For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covid antiviral pill:కరోనా విరుగుడుకు ట్యాబ్లెట్లులొచ్చేశాయి..దీని ధరెంత.. వీటిని ఎవరెవరు ఎలా వాడాలంటే...

కరోనా విరుగుడుకు ట్యాబెట్లు కూడా వచ్చేశాయి. వాటి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఇప్పటివరకు కరోనా మహమ్మారికి విరుగుడుగా కేవలం వ్యాక్సిన్లు(ఇంజెక్షన్లు) మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు మాత్రలు కూడా అందుబాటులోకొచ్చేశాయి.

Covid antiviral oral pill Molnupiravir launched in India; Know Price, dosage and other details in Telugu

ఇంతవరకు అమెరికా, బ్రిటన్ దేశాల్లో మాత్రమే దొరికే ఈ ట్యాబ్లెట్లు మన దేశంలోనూ తాజాగా విడుదలయ్యాయి. అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ మెర్క్ రూపొందించిన ట్యాబ్లెట్ వినియోగానికి ఇటీవల మన దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Covid antiviral oral pill Molnupiravir launched in India; Know Price, dosage and other details in Telugu

మెర్క్ ఫార్మా కంపెనీ తయారు చేసిన 'మెల్నూపిరావిర్'(Molnupiravir)ట్యాబ్లెట్ ను అత్యవసర వినియోగం కింద వాడొచ్చని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కరోనా స్వల్ప లక్షణాలు మరియు మోస్తరు లక్షణాలు ఉండే వారు కోవిద్-19 చికిత్సలో భాగంగా ఈ మాత్రలను వాడొచ్చు. ఈ సందర్భంగా వీటిని ఎలా వాడాలి.. ఎవరు వీటిని తీసుకోవాలి.. వీటి ధర ఎంత.. వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సహజంగా స్త్రీలలో లైంగిక భావాలను రేకెత్తించే ఆహారాలు ఏమిటో తెలుసా?సహజంగా స్త్రీలలో లైంగిక భావాలను రేకెత్తించే ఆహారాలు ఏమిటో తెలుసా?

మోల్నుపిరావిర్ అంటే?

మోల్నుపిరావిర్ అంటే?

మోల్నుపిరావిర్(Molnupiravir) అనేది యుకె మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ(MHRA) ద్వారా కోవిద్-19 చికిత్స కోసం ఆమోదించబడిన తొలి యాంటీవైరల్ ట్యాబ్లెట్.

ఎవరు వేసుకోవాలంటే..

ఎవరు వేసుకోవాలంటే..

అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ మెర్క్ తయారు చేసిన ఈ మాత్రలను కరోనా స్వల్ప లక్షణాలు మరియు మోస్తరు లక్షణాలు ఉండేవారు ఎవరైనా వేసుకోవచ్చు. అంతేకాదు తీవ్రమైన కోవిద్-19 లేదా ఆసుప్రతిలో చేరే ప్రమాదం ఉన్న వారు సైతం ఈ మాత్రలను వేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ట్యాబ్లెట్లను 18 సంవత్సరాలలోపు ఉన్న రోగులు ఉపయోగించడానికి అనుమతి లేదు. ఎందుకంటే ఇది ఎముకలను మరియు వాటి ఎదుగుదలను ప్రభావితం చేయొచ్చు.

ఎలా పని చేస్తుంది?

ఎలా పని చేస్తుంది?

మోల్నుపిరావిర్ (Molnupiravir) అనేది SARS CoV-2 వైరస్ జెనెటిక్ కోడ్ లో లోపాలను ప్రవేశపెట్టడం ద్వారా పనిచేసే ఒక ఔషధం. ఇది వైరస్ ను రాకుండా కాపాడుతుంది. ఈ మోల్నుపిరావిర్ నాలుగు 200 మిల్లీగ్రాముల క్యాప్సూల్స్ గా ప్రతి 12 గంటలకు ఐదు రోజుల పాటు మొత్తం 40 క్యాప్సూల్స్ ను నోటి ద్వారా వేసుకోవాలి. మోల్నుపిరావిర్ ను వరుసగా ఐదురోజుల కంటే ఎక్కువకాలం ఉపయోగించడానికి అనుమతి లేదు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినాల్సిన 5 రకాల చపాతీలు!మధుమేహ వ్యాధిగ్రస్తులు తినాల్సిన 5 రకాల చపాతీలు!

89 శాతం ఫలితం..

89 శాతం ఫలితం..

కరోనా విరుగుడు కోసం తయారు చేసిన ఈ ట్యాబ్లెట్లు కోవిద్-19 తీవ్రత ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో లేదా ఆసుపత్రిలో చేరే ముప్పును 89 శాతం వరకు తగ్గిస్తుందని తమ క్లినికల్ ట్రయల్స్ లో నిరూపితమయ్యిందని ఆ కంపెనీ ప్రతినిధులు వివరించారు.

గర్భిణీ స్త్రీలకు ప్రమాదం..

గర్భిణీ స్త్రీలకు ప్రమాదం..

జంతు పునరుత్పత్తి అధ్యయనాల ఫలితాల ఆధారంగా మోల్నూపిరావిర్ గర్భిణులకు ప్రమాదం అని చెబుతున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ లేడీస్ ఈ మాత్రలను వేసుకుంటే పిండానికి హాని కలిగే అవకాశం ఉంటుందట. అందుకే గర్భిణులు మోల్నుపిరావిర్ ట్యాబ్లెట్లను వేసుకోవడానికి అనుమతి లేదు.

ధర ఎంతంటే..

ధర ఎంతంటే..

మోల్నుపిరావిర్ 200mg యొక్క నాలుగు మాత్రలు ఐదురోజుల పాటు రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. ఇలా ఐదురోజుల పాటు 40 మాత్రలను తీసుకోవాలి. కోవిద్ కు వ్యతిరేకంగా పని చేసే ఈ మోల్నూపిరావిర్ ధర కేవలం రూ.63. అయితే మొత్తం 40 రోజులకు గాను సుమారు 2000 నుండి మూడు వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఎందుకంటే ఆయా కంపెనీలను ధరల మధ్య వ్యత్యాసం ఉంటుంది.

FAQ's
  • కరోనా ట్యాబ్లెట్లను ఎవరు వేసుకోవాలి?

    అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ మెర్క్ తయారు చేసిన ఈ మాత్రలను కరోనా స్వల్ప లక్షణాలు మరియు మోస్తరు లక్షణాలు ఉండేవారు ఎవరైనా వేసుకోవచ్చు. అంతేకాదు తీవ్రమైన కోవిద్-19 లేదా ఆసుప్రతిలో చేరే ప్రమాదం ఉన్న వారు సైతం ఈ మాత్రలను వేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ట్యాబ్లెట్లను 18 సంవత్సరాలలోపు ఉన్న రోగులు ఉపయోగించడానికి అనుమతి లేదు. ఎందుకంటే ఇది ఎముకలను మరియు వాటి ఎదుగుదలను ప్రభావితం చేయొచ్చు.

  • కరోనా ట్యాబ్లెట్లను గర్భిణులు వేసుకోవచ్చా?

    జంతు పునరుత్పత్తి అధ్యయనాల ఫలితాల ఆధారంగా మోల్నూపిరావిర్ గర్భిణులకు ప్రమాదం అని చెబుతున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ లేడీస్ ఈ మాత్రలను వేసుకుంటే పిండానికి హాని కలిగే అవకాశం ఉంటుందట. అందుకే గర్భిణులు మోల్నుపిరావిర్ ట్యాబ్లెట్లను వేసుకోవడానికి అనుమతి లేదు.

  • కరోనా ట్యాబ్లెట్ కోవిద్ వ్యతిరేకంగా ఎలా పని చేస్తుంది?

    మోల్నుపిరావిర్ (Molnupiravir) అనేది SARS CoV-2 వైరస్ జెనెటిక్ కోడ్ లో లోపాలను ప్రవేశపెట్టడం ద్వారా పనిచేసే ఒక ఔషధం. ఇది వైరస్ ను రాకుండా కాపాడుతుంది. ఈ మోల్నుపిరావిర్ నాలుగు 200 మిల్లీగ్రాముల క్యాప్సూల్స్ గా ప్రతి 12 గంటలకు ఐదు రోజుల పాటు మొత్తం 40 క్యాప్సూల్స్ ను నోటి ద్వారా వేసుకోవాలి. మోల్నుపిరావిర్ ను వరుసగా ఐదురోజుల కంటే ఎక్కువకాలం ఉపయోగించడానికి అనుమతి లేదు.

English summary

Covid antiviral oral pill Molnupiravir launched in India; Know Price, dosage and other details in Telugu

Covid antiviral oral pill Molnupiravir launched in India. It is used to treat COVID-19 in those infected by SARS-CoV-2. Know Price, dosage and other details in Telugu. Read on
Desktop Bottom Promotion