For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covid Omicron XE:కోవిద్ కొత్త వేరియంట్ లక్షణాలేంటి? ముంబైలో తొలి కేసు నమోదు...

|

New Covid Omicron XE: కరోనా మహమ్మారి చైనా నుండి ఎలా పుట్టుకొచ్చిందో కానీ.. అది మనల్ని ఓ పట్టాన వీడేటట్టు లేదు. కరోనా వైరస్ తగ్గిందనుకునేలోపే.. కరోనా 2.0 పేరిట సెకండ్ వేవ్ వరకు ప్రతి ఒక్కరినీ కలవరపెట్టింది.

మూడో దశ ముప్పు నుండి మనం తప్పించుకున్నామనుకుని ఆనందించేలోపే, తాజాగా మరో కొత్త రూపంలో మళ్లీ మనల్ని హడలెత్తిస్తోంది. కరోనా విరుగుడుకు ఎన్ని వ్యాక్సిన్లు కనిపెట్టినా.. అవి కొత్త కొత్త దారులను వెతుక్కుని సరికొత్త మార్గాల్లో వచ్చి మనల్ని పీడిస్తోంది.

ఈ నేపథ్యంలో చైనాలో కొత్త కోవిద్ వేరియంట్ ఎక్స్ఇ వచ్చినట్లు మనం వార్తలు వింటున్నాం. ఇది చైనాతో పాటు బ్రిటన్ ను కూడా వణికిస్తోంది. ఓమిక్రాన్ వేరియంట్ కు సరికొత్త సబ్ వేరియంట్ ఈ వైరస్ చాలా ప్రమాదకరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కరోనా కంటే పది రెట్లు వేగంగా దీని నుండి ముప్పు వాటిల్లుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా ఓమిక్రాన్ ఎక్స్ఇ సబ్ వేరియంట్ లక్షణాలేంటి.. ఇది ఎలా వ్యాపిస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ... మరి మీ బ్లడ్ గ్రూప్ ఏమిటి?

మళ్లీ ముప్పు..

మళ్లీ ముప్పు..

చైనాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే.. ఈ కొత్త వేరియంట్ వల్ల మళ్లీ ముప్పు తప్పేలా లేదనిపిస్తోంది. ఓమిక్రాన్ సరికొత్త మ్యూటెంట్లతో అత్యంత వేగంగా విస్తరిస్తూ చైనా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పుడు మన దేశంలోని ముంబై నగరంలో కూడా ఈ రకమైన తొలి కేసు నమోదైనట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇది ఓమిక్రాన్ వేరియంట్లు బిఎ1, బిఎ2 నుండి రూపాంతరం చెందిన వేరియంట్ ఎక్స్ఇగా చెబుతున్నారు.

పది రెట్లు ఎక్కువ..

పది రెట్లు ఎక్కువ..

కరోనా బిఎ2 ఓమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే.. ఈ ఓమిక్రాన్ ఎక్స్ఇ సబ్ వేరియంట్ పది రెట్లు వేగంగా వ్యాపిస్తుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) ఎపిడెమియోలాజికల్ నివేదిక హెచ్చరించింది. 2020 తర్వాత కేవలం కొద్దిరోజుల్లోనే.. చైనాలో 13వేలకు పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఈ వేసవి ఆహారాలు ఎండ తీవ్రతను ఎదుర్కోవటానికి మరియు త్వరగా బరువు తగ్గడానికి మీకు సహాయపడతాయని మీకు తెలుసా?

జనవరిలోనే..

జనవరిలోనే..

ఈ కొత్త రకం కరోనా వేరియంట్XE ను తొలిసారి జనవరి 19వ తేదీన బ్రిటన్లో గుర్తించారు. అప్పుడు బ్రిటన్లో 600 కంటే ఎక్కువగా ఎక్స్ఇ కేసులు నమోదైనట్లు WHO ప్రకటించింది. అయితే ఫిబ్రవరిలో ఈ మహమ్మారి ముప్పు తప్పిందని, ఆంక్షలు ఎత్తేయడంతో.. పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇది ఇప్పుడు చైనా, బ్రిటిన్ తో పాటు అమెరికాలోనూ వేగంగా విస్తరిస్తోంది. అయితే కరోనా విస్తరణతో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య ఎక్కువగా పెరుగుతున్నప్పటికీ, మరణాల రేటు తక్కువగా ఉండటం కాస్త ఉపశమనం కలిగించే విషయం.

కొత్త వేరియంట్ ఎక్స్ఇ లక్షణాలు..

కొత్త వేరియంట్ ఎక్స్ఇ లక్షణాలు..

ఓమిక్రాన్ వేరియంట్ మాదిరిగానే ఈ సబ్ వేరియంట్ సోకిన వారికి జలుబు, ముక్కు తరచుగా కారడం, తుమ్ములు, గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 600 మంది XE వేరియంట్ వెలుగు చూడటంతో నాలుగో దశ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిద్ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటిస్తేనే దీని వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెబుతున్నారు.

ముంబైలో తొలి కేసు..

ముంబైలో తొలి కేసు..

కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఎక్స్ఇ ముంబైలో తొలి కేసు నమోదైనట్లు సమాచారం వెలుగులోకొచ్చింది. జెనెటిక్ ఫార్ములా డిటర్మినెషన్లో భాగంగా మొత్తం 230 శాంపిల్స్ ను పరీక్షించగా 228 మందికి ఓమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అయితే ఒక శాంపిల్ లో కప్పా రకం వైరస్ బయటపడినట్లు, మరో వ్యక్తికి ఎక్స్ఇ వేరియంట్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పటికే మే, జూన్ నెలలో నాలుగో దశ ముప్పు ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Covid Omicron XE లక్షణాలు ఏంటి?

ఓమిక్రాన్ వేరియంట్ మాదిరిగానే ఈ సబ్ వేరియంట్ సోకిన వారికి జలుబు, ముక్కు తరచుగా కారడం, తుమ్ములు, గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 600 మంది XE వేరియంట్ వెలుగు చూడటంతో నాలుగో దశ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిద్ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటిస్తేనే దీని వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెబుతున్నారు.

కోవిద్ కొత్త వేరియంట్ ఎక్స్ఇ తొలి కేసు ఎక్కడ నమోదైంది?

కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఎక్స్ఇ ముంబైలో తొలి కేసు నమోదైనట్లు సమాచారం వెలుగులోకొచ్చింది. జెనెటిక్ ఫార్ములా డిటర్మినెషన్లో భాగంగా మొత్తం 230 శాంపిల్స్ ను పరీక్షించగా 228 మందికి ఓమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అయితే ఒక శాంపిల్ లో కప్పా రకం వైరస్ బయటపడినట్లు, మరో వ్యక్తికి ఎక్స్ఇ వేరియంట్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పటికే మే, జూన్ నెలలో నాలుగో దశ ముప్పు ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

English summary

Covid Omicron XE: Symptoms and everything you need to know about the combined variant in Telugu

XE is a mixture of the two Omicron variant sub-types BA.1 and BA.2. Know symptoms, transmission and everything you need to know about the combined variant in Telugu.
Story first published:Thursday, April 7, 2022, 13:49 [IST]
Desktop Bottom Promotion