Latest Updates
-
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
China Corona Cases: చైనాలో మళ్లీ కరోనా విజృంభన, 30 వేలకు పైగానే రోజువారీ కేసులు
చైనాలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. చైనాలో కొవిడ్-19 కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే చైనాలో రోజువారీ కేసులు 31,454 నమోదు అయ్యాయి.
China Corona Cases: చైనాలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. చైనాలో కొవిడ్-19 కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే చైనాలో రోజువారీ కేసులు 31,454 నమోదు అయ్యాయి. అయితే ఇందులో 27,517 మందికి ఎలాంటి లక్షణాలు లేవని అక్కడి అధికారులు చెబుతున్నారు.

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉద్ధృతంగా వ్యాపించిన సమయంలో కూడా చైనాలో ఇన్ని కరోనా కేసులు నమోదు కాలేదు. అలాంటి ఇప్పుడు రోజువారీ కేసులు 30 వేలు దాటడంపై ఆందోళనలు నెలకొన్నాయి.
1.4 బిలియన్ల చైనా జనాభాతో పోల్చి చూసినప్పుడు ఈ రోజువారీ కేసులు ఏమంత పెద్ద సంఖ్య కాదు. కానీ ఇవే చైనాలో రికార్డు స్థాయి కేసులు కావడం గమనార్హం.

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి చైనా ప్రభుత్వం అన్ని రకాల కట్టడి చర్యలు తీసుకుంటోంది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచింది. అలాగే ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తోంది. పలు నగరాల్లో లాక్ డౌన్ అమలు అవుతోంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదు అయిన ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న చైనా ఆరోగ్య శాఖ అధికారులు. చాలా ప్రాంతాల్లో కార్యాలయాలు, రెస్టారెంట్లను మూసివేశారు. చిన్నపాటి లక్షణాలు కనిపించినా పరీక్ష చేయించుకోవాలని అధికారులను ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే అనవసరంగా బయటకు రావొద్దని వెల్లడించారు.
మెగాసిటీ షాంఘై లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు ఏప్రిల్ మధ్యలో నమోదైన 29,390 ఇన్‌ఫెక్షన్‌లను బుధవారం గణాంకాలు మించిపోయాయి. నివాసితులు ఆహారం కొనడానికి మరియు వైద్య సంరక్షణను పొందటానికి కష్టపడుతున్నారు.
మహమ్మారి మూడవ సంవత్సరానికి చేరువవుతున్నందున నిరంతరాయమైన లాక్ డౌన్ విధానం జనాభాలో అలసట మరియు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఇది చెదురుమదురు నిరసనలకు దారితీసింది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకతను దెబ్బతీసింది. చైనాలోని యాపిల్ ఫోన్ల తయారీ కంపెనీ ఉద్యోగులను కట్టడి చేయడంతో వాళ్లు అక్కడి నుండి పారిపోయన ఘటనలపై చాలా వార్తలు వచ్చాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
