For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాల్షియం ఎముకలకే కాదు.. ఇంకా చాలా వాటికి అవసరం.. అది బాడీలో లేకుంటా అవన్నీ వీక్ అవుతాయి జాగ్రత్త

మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాల్లో క్యాల్షియం కూడా ఒకటని అందరికీ తెలిసిందే. క్యాల్షియం మన శరీరంలో ఎముకలను దృఢంగా చేస్తుంది.క్యాల్షియం ఉపయోగాలు, క్యాల్షియం ప్రయోజనాలు, క్యాల్షియం లభించే ఆహారాలు

|

మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాల్లో క్యాల్షియం కూడా ఒకటని అందరికీ తెలిసిందే. క్యాల్షియం మన శరీరంలో ఎముకలను దృఢంగా చేస్తుందని కూడా తెలుసు. కానీ క్యాల్షియం అంటే కేవలం ఎముకలకే బలాన్నిస్తుందని అందరూ అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. నిజానికి క్యాల్షియం ఇంకా ఎన్నో పనులను చేస్తుంది. ఈ క్రమంలోనే అసలు క్యాల్షియం వల్ల మనకు ఇంకా ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అదుపులో రక్తపోటు

అదుపులో రక్తపోటు

క్యాల్షియం ఉన్న ఆహారాన్ని రోజూ తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నిత్యం క్యాల్షియం ఉన్న ఆహారాన్ని తగినంత తీసుకుంటే బీపీని కంట్రోల్ చేయవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలోనూ క్యాల్షియం కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

కిడ్నీ స్టోన్లు

కిడ్నీ స్టోన్లు

శరీరంలో క్యాల్షియం ఎక్కువగా ఉంటే కిడ్నీ స్టోన్లు వస్తాయన్న మాట నిజమే. అయితే క్యాల్షియం మరీ తక్కువగా ఉన్నా కిడ్నీ స్టోన్లు వస్తాయి. అంటే.. ఈ పోషకాన్ని ఎంత మోతాదులో కావాలో అంతే మోతాదులో తీసుకోవాలి. మోతాదు మించకూడదు.

కీళ్ల నొప్పుల సమస్య ఉండదు

కీళ్ల నొప్పుల సమస్య ఉండదు

స్త్రీలకు రుతు సమయంలో వచ్చే వెన్ను నొప్పి, చిరాకు, కోపం, ఆందోళన తదితర సమస్యలను అధిగమించాలంటే క్యాల్షియం ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. క్యాల్షియం ఉన్న ఆహారాన్ని రోజూ తీసుకుంటే వృద్ధాప్యం వచ్చే సరికి కీళ్ల నొప్పుల సమస్య బాధించదు.

అధిక బరువు ఉండదు

అధిక బరువు ఉండదు

నిత్యం క్యాల్షియం ఉన్న ఆహారాన్ని తీసుకుంటుంటే అధిక బరువు సమస్య దరిచేరే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.

క్యాల్షియం లోపం రాకుండా

క్యాల్షియం లోపం రాకుండా

జీడిపప్పు, మునగాకు తదితర ఆహారాలను తీసుకుంటే క్యాల్షియం లోపం రాకుండా చూసుకోవచ్చు. అలాగే ఆవాలు, ముల్లంగి, మునగకాయలు, కరివేపాకు, సోయా, నారింజ, క్యాబేజీ, కొబ్బరి, బాదం పప్పులను తరచూ ఆహారంలో తీసుకుంటున్నా క్యాల్షియం లోపాన్ని సరిచేయవచ్చు.

అత్తిపండ్లు (ఫిగ్స్‌) తింటే

అత్తిపండ్లు (ఫిగ్స్‌) తింటే

రోజూ గ్లాసు పాల కన్నా అత్తిపండ్లు (ఫిగ్స్‌) తిని చూడండి. ఒక కప్పు ఎండు అత్తిపండ్లతో పాలతో సమానంగా క్యాల్షియం లభిస్తుంది. పైగా వీటిల్లో పీచు కూడా దండిగా ఉంటుంది. అలాగని మరీ ఎక్కువగా లాగించేయకండి. ఎందుకంటే వీటిల్లో చక్కెర, కేలరీలు కూడా దండిగా ఉంటాయి.

తమలపాకు

తమలపాకు

తమలపాకుతో సున్నం కలిపి వేసుకుంటే శరీరంలో కాల్షియం సమపాళ్ళలో ఉండేలా చూస్తుంది. మరియు ఎముకలు అరిగిపోకుండా చూస్తుంది. బాలెంతలు తాంబూలం వేసుకుంటే ఎంతో మంచిది. వక్క, తమలపాకు మరియు సున్నం రెండింటినీ అనుసంధానం చేసి శరీరంలో వేడి పెరగకుండా సమతుల్యం చేస్తుంది.

పెరుగు, మజ్జిగా

పెరుగు, మజ్జిగా

క్యాల్షియం లోపం లేకుండా ఉండాలంటే... రెగ్యులర్‌గా వీటిని ఆహారంలో చేర్చుకోండి. డైరీ ప్రొడక్ట్స్‌లో అధిక శాతంలో క్యాల్షియం ఉంటుంది. సాధారణంగా పాలు తీసుకొనే కంటే పెరుగు, మజ్జిగా తీసుకోవడం చాలా మంచిది. ఒక గ్లాసు పాలలోకంటే గుప్పెడు నువ్వుల్లో ఎక్కువ క్యాల్షియం ఉంటుంది. నువ్వుల్లో అధికంగా ఉన్న జింక్‌ ఎముకల మినరల్స్‌ సాంద్రతను పెంచుతుంది.

పాలకూరలో

పాలకూరలో

ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూరలో క్యాల్షియంఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. తల్లి నుంచి రక్తం బిడ్డవైపుకు ప్రసరిస్తుంది కాబట్టి, ఆకు కూరలను తినడం వల్ల తల్లికి సరిపడా రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది.

చిక్కుళ్లలో

చిక్కుళ్లలో

చిక్కుళ్లలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. బాగా ఉడికించిన బెండకాయల్లో సైతం క్యాల్షియం అధికంగా ఉంటుంది. సంత్రాల్లోనూ క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.వీటిని డైరెక్టుగా తినేయొచ్చు. లేదంటే జ్యూస్‌లుగానో, సలాడ్స్‌గానో చేసి తీసుకోవచ్చు.

ఆస్పరాగస్‌

ఆస్పరాగస్‌

'డి' విటమిన్‌ వల్లే మన శరీరంలో క్యాల్షియం ఉత్పత్తి అవుతుందని. ఆస్పరాగస్‌ లో 'డి' విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే ఆరోమాటిక్‌ ఫ్లేవర్‌ మార్నింగ్‌ సిక్‌ నెస్‌ ను పోగొడుతుంది.

సాల్మన్‌, టునా, క్యాట్‌ ఫిష్‌

సాల్మన్‌, టునా, క్యాట్‌ ఫిష్‌

సీ ఫిష్‌లో సాల్మన్‌, టునా, క్యాట్‌ ఫిష్‌లో విటమిన్‌ 'డి' మాత్రమే కాదు కాల్షియం, ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్‌ కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి చేపలు తినడం మంచిది. రొయ్యలు, పీతల్లో సైతం క్యాల్షియం ఉంటుంది.

బ్లాక్‌బెర్రీస్‌, స్ట్రాబెర్రీస్‌, రస్‌బెర్రీస్‌.. మూడింటిలోనూ క్యాల్షియం ఉంటుంది. కర్జూర పండ్లు, కిస్‌మిస్‌ల్లో కూడా క్యాల్షియం కావాల్సినంత లభిస్తుంది.

విటమిన్‌ - డి సప్లిమెంట్లు

విటమిన్‌ - డి సప్లిమెంట్లు

ఇక వయోవృద్దుల్ని చూడగానే చాలా మంది క్యాల్షియం, విటమిన్‌ - డి సప్లిమెంట్లు తీసుకోమంటూ సలహా ఇచ్చేస్తుంటారు. ఇవి ఎముకల ఆరోగ్యాన్నీ, దృఢత్వాన్నీ కాపాడతాయని, ఎమకలు విరిగిపోకుండా నిలబెడతాయనేది వారి అభిప్రాయం. అయితే, ఈ విషయమై ఇటీవల జరిగిన చైనా పరిశోధకుల అధ్యయనంలో ఈ సప్లిమెంట్ల వల్ల ఏ ప్రయోజనమూ లేదని బయటపడింది.

ఏమీ తగ్గలేదని తేలిపోయింది

ఏమీ తగ్గలేదని తేలిపోయింది

కొంత మందికి సప్లిమెంట్లు, మరికొందరికి ప్లేస్‌బోలు ఇచ్చి చూస్తే, మాత్రలు వేసుకున్న వారి ఎముకలు విరిగే ప్రమాదం ఏమీ తగ్గలేదని తేలిపోయింది. కాకపోతే, ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం, విటమిన్‌ - డి తప్పని సరి అనేది ఎవరూ కొదవలేని నిజం.అందువల్ల ఆ రెండింటిని ఆహార పానీయాల ద్వారా, సూర్యరశ్మి ద్వారా పొందాల్సిందే తప్ప మాత్రల ద్వారా కాదని ఆ అధ్యయనంలో స్పష్టమయ్యింది.

సూర్యరశ్మిలో

సూర్యరశ్మిలో

ఆహార పానీయాల్లో ప్రత్యేకించి పాల ఉత్పత్తుల ద్వారా కలిగే ఈ ప్రయోజనం చాలా ఎక్కువ. ఇక విటమిన్‌- డి కోసమైతే, సూర్యరశ్మిలో గడపడాన్ని మించిన మార్గమే లేదని అధ్యయనకారులు చెప్పారు. ఈ వివరాలు ‘ జర్నల్‌ ఆఫ్‌ ద అమెరికన్‌ మెడికల్‌ అసోషియేషన్‌' లో ప్రచురితమయ్యాయి.

English summary

why calcium is good for your body

why calcium is good for your body
Story first published:Tuesday, May 29, 2018, 11:32 [IST]
Desktop Bottom Promotion