For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాన్సర్ చికిత్స తర్వాత శృంగార కోరికలు తగ్గుతాయా? సరిగ్గా సెక్స్ చేయలేరా?

క్యాన్సర్, క్యాన్సర్ చికిత్స లైంగిక జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. క్యాన్సర్ పురుషులు, స్త్రీలలో లైంగిక పనితీరును ప్రభావితం చేస్తుంది. సర్జరీ, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి క్యాన్సర్ చికిత్సలు లైంగిక జీవితంపై గణ

|

క్యాన్సర్, క్యాన్సర్ చికిత్స లైంగిక జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. క్యాన్సర్ పురుషులు, స్త్రీలలో లైంగిక పనితీరును ప్రభావితం చేస్తుంది. సర్జరీ, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి క్యాన్సర్ చికిత్సలు లైంగిక జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కొంత మంది లైంగిక జీవితంలో క్యాన్సర్ చాలా ఇబ్బందులను తీసుకువస్తుంది. సంభోగం వేళ నొప్పి, అలసట, శరీరంలో మార్పులు, అంగస్తంభన లోపం, యోని పొడిబారడం, లిబిడో తగ్గడం వంటి సమస్యలు చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు ఎదుర్కొంటారు.

Does cancer treatment affect your sexual desire or sex life in Telugu

క్యాన్సర్, క్యాన్సర్ చికిత్స లైంగిక కోరికను ఎలా ప్రభావితం చేస్తుంది?

లైంగిక కోరికపై క్యాన్సర్ రోగం, ఆ రోగానికి చికిత్స తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. క్యాన్సర్ మహమ్మారి వల్ల వ్యాధిగ్రస్తుల్లో అలసట, వికారం, నొప్పి, ఆందోళన లాంటి సమస్యలు వేధిస్తాయి. ఈ సమస్యల వల్ల సెక్స్ డ్రైవ్ తగ్గుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ చికిత్సలు అంగస్తంభన, యోని పొడిబారడం లాంటి ఇబ్బందులను తెచ్చిపెడతాయి. దీని వల్ల శృంగారాన్ని ఎంజాయ్ చేయలేరు.

అయితే ఈ సమస్యలు అందరిలో ఒకేలా ఉండవని గుర్తుంచుకోవడం ముఖ్యం. కొందరిలో క్యాన్సర్, దాని చికిత్స లైంగిక జీవితంపై ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చు.

Does cancer treatment affect your sexual desire or sex life in Telugu

క్యాన్సర్ చికిత్స వేళ వచ్చే లైంగిక మార్పులను ఎదుర్కోవడం ఎలా?

క్యాన్సర్ చికిత్స సమయంలో లైంగిక మార్పులు సర్వసాధారణం. అలాగే వాటిని ఎదుర్కోవడం కూడా చాలా కష్టం. లైంగిక జీవితంలో ఏవైనా మార్పుల గురించి వైద్యులతో మాట్లాడటం చాలా ముఖ్యం. క్యాన్సర్ అయినా, క్యాన్సర్ చికిత్స అయినా లైంగిక కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

క్యాన్సర్ చికిత్స తర్వాత ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తిస్తే వారికి సరైన మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం కీలకం. ఇది వారిలో ఆత్మన్యూనత భావాన్ని తొలగించడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

Does cancer treatment affect your sexual desire or sex life in Telugu


లైంగిక సమస్యలను భాగస్వామితో ఇలా మాట్లాడాలి:

  1. లైంగిక సమస్యలు ఎదుర్కొంటుంటే ఆ విషయాన్ని భాగస్వామికి స్పష్టంగా తెలియజేయాలి. నిజాయితీగా ఉన్నప్పుడే ఎదుటి వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది కొంత ఇబ్బందిగా అనిపించినా.. తప్పదు.
  2. ఆందోళనలు, భయాల గురించి మాట్లాడాలి. వాటి గురించి మీరెంతగా ఫీల్ అవుతున్నారో ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పాలి. వారు అర్థం చేసుకోగలిగితే ఆ సమస్యల పరిష్కారానికి వారు కూడా తోడవుతారు.
  3. క్యాన్సర్ చికిత్సకు ఎంతో మనోధైర్యం కావాలి. అలాగే అది సమయంతో కూడుకున్నది. కాబట్టి ఓపికగా ఎదురుచూడటం ముఖ్యం.
  4. మీ ఆందోళనలు, భయాలు, ఫీలింగ్స్ వ్యక్తం చేయలేకపోతే కౌన్సిలర్ సహాయం తీసుకోవడం మంచిది. వారు మీ భావాలను మరింత బాగా వ్యక్తం చేయగలుగుతారు. అర్థమయ్యేలా చెబుతారు.

English summary

Does cancer treatment affect your sexual desire or sex life in Telugu

read this to know Does cancer treatment affect your sexual desire or sex life in Telugu
Story first published:Sunday, February 5, 2023, 20:00 [IST]
Desktop Bottom Promotion