For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆహార పదార్థాలు

చలికాలం వచ్చిందంటే చాలు చాలా మందికి జలుబు, దగ్గు, జ్వరం వస్తుంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో అయితే మరీనూ. ఇవే కాకుండా మరికొంరిలో కాళ్ల పగుళ్లు, శరీరం అంతా పొడిబారిపోయి దురద వంటి సమస్యలతో మరిన్ని సమస్యలు వస్తుంటాయి. ఇలాంట

|

చలికాలం వచ్చిందంటే చాలు చాలా మందికి జలుబు, దగ్గు, జ్వరం వస్తుంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో అయితే మరీనూ. ఇవే కాకుండా మరికొంరిలో కాళ్ల పగుళ్లు, శరీరం అంతా పొడిబారిపోయి దురద వంటి సమస్యలతో మరిన్ని సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్యలన్నిటికి చెక్ పెడుతూ.. చలికాలంలోనూ ఆరోగ్యంగా, అందంగా ఉండాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు.

Foods that improve immunity and other benefits in Telugu

వింటర్ లో వచ్చే ఆనారోగ్యాలన్నిటికి చెక్ పెట్టాలంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడమే సరైన మార్గం. కాలాలకు తగ్గట్లుగా ఆహారం తీసుకుంటే ఆరోగ్ంగా ఉండొచ్చ. అనేక రకాల వ్యాధుల నుంచి కూడా కుటుంబాన్ని రక్షించుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ కాలంలో తీసుకునే సరైన ఆహార పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వేరుశనగ:

వేరుశనగ:

వేరుశనగలో పుష్కలంగా ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, మైక్రో-మేక్రో న్యూట్రియంట్లు శరరాన్ని చాలా వెచ్చగా ఉంచుతాయి. ఇవి చలికాలంలో శరీరానికి కవచంలా మారి చలికాలపు అనారోగ్యాల నుంచి కాపాడతాయి. అయితే చాలా మందికి నేరుగా వేరుశనగ గుళ్లు తినడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్లు పల్లీలను ఈ రకంగా కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వేరుశెనగ చట్నీ నుండి వేరుశెనగ చాట్ వరకు కావాల్సిన విధంగా తీసుకోవచ్చు. మీరు వేరుశెనగ వెన్నని కూడా ఆస్వాదించవచ్చు. లేదా కాల్చిన వేరు శెనగతో మీ పోహాను అలంకరించుకోవచ్చు. మీకు స్వీట్లు ఎక్కువగా ఇష్టం ఉండే వేరుశనగ చిక్కీలను తయారు చేసుకొని సమయం ఉన్నప్పుడల్లా తినేసేయొచ్చు.

పాలు, అంజీరా:

పాలు, అంజీరా:

ఏ కాలాల్లో అయినా సరే పాలు, అంజీరలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే జీవ క్రియలను సమన్వయం చేసే శక్తి అంజీరాలో మెండుగా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా అధిక బరువు సమస్యను దరిచేరనివ్వదు. రోజూ కప్పు పాలల్లో మూడు అంజీరాలను వేసి మరిగించి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేస్తే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

 బెల్లం:

బెల్లం:

బెల్లంటో ఉండే విటామని సి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీనివల్ల మహిళలకు, పిల్లలకు అనేక ఆరోగ్య ప్రయేజనాలు చేకూరుతాయి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. రక్త ప్రసరణను సక్రమంగా జరిగేలా చేస్తుంది. రోజూ మితంగా బెల్లాన్ని తీసుకుంటే శీతాకాలాన్ని కూడా ఆరోగ్యంగా గడపవచ్చు. బెల్లాన్ని అనేక రకాల స్వీట్లలో ఉపయోగిస్తూ రోజూ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అలా నచ్చని వాళ్లు టీ, కాఫీల్లో చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడుకోవచ్చు.

ఉసిరి:

ఉసిరి:

ఉసిరి సీజనల్ ఫ్రూట్. ముఖ్యంగా చలికాలంలో ఇవి ఎక్కువగా దొరుకుతాయి. ఇందులోని సి విటామిన్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అనారోగ్యాల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఈ పండ్లలోని ఫ్లావనాల్స్, రసాయనాలు జ్ఞాపక శక్తిని పెంచుతాయి. మెదడును ఆరోగ్యంగా ఉంచడంతో ఒత్తిడి ఆందోళన దరి చేరవు. దీంతో మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఉసిరిలోని పీచు పదార్థం శరీరంలో త్వరగా కలిసిపోతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలో త్వరగా పెరగవు. పీచు కారణంగా జీర్ణశక్తి మెరుగుపడి మలబద్ధకం దూరం అవుతుంది. శరీరంలోని మలినాలు బయటకు పోయి, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కారణంగా హృద్రోగాలు, క్యాన్సర్ వంటి అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు.

జామకాయలు:

జామకాయలు:

జామ కాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తితో పాటు మరెన్నో లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరాన్ని తగ్గించుకోవచ్చు. జామకాయలో ఉండే విటామిన్ ఎ, సి వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఎ వల్ల న్యూట్రిషియన్ ఐ సైట్ ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే పీచు పదార్థాల వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

English summary

Foods that improve immunity and other benefits in Telugu

read on to know Foods that improve immunity and other benefits in Telugu
Story first published:Wednesday, December 7, 2022, 9:56 [IST]
Desktop Bottom Promotion