అంతర్జాతీయ మహిళా దినోత్సవం,- ఎందుకు మహిళలే ఎక్కువగా ఆస్టియోపొరాసిస్ బారిన పడుతున్నారు? కారణాలు ఇవే

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఈ ఆస్టియోపొరాసిస్ ను, బోలు ఎముకల వ్యాధి అని కూడా పిలుస్తారు. ఇది పురుషులలో కంటే స్త్రీలలోనే ఎక్కువగా వస్తుంది. అంతర్జాతీయ ఆస్టియోపొరాసిస్ ఫౌండేషన్ వారి లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 200 మిలియన్ల మంది మహిళలు దీని బారిన పడి భాదపడుతున్నారు.

ముఖ్యంగా మహిళల ఎముకల సాంద్రత తక్కువగా ఉన్న కారణాన వయసుతో పాటు ఎముకల పటుత్వం తగ్గడం వలన ఈ వ్యాధికి గురవుతున్నారు. దీని ప్రకారం సగటున 20 నుండి 80 సంవత్సరాల మద్యఉన్న మహిళలలో 1 లో మూడవ వంతు తొంటి భాగాన ఉన్న ఎముకలలో సాంద్రతను కోల్పోవడం జరుగుతుంది.

ఆస్టియోపొరాసిస్ గణనాంకాల ప్రకారం 44 మిలియన్ మహిళలలో 68 శాతం మంది మహిళలు ఈ వ్యాధి కారణం గా భాధపడుతున్నారు. 50 ఏళ్ళ లోపు వయసున్న మహిళలలో కూడా ఆస్టియోపొరాసిస్ సంబంధించిన ఎముక విరుగులు వారి జీవితకాలంలో ఒక్కసారైనా కనిపిస్తున్నాయి.

స్త్రీలలో ముఖ్యంగా ఆస్టియోపొరాసిస్ రావడానికి అనేక కారణాలు క్రింది విధంగా ఉన్నాయి.

మహిళలు పురుషుల కంటే చిన్ననైన మరియు సన్నటి ఎముకలను కలిగి ఉండడం.

ఎముకలను రక్షించే హార్మోన్ ఈస్ట్రోజన్, మహిళల మెనోపాజ్ దశలో తగ్గడం మూలంగా ఎముక క్షీణతకు గురవుతుంది.

దీని కారణంగానే అధిక సంఖ్యలో మహిళలు ఈ ఆస్టియోపొరాసిస్ బారిన పడుతున్నారు.

ఎముకల పటుత్వాన్ని పెంచుకొనుట

ఎముకల పటుత్వాన్ని పెంచుకొనుట

ఎముకల పెరుగుదల మహిళలలో 18 సంవత్సరాల వయసులో , మరియు పురుషులలో 20 సంవత్సరాల వయసులో ఆగిపోతుంది. కావున అక్కడి నుండి వాటి సాంద్రత మరియు పటుత్వం పెంచే క్రియలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పురుషులు సాధించిన పెరుగుదల స్త్రీలలో కనపడుట లేదు. మరియు మహిళలలో 30 ఏళ్ళ వయసు నాటికి ఎముకలు పూర్తిగా బలాన్ని సంతరించుకుంటాయి. కాని ఆ తర్వాత వాటిలో సరైన పటుత్వ లక్షణాలు కనపడుటలేదు.

ఆస్టియోపొరాసిస్ మరియు ఈస్ట్రోజన్

ఆస్టియోపొరాసిస్ మరియు ఈస్ట్రోజన్

నిజం, ఈస్ట్రోజన్ హార్మోన్ మహిళలలో ఎముకల పటుత్వం పెరుగుటలో మరియు గర్భాశయ పనితీరుపై ఎక్కువ పెంచుతుంది. కొందరి మహిళలలో ఇది లోపించినప్పుడు మందుల ద్వారా ఇవ్వవలసి ఉంటుంది కూడా. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ మెనోపాజ్ దశలో తగ్గుముఖం పడుతుంది. తద్వారా ఎముకల సాంద్రత పెరిగే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం అనేది ప్రారంభమైతే రుతుక్రమాల సమయాల్లో తేడాలు రావడం(irregularities) , చివరికి ఒక వయసులో మెనోపాజ్ రావడం జరుగుతుంది. మరియు ఇది వరకే ఆస్టియోపొరాసిస్ తో భాదపడుతున్న మహిళలు అయితే సమస్య మరింత జఠిలం అవుతుంది.

ఈటింగ్ డిజార్డర్స్

ఈటింగ్ డిజార్డర్స్

అనేకమంది అనొరెక్సియా మరియు బులిమియా వంటి ఆహార రుగ్మతలతో భాదపడుతున్నారు. అనొరెక్సియా డిసార్డర్ ఉండేవారు సరిగ్గా తినడానికి ఇష్టపడరు. దీనికారణాన ఎక్కువగా సన్నగా ఉంటారు. బులిమియా డిసార్డర్ అతిగా తినేందుకు దోహదం చేస్తుంది. ఒక్కోసారి వాంతులకు కూడా కారణం అవ్వొచ్చు. ఈ రెండు రుగ్మతలు ఉన్న వారు ఎక్కువగా ఆస్టియోపొరాసిస్ బారిన పడే అవకాశo ఉంది.

ప్రీ – మెనోపాజ్

ప్రీ – మెనోపాజ్

చాలామంది ప్రీ మెనోపాజ్ అని వ్యవహరిస్తారు కాని ఇది పెరి మెనోపాజ్ గా పిలవబడుతుంది. ఈ ప్రీ మెనోపాజ్ కారణం గా ఆస్టియోపొరాసిస్ అనేది యుక్తవయసు యువతులపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. కొంతమంది మహిళలు 20, 30, 40 వయసులోనే మెనోపాజ్ దశకు చేరుకుంటారు. వీరిలోని హార్మోన్ల అసమతౌల్యం ముఖ్యంగా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా తక్కువ వయసులో కూడా ఆస్టియోపొరాసిస్ వచ్చే అవకాశo ఉంది. ఈ ప్రీ మెనోపాజ్ కి చేరుకున్న మహిళలలో ఎక్కువగా ఎముకల సాంద్రత లోపిస్తుంది, తద్వారా ఆస్టియోపొరాసిస్ వచ్చే అవకాశo ఎక్కువ. కావున ఎప్పటికప్పుడు శరీరం లోని మార్పులపై అనుమానం వచ్చినప్పుడు డాక్టరును సంప్రదించడం మంచిది.

ఆస్టియోపొరాసిస్ యుక్తవయసు స్త్రీలలో

ఆస్టియోపొరాసిస్ యుక్తవయసు స్త్రీలలో

వయసుతో సంబంధంలేకుండా యుక్తవయసులోని మహిళలు కూడా దీని బారిన పడుతున్నారు. దీనికి కారణం వయసుకు తగిన ఎముకల పెరుగుదల మరియు వాటి సాంద్రత పెరగకపోవడమే. చాల మంది యువతులు తమకే తెలీకుండా వీటి బారిన పడిఉన్నారు. కాని ఇది ఆస్టియోపొరాసిస్ అని డాక్టరుని సంప్రదించిన తర్వాతనే తెలుస్తుంది. కొన్ని సార్లు ప్రీ మెనోపాజ్ కారణంగా కాని , కొన్నిఎముకల పటుత్వం పై ప్రభావం చూపే ఔషదాల వాడకం వలన కాని ఈ ఆస్టియోపొరాసిస్ కలుగవచ్చు కూడా.

ఆస్టియోపొరాసిస్ గర్భధారణ సమయం లో?

ఆస్టియోపొరాసిస్ గర్భధారణ సమయం లో?

గర్భధారణ సమయంలో తమకే తెలీకుండా ఆస్టియోపొరాసిస్ శరీరంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే డాక్టర్లు ఓరల్ గా కాల్షియం మరియ విటమిన్ D మందులను సూచిస్తుంటారు. వీటిని ఖచ్చితత్వంతో తీసుకొనుట మూలంగా ఆస్టియోపొరాసిస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు ఓరల్ మెడిసిన్ ద్వారా కాని ఆహరం రూపంలో కాని కాల్షియం మరియు విటమిన్ D లని శరీరానికి ఇవ్వవలసి ఉంటుంది. శరీరంలో ఆ ఖనిజాలు నిష్పత్తి తక్కువ అయినప్పుడు పాలు తయారవ్వడానికి ఎముకల నుండి ఈ ఖనిజాలను సేకరించవలసిన అవసరం శరీరం పై పడుతుంది. తద్వారా ఆస్టియోపొరాసిస్ వచ్చే అవకాశo ఉంది.

English summary

International Women's Day: Why Are Women More Prone To Osteoporosis

According to the International Osteoporosis Foundation, it is estimated that osteoporosis affects about 200 million women worldwide! Women have an increased risk of being affected by osteoporosis because they have small and thin bones, due to certain eating disorders, low bone density, low levels of oestrogen, etc.
Story first published: Thursday, March 8, 2018, 12:00 [IST]