For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యువతలో హెర్నియా సమస్యకుగల కారణాలేమిటి, చికిత్స ఎలా ?

యువతలో హెర్నియా సమస్యకుగల కారణాలేమిటి, చికిత్స ఎలా ?

|

మహిళల కన్నా, హెర్నియా ఎక్కువగా పురుషులలోనే సంభవిస్తుంది. ఏదైనా ఒక అవయవం లేదా కొవ్వు కణజాలం, పరిసర బలహీనమైన భాగం ద్వారా కండరాలలో లేదా అనుసంధాన కణజాలాలలోకి నెట్టబడడం ద్వారా ఈ హెర్నియా సమస్య ఏర్పడుతుంది. ఈ వ్యాసంలో, హెర్నియా యొక్క లక్షణాలు మరియు చికిత్సా పద్దతుల గురించిన వివరాలను అందించబోతున్నాము.

హెర్నియా పొత్తికడుపులో తలెత్తే అత్యంత సాధారణమైన సమస్యగా ఉంది. కానీ అది నాభి, ఎగువ తొడ మరియు కటి (గజ్జ భాగంలో) ప్రాంతాలలో సంభవించవచ్చు. ఒక్కోసారి ఈ సమస్య పుట్టుకతోనే ఏర్పడవచ్చు, లేదా కొన్ని అంతర్గత సమస్యలు, ప్రమాదాలు, స్వయంకృతాల కారణంగా కూడా సంభవించవచ్చు.

హెర్నియాలో రకాలు :

హెర్నియాలో రకాలు :

1. ఇంగ్యునల్ హెర్నియా :

బ్రిటీష్ హెర్నియా సెంటర్ ప్రకారం, అన్ని హెర్నియా రకాలలో 70 శాతం వరకు ఉండే అత్యంత సాధారణ హెర్నియా రకం ఇది. ఒక బలహీనమైన భాగం లేదా గాయం ద్వారా పెద్ద ప్రేగు దిగువ ఉదర గోడ నుండి గజ్జలలోకి ప్రవేశించడం కారణంగా ఈరకం హెర్నియా ఏర్పడుతుంది. తరచుగా గజ్జ భాగంలో కనిపిస్తుంటుంది. పొత్తికడుపు నుండి స్పెర్మాటిక్ కార్డ్, వృషణాలకు వెళ్ళే ప్రదేశంలో ఇది సంభవిస్తుంది.

2. ఇన్సిసియోనల్ హెర్నియా :

2. ఇన్సిసియోనల్ హెర్నియా :

మీరు ఏదైనా ఉదర సంబంధిత శస్త్రచికిత్సను ఎదుర్కొనిన ఎడల, అక్కడ ఏర్పడిన గాయం లేదా బలహీనమైన కణజాల ద్వారం నుండి, ప్రేగులు చొచ్చుకుని వ్యాపించి ఉన్న కారణాన, ఇన్సిసియోనల్ హెర్నియాకు దారితీసే అవకాశాలు లేకపోలేదు.

3. హయాటల్ హెర్నియా :

3. హయాటల్ హెర్నియా :

అన్నవాహిక, ఛాతీ నుండి ఉదరంలోకి వెళ్ళే ద్వారాన్ని హయాటస్ అని వ్యవహరిస్తారు. మీ కడుపులో కొంతభాగం ఈ భాగంలో చిక్కుకున్నప్పుడు, దీన్ని హయాటల్ హెర్నియా అని పిలుస్తారు. ఈ హెర్నియా 50 సంవత్సరాలకు పైన ఉన్నవారిలో సాధారణంగా ఉంటుంది.

Most Read:ట్రైన్ లో చూసి ఫ్లాట్ అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, బాగా సుఖ పరిచేదాన్ని, చంపబోయాడు,Most Read:ట్రైన్ లో చూసి ఫ్లాట్ అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, బాగా సుఖ పరిచేదాన్ని, చంపబోయాడు,

4. తొడ హెర్నియా :

4. తొడ హెర్నియా :

ప్రేగు కణజాలం తొడ కాలువ గోడ నుండి వెళ్తున్నప్పుడు ఇది సంభవిస్తుంది. గర్భిణీ స్త్రీలు మరియు ఊబకాయంతో బాధపడుతున్న స్త్రీలలో తొడ హెర్నియా అత్యంత సాధారణమైన విషయంగా ఉంటుంది.

5. నాభి సంబంధిత (ఉంబిలికల్) హెర్నియా :

5. నాభి సంబంధిత (ఉంబిలికల్) హెర్నియా :

చిన్న ప్రేగులలోని ఒక భాగం కడుపు కండరాల ద్వారా వెలుపలికి నెట్టబడుతున్న సందర్భంలో ఈ సమస్య తలెత్తుతుంది. క్రమంగా నాభి భాగంలో వాపు వలె కనిపించవచ్చు.

హెర్నియాకు గల కారణాలు :

హెర్నియాకు గల కారణాలు :

కణజాల విచ్ఛిన్నం మరియు మరమ్మత్తు వంటి శరీర సహజ చక్రంలో తలెత్తిన సమస్యల కారణంగా బలహీనమైన కండరాలు లేదా అనుసంధాన కణజాలాలలోనికి అవయవాలు లేదా కొవ్వు కణజాలాలు నెట్టబడడం కారణంగా హెర్నియా ఏర్పడుతుంది.

వయస్సు, దీర్ఘకాలిక దగ్గు మరియు శస్త్రచికిత్స కారణంగా తలెత్తిన అనుకోని సమస్యలు, కండరాల బలహీనతలకు గల ప్రధాన కారణాలుగా ఉండగా, అధిక బరువులు ఎత్తడం, మలబద్ధకం, ఉదరంలో ద్రవం చేరడం, నిరంతర దగ్గు మరియు శస్త్రచికిత్సలు మొదలైనవి హెర్నియాకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

Most Read:తొడలపై చెయ్యేశాడు, తనపైకి లాక్కున్నాడు, ఒక్కసారి సహకరించమన్నాడు, పోస్ట్ ఊరికే వస్తుందా?Most Read:తొడలపై చెయ్యేశాడు, తనపైకి లాక్కున్నాడు, ఒక్కసారి సహకరించమన్నాడు, పోస్ట్ ఊరికే వస్తుందా?

హెర్నియా లక్షణాలు :

హెర్నియా లక్షణాలు :

హెర్నియా అత్యంత సాధారణ లక్షణం, ప్రభావిత ప్రాంతంలో ఒక గడ్డలా ఏర్పడడం. ఇతర సాధారణ లక్షణాలుగా ప్రభావిత ప్రాంతంలో బలహీనత, లేదా ఉదరంలో భారము యొక్క అనుభూతి, ప్రభావిత ప్రాంతంలో నొప్పి లేదా అసౌకర్యం ఉండగా, ఇతర లక్షణాలుగా ఛాతీ నొప్పి, మ్రింగుటలో కష్టం, మరియు యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు ఉన్నాయి.

హెర్నియా ప్రమాద కారకాలు ఏమిటి ?

హెర్నియా ప్రమాద కారకాలు ఏమిటి ?

ప్రమాద కారకాలుగా వంశపారంపర్యంగా వచ్చే జన్యు సమస్య, ఊబకాయం, దీర్ఘకాలిక మలబద్ధకం, దగ్గు మరియు ధూమపానంగా ఉన్నాయి. సిస్టిక్ ఫైబ్రోసిస్ కూడా హెర్నియా యొక్క ప్రధాన ప్రమాద కారకంగా ఉంది.

హెర్నియా వ్యాధి నిర్ధారణ :

హెర్నియా వ్యాధి నిర్ధారణ :

ఇన్సిసియోనల్ లేదా ఇంగ్యునల్ హెర్నియా నిర్ధారణకు భౌతిక పరీక్ష జరుగుతుంది. వైద్యుడు, మీ ఉదర భాగంలో గడ్డ వంటి అనుభూతిని పొందినప్పుడు, మరియు అది ఒక హయాటల్ హెర్నియా వలె ఉన్న సందర్భంలో, నిర్ధారణ కోసం బేరియం ఎక్స్- రే లేదా ఎండోస్కోపీ పరీక్షలకు సూచించే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలు రెండూ మీ వైద్యుని మీ కడుపు యొక్క అంతర్గత భాగాలను చూసేందుకు అనుమతిస్తాయి.

Most Read:ఆమె నాకు హస్త ప్రయోగం చేసింది, వీర్యం అంటిన చేతిని యోనిలో పెట్టుకుంది, ప్రెగ్నెన్నీ వస్తుందాMost Read:ఆమె నాకు హస్త ప్రయోగం చేసింది, వీర్యం అంటిన చేతిని యోనిలో పెట్టుకుంది, ప్రెగ్నెన్నీ వస్తుందా

హెర్నియా చికిత్స :

హెర్నియా చికిత్స :

హెర్నియా చికిత్సలో ప్రధానంగా శస్త్రచికిత్స ఉంటుంది కానీ, హయాటల్ హెర్నియా విషయంలో, యాంటాసిడ్లు, H2 రిసెప్టర్ బ్లాకర్స్ మరియు ప్రోటాన్ పంప్ నిరోధకాలు వంటి మందులు కడుపులోని యాసిడ్ మొతాదులను తగ్గించి, లక్షణాలను మెరుగుపరుస్తాయి.

అయితే, శస్త్రచికిత్స అనేది హెర్నియా రకం, హెర్నియా యొక్క కంటెంట్, ఆరోగ్య లక్షణాలు మరియు సాధారణ ఆరోగ్య పరిస్థితితో సహా అనేక కారణాల ఆధారితంగా అంచనా వేయబడుతుంది.

హెర్నియా చికిత్సకు సూచించబడే సర్జరీ రకాలు : ఇవి ప్రధానంగా రెండు రకాలు :

హెర్నియా చికిత్సకు సూచించబడే సర్జరీ రకాలు : ఇవి ప్రధానంగా రెండు రకాలు :

1. ఓపెన్ సర్జరీ :

దీనిలో, హెర్నియాను మెష్ ఉపయోగించి మూసివేయడం జరుగుతుంది. శస్త్రచికిత్సలో ఏర్పడిన గాయాలను సర్జికల్ గ్లూ లేదా, కుట్లతో మూయడం జరుగుతుంది.

2. లాప్రోస్కోపిక్ ఆపరేషన్ (కీహోల్ శస్త్రచికిత్స) :

ఇది అత్యంత క్లిష్టమైన పద్దతి కానీ పరిసర కణజాలాలకు తక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఆపరేషన్లో అనేక చిన్ని చిన్ని గాయాలను చేయడం ద్వారా జరుగుతుంది. దీనిలో సర్జన్, హెర్నియా చికిత్సలో భాగంగా ప్రత్యేకించబడిన అనేక ఉపకరణాలను ఉపయోగించడం జరుగుతుంది.

అందుకే మన పెద్దలు, అధిక బరువులు ఎత్తరాదని సూచిస్తుంటారు. హెర్నియా అనేక ఇతర పరిస్థితులకు కూడా దారితీస్తుందని మనం ఇదివరకే తెలుసుకున్నాం. కావున ఎటువంటి అసంబద్ద పోకడలకు మీ శరీరం గురైనా ఏమాత్రం సంకోచించకుండా, వైద్యుని సంప్రదించండి. కొంతమంది సిగ్గు బిడియం కారణంగా వైద్యుని వద్దకు వెళ్ళడానికి సంకోచిస్తుంటారు. కానీ అటువంటివి ఆరోగ్యం విషయంలో తగదు. ఒక్కోసారి మీ ఆలస్యం ప్రాణాలకే ముప్పు తీసుకునిరావొచ్చు.

గమనిక: కొందరు నాటు వైద్యాలు అంటూ సైన్స్ పూర్తి స్థాయిలో ధృవీకరించని వైద్యాలను చేస్తుంటారు. అవి అన్ని వేళలా పనిచేయవని గుర్తుంచుకోండి. కావున, ఎట్టి పరిస్థితుల్లో సంబంధిత ధృవీకరించబడిన వైద్యుని మాత్రమే సంప్రదిస్తున్నారని నిర్ధారించుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.


English summary

Hernia: Types, Causes, Symptoms and Treatment

Hernia is a condition that occurs mostly in men and it happens when an organ or a fatty tissue pushes through a weak spot in a surrounding muscle or connective tissue. It causes when there is a strain in the weak muscles or connective tissues or weakness in the muscles caused by an interruption in the body's natural cycle of tissue breakdown.
Desktop Bottom Promotion