For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా మోనోపాజ్ ఎందుకొస్తుంది, 7 లక్షణాలు

|

ప్రతి మహిళ రుతుస్రావం ప్రారంభం అయిన దగ్గర నుండి, మెనోపాజ్ (రుతువిరతి) వరకు నెలసరి రుతుస్రావం తప్పనిసరి. అదేవిధంగా మెనోపాజ్ సమీపిస్తున్న కొద్దీ కొన్ని లక్షణాలు ముందుగానే సూచిస్తూ ఉంటాయి.

మెనోపాజ్లో పునరుత్పత్తి హార్మోన్లు ఉత్పత్తి ఆగిపోవడం జరుగుతుంటుంది, ఫలితంగా హార్మోన్ల హెచ్చుతగ్గులను తలెత్తి కొన్ని అవాంఛనీయ లక్షణాలు కనపడడం ప్రారంభిస్తాయి.

రుతువిరతి సమీపిస్తున్న మహిళ తన నెలసరి బహిష్టు స్రావం ఆగిపోవడం చూస్తుంది. మరియు వేడి ఆవిర్లు, మానసిక ప్రవర్తనలలో మార్పు, బరువు పెరగడం, శరీరంలో వెంట్రుకల పెరుగుదల, చెమట పట్టడం, లైంగిక పటుత్వం కోల్పోవడం మొదలైన కొన్ని ఇతర లక్షణాలను కూడా ఎదుర్కొంటుంది.

రుతువిరతి అనేది సాధారణంగా 45 ఏళ్ళ వయస్సు పైబడి ఉన్న మహిళలకు వస్తుంటుంది. క్రమంగా బహిష్టు స్రావం ముగింపును సూచిస్తుంది. కానీ, ఈ పరిస్థితి శరీరంలో కొన్ని దుష్ప్రభావాలు తలెత్తడానికి కారణం కావచ్చు.

అయితే, అరుదైన సందర్భాలలో, కొంతమంది మహిళలు ముందుగానే రుతువిరతి లక్షణాలను ఎదుర్కొనవచ్చు. అనగా ముప్పైల వయసులోనే మెనోపాజ్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

రుతుస్రావం ప్రారంభమైన తరువాత, మహిళలలో అనేక శారీరిక మరియు భావోద్వేగ సమస్యలు తలెత్తవచ్చు. అదేవిధంగా కొన్ని సంకేతాలు లేదా లక్షణాలు, ఒక మహిళ ముందస్తుగా రుతువిరతి ఎదుర్కోవచ్చునని సూచిస్తుంది.

1. అనువంశికత (జన్యు పరమైన లేదా హెరిడిటీ) :

1. అనువంశికత (జన్యు పరమైన లేదా హెరిడిటీ) :

మీ తల్లి లేదా అమ్మమ్మ ముందస్తు రుతువిరతిని ఎదుర్కొన్నట్లయితే, అది మీకు కూడా ముందస్తు రుతువిరతికి సంకేతం కావచ్చు. ఈ స్థితి జన్యుపరంగా ఉండవచ్చు.

2. సర్జరీ :

2. సర్జరీ :

మీరు మీ గర్భాశయం లేదా అండాశయం సంబంధిత శస్త్రచికిత్సలను ఎదుర్కొని ఉంటే, అది కూడా ముందస్తు రుతువిరతికి ఒక కారణం కావచ్చు. ఎందుకంటే, కొన్ని సందర్భాలలో కొన్ని శస్త్రచికిత్సలు శరీరంలో హార్మోన్ల అసమతుల్యతలకు దారితీస్తుంది.

3. ధూమపానం :

3. ధూమపానం :

ప్రత్యక్ష మరియు పరోక్ష ధూమపానాలు కూడా ముందస్తు రుతువిరతికి కారణం కావొచ్చు. దీని వలన మహిళ దేహంలో ఈస్ట్రోజన్ స్థాయిలు గణనీయంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి.

4. PCOS :

4. PCOS :

పాలిసిస్టిక్ ఒవేరియన్ (అండాశయం) సిండ్రోమ్ సమస్య హార్మోన్ల హెచ్చుతగ్గులకు కారణం కావచ్చు. ముందస్తు రుతువిరతికి మరొక ప్రధాన కారణం. ఈ పరిస్థితి ఒక మహిళ శరీరంలో పునరుత్పత్తి హార్మోన్ల తగ్గుదలకు దారితీస్తుంది.

5. తక్కువ బరువు :

5. తక్కువ బరువు :

బరువు తక్కువ ఉన్న మహిళలలో, ఈస్ట్రోజన్ కొవ్వు కణజాలాల్లో నిల్వ చేయబడుతుంది, మరియు శరీరంలో తగినంత ఈస్ట్రోజన్ లేకపోవడం మూలంగా ఇది ముందస్తు రుతువిరతి దశకు దారితీస్తుంది.

6. క్యాన్సర్ :

6. క్యాన్సర్ :

ఒకవేళ మహిళకు ఎటువంటి క్యాన్సర్ సమస్య ఉన్నా, లేదా క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించిన ఔషధాల కారణంగా అయినా, శరీరం కొన్ని హార్మోన్ల హెచ్చుతగ్గులకు గురవుతుంది. క్రమంగా ముందస్తు రుతువిరతికి దారితీస్తుంది. మహిళలు అధికంగా రొమ్ము కాన్సర్, మరియు గర్భాశయ సంబంధిత కాన్సర్ ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కావున తరచుగా మిమ్ములను మీరు పరీక్షించుకోవడం, వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

7. మూర్ఛ వ్యాధి :

7. మూర్ఛ వ్యాధి :

ఒక మహిళ తరచుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లైతే, అది ముందస్తు రుతువిరతికి కారణంగా ఉంటుంది. ఈ పరిస్థితి కూడా హార్మోన్ల అసమతుల్యతలకు దారితీయవచ్చు. ప్రధానంగా ఈస్ట్రోజన్ హార్మోను మీద దీని ప్రభావం ఉంటుంది.

కానీ పై సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ముందస్తు రుతు విరతిని ఖచ్చితంగా ఎదుర్కొంటారు అని లేదు. కానీ అవకాశాలు మాత్రం మెండుగా ఉంటాయని గుర్తుంచుకోండి. మరియు తరచుగా మీ గైనకాలజిస్టులను సంప్రదిస్తూ వారు సూచించిన పరీక్షలను అనుసరించడం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిగురించిన కనీస అవగాహన మీకు ఉంటుంది. ఒక్కోసారి ఈ ముందస్తు మెనోపాజ్ లక్షణాలే, కొన్ని ఆరోగ్య పరిస్థితులను బహిర్గతం చేస్తుంటాయి. కావున జాగ్రత్త తప్పనిసరి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, మాతృ శిశు సంబంధ, వ్యాయామ, లైంగిక, ఫాషన్, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

Read more about: menopause
English summary

Menopause Causes | Early Menopause causes

However, in rare cases, some women may experience the symptoms of menopause quite early, when they are still younger, say, in their mid-30s!The early onset of mensuration can cause a lot of health and emotional issues in a woman.There are certain signs or symptoms that say a woman could experience an early menopause, have a look at them here.
Story first published: Monday, March 18, 2019, 12:25 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more