For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీటిని పచ్చిగా తింటే అంతే సంగతే

ఈ రోజుల్లో నిజంగానే పచ్చికూరలు... మొలకెత్తిన ధాన్యాలు తినడం ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. అయితే అందరూ వీటిని తినవచ్చా ? ముమ్మాటికీ తినకూడదు ఎందుకనీ ? అంటే అందుకు చాలా కారణాలున్నాయి.

|

ఈ రోజుల్లో నిజంగానే పచ్చికూరలు... మొలకెత్తిన ధాన్యాలు తినడం ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. అయితే అందరూ వీటిని తినవచ్చా ? ముమ్మాటికీ తినకూడదు ఎందుకనీ ? అంటే అందుకు చాలా కారణాలున్నాయి. కూరలును వండటం వల్ల అందులో పోషకాలు తగ్గుతాయన్నది అందరికీ తెలిసిన సత్యమే, ఎంతవరకు తగ్గుతాయన్నది. వండే విధానం మీద ఆధారపడి వుంటుంది. అసలీ వండటమనే ప్రక్రియ ప్రాధానోద్దేశం రుచికరమైన ఆహారం మాత్రం కాదు మరి.

పోషకాలు సరిగ్గా అందవు

పోషకాలు సరిగ్గా అందవు

ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేందుకు సురక్షితంగా ఉండేందుకు అయితే రానురాను రుచులు పెరిగి వండటం అనేది సంక్షిప్త విధానంగా మారింది. ఆహారం రంగు, రుచి, వాసన ఆకర్షణీయంగా ఉండేందుకు వండేటపుడు చేర్చే పధార్థాల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఎక్కువగా నూనెతో వేయించడం వల్ల రిఫైన్డ్ పధార్థాలను వాడటం వల్ల ఆయా పధార్థాల నుంచి శరీరానికి అందాల్సిన పోషకాలు సరిగా అందడంలేదు. లాభాలేంటి ? ప్రాసెస్ చేయని, వండని ఆహారమేదైనా వచ్చి ఆహారం కిందే లెక్క తాజా కూరగాయలు, పండ్లు, గింజలు, డ్రైప్రూట్స్, ఇవన్నీ వచ్చి ఆహారమే కదా, మన ఆహారంలో కనీసం 45 శాతం ఇలాంటిది ఉండవచ్చు.

పరిమితంగా తీసుకుంటే

పరిమితంగా తీసుకుంటే

పచ్చి ఆహార పధార్థాలను పరిమితంగా తీసుకుంటే ఏమౌతుందంటే... 1.శక్తి పొందుతుంది. 2. చర్మం కాంతిలీనుతుంది. 3. జీర్ణప్రక్రియ మెరుగవుతుంది 4. బరువు తగ్గుతారు. 5.గుండెజబ్బులోచ్చే ప్రమాదం తగ్గుతుంది. జాగ్రత్తలూ అవసరం పచ్చివి తినమన్నారు కదాని ఎలా పడితే అలా తినేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అచ్చంగా పచ్చివే తిన్నా మళ్లీ పోషకాలు సరిపోవు, అందువల్ల పరిమితంగానే వీటిని తీసుకోవాలి. అదీ తగిన జాగ్రత్తతో...

కూరగాయల పాత్ర అమోఘం

కూరగాయల పాత్ర అమోఘం

మన శరీరానికి ఆరోగ్యాన్ని, పోషణను అందించడంలో కూరగాయల పాత్ర అమోఘమైంది. వాటిల్లో మనకు కావల్సిన ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. అవి మనకు పోషణను అందిస్తాయి. అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి. అయితే ఏ కూరగాయల్లో దేన్నయినా చాలా వరకు మనం ఉడకబెట్టుకునే తింటాం. కానీ కొన్నింటిని మాత్రం పచ్చిగా తినవచ్చు. అయితే పలు రకాల కూరగాయలను మాత్రం పచ్చిగా తినరాదు. ఉడికించుకునే తినాలి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలుగడ్డలు

ఆలుగడ్డలు

ఆలుగడ్డలను పచ్చిగా ఉన్నప్పుడు తినరాదు. ఉడకబెట్టుకుని తినాలి. లేదంటే వాటిల్లో ఉండే పిండి పదార్థాలు ఒక పట్టాన జీర్ణం కావు. దీంతో గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. అలాగే పచ్చి ఆలుగడ్డలను తింటే కొన్ని సార్లు వాటిల్లో ఉండే సొలనైన్ అనే సమ్మేళనం విషంగా మారుతుంది. అది ప్రాణాలకు ప్రమాదాన్ని కలగజేస్తుంది. కనుక ఆలుగడ్డలను కచ్చితంగా ఉడికించే తినాలి.

పుట్ట గొడుగులు

పుట్ట గొడుగులు

పుట్ట గొడుగులను కొందరు పచ్చిగా కూడా తింటారు. కానీ అలా తినడం మంచిది కాదు. అలా తింటే అవి జీర్ణవ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తాయి. దీంతోపాటు వాటిల్లో ఉండే ప్రమాదకరమైన సమ్మేళనాలను మనకు ప్రాణాపాయ స్థితిని కలగజేస్తాయి. కనుక వీటిని కూడా బాగా ఉడికించే తినాలి.

వంకాయలు

వంకాయలు

వీటిల్లోనూ సొలనైన్ అనే సమ్మేళనం ఉంటుంది. కనుక వంకాయలను కూడా పచ్చిగా తినరాదు. అవి శరీరంలోకి విష పదార్థాలను విడుదల చేస్తాయి. అందువల్ల వంకాయలను బాగా ఉడికించి మాత్రమే తినాలి.

మొలకెత్తిన విత్తనాలు

మొలకెత్తిన విత్తనాలు

మొలకెత్తిన విత్తనాలతో చాలా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. కానీ కొందరు వీటిని పచ్చిగానే తింటారు. అలా తినరాదు. తింటే వాటిల్లో ఉండే రసాయనాలు జీర్ణ సమస్యలను కలగజేస్తాయి. కనుక వీటిని ఉడకబెట్టుకుని తినాలి.

కాలిఫ్లవర్, పాలకూర

కాలిఫ్లవర్, పాలకూర

కాలిఫ్లవర్, పాలకూరలను కూడా ఉడికించే తినాలి. లేదంటే జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పాలకూరను ఉడికించి తింటే అందులో ఐరన్, మెగ్నిషియం తదితర పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. కనుక వీటిని ఉడకబెట్టుకుని తినడమే ఉత్తమం.

పోషకాలు మాయం

పోషకాలు మాయం

ఇక కొన్ని కూరగాయాలను పచ్చిగా తింటే కూడా మంచి లాభాలుంటాయి. కష్టమైనా సరే పచ్చి కూరగాయలే బెటర్‌ అన్నది ‘పచ్చి' నిజం.

మార్కెట్లో కూరగాయలు కొనగానే వేడి వేడి నూనెలో కారం, ఉప్పు, మసాలా దట్టించి వేయించడం అప్పుడప్పుడు మానేయాలని నిపుణులు అంటున్నారు.

కూరగాయలు, ఆకుకూరల్లో ఉండే సి-విటమిన్‌, కీలకమైన ఎంజైమ్స్‌ ఆహారం అరుగుదలకు ఎంతో ఉపయోగపతాయి. అయితే కూరగాయలను వేడిచేస్తే ఇటువంటి పోషకాలు మాయమైపోతాయి.

స్టీమ్‌ చేసుకోండి

స్టీమ్‌ చేసుకోండి

కూరగాయలను వేయించడం ఒక్కటే మార్గమా కాదు....ఇంకో దారి కూడా ఉంది. ఉడకబెట్టండి. అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతతో, నీళ్లతో కూరగాయలను చాలా లైట్‌ స్టీమ్‌లో వంట చేయాలి.అలాగే కూరగాయలతో వంట చేశాక, మిగిలిన నీళ్లలో బోల్డెన్ని పోషకాలు ఉంటాయి. ఈ నీళ్లతో మాంసం సూప్‌ చేసుకోవచ్చు. అలాగే నూడుల్స్‌నూ వండుకోవచ్చు.

 క్యాన్సర్‌కు చెక్‌

క్యాన్సర్‌కు చెక్‌

పచ్చి ఆకుకూరల్లో మైరోసినేజ్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. క్యాన్సర్‌ కారకాలైన కార్సినోజెన్స్‌కు ఈ ఎంజైమ్‌ చెక్‌ చెబుతుంది.

మెదడుకు రక్ష

మెదడుకు రక్ష

టమాటాల్లో ఉండే లైకోపిన్‌ అనే పిగ్మెంట్‌ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా గుండెను అన్ని రకాల వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది.వీటిలో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌ వల్ల ఎర్ర రక్త కణాలు అభివృద్ధి చెందడమే కాకుండా మెదడు, నాడీ వ్యవస్థలపై మంచి ప్రభావం చూపుతుంది.

English summary

these veggies you shouldnt eat raw

these veggies you shouldnt eat raw
Desktop Bottom Promotion