Latest Updates
-
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా?
Budget 2022 for Health:హెల్త్ బడ్జెట్ 2022 హైలైెట్స్ ఏంటో చూసెయ్యండి...
2022 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి సంబంధించిన హైలెట్స్, వైద్య రంగంలో ఎలాంటి పథకాలు, స్కీమ్స్ వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Budget 2022 Highlights for Health:గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మన దేశంలో నేషనల్ డిజిటల్ హెల్త్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ వంటి వాటితో పాటు మిల్లెట్స్ ప్రధానంగా ఫోకస్ పెడుతున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు.

పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తేదీన మంగళవారం నాడు తన నాలుగో కేంద్ర బడ్జెట్ ను ఆరోగ్య సంరక్షణ రంగంపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించే సమయంలో ఆరోగ్య సంరక్షణ గురించి.. ఈ రంగాన్ని బలోపేతం చేయడం గురించి నొక్కి వక్కాణించారు. ''మేము ఓమిక్రాన్ వేవ్ మధ్యలో ఉన్నాం. మాకు కరోనా టీకా ప్రచారం యొక్క వేగం బాగా సహాయపడింది. 'సబ్ కా ప్రయాస్'తో మేము బలమైన వ్రుద్ధిని కొనసాగిస్తామనే విశ్వాసం నాకు ఉంది' అని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరిచేందుకు వచ్చే ఆరు సంవత్సరాల్లో ప్రభుత్వం రూ.64,180 కోట్లు వెచ్చించనుందని గత ఏడాది నిర్మలమ్మ చెప్పారు.

ఆరోగ్య సంరక్షణ రంగంపై సీతారామన్ హైలైట్స్..
* నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్
''నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్ కోసం ఒక ఓపెన్ ప్లాట్ ఫామ్ రూపొందించబడుతుంది. ఇది ఆరోగ్య ప్రదాతలు మరియు ఆరోగ్య సౌకర్యాల డిజిటల్ రిజిస్ట్రీలు, ప్రత్యేకమైన ఆరోగ్య గుర్తింపు మరియు ఆరోగ్య సౌకర్యాలకు సార్వత్రిక ప్రాప్యతను కలిగి ఉంటుంది'' అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.

* నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్..
''కరోనా మహమ్మారి అన్ని వయసుల వారిలోనూ మానసిక ఆరోగ్య సమస్యలను పెంచింది. నాణ్యమైన మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ మరియు సంరక్షణ సేవలకు మెరుగైన ప్రాప్యత కోసం, జాతీయ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రారంభించబడుతుంది. ఇందులో 23 టెలీ మెంటల్ హెల్త్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నెట్ వర్క్ ఉంటుంది. నిమ్హాన్స్ నోడల్ సెంటర్ గా ఉంటుంది మరియు ఐఐఐటి బెంగళూరు టెక్నాలజీ సపోర్టును అందిస్తుంది''అని సీతారామన్ చెప్పారు.
* ఆరోగ్య సంరక్షణ రంగంలో పురోగతి..
''112 ఆకాంక్షత్మక జిల్లాల్లో 95 శాతం ఆరోగ్యం, మౌలిక సదుపాయాలలో గణనీయమైన పురోగతి సాధించాయి' అని నిర్మలమ్మ చెప్పారు.
ఆరోగ్య రంగంపై ఆర్థిక సర్వే..
బడ్జెట్లో 2022 సంవత్సరంలో ఆరోగ్య సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. భారతదేశం తన ప్రభుత్వ బడ్జెట్లో ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే దేశాల్లో 189 దేశాలలో 179వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఆరోగ్యం అనేది ఒక రాష్ట్ర అంశం కాబట్టి, ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ ఖర్చులను పరిశీలించేటప్పుడు, రాష్ట్రాలు ఆరోగ్య సంరక్షణపై ఖర్చు చేయడం చాలా ముఖ్యమని ఆర్థిక సర్వే 2020-21 ప్రకారం, బడ్జెట్ సమర్పణకు ముందు నిర్మలా సీతారామన్ గతంలో తెలిపారు. అయితే జిడిపిలో ప్రభుత్వ వ్యయం 1 శాతం నుండి 2.5 నుండి 3 శాతానికి పెరగడం వల్ల మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యయంలో ఓఓపి వ్యయాలను 65 శాతం నుండి 30 శాతానికి తగ్గించొచ్చని సర్వే సూచించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
