గోరుచుట్టు స‌మ‌స్య‌కు ఇంట్లోనే 11 పరిష్కార మార్గాలు

Written By: sujeeth kumar
Subscribe to Boldsky

గోరుచుట్టూ స‌మ‌స్య మ‌న‌లో ఎవ‌రికో ఒక‌రికి ఎప్పుడో ఒక‌సారి అనుభ‌వ‌మై ఉంటుంది. ఆ బాధ అనుభ‌వించిన‌వారికే తెలుస్తుంది. సాధార‌ణంగా గోర్లు అందాన్నే కాదు ర‌క్ష‌ణ‌ను కూడా ఇస్తాయి. లోప‌లి గోరు విరిగిపోయిన‌ప్పుడు కాలిని క‌దిలించాల‌న్నా బాధగా ఉంటుంది. అందుకే ఈ బాధ నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు త‌గిన ప్ర‌య‌త్నాలుచేస్తుంటారు. ఐతే ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాల‌తో ఈ నొప్పిని ఎలా మ‌టుమాయం చేసుకోవ‌చ్చో ఇప్పుడు చూద్దాం..

గోరుచుట్టూ అంటే?

కాలి బొట‌న వేలు గోరు చ‌ర్మం లోప‌లికి విరిగిపోతే అప్పుడు అక్క‌డ చ‌ర్మం బ‌య‌ట‌కు క‌నిపించి గోరుచుట్టుగా మారుతుంది. అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు అనే తేడా లేకుండా అంద‌రికీ గోరుచుట్టు సాధార‌ణ స‌మ‌స్య‌. ముఖ్యంగా టీనేజీ పిల్ల‌ల్లో, కాలికి చెమ‌ట ఎక్కువ ప‌ట్టేవారికి ఈ స‌మ‌స్య అధికంగా వ‌చ్చే అవ‌కాశం ఉంది. గోరుచుట్టూ వ‌చ్చేందుకు ఉన్న వివిధ కార‌ణాలు చూద్దాం...

How To Remove An Ingrown Toenail Naturally Without Surgery ,

గోరుచుట్టుకు కార‌ణాలు

* గోర్లు స‌రిగ్గా క‌త్తిరించుకోక‌పోవ‌డం

* అసాధార‌ణ‌మైన గోర్లు

* బొట‌న‌వేలిపై బాగా ఒత్తిడి క‌లిగించే పాద‌ర‌క్ష‌లు వేసుకోవ‌డం వ‌ల్ల‌

* బొట‌న‌వేలికి గాయాలైన‌ప్పుడు

* అప‌రిశుభ్ర‌మైన పాదాలు

* వంశ‌పారంప‌ర్య కార‌ణాలు

How To Remove An Ingrown Toenail Naturally Without Surgery ,

దీని ల‌క్ష‌ణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

గోరుచుట్టూ ల‌క్ష‌ణాలు సాధార‌ణం నుంచి తీవ్ర‌స్థాయి దాకా ఉండొచ్చు. చుట్టూ ఉన్న చ‌ర్మం క‌మిలిపోయి, నొప్పి ఏర్ప‌డ‌వ‌చ్చు. గోరు చుట్టూ చీము ఏర్ప‌డ‌వ‌చ్చు. ర‌క్తం రావ‌చ్చు,

దీన్ని ఇలాగే వ‌దిలేస్తే స‌మ‌స్య‌, నొప్పి మ‌రింత తీవ్ర‌మ‌య్యే అవ‌కాశం ఉండొచ్చు. ఒక వేళ మీరు స‌హ‌జంగా ఈ నొప్పికి ప‌రిష్కారం వెత‌కాల‌ని భావిస్తుంటే ఇదే స‌రైన క‌థ‌నం. నొప్పిని ఇంట్లోనే ఎలా త‌గ్గించుకోవ‌చ్చు కొన్ని ప‌రిష్కార మార్గాల‌ను చూడండి... న‌చ్చితే ట్రై చేయండి.

1. ఆరోగ్య‌క‌ర తైలాలు

1. ఆరోగ్య‌క‌ర తైలాలు

1 టీ ట్రీ తైలం

టీ ట్రీ ఆయిల్‌ను 2 లేదా 3 చుక్కులు తీసుకోవాలి. దీనికి జ‌త‌గా కావాలంటే కొబ్బ‌రి నూనె వాడొచ్చు. చేతి వేలిపై కొద్దిగా టీ ట్రీ ఆయిల్ తీసుకొని నేరుగా గోరుచుట్టు పైన రాయాలి. మీది మృదువైన చ‌ర్మమైతే ఏదైనా క్యారియ‌ర్ ఆయిల్‌ను జ‌త‌చేర్చుకోవ‌చ్చు. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే స‌రి.

టీ ట్రీ ఆయిల్ మంచి యాంటీ సెప్టిక్‌లా ప‌నిచేస్తుంది. మున్ముందు ఇన్ఫెక్ష‌న్ రాకుండా నిరోధిస్తుంది. అంతేకాదు ఈ నూనెకు యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి. త‌ద్వారా ఆ ప్రాంతంలో ఇన్ఫెక్ష‌న్ రాకుండా నిరోధిస్తుంది.

పెప్ప‌ర్‌మింట్ ఆయిల్‌

ముందుగా పాదాల‌ను కాసిన్ని నీళ్ల‌లో నానేలా ఉంచాలి. ఆ త‌ర్వాత పాదాల‌ను శుభ్రంగా తుడిచి పొడిగా ఉండేలా చేసుకోవాలి. గోరుచుట్టు ఉన్న ప్రాంతంలో పెప్ప‌ర్‌మింట్ ఆయిల్ వేసి మ‌ర్ద‌న చేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే ఫ‌లితం క‌నిపిస్తుంది.

పెప్ప‌ర్‌మింట్ ఆయిల్‌లో ఉండే పుదీన నొప్పి నివారిణిలా పనిచేస్తుంది. అంతే కాదు ఇది కొన్ని యాంటీబ్యాక్టీరియల్ గుణాలుంటాయి. మ‌రింత ఇన్ఫెక్ష‌న్‌కు గురికాకుండా కాపాడుతుంది.

2. బేకింగ్ సోడా

2. బేకింగ్ సోడా

అర టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్ది చుక్క‌ల నీరు, బ్యాండేజ్ కావాలి.

ముందుగా బేకింగ్ సోడాను కొద్దిగా నీళ్ల‌లో వేసి మెత్త‌ని పేస్టులా చేసుకోవాలి. గోరుచుట్టు దీన్ని పూత‌లా పూసి బ్యాండేజ్ క‌ట్టాలి. ఇలా రోజుకు 1 లేదా 2 సార్లు చేస్తే ఫ‌లిత‌ముంటుంది.

బేకింగ్ సోడా స‌హ‌జ‌సిద్ధంగానే యాంటీ సెప్టిక్ గుణాలుంటాయి. ఇవి గోరుచుట్టును నివారించ‌గ‌ల‌దు. అంతే కాదు యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు కూడా బేకింగ్ సోడాకు ఉన్నాయి. అందుకే ఇది గోరుచుట్టుకు మంచి ప‌రిష్కారం కాగ‌ల‌దు.

3. ఎప్‌స‌మ్ సాల్ట్‌

3. ఎప్‌స‌మ్ సాల్ట్‌

ఒక‌టి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఎప్స‌మ్ సాల్ట్ ను ఒక పెద్ద బ‌కెట్ నీటిలో వేయండి. దీంట్లో మీ పాదాల‌ను 15 నుంచి 20 నిమిషాల వ‌ర‌కు ఉంచండి. ఇలా రోజుకు 2 లేదా 3 సార్లు చేయాలి. ఎప్స‌మ్ సాల్ట్‌లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది ఇన్ ఫ్ల‌మేష‌న్ తో పోరాడి నొప్పిని త‌గ్గిస్తుంది. ఏవైనా వాపు ఏర్ప‌డినా వెంట‌నే త‌గ్గిపోతుంది.

4. కొబ్బ‌రి నూనె

4. కొబ్బ‌రి నూనె

లేత కొబ్బ‌రి నూనెను తీసుకొని గోరుచుట్టు ఉన్న ప్రాంతంలో మృదువుగా మ‌ర్ద‌నా చేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తు ఫ‌లిత‌ముంటుంది.

కొబ్బ‌రి నూనెలో అపార‌మైన ఔష‌ధ గుణాలుంటాయి. కొన్ని ర‌కాల ఫ్యాటీ ఆమ్లాలు లారిక్ యాసిడ్‌, క్యాప్రిలిక్ యాసిడ్‌లు ఉండ‌టం వ‌ల్ల అవి చ‌ర్మానికి మంచి చేస్తాయి. వీటిలో యాంటీ ఫంగ‌ల్‌, అనాల్జిసిక్‌, యాంటీ ఇన్ ఫ్ల‌మేట‌రీ గుణాలుంటాయి. ఇవి గోరుచట్టు నొప్పిని త‌గ్గించ‌డంలో స‌హ‌క‌రిస్తాయి.

5. యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌

5. యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌

ఒక కాట‌న్ బాల్ తీసుకొని కొద్దిగా యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌లో ముంచాలి. దీన్ని నేరుగా గోరుచుట్టు ఉన్న ప్రాంతంలో రాయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే బాగుంటుంది.

గోరుచుట్టు స‌మ‌స్య‌కు యాపిల్ సిడార్ వెనిగ‌ర్ చ‌క్క‌ని ప‌రిష్కారం. దీనికి శ‌క్తివంత‌మైన యాంటీ ఇన్ ఫ్ల‌మేట‌రీ గుణాలుంటాయి. ఇవి నొప్పిని సులువుగా త‌గ్గిస్తాయి. అంతే కాదు యాంటీ మైక్రోబియల్ గుణాల వ‌ల్ల గోరును బ్యాక్టీరియా, ఫంగ‌స్ ఇన్ఫెక్ష‌న్ల నుంచి కాపాడుతుంది.

6. వెల్లుల్లి

6. వెల్లుల్లి

వెల్లుల్లి ముక్క‌ల‌ను మెత్త‌గా నూరి పెట్టుకోవాలి. దీన్ని నొప్పి ఉన్న ప్రాంతంలో రాయాలి. ఆ త‌ర్వాత బ్యాండేజీతో క‌ట్టు క‌ట్టాలి. ఇలా చేసి రాత్రంతా వ‌దిలేయాలి. ప్ర‌తి రోజు ప‌డుకునే ముందు ఇలా చేయ‌డం వ‌ల్ల త్వ‌ర‌లోనే నొప్పి త‌గ్గుతుంది.

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ప‌దార్థం ఉంటుంది. ఇది యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు క‌లిగిన‌ది. గోరుచుట్టు వ‌స్తే ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి వెల్లుల్లి కాపాడుతుంది. అంతేకాదు త్వ‌ర‌గా కోలుకునేలాగాను చేస్తుంది.

7. హైడ్రోజ‌న్ పెరాక్సైడ్‌

7. హైడ్రోజ‌న్ పెరాక్సైడ్‌

3 శాతం హైడ్రోజ‌న్ పెరాక్స్‌డ్ ద్రావ‌ణం అర క‌ప్పు తీసుకొని అర బ‌కెట్ గోరువెచ్చ‌ని నీటిలో క‌ల‌పాలి. దీంట్లో 15 నుంచి 20 నిమిషాల పాటు పాదాల‌ను ఉంచి శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు 2 లేదా 3 సార్లు చేయ‌డం మంచిది.

హైడ్రోజ‌న్ పెరాక్సైడ్ స‌హ‌జ డిస్ ఇన్‌ఫెక్టెంట్‌. గాయాల‌ను మాన్పించేందుకు దీన్ని ఉప‌యోగిస్తారు. యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాల‌ను ఇది క‌లిగిఉంది. అందుకే గోరుచుట్టుకు హైడ్రోజ‌న్ పెరాక్సైడ్‌ను చక్క‌గా వాడుకోవ‌చ్చు.

8. ప‌సుపు

8. ప‌సుపు

ఒక టీ స్పూన్ ప‌సుపు తీసుకొని దాంట్లో త‌గినంత నీరు పోసి మెత్త‌ని పేస్టులా చేసుకోవాలి. ఆ త‌ర్వాత దీన్ని గోరుచుట్టుకు రాయాలి. ఇలా రోజులో ఒక‌టి లేదా రెండు సార్లు చేస్తుండాలి.

ప‌సుపులో కుర్‌కుమిన్ అనే ప‌దార్థాం యాంటీ ఇన్ ఫ్ల‌మేట‌రీ గుణాలు క‌లిగి ఉంటాయి. ఇది నొప్పిని తగ్గించ‌గ‌ల‌వు. అంతే కాదు తొంద‌ర్లోనే గోరుచుట్టు మ‌టుమాయ‌మై నొప్పి పూర్తిగా త‌గ్గిపోతుంది.

9. నిమ్మ‌ర‌సం

9. నిమ్మ‌ర‌సం

తాజా నిమ్మ‌ర‌సం తీసి గోరుచుట్టుకు రాయాలి. దానిపైన బ్యాండేజీ వేసి రాత్రంతా అలాగే ఉంచేయాలి. సాధార‌ణంగా రాత్రి ప‌డుకోబోయే ముందు ఇలా చేయ‌డం మంచిది.

నిమ్మ‌ర‌సంలో ఉండే యాసిడ్ గుణాలు బ్యాక్టీరియాను సులువుగా చంపేయ‌గ‌ల‌దు. నిమ్మ‌లో యాంటీ ఫంగ‌ల్ గుణాలు సైతం ఉంటాయి. అవి ఫంగ‌స్ ద‌రిచేయ‌కుండా చేయ‌గ‌ల‌దు.

10. లిస్ట‌రీన్‌

10. లిస్ట‌రీన్‌

ఒక టేబుల్ స్పూన్ లిస్ట‌రీన్‌కు ఒక టేబుల్ స్పూన్ నీళ్లు క‌ల‌పండి. కాట‌న్ ముద్ద తీసుకొని ఈ మిశ్ర‌మంలో ముంచండి. ఆ త‌ర్వాత గోరుచుట్టు రాయాలి. ఇలా రోజుకు 2 లేదా 3 సార్లు చేయ‌డం వ‌ల్ల ఫ‌లితాలు వ‌స్తాయి.

లిస్ట‌రీన్‌లో మెంథాల్‌, యూక‌లిప్ట‌స్ లాంటి మంచి ద్రావ‌ణాలు ఉంటాయి. లిస్ట‌రీన్ యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు క‌లిగి ఉన్నాయి. భ‌విష్య‌త్‌లో ఏ స‌మస్య‌లు రాకుండా చూసుకోగ‌ల‌దు.

11. ఉల్లిపాయ‌లు

11. ఉల్లిపాయ‌లు

స‌న్న‌గా తరిగి న ఉ ల్లిపాయ ముక్క ఒక‌టి తీసుకొని నొప్పి ఉన్న ప్రాంతంలో నేరుగా రాయాలి. దానిపైన బ్యాండేజీ క‌ట్టేయాలి. ఇలా ప్ర‌తి రాత్రి ప‌డుకోబోయే చేసుకుంటే మంచిది.

ఉల్లిపాయ‌లు గోరుచుట్టు స‌మ‌స్య‌కు మంచి పరిష్కారం. ఉల్లిపాయ‌ల్లో అల్లీసెపిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది యాంటీ ఫంగ‌ల్ గుణాలు క‌లిగి ఉంటాయి. అంతే కాదు యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్ ఫ్ల‌మెట‌రీ గుణాలు సైతం ఉంటాయి. దీన్ని మంచి నొప్పి నివార‌ణ‌కుఉప‌యోగించవ‌చ్చు.

మ‌రి ఇవ‌న్నీ గోరుచుట్టు స‌మ‌స్య‌కు పరిష్కార మార్గాలు. వీటిలో ఏదైనా ఒక‌దాన్ని పాటిస్తే మంచిది.

 నివార‌ణ మార్గాలు

నివార‌ణ మార్గాలు

* గోర్ల‌ను ఎప్పుడు వంక‌ర్లు పోకుండా నిలువుగా క‌త్తిరించుకోవాలి.

* మ‌రీ చిన్నగా క‌ట్ చేసుకోకుండా జాగ్ర‌త్త‌ప‌డండి.

* మీకు స‌రిపోయే షూల‌ను మాత్ర‌మే ధ‌రించండి.

* అవ‌స‌ర‌మైతే గోర్ల‌కు ర‌క్ష‌ణ క‌వ‌చాన్ని ధ‌రించండి.

ఒక వేళ మ‌రీ వంక‌ర‌గా లేదా ద‌ళ‌స‌రిగా గోర్లు ఉంటే, స‌ర్జ‌రీ చేయించుకోవ‌డం మేలు. ఇవ‌న్నీ పాటించినా కూడా గోరుచుట్టు స‌మ‌స్య త‌గ్గ‌క‌పోతే డాక్ట‌రును సంప్ర‌దించ‌డం మేలు.

వైద్యుడ్ని సంప్ర‌దించండి..

ఇన్ని చిట్కాలు పాటించినా గోరుచుట్టు త‌గ్గ‌క‌పోతే వైద్యుడ్ని సంప్ర‌దించ‌డం మేలు.

గోరుచుట్టు స‌మ‌స్య‌తో చీము కారుతుంటే వెంట‌నే డాక్ట‌ర్‌కు చూపించుకోవాలి. లేదా డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డేవారికి ర‌క్తం ఎక్కువ‌గా కారుతుంది. అలాంటి వారు కూడా ఒక సారి డాక్ట‌ర్‌ను క‌ల‌వాలి. ఇక గోరుచుట్టు వ‌ల్ల స‌మ‌స్య‌ల‌తో పాటు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటివారు జాగు చేయ‌కుండా ఏదో ఒక‌రకంగా త‌గ్గించుకునే ప్ర‌య‌త్నంచేస్తుండాలి.

English summary

How To Remove An Ingrown Toenail Naturally Without Surgery

An ingrown toenail is the growth of nail in one side underneath the skin. Ingrown nails are indeed a big trouble and there are numerous surgical procedures to set them right. The good news is, there is a powerful home remedy to remove ingrown toenail. There are several expensive procedures out there to get rid of ingrown toenails as well.
Story first published: Thursday, April 19, 2018, 14:00 [IST]