For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాతీయ నేత్ర దాన దినోత్సవం 2019: భారతదేశంలో నేత్ర దానం ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసా..

|

ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జాతీయ నేత్ర దానం ఉత్సవాలను నిర్వహిస్తారు. నేత్ర దానం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించడం మరియు అవయవ దానం కోసం ప్రతిజ్ఞ చేసేలా ప్రజలను ప్రేరేపించేందుకు ఈ ప్రచారం నిర్వహిస్తున్నారు. రూబికాన్ ప్రాజెక్ట్ ఆధారంగా, కొన్ని నివేదికలను బట్టి భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో అంధత్వం ప్రధాన ఆరోగ్య సమస్యలలో ఒకటిగా పేర్కొనబడింది.

National Eye Donation Fortnight

ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం అత్యధిక సంఖ్యలో అంధులకు నిలయంగా భారతదేశం నిలిచినట్లు కఠోరమైన వాస్తవం బయటపడింది. కార్నియల్ వ్యాధుల కారణంగా కనీసం ఒక కంటిలో 6/60 కన్నా కంటి చూపు ఉన్న వారు 6.8 మిలియన్ల మంది ఉన్నారని అంచనా వేశారు. ఇప్పటివరకు ప్రపంచ జనాభాలో 37 మిలియన్ల అంధులు, 15 మిలియన్లు భారతదేశానికి చెందిన వారు ఉన్నారు. ఈ కేసులలో 75 శాతం మంది అంధత్వాన్ని తప్పించుకోలేరని నివేదికల ద్వారా తెలుస్తోంది.

అతి తక్కువగా నేత్ర దానం..

అతి తక్కువగా నేత్ర దానం..

జాతీయ నేత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతతో ఒక కాంతి ప్రకాశిస్తుంది. కార్నియల్ బ్లైండ్ నెస్ చికిత్స కోసం ఆప్టోమెట్రిస్టులు (కంటి నిపుణులు), దానం చేసిన కళ్లు దేశంలో 40 వేలకు గాను కేవలం ఎనిమిది వేలు మాత్రమే ఉన్నాయి. ఇదొక్కటే కాకుండా మన దేశానికి ప్రతి సంవత్సరం రెండున్నర లక్షల దానం చేసిన కళ్లు అవసరమవుతున్నాయి. కానీ మన దేశంలోని 109 కంటి బ్యాంకుల నుండి తక్కువ సంఖ్యలో అంటే కేవలం 25 వేల మంది కళ్లను మాత్రమే సేకరిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇంత కొరత ఉండటం వల్ల ప్రతి సంవత్సరం కేవలం పది వేల కార్నియల్ మార్పిడి మాత్రమే జరుగుతున్నాయి.

అధిక సంఖ్యలో అంధులు..

అధిక సంఖ్యలో అంధులు..

మన దేశంలో 153 మిలియన్ల భారతీయులకు రీడింగ్ గ్లాసెస్ అవసరమైనా వారికి యాక్సెస్ లేదు. ఇలా దేశంలో అధిక సంఖ్యలో అంధులు పెరుగుతున్నారు. కానీ పరిమిత సంఖ్యలోనే కేవలం 20 ఆప్టోమెట్రీ పాఠశాలలే వారికి అనుసంధానంగా ఉన్నాయి. దీని నుండి ప్రతి సంవత్సరం కేవలం 1000 మంది వరకే ఆప్టోమెట్రిస్టులు బయటకు వస్తున్నారు. వీరు సుమారు 17 మిలియన్ల మంది జనాభాకు సేవలందిస్తున్నారు.

మీ మరణం తర్వాత సహాయం..

మీ మరణం తర్వాత సహాయం..

మన దేశంలో 15 మిలియన్లలో మూడు మిలియన్ల మంది కార్నియల్ డిజార్డర్స్ కారణంగా పిల్లలు అంధత్వంతో బాధపడుతున్నారు. అందుకే మీ మరణం తర్వాత కనీసం ఒకరికి సహాయం చేయాలని నిర్ణయించుకోవడం గొప్ప పని. మీ నుండి ఇది మొదలైతే ప్రజలలో కొంతైనా మార్పు వచ్చి వారు కూడా అవయవదానం చేసేందుకు తోడ్పడుతుంది. మిమ్మల్ని మీరు ఒక అవయవ దాతగా నమోదు చేసుకోండి. మీ మరణానంతరం మీ కళ్లను దానం చేసి ఈ ప్రపంచాన్ని ఇంకా చూస్తూనే ఉండండి. కార్నియల్ ట్రాన్స్ ప్లాంటేషన్ అని పిలువబడే శస్త్రచికిత్సా విధానం ద్వారా వారు కళ్లను పొందుతారు. ఇందుకోసమే భారత ప్రభుత్వం ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ 1994ను తీసుకొచ్చింది. ఇది మన దేశంలోని అవయవ దానం, మార్పిడి యొక్క అంశాలలో సానుకూల మార్పును తీసుకొస్తుందని వారి భావన.

ఎపి, తమిళనాడు గణనీయమైన ప్రయత్నం..

ఎపి, తమిళనాడు గణనీయమైన ప్రయత్నం..

ఈ కార్యక్రమంపై వివిధ రాష్ట్రాలు చొరవ తీసుకున్నప్పటికీ, ఈ కార్యక్రమం యొక్క ప్రభావాన్ని, ప్రజలకు చేరువ చేయడంలో ఎటువంటి శ్రద్ధ చూపలేదు. కానీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు గణనీయమైన ప్రయత్నాలు చేశాయి. తమిళనాడులో 302 మంది నేత్రదానం చేయడానికి ముందుకు రాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 150 మంది వరకు ముందుకొచ్చారు. ఆ తర్వాతి స్థానాల్లో ఇతర రాష్ట్రాలు కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ మరియు కేరళ నిలిచాయి. మిగిలిన వాటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

దానం చేసిన కళ్లలో సగం వృథా..

దానం చేసిన కళ్లలో సగం వృథా..

మన దేశంలో ఎంతో కొంతమంది దానం చేసిన కళ్లు చేస్తున్నారు. కానీ వాటిలో దానం చేసిన కళ్లలో సగానికి పైగా వృథా అవుతున్నాయి.

ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా నేత్ర దానంపై అవగాహన మరియు ప్రాముఖ్యత లేకపోవడం ఒకటైతే, ఆసుప్రతులలో ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. దానం చేసిన కళ్ళను వృథా కాకుండా కాపాడటం కష్టంగా ఉంటోంది. ఒక నివేదిక ప్రకారం

2018 ఏప్రిల్ నుండి 2019 మార్చి వరకు భారతదేశంలో 52,000 మంది నేత్ర దానం చేశారు. అయితే దేశంలో కార్నియల్ మార్పిడి సంఖ్య మాత్రం కేవలం 28 వేలు మాత్రమే. దాదాపు కార్నియాలో 50 శాతం వినియోగించలేదు. ఇవన్నీ వృథా అయ్యాయి. ఇది ఏదో ఒక్క రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఉంది. దానం చేసిన కార్నియాను ఆరు నుండి 14 రోజుల భద్రపరచవచ్చు. 14 రోజుల తర్వాత వాటిని ఉపయోగించకపోతే వాటిని వ్యర్థంగానే భావిస్తారు.

తక్కువగా బాగా అమర్చే కంటి బ్యాంకులు..

తక్కువగా బాగా అమర్చే కంటి బ్యాంకులు..

దేశంలో బాగా అమర్చే ఐ బ్యాంకులు లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మన దేశంలో చాలా తక్కువ కంటి బ్యాంకులతో పాటు పరిమిత సంఖ్యలో కంటి సర్జన్లు ఉన్నారు. చాలా మంది ప్రజలు కళ్లు దానం చేయడానికి ఆసక్తి చూపరు. 21వ శతాబ్దంలో కూడా వివిధ పరిణామాలు, అపొహల వల్ల వారు దీనిపై ఇంకా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అవగాహన లేకపోవడం, ప్రేరణ లేకపోవడం, సాంప్రదాయ విశ్వాసాలు వంటివి సవాళ్ళుగా మారుతున్నాయి.

తాజా సర్వేలో బయటపడ్డ నమ్మలేని నిజాలు..

తాజా సర్వేలో బయటపడ్డ నమ్మలేని నిజాలు..

కార్నియా సంరక్షణ పద్ధతిని బట్టి, కళ్లు దానం చేసిన నాలుగు రోజులలోపు కార్నియా మార్పిడి జరుగుతుంది. కంటి కణజాలం యొక్క తొలగింపు శస్త్రచికిత్స ద్వారా మరణించిన వెంటనే జరుగుతుంది. ఇందుకు అంత్యక్రియల ఏర్పాట్లకు ఎలాంటి ఆలస్యం జరగదు.

కంటి దానానికి సంబంధించి అపొహలను అన్వేషించిన తాజా సర్వేలో మొత్తం 641 పట్టణ ప్రతివాదులలో 28 శాతం మంది అవయవ దాతలు ఎలాంటి ప్రాణాలను రక్షించలేరు అని నమ్ముతున్నారు. అయితే 18 శాతం మంది తమ శరీరం అంగవిహీనంగా మారుతుందని నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితులను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం వివిధ ఆసుప్రతుల్లో వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టి చర్యలు తీసుకుంటున్నాయి. 2003 సంవత్సరంతో పోల్చితే నేత్ర దాతల సంఖ్యలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది.

అవయవదాతగా మారండి.. ఆనందంగా ముందుకు సాగండి..

అవయవదాతగా మారండి.. ఆనందంగా ముందుకు సాగండి..

ఏది ఏమైనప్పటికీ దానం చేసిన కార్నియాస్ యొక్క సంరక్షణకు మెరుగైన ఆసుప్రతి పరికరాలను ఏర్పాటు చేయాలి. ఇవే కాకుండా, భారత పౌరుడిగా, మీరు అవయవ దాతగా నమోదు చేసుకోవాలి. ఎవరైనా కంటి దాత మారవచ్చు. ( ఏదైనా వయస్సు వారైనా లేదా ఏ లింగం వారైనా) షుగర్ పేషెంట్లు, కళ్లజోడు వాడే వ్యక్తులు, అధిక రక్తపోటు ఉన్న రోగులు, ఉబ్బసం ఉన్న రోగులు మరియు సంక్రమణ వ్యాధులు లేని వారంతా తమ కళ్లను దానం చేయవచ్చు. ఇప్పటికైనా అవయవ దాతగా నమోదు చేసుకోండి. మానవుడిగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి.. ఆనందంగా ముందుకు సాగండి..

English summary

National Eye Donation Fortnight 2019: Current Status Of Eye Donation In India

Although various states have taken initiatives on the program, they have not paid any attention to the effectiveness of the program. But states like Tamil Nadu and Andhra Pradesh have made significant efforts. In Tamilnadu, 302 people have come forward to perform Nethrava and 150 people have come forward in Andhra Pradesh. Other states followed by Karnataka, Maharashtra, Gujarat, Rajasthan and Kerala. The rest of the situation is very bad.
Story first published: Wednesday, August 28, 2019, 12:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more