అరటిపండు పరగడుపున తింటే ఏమైతుందో తెలుసా? అరటిపండుతో ఆరోగ్య ప్రయోజనాలు

కొందరు నైట్ బాగా డ్రింక్ చేసి ఉదయమే తలనొప్పితో అల్లాడిపోతుంటారు. అలాంటి వారు అరటిపండు, తేనేతో కలిసి ఒక స్మూత్ ను తయారు చేసుకుని తాగండి. కొద్దిసేపట్లోనే మీకు ఉపశమనం లభిస్తుంది.

అరటి పండు ద్వారా చాలా లాభాలుంటాని మనందరికీ తెలిసిందే. చాలా మంది అన్నం తిన్న తర్వాత అరటిపండు తింటూ ఉంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదే. దీని వల్ల బాడీకి కావాల్సిన ఐరన్ అందుతుంది.

చాలా మంది క్రీడాకారులు రోజూ అరటిపండ్లు తింటూ ఉంటారు. బాడీ ఫిట్ నెస్ ను మెయింటెన్ చేసేవారంతా కూడా అరటిపండ్లకే ప్రాధాన్యం ఇస్తారు. రోజూ మూడునాలుగు అరటిపండ్లు తినడం మంచిదే.

పొటాషియం

పొటాషియం

అరటిపండ్ల వల్ల బాడీకి పొటాషియం బాగా అందుతోంది. ఉదయం టిఫిన్ చేసేటప్పుడు లేదంటే ఒకటి, మధ్యాహ్నం అన్నం తిర్వాత ఒకటి, రాత్రి అన్నం తినేటప్పుడు ఒక అరటిపండు తింటే మంచిది.

మూడుపూటల తింటే

మూడుపూటల తింటే

ఇలా రోజూ మూడుపూటల అరటిపండ్లు తింటే గుండె సంబంధింత వ్యాధుల బారిన అస్సలు పడరు. అరటి పండ్లు రోజూ తింటే ఎముకలు గట్టిగా మారుతాయి.

మీ మైండ్ బాగా పని చేసేలా

మీ మైండ్ బాగా పని చేసేలా

అరటి పండ్ల వల్ల మెదడు కూడా బాగా పని చేస్తుంది. అందులోని సెరటోనిన్ మీ మైండ్ బాగా పని చేసేలా చేస్తుంది. రోజూ అరటిపండ్లు తింటే మీరు మానసికంగా కూడా బలంగా ఉండగలుగుతారు. జ్ఞాపకశక్తి పెరిగేందుకు అరటిపండ్లు బాగా ఉపయోగపడతాయి.

రక్తహీనత

రక్తహీనత

కొందరు రక్తహీనత వల్ల బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రోజూ ఒక అరటిపండు తింటే మంచిది. దీంతో రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది.

మలబద్దకం

మలబద్దకం

మలబద్దకం సమస్య ఉన్నవాళ్లు అరటిపండ్లను తింటే చాలా మంచిది. మీరూ ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు. రోజూ అరటిపండ్లు తినండి చాలు. ఆటోమేటిక్ గా మీ మలబద్దకం సమస్య పోతుంది.

నైట్ బాగా డ్రింక్ చేసి

నైట్ బాగా డ్రింక్ చేసి

కొందరు నైట్ బాగా డ్రింక్ చేసి ఉదయమే తలనొప్పితో అల్లాడిపోతుంటారు. అలాంటి వారు అరటిపండు, తేనేతో కలిసి ఒక స్మూత్ ను తయారు చేసుకుని తాగండి. కొద్దిసేపట్లోనే మీకు ఉపశమనం లభిస్తుంది.

పరగడుపున వద్దు

పరగడుపున వద్దు

అయితే పరగడుపున ఓన్లీ అరటి పండు తినకూడదు. అరటిలో మెగ్నీషియం బాగా ఉంటుంది. దీంతో ఉదయం పరగడుపునే మీరు అరటి పండు అస్సలు తినకండి. మార్నింగ్ మెగ్నిషియం బాడీకి అందండం మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరగడుపున అరటిపండు తినకండి. అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది.

Desktop Bottom Promotion