For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హార్ట్ అటాక్ వార్నింగ్ : ఫిష్ డైట్ తో రిస్క్ తగ్గించుకోవచ్చు

హార్ట్ అటాక్ వార్నింగ్ : ఫిష్ డైట్ తో రిస్క్ తగ్గించుకోవచ్చు

|

భారతదేశంలోని దాదాపు 1.7 లక్షల భారతీయులు హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. భారతదేశంలో ఎక్కువగా హార్ట్ ఎటాక్ తో మరణాలు సంభవిస్తాయని ప్రపంచవ్యాప్తంగా ఇది 23 శాతానికి చెందినదని తెలుస్తోంది. ఈ ఆర్టికల్ లో, హార్ట్ ఎటాక్ కి చెందిన వార్నింగ్ సైన్స్ గురించి చర్చించుకుందాం. అలాగే, హార్ట్ ఎటాక్ డైట్ గురించి కూడా తెలుసుకుందాం.

హార్ట్ ఎటాక్ అనే కండిషన్ ను మయోకార్డియల్ ఇంఫార్క్షన్ అనంటారు. బ్లడ్ సప్లై గుండెకు చేరడంలో అవాంతరాలు ఎదురవుతాయి. తగినంత బ్లడ్ సప్లై లేనప్పుడు గుండె సరిగ్గా పనిచేయదు. గుండె పనితీరు దెబ్బతింటుంది.

Heart Attack Warning: Eat This Meal To Lower Your Risk

హార్ట్ ఎటాక్ వార్నింగ్ సైన్స్ ఏంటి?

చెస్ట్ పెయిన్ - ఇది హార్ట్ ఎటాక్ కి సంబంధించిన సాధారణ ప్రమాద ఘంటిక. గుండె మధ్యలోంచి ఒత్తిడికి చెందిన భావన మొదలవుతుంది. ఈ నొప్పి చేతులకు ప్రాకుతుంది.

ఊపిరి అందకపోవడం - గుండె తగినంత రక్తాన్ని పంపిణీ చేయకపోతే శ్వాస ఇబ్బందులు తలెత్తవచ్చు. ఉపిరి అందకపోవచ్చు. గుండె శరీరానికి రక్తాన్ని పంపిణీ చేస్తుంది, కాబట్టి, లంగ్స్ నుంచి టిష్యూస్ ఆక్సిజన్ ను అందుకుంటాయి.

ఎడమ చేతి వద్ద నొప్పి : హార్ట్ అటాక్ సమయంలో, ఎడమ చేతి వద్ద ఎక్కువ ప్రభావం కలుగుతుంది. గుండె కండరాలకు ఆక్సిజన్ తగిన మోతాదులో అందకపోవటంతో ఈ సమస్య ఎదురవుతుంది. నెర్వస్ సిస్టమ్ ద్వారా హార్ట్ ఎటాక్ కి సంబంధించిన ప్రమాద ఘంటిక ఈ విధంగా తెలుస్తుంది.

విపరీతమైన చెమట - చెమట విపరీతంగా పట్టడం హార్ట్ అటాక్ కి సంబంధించిన ముఖ్య హెచ్చరిక. బ్లడ్ సప్లై అనేది క్లాగ్డ్ ఆర్టరీస్ నుంచి అతికష్టం మీద పంపిణీ అవడం జరుగుతుంది. ఈ శ్రమ వలన చెమట విపరీతంగా పడుతుంది.

విపరీతమైన అలసట - ఈ వార్నింగ్ సైన్ ను గుర్తించడం కష్టం. మీరు అలసటను సాధారణ లక్షణంగా భావించడం జరుగుతుంది. అయితే, ఎటువంటి కారణం లేకుండా అలసటకు గురవడం అనేది అనారోగ్యానికి సూచనగా మీరు పరిగణించాలి.

ఆహారంలోని మార్పులను చేయడం ద్వారా అలాగే క్రమ బద్దంగా వ్యాయామం చేయడం ద్వారా హార్ట్ ఎటాక్ కి గురయ్యే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

ఫిష్ డైట్ తో హార్ట్ ఎటాక్ ని అరికట్టవచ్చు

ఆరోగ్యకరమైన అలాగే బాలన్స్డ్ డైట్ ను తీసుకుంటూ హార్ట్ ఎటాక్ కి గురయ్యే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఫిష్ అనేది గుండె ఆరోగ్యాన్ని సంరక్షించే ఆహారం.

హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం ప్రకారం, వారానికి రెండు సార్లు ఫిష్ ని తీసుకోవడం వలన హార్ట్ ఎటాక్ కి గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. గుండె వ్యాధులు కూడా దరిచేరవు.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్ లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి బ్లడ్ క్లాట్స్ ని అరికట్టేందుకు తోడ్పడతాయి. బ్లడ్ ప్రెషర్ ను మెరుగుపరుస్తాయి. వారానికి రెండు సెర్వింగ్స్ ఫిష్ ను తీసుకున్నవారు రోజువారీ సిఫార్సు చేయబడిన పోషకాల మార్గదర్శకాన్ని అంటే, 250 మిల్లీగ్రాములను దాదాపు మీట్ అవగలుగుతారు.

అలాగే, ఫిష్ ను ఎక్కువగా తీసుకునే వారు ప్రొసెస్డ్ మీట్స్ ను తక్కువగా తీసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

ఫిషెస్ లో లీన్ ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. సల్మాన్, మ్యాకేరల్, హెర్రింగ్, సార్డినెన్ మరియు ట్యూనా లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఈ ఒమేగా 3 ఫ్యాట్స్ ను డొకోసహేక్సయేనోయిక్ యాసిడ్ (DHA) మరియు ఈకోసపెంటేనోయిక్ యాసిడ్ అనంటారు. ఇవి బ్లడ్ క్లాట్స్ ను అరికట్టి ప్రమాదకరమైన హార్ట్ రిథమ్స్ ను సరిచేస్తాయి.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఒక రకమైన అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవి శరీరంలోని ఇంఫ్లేమేషన్ ను తగ్గిస్తాయి. ఇంఫ్లేమేషన్ వలన బ్లడ్ వెజిల్స్ కి డేమేజ్ జరుగుతుంది. తద్వారా, స్ట్రోక్ మరియు గుండెవ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది.

ప్రతివారం ఫిష్ ను ఎక్కువగా తీసుకునే వారు గుండె వ్యాధుల నుంచి బాధపడే ప్రమాదాన్ని తగ్గించుకోగలుగుతారు. అసలు విషయం ఏంటంటే, ఫిష్ ను ఎక్కువగా తీసుకునే వారు హ్యామ్, సాసేజ్ లేదా బేకాన్ మరియు రెడ్ మీట్ ను అతిగా తీసుకోవడం జరగదు. అందువలన, వీరికి అనారోగ్యం సంభవించే ముప్పు తక్కువ.

మీరు అవాయిడ్ చేయవలసిన ఫిషెస్ ఇవే:

క్యాట్ ఫిష్ మరియు తిలాఫియాలు గుండె ఆరోగ్యానికి మంచివి కావు. వీటిలో అనారోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా లభిస్తాయి.

English summary

Heart Attack Warning: Eat This Meal To Lower Your Risk

Heart Attack Warning: Eat This Meal To Lower Your Risk,Heart Attack Warning: Eat This Meal To Lower Your Risk,Heart attack is the leading cause of death in India, killing at least 1.7 million Indians. India is touted as the country with most heart failure deaths in the world at 23 per cent. In this article, హార్ట్ అటాక్ వార్నింగ్ : ఫిష్ డైట్ తో రిస్క్ తగ్గించుకోవచ్చు
Desktop Bottom Promotion