For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిర్ధారణ జరగని మధుమేహాన్ని గుర్తించడానికి 10 సంకేతాలు

By Telugu Samhitha
|

డయాబెటిస్, ఇప్పుడు దశాబ్దాలుగా ప్రపంచ మానవ ఆరోగ్యంపై తన ప్రభావాన్ని విస్తరిస్తోంది.

ఇన్సులిన్‍‍ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ సామర్థ్యాన్ని నాశనం చేసే ఒక స్వయం ప్రతిరక్షక పరిస్థితిగా ఇది మొదలైంది. ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా ఒక అంటువ్యాధిలా విస్తరించి పెద్దవాళ్ళని ఆసుపత్రి పడకలకు పరిమితం చేస్తోంది. అంతేకాకుండా వాస్తవానికి ఆటో ఇమ్యూన్ మొదటి రకం డయాబెటిస్ బారిన ఒక్కసారి పడ్డ పిల్లలు ప్రస్తుతం ఈ వ్యాధి యొక్క రెండవ రకమునకు సంభందించిన భయంకర జీవనశైలికి ఎరగా మారుతున్నారు.

ఈ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందే అప్రమత్తత రేటును అనుసరించి ఇవ్వబడిన గణాంకాలు మన మధ్య నడుస్తున్న ప్రజలు సగటున మధుమేహంతో బాధపడుతున్నట్లు వాళ్ళకే తెలీదు అనే ఖచ్చితమైన దృగ్విషయాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

మీరు వారిలో ఒకరిగా ఉన్నారా? ఈ 10 లక్షణాలుతో నిర్ధారణ జరగని మధుమేహాన్ని గుర్తించండి.

1. మీరు చాలా తరచుగా మూత్రానికి వెళ్తున్నారా... రాత్రి సమయంలో కూడా

1. మీరు చాలా తరచుగా మూత్రానికి వెళ్తున్నారా... రాత్రి సమయంలో కూడా

మీ రక్తం పెద్ద మొత్తంలో చక్కెరను మోస్తున్నప్పుడు మీ శరీరం వెంటనే మూత్రపిండాలు ద్వారా దాన్ని ఫిల్టర్ చేయడానికి సిద్ధం అవుతుంది. చక్కరను విచ్చిన్నం చేయడానికి చాలా ఎక్కువ నీరు అవసరం కాబట్టి ఇది మీ శరీరం నుండి నీటిని లాగేస్తుంది.

అందువల్ల మధుమేహం యొక్క ప్రారంభ దశలో ఉన్నవారు మధ్య రాత్రిలో కూడా చాలా తరచుగా ఇది వరకు లేని విధంగా మూత్రానికి వెళ్తూ ఉన్నట్లు ఫిర్యాదులు చేస్తుంటారు.

2. మీరు అన్ని సమయాల్లోనూ దాహాన్ని కలిగి ఉండటం.

2. మీరు అన్ని సమయాల్లోనూ దాహాన్ని కలిగి ఉండటం.

శరీరం రక్తంలో చక్కెరను వదిలించుకోవడానికి చాలా ఎక్కువ నీటిని ఉపయోగించి మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపిస్తుంది. నిర్జలీకరణ(Dehydration) మధుమేహం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య. అందువలన దాహం వెనుక ఎటువంటి కారణం లేకుండా (మీరు ఆడుతున్నప్పుడు లేదా ఎండలో ఉండటం వంటివి) అన్ని సమయాల్లోనూ అధికమైన దాహాన్ని కలిగి ఉండే ఈ స్థితి అధిక మూత్ర విసర్జనతో అనుసంధానించబడుతుంది. అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు బహుశా మీరు డయాబెటీస్ కలిగి ఉంటారు.

3. మీరు అస్తవ్యస్తమైన శ్వాసని కలిగి ఉండడటం.

3. మీరు అస్తవ్యస్తమైన శ్వాసని కలిగి ఉండడటం.

మీ శరీరం రక్తంలోని చక్కెరని శక్తి అవసరాలకు ఇంధనంగా ఉపయోగించలేనప్పుడు దానికి బదులుగా కొవ్వులని విచ్చిన్నం చేయడం ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియను కెటోసిస్ అని పిలుస్తారు. కెటోన్‌ల ( ద్వికర్బన పదార్ధాల) ఉత్పత్తికి దారితీస్తుంది. ఈ కెటోన్లు సులభంగా ఊపిరితిత్తుల లోనికి ఊరటం వలన ఇది అస్తవ్యస్తమైన శ్వాసకి కారణం అవుతుంది.

దానితో పాటుగా ఈ నిర్జలీకరణము (dehydration) నోరు పొడిబారిపోవడానికి దారితీస్తుంది. ఇది కూడా శ్వాస అస్తవ్యస్తతకు ఒక ప్రధాన కారణం.

4. మీరు అన్ని సమయాల్లోనూ ఆకలిగా ఉండటం.

4. మీరు అన్ని సమయాల్లోనూ ఆకలిగా ఉండటం.

మీ శరీరం రక్తంలోని చక్కెరని ఉపయోగించలేనప్పుడు (ఇన్సులిన్ నిరోధక రెండవ రకం డయాబెటిస్ కారణంగా) ఇది మీ మెదడుకు పనిని కొనసాగించడానికి ఇంధనం అవసరం అని సిగ్నల్‌ను ఇస్తుంది, తద్వారా మీ శరీరానికి అవసరమయ్యే ఇంధనాన్ని సమకూర్చడానికి ఒక స్థిరమైన ఆకలి ఉండే స్థితికి ఇది దారితీస్తుంది.

5. మీ కంటి చూపు అస్పష్టంగా, మసకగా ఉన్నట్లయితే.

5. మీ కంటి చూపు అస్పష్టంగా, మసకగా ఉన్నట్లయితే.

సాధారణంగా డయాబెటిస్‌తో బాధపడుతున్న మహిళలు మరియు ఇప్పటి వరకు నిర్ధారణ చేయబడనటువంటి వాళ్ళకు ఈ ద్రవం కళ్లలోకి ప్రవేశించినప్పుడు వివిధ దృష్టి లోపాలకు దారితీస్తుంది.

మీ రక్తంలో చక్కెరని తిరిగి సాధారణ స్థాయికి తీసుకురావడం ద్వారా మీరు ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

6. తరచుగా మీ అరిచేతులు మరియు పాదాలు మీద సూదులతో పొడిచినట్లు అనుభూతి పొందుతున్నారా?

6. తరచుగా మీ అరిచేతులు మరియు పాదాలు మీద సూదులతో పొడిచినట్లు అనుభూతి పొందుతున్నారా?

డయాబెటిక్ న్యూరోపతి అనేది 2వ రకం మధుమేహం యొక్క సాధారణ లక్షణం. ఇందులో మీ రక్త నాళాలలో ప్రేరేపించబడిన నిర్మాణ మార్పులు కారణంగా మీ అంత్య భాగాలకు (క్రింది అవయవ భాగాలకు) రక్త సరఫరా తగ్గిపోతుంది.

ఈ కారణంగా నిర్ధారణ కానటువంటి మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు తరచూ వారి చేతులు మరియు పాదాలలో సూదులతో పొడుస్తున్నట్లు తీవ్రమైన బాధని పొందుతారు. అంతేకాకుండా క్రింది అవయవ భాగాలు చల్లగా మారి తిమ్మిర్లు పడుతున్నట్లు తరచుగా ఫిర్యాదు చేస్తారు.

7. మీ పాదాలకి సోకిన గాయం నయం కాని పుండుగా మారినప్పుడు.

7. మీ పాదాలకి సోకిన గాయం నయం కాని పుండుగా మారినప్పుడు.

ఒక నయం కానటువంటి మొండి వ్రణం (ulcerated) పుండు ఉనికి మీ పాదాల మీద కనిపించడం మీరు డయాబెటిస్ కలిగి ఉన్నారు అని చెప్పడానికి ఒక పెద్ద సంకేతం.

మీ సిరల్లో ఆమ్లజని రహిత రక్తంని వేగంగా బయటకు తరలించడాన్ని నిరోధించడం వలన క్రింది అవయవ భాగాలకు తగ్గిన రక్త సరఫరా వలన ఇది సంభవిస్తుంది. అందువలన ద్రవం నిలుపుదల (ఎ.కె.ఎ ఎడెమా) మరియు పూతలకి దారితీస్తుంది.

మరియు గుర్తించని మధుమేహం కలిగిన వారి రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నందున, వారి బాహ్య గాయాలు చక్కెరను తినే సూక్ష్మజీవుల ద్వారా నయంకాని పుండుగా మారుతాయి.

8. అప్రయత్నంగా మీ బరువుని కోల్పోవడం.

8. అప్రయత్నంగా మీ బరువుని కోల్పోవడం.

డయాబెటిస్ మీ శరీరం శక్తి కోసం మీ రక్తంలో చక్కెరను ఉపయోగించకుండా నిరోధిస్తుంది. అందుచేత మీ శరీరం శక్తిని పొందడానికి నిల్వ ఉన్న కొవ్వులను మరియు కండరాలను విచ్చిన్నం చేయడం ప్రారంభిస్తుంది.

కనుక 6 నెలల వ్యవధిలో మీ శరీర బరువులో 10% వరకు ఎటువంటి ఆహార నిబద్ధత లేదా వ్యాయామ ప్రమేయం లేకుండా కోల్పోయినట్లయితే మరియు మీరు పైన పేర్కొన్న లక్షణాల్లో కొన్నింటిని లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలను కలిగి ఉంటే బహుషా మీరు డయాబెటిస్ కలిగి ఉండవచ్చు.

9. మీరు అన్ని సమయాల్లోనూ అలసటని పొందుతున్నారా .

9. మీరు అన్ని సమయాల్లోనూ అలసటని పొందుతున్నారా .

పూర్తి 8 గంటలు నిద్రిస్తున్న తర్వాత కూడా అలసటగా ఉంటున్నారా? మూడు మెట్లను ఎక్కడానికి కూడా అలసిపోతున్నారా? మీరు ఈ జాబితాలో ఇతర లక్షణాలతో పాటు ఈ లక్షణాన్ని కలిగి ఉంటే మీకు మధుమేహం ఉండవచ్చు.

డయాబెటిక్స్ తరచూ అలసటని కలిగిస్తుంది. ఎందుకంటే వారి శరీరం శక్తి కోసం రక్తంలో గ్లూకోజ్‌ను ఉపయోగించలేదు. అందుచేత ఒక వేళ మీరు ఈ విధంగా బావిస్తే మీకు మీరుగా ఒకసారి చెక్ చేసుకోండి.

10. మీ మెడ మరియు చంకలు నలుపుగా మారుతున్నయా?

10. మీ మెడ మరియు చంకలు నలుపుగా మారుతున్నయా?

మీ మెడ మరియు చంకలు అకస్మాత్తుగా సూర్యరశ్మి లేకుండా మీ శరీరం యొక్క మిగిలిన భాగాల కంటే నలుపుగా మారితే ఇది ఇన్సులిన్ నిరోధకత యొక్క ప్రారంభ సంకేతం, కనుక (2వ రకం డయాబెటిస్) మధుమేహం ఉండవచ్చు.

వాస్తవానికి సాధారాణంగా పురుషులలో కంటే స్త్రీలలో ఈ సంకేతం ఎక్కువగా కనిపిస్తుంది.

English summary

10 Signs You Have Undiagnosed Diabetes

10 Signs You Have Undiagnosed Diabetes,With the diabetes epidemic reaching a crescendo, it pays to know if you are showing signs of undiagnosed diabetes. Signs like perpetual fatigue, hunger, thirst, and pins and needles in extremities, along with an uncontrollable urge to urinate frequently and develop non-healing ulc
Desktop Bottom Promotion