జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి, ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి పసుపు ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

జ్ఞాపకశక్తి పెరగటానికి, ఆలోచన విధానం మెరుగుపడటానికి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. అది ఎలానో తెలుసుకోవాలంటే ఒకసారి మీరు ఈ వ్యాసాన్ని చదవండి. సాధారణంగా భారతీయ వంటలన్నింటిల్లో పసుపు ఎక్కువగా వాడుతుంటారు. పసుపు వల్ల అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పసుపు జ్ఞాపకశక్తిని పెంచుతుంది మరియు తేలికపాటిగా అవ్యవహరించేవారికి, వయస్సు రీత్యా జ్ఞాపకశక్తి తగ్గిపోయే వ్యక్తులకు, అలా జరగకుండా వారి యొక్క స్థితిని మెరుగుపరుస్తుంది. అమెరికాకు చెందిన ఒక ప్రఖ్యాత సంస్థ ఒక పెద్ద పరిశోధన చేపట్టింది. ఆ పరిశోధనలో కుర్కుమిన్ మెదడు యొక్క పనితీరు పై ఎలా ప్రభావం చూపుతుంది మరియు చిత్త వైకల్యం రాకుండా ఎలా నిరోధిస్తుంది అనే విషయాలతో పాటు, అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వ్యక్తుల యొక్కమెదడులో కంటికి కనపడని ఫలకాలు మరియు ఏర్పడ్డ దూరం వల్ల కలిగే సంభావ్య ప్రభావం ఎలా ఉంది అనే విషయాన్ని అధ్యయనం చేయడం జరిగింది.

Use Turmeric To Improve Your Memory And Mood

పసుపులో కుర్కుమిన్ అనే పదార్ధం ఉంటుంది. దీనికి కాలిన గాయాలను మాన్పించే శక్తి ఉంది మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇందుచేతనే భారతదేశంలో ఉండే వృద్ధుల్లో అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు తక్కువగా ఉన్నాయని మరియు అభిజ్ఞ ప్రదర్శన కూడా బాగుందని గుర్తించారు.

Use Turmeric To Improve Your Memory And Mood

" కుర్కుమిన్ ఎలా తన ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయం ఎవరికీ సరిగ్గా తెలియదు. కానీ, మెదడులో ఉండే మంటను తగ్గించే సమర్ధత దీనికి ఎక్కువగా ఉందని గుర్తించారు. ఈ మంటకు, అల్జీమర్స్ వ్యాధికి మరియు ఎక్కువ ఒత్తిడికి సంబంధం ఉందని " అమెరికాకు చెందిన ప్రఖ్యాత పరిశోధకులు చెబుతున్నారు.

Use Turmeric To Improve Your Memory And Mood

ఈ మొత్తం అధ్యయనానికి 50 నుండి 90 సంవత్సరాల వయస్సులో ఉండి, కొద్దిగా జ్ఞాపకశక్తి పై పిర్యాదులుచేసే 40 మంది పెద్దలను తీసుకోవడం జరిగింది. ఇందులో పాల్గొన్నవారందరికి అప్పుడప్పు ప్లాసిబో కానీ లేదా 90 మిల్లి గ్రాముల కుర్కుమిన్ ని రోజుకు రెండు సార్లు 18 నెలల పాటు ఇవ్వడం జరిగింది. వ్యక్తులు ఎవరైతే కుర్కుమిన్ స్వీకరించడం జరిగిందో, వారిలో జ్ఞాపకశక్తి మరియు దృష్టిని కేంద్రీకరించే సామర్థ్యం గణనీయంగా పెరిగిందని గుర్తించారు. కానీ, అదే సమయంలో ప్లాసిబో తీసుకున్నవారిలో ఎటువంటి మార్పు లేదు.

English summary

Use Turmeric To Improve Your Memory And Mood

Turmeric, a common ingredient in Indian cuisine, may lower the risk of Alzheimer's disease by improving memory and mood in people with mild, age-related memory loss.
Story first published: Thursday, February 15, 2018, 10:30 [IST]
Subscribe Newsletter