For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Study : కరోనా నుంచి కోలుకున్న తర్వాత.. ఎంతకాలం సురక్షితంగా ఉంటారో తెలుసా...

కరోనా పాజిటివ్ వచ్చినా కూడా సుమారు 8 నెలల పాటు సురక్షితంగా ఉంటారట.

|

మన దేశంలో ఇప్పటికే కరోనా మహమ్మారి కేసులు కోటి సంఖ్యను దాటేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఆ సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే ఇప్పుడిప్పుడే ఆ సంఖ్య తగ్గుముఖం పడుతోంది.

COVID-19 immunity lasts at least 8 months, hope for longevity of vaccinations: Study

అయితే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారిలో తిరిగి కోలుకున్న వారు చాలా మందే ఉన్నారు. వారితో పాటు కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఆస్ట్రేలియా యూనివర్సిటీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

COVID-19 immunity lasts at least 8 months, hope for longevity of vaccinations: Study

అదేంటంటే.. కరోనా మహమ్మారి బారిన పడి ఎవరైతే కోలుకుంటారో అలాంటి వారికి కోవిద్-19 సుమారు ఎనిమిది నెలల వరకు మళ్లీ దరిచేరదట. అంతేకాదండోయ్ అలా కరోనా సోకిన వారికి టీకా సామర్థ్యం కూడా లభిస్తే వారు మరింత సురక్షితంగా ఉంటారని ఆ అధ్యయనం చెబుతోంది. వీటితో పాటు వారి అధ్యయనంలో మరిన్ని వివరాలు వెలుగులోకొచ్చాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Corona Updates : 'కోవాక్సిన్'&'కోవిషీల్డ్'కు గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? వీటిని ఎప్పుడు, ఎలా వాడాలో తెలుసుకోండి...Corona Updates : 'కోవాక్సిన్'&'కోవిషీల్డ్'కు గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? వీటిని ఎప్పుడు, ఎలా వాడాలో తెలుసుకోండి...

కరోనా రోగులపై..

కరోనా రోగులపై..

ఆస్గ్రేలియా దేశంలోని మొనాష్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు 25 మంది కరోనా రోగులపై పరిశోధనలు చేశారు. మొత్తం 36 మంది నమూనాలను సేకరించారు. వారిని దాదాపు 250 రోజులగా పరీక్షలుగా చేస్తున్నారు.

బీ-సెల్స్ గుర్తింపు..

బీ-సెల్స్ గుర్తింపు..

వారి పరిశోధనల ప్రకారం ఫలితాలను కొన్ని రోజుల కిందట ‘సైన్స్ ఇమ్యూనాలజీ జర్నల్'లో ప్రచురించారు. కోవిద్-19 బారిన పడ్డవారిలో ఇమ్యూనిటీ వ్యవస్థకు చెందిన మెమొరీ బీ-సెల్స్ ను సైంటిస్టులు గుర్తించారు. ఇవి కరోనా వైరస్.. కణాల వ్యాధిని రెండింటి గుర్తుంచుకుంటాయట.

యాంటీ బాడీలు వేగంగా..

యాంటీ బాడీలు వేగంగా..

ఒకవేళ ఆ కరోనా వైరస్ మళ్లీ దాడి చేస్తే.. ఈ కణాలు ఇమ్యూనిటీ పవర్ ను చైతన్యపరచి యాంటీ బాడీలు వేగంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయని, ఆ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మెమో వాన్ జెల్మ్ వెల్లడించారు.

కోవిద్-19 వ్యాక్సిన్ కోసం ఎలా నమోదు చేసుకోవాలి? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివే...!కోవిద్-19 వ్యాక్సిన్ కోసం ఎలా నమోదు చేసుకోవాలి? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివే...!

యాంటీ బాడీలు వేగంగా

యాంటీ బాడీలు వేగంగా

కరోనా వైరస్ బారిన ఎవరైతే పడ్డారో వారిని నాలుగో రోజు నుండి 242వ రోజు పరిశీలించామని వాన్ జెల్మ్ చెప్పారు. ఈ వైరస్ నిరోధానికి దోహదపడే యాంటీబాడీలు 20వ రోజు నుండి తగ్గిపోవడం మొదలైందని.. అయితే మెమొరీ బీ-సెల్స్ మాత్రం చివరి రోజు వరకు కొనసాగాయని వెల్లడించారు.

ఇతర భాగాలకు విస్తరించకుండా..

ఇతర భాగాలకు విస్తరించకుండా..

మెమొరీ బీ-సెల్స్, కరోనా మహమ్మారి, న్యూక్లియో ప్లాస్టిడ్ ప్రోటీన్ రెండింటిని గుర్తించగలదని వివరించారు. కరోనా మహమ్మారి బలపడి శరీరంలో ఇతర భాగాలకు విస్తరించడానికి న్యూక్లియో ప్లాస్టిడ్ ప్రోటీన్ దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

8 నెలల పాటు..

8 నెలల పాటు..

మన శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీలు సుమారు ఎనిమిది నెలల పాటు కరోనా వైరస్ తో సమర్థంగా పోరాడగలవని వివరించారు. కరోనా నియంత్రణకు డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ల ద్వారా మరింత సమయం మీకు రక్షణ లభించే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు.

మీరు బర్డ్ ఫ్లూ గురించి భయపడుతున్నారా? ఈ విషయాలను తెలుసుకోండి... ముందు జాగ్రత్తలు తీసుకోండి...మీరు బర్డ్ ఫ్లూ గురించి భయపడుతున్నారా? ఈ విషయాలను తెలుసుకోండి... ముందు జాగ్రత్తలు తీసుకోండి...

రెండోసారి కేసుల విషయానికొస్తే..

రెండోసారి కేసుల విషయానికొస్తే..

అయితే.. చాలా మంది కరోనా నుండి కోలుకున్న తర్వాత కూడా మరో ఆరు నెలల్లోపు మళ్లీ ఆ వైరస్ బాడిన సంఘటనలు కూడా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, అలాంటి వారిలో మిలియన్ల మందిలో కొందరే ఉన్నారని చెబుతున్నారు.

ఇమ్యూనిటీ తక్కువగా ఉండటమే..

ఇమ్యూనిటీ తక్కువగా ఉండటమే..

అంతేకాదు వాటికి గల కారణాలేంటో వివరిస్తున్నారు. రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉండటం.. వారు అదనపు సమస్యలతో బాధపడటం వల్లే, వారు మళ్లీ కరోనా బారిన పడ్డారని వివరించారు.

భయపడాల్సిన పని లేదు..

భయపడాల్సిన పని లేదు..

అయితే తొలిరోజుల్లో కరోనా పాజిటివ్ అంటే భయపడిన వారు.. ఇప్పుడు మాత్రం ఎలాంటి భయం లేకుండా ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ ను ధైర్యంగా ఎదుర్కొన్నవారు తేలిగ్గానే బయటపడ్డారు. అయితే గర్భిణులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రమే పరిస్థితి కొంత క్లిష్టంగా మారింది. మరికొందరు మరణించారు. ఏ సమస్యా లేని వారు అస్సలు భయపడాల్సిన పని లేదు.

నిర్లక్ష్యంగా ఉండకండి..

నిర్లక్ష్యంగా ఉండకండి..

కరోనా పాజిటివ్ తర్వాత కోలుకున్న వారు.. కరోనా బారిన పడని వారు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి. ఎందుకంటే ఇది మన వల్ల ఇతరులకు సోకే ప్రమాదం.. ఇతరుల వల్ల మనకు సోకే ప్రమాదం ఎక్కువ కాబట్టి.. చాలా జాగ్రత్తగా ఉండండి.

English summary

COVID-19 Immunity Lasts at Least 8 Months, Hope for Longevity of Vaccinations: Study

Here we talking about the covid-19 immunity lasts at least 8 months, hope for longevity of vaccinations:Study.Read on
Desktop Bottom Promotion