For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సహజమైన పద్ధతిలో క్యాన్సర్ను నివారించడం ఎలా ?

  |

  దురదృష్టవశాత్తూ తమకు ఎదురయ్యే పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా ఉండటమే మానవ ధోరణి. భూకంపాలు, కరువులు, వరదలు మొదలైన వాటికి సంబంధించిన సహజమైన విపత్తులు; అలానే హానికరమైన వ్యాధుల వల్ల (లేదా) ప్రమాదాల వల్ల వంటివి ఏవీ మనకు / మన ప్రియమైనవారికి సంభవించ కూడదనే మనము ఎప్పుడూ కోరుకుంటాము.

  క్యాన్సర్ వ్యాధి అనేది లక్షల మంది మరణాలకు కారణమైనది కాబట్టి ఇది ప్రపంచంలోనే అత్యంత మరణాంతకమైన వ్యాధుల్లో ఒకటిగా ఉంది. మానవ శరీరంలోని ఏ భాగానికైనా అసాధారణమైన రీతిలో అణచివేయలేని కణాల పెరుగుదలను కలిగి ఉండే దానినే క్యాన్సర్ అని అంటారు, దీనిని గుర్తించిన తర్వాత కూడా దానిని నుంచి మనము బయటపడవచ్చు / బయటపడకపోవచ్చు.

  How To Prevent Cancer Naturally

  మనలో చాలా మందికి కనీసం 1 (లేదా) అంతకన్నా ఎక్కువ క్యాన్సర్ రోగులకు గూర్చి (లేదా) క్యాన్సర్తో సంబంధం ఉన్న (లేదా) క్యాన్సర్ను కలిగి ఉన్న వారి గూర్చి బాగా తెలిసి ఉండవచ్చు. ఈ ఘోరమైన వ్యాధి తీవ్రత నుంచి బయటపడటానికి ఆ వ్యక్తులను మరియు వారి కుటుంబాలు ఎంతలా పోరాడటానికి శ్రమిస్తున్నాయో మనమ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  ఈ ఆర్టికల్ ద్వారా, క్యాన్సర్ను ప్రభావితం చేయగల వివిధ అంశాలను గూర్చి, దానికి గల కారణాలు & దాని నివారణ పద్ధతులను గూర్చి మీకు అర్థమయ్యేలా వివరించబోతున్నాము. ముందుగా చెప్పుకోవాలంటే ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి చాలా రకాలైన క్యాన్సర్లు ఉన్నాయి. WHO చేసిన అధ్యయనం ప్రకారం, 2015 లో 8 మిలియన్ల మందికి పైగా ప్రజలు క్యాన్సర్ వల్ల మరణించారంట.

  ఏదేమైనా, 35-50% మంది మరణాలకు గురికాకుండా ఉండేందుకు ఈ వ్యాధిని నివారించడం (లేదా) ఈ వ్యాధికి ప్రధాన ప్రమాద కారకాలను మార్పులు చేయడం ద్వారా నివేదించబడ్డాయని కొన్ని నివేదికలు తెలియజేశాయి. ఆ కారకాలు ఏమిటంటే ఉదాహరణకు:- ఆరోగ్యకరమైన శరీర బరువు, క్రమబద్ధమైన వ్యాయామం, మద్యమును తక్కువ వినియోగించడం వంటి మొదలైన చర్యలు.

  జన్యుపరమైన మార్పులు, ధూమపానం, అదనపు బరువును కలిగి ఉండటం, నికోటిన్ను ఉపయోగించడం, వ్యాయామం చేయకపోవడం, రసాయనాలను కలిగి ఉన్న కాస్మెటిక్స్ను ఉపయోగించడం, రేడియేషన్ తీవ్రత, వంశపారపర్యంగా వచ్చే హార్మోన్ల అసమానత & ఆటోఇమ్యూన్ వ్యాధుల వల్ల శరీరంలో ఏర్పడే వాపుల వంటివి క్యాన్సర్ని కలుగజేసే వ్యాధి కారకాలని చెప్పవచ్చు.

  వైద్యపరంగా నిరూపితమైన క్యాన్సర్ నివారణలు ఏమిటి? వీటిలో మందులు, కెమోథెరపీ, రేడియేషన్, శస్త్రచికిత్స, లేజర్ థెరపీ వంటివి మొదలైనవి ఉంటాయి. అయితే, ఈ వ్యాసం ద్వారా రాబోయే రోజులలో, క్యాన్సర్ సంభవించినప్పుడు (లేదా) క్యాన్సర్ తిరగపడినప్పుడు నిరోధించ గల వివిధ సహజ మార్గాల గూర్చి మనము ఇప్పుడు అర్థం చేసుకుందాం.

  మొట్టమొదటిది, ఆహారంలో కొన్ని మార్పులు చేయడం వల్ల కాన్సర్ను దూరంగా ఉంచగలిగే ఒక అద్భుతమైన మార్గం.

  వెల్లుల్లి:

  వెల్లుల్లి:

  వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాల ఉనికిని కలిగి ఉన్నందువల్ల, దానిని మన ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. వెల్లుల్లిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వ్యతిరేకంగా పోరాడగలిగే శక్తిని కలిగి ఉన్న శరీరం యొక్క సహజ రక్షణ అయిన రోగనిరోధక వ్యవస్థకు తగిన ప్రేరణను అందిస్తుంది.

  బ్రోకలీ

  బ్రోకలీ

  మరొక పక్క బ్రోకలీ, బచ్చలికూర వంటి ఆకుపచ్చ కూరగాయలలో మెగ్నీషియం అధికంగా ఉన్న కారణంగా ఇవి గొప్ప ఆహార పదార్థాలుగా పిలువబడతాయి, అలాగే ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటితోపాటు తాజా పండ్లు, నట్స్, పాలు, సాల్మొన్ చేపలు, మొదలైన వాటిని మీ రెగ్యులర్ డైట్లో ప్రధాన భాగంగా చేర్చుకోవడం మంచిది.

  అవిసె గింజలు

  అవిసె గింజలు

  3. అవిసె గింజలు కూడా అద్భుతమైన ఆహారంగా పరిగణించబడతాయి, ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను నివారించేందుకు వీటినే బాగా ఉపయోగిస్తారు. అయితే వీటిని నేరుగా గింజల రూపంలో గానీ (లేదా) ఆయిల్ రూపంలోగానీ తీసుకునే బదులుగా, మీరు తీసుకునే ఆహారంలో అనగా భోజనము, పెరుగు, స్మూతీస్ వంటివాటిలో దీనిని కలిపి తీసుకోవచ్చు. ఈ గింజలలో ఒమేగా -3 చాలా పుష్కలంగా ఉండటంవల్ల, రొమ్ము క్యాన్సర్కు కారణమయ్యే కణాలకు వ్యతిరేకంగా పోరాడటంలో తగిన రక్షక కవచాలను కలిగి ఉంటాయి.

  ఆమ్లత్వమును కలిగి ఉన్న పానీయాలు, జంక్ ఫుడ్, ధూమపానం

  ఆమ్లత్వమును కలిగి ఉన్న పానీయాలు, జంక్ ఫుడ్, ధూమపానం

  4. కొన్ని అనివార్యమైన విషయాలకు దూరంగా ఉండటం వల్ల కూడా క్యాన్సర్ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. వాటిలో ముఖ్యమైనవి చక్కెర, ఆమ్లత్వమును కలిగి ఉన్న పానీయాలు, జంక్ ఫుడ్, ధూమపానం, ఆల్కాహాల్, ప్రాసెస్ చేయబడిన మాంసాహారాలు వంటి మొదలైన వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది.

  ఆహారంలో సూచించిన ఈ మార్పులనే కాకుండా, మీరు శారీరక ఫిట్నెస్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తగా తీసుకోవాలి.

   వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, యోగ

  వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, యోగ

  వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, యోగ, వంటి తదితరాల వ్యాయామాలను చేయడం ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 35-40% వరకూ తగ్గించవచ్చు. కనీసం 20-60 నిమిషాల వరకు ఒక మోస్తరు వ్యాయామం చేయడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది.

  విటమిన్-డి

  విటమిన్-డి

  విటమిన్-డి లేని కారణంగా శరీర కణాల మధ్య సమన్వయం లోపించి క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతాయి మరియు వ్యాప్తి చెందుతాయి. అందువల్ల తప్పనిసరిగా విటమిన్ D తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. సూర్యకాంతే విటమిన్-డి కి అద్భుతమైన మూలం అని అందరికీ తెలిసిన వాస్తవం. అందువల్ల, విటమిన్ డి వల్ల కలిగే ప్రయోజనాలను పొందడానికి ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు సూర్యరశ్మిలో ఉండాలి, అలా అని ఎక్కువ సేపు సూర్యరశ్మిలో ఉండటం వల్ల సూర్యుని నుండి విడుదల కాబడే హానికరమైన UV కిరణాల వల్ల మీకు చర్మ క్యాన్సర్ రావడానికి కారణం కావచ్చు!

  క్యాన్సర్

  క్యాన్సర్

  పైన చెప్పిన ఈ సహజ మార్గాలే కాకుండా, సాధారణ వైద్య పరీక్షల ద్వారా కూడా మీరు స్కిన్ క్యాన్సర్ను నియంత్రించడానికి చాలా మంచి మార్గము. ఇది క్యాన్సర్ కణాల ఉనికిని మాత్రమే కాకుండా, ప్రారంభదశలో ఉన్న క్యాన్సర్ను గుర్తించడంలో సహాయం చేస్తుంది, తద్వారా మెరుగైన చికిత్సా విధానాలను అనుసరించడానికి గల అవకాశాలను మెరుగుపరుస్తుంది.

  English summary

  How To Prevent Cancer Naturally

  It is human tendency to disregard any feelings of misfortune or bad luck towards oneself. Be it natural calamities such as earthquakes, droughts, floods, etc., any kind of accidents or even malfunctioning of the human body resulting in life-threatening diseases, none of us would want any of these to happen to us or to
  Story first published: Tuesday, April 24, 2018, 18:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more