For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మహిళలతో పోలిస్తే పురుషులలోనే అధికంగా పని ఒత్తిడి ప్రభావం. క్రమంగా గుండె మరియు మధుమేహ సమస్యలు కూడా

  |

  మహిళలతో పోలిస్తే పురుషులలోనే అధికంగా పని ఒత్తిడి ప్రభావం. క్రమంగా గుండె మరియు మధుమేహ సమస్యలు కూడా

  మీ ఉద్యోగం మీ మరణానికి కారణం అవుతుందా? శాస్త్ర సాంకేతికపరంగా కాదు కానీ, అధిక పని ఒత్తిడి, క్రమంగా మానసిక ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఎప్పటికైనా ప్రాణాంతకమే అవుతుంది. ఈ ఆధునిక ప్రపంచంలో పని ఒత్తిడి ఒక కిల్లర్ గా ఉంది అనడంలో ఆశ్చర్యమే లేదు.

  అందరికీ ఈ పని ఒత్తిడి పర్యవసానాలు మరియు కారణాల గురించి తెలుసు. కానీ ఒత్తిడి మనల్ని మానసికంగానే కాకుండా, గుండె వ్యాధులు మరియు మధుమేహం వంటి తీవ్ర సమస్యలకు కూడా గురిచేస్తుంది. కానీ అనేక నివేదికల ప్రకారం పని ఒత్తిడి వలన ఇటువంటి సమస్యల బారిన పడేవారిలో మహిళల కంటే పురుషులే అధికులుగా ఉన్నారు.

  Work Stress Is More Fatal For Men Than Women With Heart Ailments And Diabetes

  మనం ఏదైనా పని యందు కష్టం చేస్తున్నప్పుడు శ్రమ అనేది సర్వసాధారణమైన అంశం, శ్రమ ఎక్కువ అయ్యే కొలదీ అది అధిక ఒత్తిడికి దారితీస్తుంది., కానీ, మీ అభిరుచికి తగినట్లు ఇష్టంతో పని చేయడాన్ని ఎల్లప్పుడూ స్వాగతించగలరు. మీ పని యందు ఒత్తిడిని తగ్గించడానికి వృత్తిని మీ అభిరుచిగా మార్చండి.

  పురుషులు మరియు స్త్రీలపట్ల ఒత్తిడిని పెంచే ప్రభావాల గురించిన అనేక అధ్యయనాల చివరి ఫలితాలను ఇప్పుడు చూద్దాం.

  జనాభాలో మెజారిటీని ప్రభావితం చేసే అత్యంత ఘోరమైన వ్యాధులలో డయాబెటిస్ మరియు గుండె వ్యాధులు ప్రధానంగా ఉన్నాయి. నిర్ధారణ జరిగాక, సరైన వైద్యం మరియు ఆరోగ్యంపై శ్రద్ధ ఖచ్చితంగా అవసరం. ఇటువంటి పరిస్థితులకు, ఒత్తిడి అనేది ఒక ముఖ్యమైన కారణం కూడా కావచ్చు.

  స్థిరమైన పని ఒత్తిడికి గురైన పురుషులు అకాల మరణాలకు అధికంగా గురవుతున్నారని కూడా అనేక అధ్యయనాలు వెల్లడించాయి, అయితే మహిళలకు అటువంటి నివేదికలు లేవు.

  దీనిని అడ్డుకోవాలని కోరుకుంటే, మీ పని ఒత్తిడిని తగ్గించడం లేదా మీ పని నమూనాను మార్చడం వంటి చర్యలే మీకు సహాయపడుతాయి . మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, చురుకుగా ఉన్నా సరే, ఒత్తిడి మాత్రం దాని ప్రాణాంతకమైన పాత్రను ఖచ్చితంగా పోషించగలదని పరిశోధకులు చెప్తున్నారు.

  ఇటీవలి అధ్యయనాల ప్రకారం, పురుషులు ఆరోగ్యకరమైన ఆహారం మరియు క్రియాశీల జీవనశైలిని కొనసాగించినప్పటికీ, ఒత్తిడి కారణంగా వీరి మరణాలు 6 రెట్లు పెరిగాయి. కానీ ఇదే వైద్య పరిస్థితులతో ఉన్న మహిళల్లో, అటువంటి అకాల మరణాలు సంభవించిన దాఖలాలు కనపడలేదు.

  దీనికి గల ప్రధాన కారణం ఏమిటంటే, మహిళలతో పోలిస్తే పురుషుల్లు ధమనుల గోడలు మరింత గట్టిపడడమే అని చెప్తున్నారు. సాధారణంగా మెనోపాజ్ కు ముందు దశలో మహిళల గుండె పోటుకు తక్కువ అవకాశాలు ఉంటాయి. శాస్త్రవేత్తల అభిప్రాయాల ప్రకారం, పని గంటలను తగ్గించడం ద్వారా పురుషుల జీవన పరిస్థితిని మెరుగుపరచవచ్చు.

  Work Stress Is More Fatal For Men Than Women With Heart Ailments And Diabetes

  పరిశోధనలు నిర్వహించినప్పుడు, స్ట్రోక్, డయాబెటిస్ మరియు హృదయ సంబంధమైన రోగాల వల్ల బాధపడుతున్న పురుషులలో పని ఒత్తిడి మరియు అకాల మరణాల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని తెలిసింది. కొలెస్ట్రాల్ స్థాయిని మరియు రక్తపోటుని నియంత్రించిన తర్వాత కూడా మెరుగుదల కనపడలేదు.

  పరిశోధన ప్రకారం, శాస్త్రవేత్తలు ప్రజలను ప్రభావితం చేసే రెండు రకాల పని ఒత్తిడులని కనుగొన్నారు; ఒకరు అధిక పని ఒత్తిడిని కలిగి ఉంటే, మరొకటి కష్టం – ఫలితం అసమతుల్యత. అంటే ఒక వ్యక్తి పని యందు నిబద్దతను కలిగి ఉన్నా కూడా , సరైన ఫలితాన్ని పొందలేక నిరాశతో కాలం గడపడం. ఒక్కోసారి ఈ సమస్య డిప్రెషన్ వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది.

  ఈ పరిశోధనతో, కార్డియాక్ వ్యాధితో బాధపడుతున్న మరియు అధిక పని ఒత్తిడిని కలిగి ఉన్న పురుషులు, 68 శాతం ఎక్కువగా అకాల మరణానికి గురయ్యే ప్రమాదం ఉందని తేలింది.

  కానీ “కష్టం–ఫలితం” అసమతుల్యతతో పోరాడుతూ, గుండె సంబంధిత వ్యాధులు లేని పురుషుల అకాల మరణాల రేటు కాస్త తక్కువగానే ఉంది. మహిళల్లో కూడా, ముందస్తు మరణానికి సంబంధించిన ప్రమాదాలు గుర్తించబడలేదు.

  ఒత్తిడి అనేది కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను పెంచుతుంది, ఈ హార్మోన్ స్థాయిలు ప్రాణాలకు కూడా హాని కలిగించవచ్చు. ఇది గ్లూకోజ్ ఉత్పత్తిని పెంచుతుంది మరియు ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా మధుమేహంతో భాదపడుతున్న వారు ఎక్కువ ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఒత్తిడి, రక్తపోటు స్థాయిని పెంచుతుంది మరియు రక్తం గడ్డకట్టేలా కూడా చేయగలదు. ఇది ధమనులు గట్టిపడటంతో బాధపడుతున్న వారికి తీవ్రమైన గుండెపోటును కూడా కలిగించవచ్చు.

  మీ పని ముఖ్యమే, కానీ మీరు పని ఒత్తిడికి గురవుతున్నారని అనిపిస్తే, తగ్గట్లు ప్రణాళికలు చేసుకోవడం మంచిది. లేనిచో కోరి అనారోగ్యాలు తెచ్చుకున్నట్లే అవుతుంది. పురుషులు దాదాపుగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడించినప్పటికీ, వారి పని ఒత్తిడే వారి అకాల మరణాలకు సగం కారణంగా ఉంది.

  కార్యాలయంలో నెలలో ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవడమే మీ గౌరవాన్ని పెంచడంలో సహాయపడవచ్చు, అయితే ఈ ఒత్తిడి మీ ఆరోగ్యంపై విధించే ప్రతికూల ప్రభావాలను కూడా అంచనా వేయగలగాలి. ముఖ్యంగా పొగాకు మరియు మద్యపానం వంటి వ్యసనాలు అలవాటు ఉన్న పురుషులలో మాత్రమే ఎక్కువశాతం ఈ అకాల మరణాల ప్రమాదాన్ని కలిగి ఉంటారని అనేక నివేదికలు తేల్చాయి కూడా. సమతుల్య ఆహారం నిర్వహిస్తున్నా కూడా వ్యసనాలు తీవ్రప్రభావాన్నే చూపగలవు.

  ఈ అధ్యయనాలలో తేలిన విషయాల ప్రకారం, మీ రక్తపోటును మరియు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించటమే కాక, ప్రతిరోజూ మీరు వ్యవహరించే పనిభారాన్ని సమతుల్యం చేయడo కూడా అత్యవసరం. కార్డియాక్ సమస్యలతో బాధపడుతున్న వారు, మీ ఫిట్నెస్ కార్యక్రమంలో భాగంగా ఒత్తిడి నిర్వహణను చేర్చడం లేదా మీ పని గంటలను తగ్గించడం కూడా జత చేయవలసిన అవసరం ఉంది.

  మనం ఎల్లప్పుడూ, దాదాపు 24x7 సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న ఒక ప్రపంచంలో మనుగడని కొనసాగిస్తున్నాము., మీరు వ్యక్తిగతంగా మీ జీవితానికి ఏది ఉత్తమమైనదో మరియు ఏది అవసరమైనదో గుర్తించాల్సిన అవసరం ఉంది. మీరు ఆరోగ్యoగా మరియు క్రియాశీలకంగా ఉండే క్రమంలో, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన మీ జీవనశైలిని సమతుల్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకాల మరణాలు పెరుగుతున్న సంఖ్యను తగ్గించే క్రమంలో, మనమంతా, ప్రత్యేకంగా పురుషులు, కార్యాలయంలో ఒత్తిడిని నియంత్రించే దిశగా జాగ్రత్త వహించాల్సి ఉంటుందని మరువకండి. వ్యసనాలకు దూరంగా పరిసరాలను, కుటుంబ మరియు కార్యాలయ వాతావరణాన్ని అనుకూలంగా ఉండేలా నిర్వహిస్తూ , సరైన ఆహార ప్రణాళిక, వ్యాయామం, ఆరోగ్యకర అలవాట్లను జత చేసుకుని జీవించే వారిలో ఈ ఒత్తిడులు, అకాల మరణాలు అనేవి కాస్త తక్కువగానే ఉన్నాయని మరవకండి.

  ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో లేదా మీ సన్నిహితులతో పంచుకోండి. ఇటువంటి అనేక ఆరోగ్య సంబంధిత విషయాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శిoచండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

  English summary

  Work Stress Is More Fatal For Men Than Women With Heart Ailments And Diabetes

  Is your job becoming the reason of your death? Well if not technically, then, of course, it is becoming fatal for you with the excessive work pressure and stress. Stress is a buzz killer in the professional world.Everyone knows its consequences and reasons it occurs. But one needs to understand that although stress is harmful to all of us, it causes more harm to men than women who are suffering from heart ailments and diabetes.
  Story first published: Thursday, June 21, 2018, 19:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more