అపక్రమ రుతుస్రావం(ఇర్రెగ్యులర్ పీరియడ్స్)సమస్యను నివారించే అల్లం, దాల్చిన చెక్కా, ఇంకా...

అపక్రమ రుతుస్రావం(ఇర్రెగ్యులర్ పీరియడ్స్)సమస్యను నివారించే అల్లం, దాల్చిన చెక్కా, ఇంకా...

Irregular Periods : 3 Home Remedies For Irregular Periods ! || Boldsky Telugu

మీరు రుతుక్రమ సమస్యలతో బాధపడుతున్నారా ? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య వేధిస్తోందా ? అయితే డోంట్ వర్రీ. అపక్రమ రుతుక్రమం(ఇర్రెగ్యులర్ పీరియడ్స్) అనేది మహిళల్లో సాధారణ సమస్య. ఇది ప్రస్తుతం చాలా సాధారణంగా కనిపించే సమస్య. 35 ఏళ్లలోనే మీకు రుతుక్రమంలో సమస్యలు రావడం, లేటుగా నెలసరి రావడం, లేదా ఒక నెల రావడం మరో నెల రాకుండా ఉండటం వంటి లక్షణాలన్నింటిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గా చెప్పవచ్చు. ఈ సమస్యలకు కారణమేంటి ?

3 home remedies for irregular periods that work wonders,


ఈ సమస్యకు వివిధ రకాల కారణాలున్నాయి. ముఖ్యంగా పిసిఓఎస్, ఎండోమెట్రీయాసిస్, హార్మోన్ల సమస్యలు, జీవనశైలిలో ఒత్తిడి, అపక్రమ డైట్, వ్యాయామం లేకపోవడం, క్రమంగా అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం, స్మోకింగ్, ఆల్కహాల్ , కెఫిన్, మందులు మరియు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం వల్ల అది ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మీద ప్రభావం చూపుతుంది. కొన్నింటికి ఖచ్ఛితంగా చికిత్స తీసుకోవల్సి ఉంటుంది. కొన్నింటికి ఇంటి నివారణలను ప్రయోగించవచ్చు. కొన్ని సమయాల్లో న్యాచురల్ పదార్థాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు కాంపౌండ్స్ హార్మోన్ల ఇర్రెగ్యులారిటీని రెగ్యులర్ చేస్తాయి. దాంతో పీరియడ్స్ కూడా క్రమంలో ఉంటాయి.

సాధారణంగా ప్రతి మహిళలో రుతుక్రమం సమయం

సాధారణంగా ప్రతి మహిళలో రుతుక్రమం సమయం

సాధారణంగా ప్రతి మహిళలో రుతుక్రమం సమయం 28రోజులు, అయినా కూడా, పీరియడ్ రేజ్ 21 నుండి 31 డేస్ వరకూ ఉంటుంది. ఇంకొంతమందికైతే 38రోజులకు ఉంటుంది. ఇది ఒక్కొక్క మహిళలో ఒక్కో విధంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన మహిళలో ప్రతి 28రోజులకు ఒక్క సారి పీరియడ్స్ జరిగితే నార్మల్ గా భావిస్తారు. అలా కాకుండా త్వరగా పీరియడ్స్ వస్తున్నా లేదా చాలా లేటుగా పీరియడ్స్ వస్తున్నా అందుకు పిసిఓఎస్, ఎండోమెట్రీయాసిస్, హార్మోన్ల అసమతుల్యతలు వంటి వివిధ రకాల కారణాలుంటాయి. ఈ కారణాలైతే వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే కొన్ని హోం రెమెడీస్ కూడా ఉన్నాయి. ఈ ఇంటి నివారణల్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు కాంపౌండ్స్ హార్మోన్ల అసమతుల్యతలను క్రమంలో ఉంచి, అపక్రమ పీరియడ్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఇంటి నివారణలను మీరు ప్రయత్నించి పీరియడ్స్ ను రెగ్యులర్ గా మార్చుకోండి.

అల్లం :

అల్లం :

అల్లంలో అనేక ఔషధ గుణాలున్నాయి. అల్లం, రుతుక్రమంలో వచ్చే నొప్పిని మాత్రమే కాదు, పీరియడ్స్ కు సంబందించిన ఇతర సమస్యలను కూడా తగ్గిస్తుంది. అందువల్ల, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను నివారించడానికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.అందుకోసం అల్లం టీ త్రాగండి లేదా రెగ్యులర్ వంటల్లో దీన్ని ఉపయోగించండి. మీకు పీరియడ్స్ చాలా లేటుగా రావడం, రక్తస్రావం తక్కువగా అవడం వంటి సమస్యలు ఉంటే.. అల్లం చక్కటి పరిష్కారం. అల్లం తురుములో కొంచెం నీళ్లు కలిపి స్టవ్ మీద పెట్టాలి. టీ స్పూన్ పంచదార వేసి బాగా మిక్స్ చేసి 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత తీసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే.. మీ సమస్య తగ్గిపోతుంది.

దాల్చిన చెక్క :

దాల్చిన చెక్క :

డయాబెటిస్ ను కంట్రోల్ చేయడం నుండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను నివారించడం వరకూ ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఇది ఒక గొప్ప హోం రెమెడీ. అంతే కాదు, వేరే ఇతర సమస్యలైనా చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. దాల్చిన చెక్క టీని త్రాగడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను తగ్గిస్తుంది. పీరియడ్స్ సమయంలో దాల్చిన చెక్క నీళ్ళు త్రాగండి.కొన్ని పరిశోధనల ప్రకారం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు ఇది చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా పిసిఓఎస్ సమస్య ఉన్నవారిలో ఇది చాలా బాగా పనిస్తుంది. దాల్చిన చెక్క శరీరంలో వేడిని పెంచుతుంది. ఇది రుతుక్రమం సజావుగా ఉండటానికి చాలా సహాయపడుతుంది. ఒక కప్పుడు దాల్చిన చెక్క పొడి తీసుకుని.. వేడినీళ్లు కలపాలి. బాగా మిక్స్ చేసి, 10 నిమిషాల తర్వాత అందులో ఒక టీ బ్యాగ్ వేయాలి. రెండు మూడు నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ పంచదార లేదా తేనె కలుపుకుని రోజూ తీసుకుంటే.. మీ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటాయి.

యాపిల్ సైడర్ వెనిగర్:

యాపిల్ సైడర్ వెనిగర్:

పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండాలంటే యాపిల్ సైడర్ వెనిగర్ ను రెగ్యులర్ గా త్రాగాలి. దీన్ని నేరుగా తీసుకోకుండా ఒక గ్లాసు నీళ్ళలో ఒక టీస్పూన్ కలిపి తీసుకోవాలి. దీన్ని ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటుంటే ఖచ్చితంగా మీ సమస్య తగ్గుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ తో చాలా ప్రయోజనాలున్నాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు ఏది కూడా పరిమితంగా తీసుకోవడం అన్ని విధాల మంచిది. ఇంకా మీరు డాక్టర్ ను సంప్రదించి తీసుకోవడం మరీ మంచిది.

Desktop Bottom Promotion