లో విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. ఇంకొక్క గొప్ప విషయం ఏంటంటే, ఈ ఆయిల్ లో హై స్మోకింగ్ పాయింట్ ఉంది. అందువలన, చర్మానికి అలాగే శిరోజాలకు మంచిది.

సాటింగ్ అలాగే ఫ్రైయింగ్ కి ఉపయోగకరంగా ఉంటుంది.

పామ్ ఆయిల్:

పామ్ ఆయిల్:

పామ్ ఆయిల్ లో విటమిన్ ఈ లభ్యమవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇది సహజంగా రెడ్డిష్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. దీనిలో నుండే బీటా కెరోటిన్ వలన ఈ రంగు ఏర్పడుతుంది. పామ్ ఆయిల్ అనేది ఎనర్జీ లెవల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే విజన్ ను మెరుగుపరచి, కార్డియో వాస్క్యూలర్ వ్యాధులను అరికడుతుంది. అలాగే, క్యాన్సర్ బారిన పడే ప్రమాదాలను తగ్గిస్తుంది. ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉండేందుకు తోడ్పడుతుంది.

కూరలను వండేటప్పుడు, నూడిల్ సూప్స్, ఆమ్లెట్స్ తో పాటు మిక్స్డ్ వెజిటబుల్ రైస్ వంటి వాటిలో ఈ ఆయిల్ ను వినియోగించవచ్చు.

Read more about: healthy diet cooking olive oil
English summary

Healthy Cooking Substitutes For Olive Oil

Many recipes call for olive oil, from dressings to marinades to sauteing. Extra-virgin olive oil is flavourful and rich in healthy fats, but it can be expensive too. Due to the olive oil being much more costly, there are other healthy cooking substitutes for olive oil such as canola oil, sunflower oil, peanut oil, avocado oil, flaxseed oil, sesame oil,
Story first published: Tuesday, April 17, 2018, 16:50 [IST]