For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మే31 - ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం: ఈ ఎనిమిది ఆహారాలు పొగాకును దూరంగా ఉంచగలవని తెలుసా?

మే31 - ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం: ఈ ఎనిమిది ఆహారాలు పొగాకును దూరంగా ఉంచగలవని తెలుసా?

|

ప్రతి సంవత్సరం మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం(వరల్డ్ నో టొబాకో డే) జరుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం యొక్క ప్రధాన థీమ్ 'పొగాకు మరియు గుండె వ్యాధి'. ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ప్రకారం, ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రజల గుండె సంబంధిత అనారోగ్యాలకు పొగాకు ఏరకమైన ప్రభావం చూపుతుంది, అని తెలియజేయడం కోసమే ఈ “థీం” రూపొందించబడింది. ఈ వ్యాసంలో పొగాకు వాడకాన్ని నివారించడానికి ఉపయోగపడే 8 ఉత్తమ ఆహార పదార్థాల గురించి తెలుసుకుంటారు.

పొగాకు వ్యసనం ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలను కోల్పోయేలా చేస్తుంది. WHO ప్రకారం, పొగాకు కారణంగా ప్రతి సంవత్సరం 7 లక్షల మందికి పైగా చనిపోతున్నారు. దీని వల్ల నోటి కాన్సర్ , గొంతు కాన్సర్ , కిడ్నీ కాన్సర్ ,జీర్ణాశయం కాన్సర్ ,ఎముక మజ్జ కాన్సర్ ,అన్నవాహిక కాన్సర్, బ్లడ్ కాన్సర్(లుకేమియా), ఊపిరితిత్తుల కాన్సర్, గొంతు వెనక ఉండే హైపో ఫెరెంజియల్ కాన్సర్, నేసో ఫెరెంజియల్ కాన్సర్, స్వరపేటిక కాన్సర్ వంటి అనేక రకాల కాన్సర్లు వస్తాయని పూర్తి అధ్యయనాల ద్వారా తేలింది. అయినా ఈ పొగాకును వీడలేని దుస్థితిలో ఉన్నారు అనేకులు.

World No Tobacco Day: 8 Foods To Prevent Tobacco Use

భారతదేశంలో, ఊపిరితిత్తుల క్యాన్సర్ 6.9 శాతం ఉండగా, అన్ని క్యాన్సర్-సంబంధిత మరణాలలో 9.3 శాతంగా ఉంది. ఈ లెక్కలు స్త్రీ-పురుషులిద్దరికీ వర్తిస్తాయి. పొగాకు వాడకం కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, మరియు పెరిఫెరల్ వస్క్యులర్ డిసీజ్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ధూమపానం నుండి మిమ్మల్ని మీరు నివారించడానికి, నికోటిన్ కోరికలను తగ్గించడానికి మీ ఆహారం ప్రణాళికలో భాగంగా తీసుకోదగిన కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

పొగాకు వినియోగం నివారించడానికి గల ఉత్తమమైన ఆహార పదార్ధాలు :

1. పాలు

1. పాలు

డ్యూక్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ధూమపానం చేసే ముందు ఒక గ్లాసు పాలు తాగడం మూలంగా సిగరెట్ రుచి భయంకరంగా ఉంటుoదని కనుగొంది. మీరు నమ్మకపోతే, సిగరెట్ ఆలోచన మనసుకు రాగానే, ముందుగా ఒక గ్లాసు పాలు త్రాగి చూడండి మరియు ఇది ఎలా పనిచేస్తుందో మీకే తెలుస్తుంది.

2. లికోరైస్

2. లికోరైస్

లికోరైస్ అనేది ఒక ఔషధ గుణాలు కలిగిన సుగంధ ద్రవ్యం, ఇది సహజంగా ధూమపానం విడిచిపెట్టడానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఎలా పని చేస్తుందో తెలుసా? లికోరైస్ లో ఉండే తీపి రుచి ధూమపానం కోరికను దూరం చేయడంలో సహాయపడుతుంది. మీ నికోటిన్ కోరికలను సంతృప్తి పరచుటకు ఒక చిన్న లికోరైస్ వేరు ముక్కను దగ్గర ఉంచుకోండి.

3. గిన్సెంగ్

3. గిన్సెంగ్

గిన్సెంగ్ కూడా నికోటిన్ కోరికల ఫ్రీక్వెన్సీని తగ్గించటానికి సహాయపడుతుంది, ఎందుకంటే అది అడ్రినల్ గ్రంధుల నిర్వహణలో ఒక టానిక్ వలె పరిగణించబడుతుంది మరియు రక్తప్రవాహంలో ఎక్కువ కర్టిసోల్ హార్మోన్ ఉత్పత్తి చేసే లక్షణాలు దీని సొంతం. ఒక గ్లాసు పాలు లేదా తృణధాన్యాలతో, గిన్సెంగ్ పొడి ఒక టీస్పూన్ తీసుకోవడం ద్వారా ధూమపానం కోరిక క్రమంగా తగ్గుతుంది.

4. ఎండబెట్టిన అల్లం నిమ్మకాయతో

4. ఎండబెట్టిన అల్లం నిమ్మకాయతో

ఆయుర్వేదంలో వినియోగించే అత్యంత ముఖ్యమైన మూలికలలో అల్లం కూడా ఒకటి, ఎందుకో తెలుసా? ఇది చెడు బాక్టీరియా వ్యతిరేక లక్షణాలను, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, మరియు మీ పొగాకు వ్యసనాన్ని నిరోధించేందుకు సహాయపడే సల్ఫర్ సమ్మేళనాలను కూడా కలిగి ఉంటుంది. నిమ్మ రసంతో, ఎండబెట్టిన అల్లం ముక్కలను చిన్న ముక్కలుగా చేసి, నల్ల మిరియాలుతో కలిపి తీసుకోవడం ద్వారా పొగాకును దూరంగా ఉంచవచ్చు.

5. గ్రీన్-టీ లేదా బ్లాక్-టీ

5. గ్రీన్-టీ లేదా బ్లాక్-టీ

ధూమపానం చేసేవారిలో క్రమం తప్పకుండా గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ త్రాగే వారిలో , తీసుకొనని వారితో పోలిస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనం వెల్లడించింది. తేయాకులోని అధిక సాంద్రత కలిగిన కాటేచిన్ ఫ్లేవనాయిడ్ అని పిలిచే ఒక ఫైటోకెమికల్ సమ్మేళనం కారణంగా ఇది సాధ్యమవుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఫ్లేవనాయిడ్లు అనామ్లజనకాలుగా ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ యొక్క పనిని నిరోధిస్తాయి.

6. విటమిన్-సి రిచ్ ఫుడ్స్

6. విటమిన్-సి రిచ్ ఫుడ్స్

ధూమపానం చేసేవారు ఎక్కువగా విటమిన్-సి లోపంతో బాధపడుతున్నారని అనేక పరిశోధనల సారంశం. ఎందుకంటే ఫ్రీరాడికల్స్ ను నిరోధించడానికి విటమిన్-సి ఎక్కువ అవసరం. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ప్రకారం, ఒక రోజులో కనీసం 35 మిల్లీగ్రాముల విటమిన్-సి ను తీసుకోవాల్సిన అవసరం ఉంది. విటమిన్-సి లోపం గుండె జబ్బులు, కంటి లోపాలు మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

7. ఆహారంలో గోధుమ జెర్మ్ చేర్చుకోండి

7. ఆహారంలో గోధుమ జెర్మ్ చేర్చుకోండి

ఒక వారం పాటు సిగరెట్ల నుంచి పక్కకు వైదొలిగినప్పుడు విటమిన్-ఈ తీసుకోవడం మూలంగా వారి రక్త నాళాల పనితీరు మెరుగుపడిందని ఒక ప్రముఖ అధ్యయనం వెల్లడించింది. గోధుమ జెర్మ్, బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుడ్లు, మరియు ఆకుకూరలు వంటి విటమిన్- ఇ రిచ్ ఆహారాలు తినడం వల్ల గుండె జబ్బుల అవకాశాలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి.

8. క్రూసిఫెరస్ కూరగాయలు:

8. క్రూసిఫెరస్ కూరగాయలు:

ఈ కూరగాయలు ఐసోథియోసైనయాట్స్ యొక్క సహజ మూలం అయినందున, ధూమపానం వలన కలిగే ఊపిరి తిత్తుల కాన్సర్ లక్షణాలను కూడా క్రమంగా తగ్గించగలదని అనేక అధ్యయనాలలో తేలింది. ఈ క్రూసిఫెరస్ కూరగాయలలో ఉండే ఐసోథియోసైయానేట్స్ అనే సమ్మేళనం క్యాన్సర్ కణాల అభివృద్ధి, పెరుగుదల మరియు వ్యాప్తిని నిరోధించగలిగేవిలా ఉంటాయి. కాలీఫ్లవర్, క్యాబేజీ, కాలే, బ్రోకోలీ, ముల్లంగి, బోక్ చోయ్ వంటి క్రుసిఫెరస్ కూరగాయలు మార్కెట్లో విరివిగా లభ్యమవుతున్నాయి.

ఈ 8 ఆహారపదార్ధాలు మిమ్ములను పొగాకుకు దూరంగా ఉంచడంలో సహాయపడగలవు. ఏదిఏమైనా మానసికంగా స్థిరసంకల్పం ఉన్నవారికి పొగాకు మానడానికి అనేక మార్గాలు ఉంటాయి.

మీకు ఈ వ్యాసం నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి ఆరోగ్య సoబంధిత విషయాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.


English summary

World No Tobacco Day: 8 Foods To Prevent Tobacco Use

Every year on 31st May World No Tobacco Day is celebrated. This year the World No Tobacco Day theme is 'Tobacco and heart disease'. According to WHO, tobacco kills more than 7 million people every year. Lung cancer being the worst deadly one is common in smokers and tobacco takers. Best foods to prevent tobacco use are milk, ginseng, licorice, black tea, etc.
Story first published:Wednesday, May 30, 2018, 13:00 [IST]
Desktop Bottom Promotion