For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Health Benefits of Castor Oil :ఆముదం నూనెలో అందంతో.. ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలుసా...

ఆముదం నూనెతో మన ఆరోగ్యానికి ఎన్ని లాభాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మనం మన ఆరోగ్యం కోసం ఎన్ని మందులు వేసుకున్నా.. ఎన్ని జాగ్రత్తలు పాటించినా కోరుకున్న ఫలితం మాత్రం చాలా సార్లు దక్కదు. అలాంటి సమయంలోనే మన ఆరోగ్యం, అందం మెరుగయ్యేందుకు సహజంగా ఏదైనా దొరికితే బాగుండనిపిస్తుంది.

Health Benefits of Castor Oil in Telugu

అసలు అలాంటివి ప్రస్తుత పరిస్థితుల్లో దొరకుతాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆముదం నూనె(castor oil) అందరికీ చాలా అవసరమనిపిస్తుంది. ఆముదమా అని ఆశ్చర్యపోతున్నారా? అదే.. ఎందుకంటే మన దేశంలో కొన్ని శతాబ్దాల నుండి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఆముదం చెట్టు గింజల నుండి లభించే ఈ నూనె ఎన్నో సమస్యలకు నివారణగా పని చేస్తుంది.

Health Benefits of Castor Oil in Telugu

సహజంగా లభించే ఈ ఆముదంలో ఎన్నో పోషకాలున్నాయి. మరీ ముఖ్యంగా రిసినోలియెక్ ఆమ్లం, ఒమెగా-6 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇతో పాటు అనేక ఖనిజ లవణాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఇది మీ చర్మ సమస్యలకు, కురుల సమస్యలకు చాలా సులభంగా చెక్ పెట్టగలదు. అంతేకాదండోయ్ వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాల వల్ల అనారోగ్య సమస్యలు సైతం తగ్గిపోతాయి. ఇవి గుండె జబ్బులు, విషజ్వరం, కుష్టు, దురద, వాపు, నులిపురుగులు, మలబద్ధక సమస్యలను సులభంగా నివారించగలదు. ఈ సందర్భంగా ఆముదంతో ఆరోగ్య పరంగా ఇంకా ఎలాంటి ప్రయోజనాలు లభించనున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Diabetes: బ్లడ్ షుగర్ తగ్గించే ఆయుర్వేద సింపుల్ మార్గాలు... ఇలా చేస్తే మధుమేహం భయం ఉండదు!Diabetes: బ్లడ్ షుగర్ తగ్గించే ఆయుర్వేద సింపుల్ మార్గాలు... ఇలా చేస్తే మధుమేహం భయం ఉండదు!

కీళ్ల నొప్పుల నివారణకు..

కీళ్ల నొప్పుల నివారణకు..

ప్రస్తుత తరం వారిలో చాలా మంది కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారికి ఆముదం నూనెతో మంచి ఉపశమనం లభిస్తుంది. దీన్ని ఎలా వాడాలంటే.. ముందుగా ఆముదంలో మెత్తని బట్టను ముంచి కీళ్ల నొప్పులున్న చోట గట్టిగా చుట్టాలి. ఆ తర్వాత వేడి నీటి బ్యాగ్ పెట్టుకుంటే మీ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

జీర్ణక్రియ మెరుగుదల..

జీర్ణక్రియ మెరుగుదల..

మనలో ప్రతి ఒక్కరూ రెండు వారాలకొకసారి తమ జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసుకోవాలి లేదా కనీసం నెలకు ఒకసారైనా మన జీర్ణ వ్యవస్థను క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనం చాలా హెల్దీ లైఫ్ సాగిస్తాం. అందుకే ఆముదాన్ని తరచుగా వాడాలి. ఇది కడుపుబ్బరం, మలబద్ధకం, ఎసిడిటి వంటి సమస్యలను మన దరికి రాకుండా చేస్తుంది. ఇందుకోసం మీరు తీసుకునే ఆహారంలో ఆముదాన్ని భాగంగా చేసుకోవాలి.

దురదను తగ్గిస్తుంది..

దురదను తగ్గిస్తుంది..

ఆముదంలో ఉండే అన్ డీసైక్లీనిక్ యాసిడ్ తామర(దురద)పై ప్రభావవంతంగా పని చేస్తుంది. దీంతో మనకు దురదను తగ్గిస్తుంది. ఇందుకోసం ఆముదాన్ని ఎలా వాడాలంటే.. కొంచెం కొబ్బరినూనె, ఆముదం నూనె తీసుకుని కలిపి ఓ మిశ్రమంగా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని మీకు దురద ఉన్న చోట రెగ్యులర్ గా నెల రోజుల పాటు నెమ్మదిగా రాస్తే కచ్చితంగా ఉపశమనం లభిస్తుంది.

అలా తీసుకుంటే..

అలా తీసుకుంటే..

ఎవరైనా ఫుడ్ పాయిన్ లేదా మలబద్ధక సమస్యలతో బాధపడుతున్నారో.. అలాంటి వారు ఆరెంజ్ జ్యూస్ లో కొద్దిగా ఆముదం కలిపి దీన్ని తాగాల్సి ఉంటుంది. గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆముదం కలపాలి. దీన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. అరగంట సమయం తర్వాత ఒక గ్లాసు నీరు తాగాలి. అదే విధంగా అప్పుడప్పుడు గోరువెచ్చని నీటిని తాగాలి. ఆముదం కలిపిన రసం యొక్క రుచి కొంచెం తేడాగా ఉంటుంది. కానీ దీన్ని తాగితే ఆరోగ్యానికి మంచి ప్రయోజనం లభిస్తుంది.

Men Health: పురుషాంగంలో నొప్పికి కారణమేమిటి? దీనికి నివారణ ఏమిటి?Men Health: పురుషాంగంలో నొప్పికి కారణమేమిటి? దీనికి నివారణ ఏమిటి?

నడుము నొప్పి తగ్గుదల..

నడుము నొప్పి తగ్గుదల..

మీరు తరచుగా నడుము నొప్పితో బాధపడుతుంటే.. ఆముదం చక్కని మందుగా పని చేస్తుంది. ఆముదం నూనెతో 15-20 నిమిషాల పాటు మర్ద చేసుకుని వేడి నీటి బ్యాగ్ పెట్టుకుంటే నడుము నొప్పికి సులభంగా చెక్ పెట్టేయొచ్చు.

పేగు సమస్యలకు నివారణగా..

పేగు సమస్యలకు నివారణగా..

ఎవరైనా పేగులకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. ఆముదం చక్కని ఔషధంగా పని చేస్తుంది. ఆయుర్వేదశాస్త్రాన్ని నమ్మేవారు పాలలో ఆముదం కలిపి తీసుకుంటే.. ఎసిడిటి, కడుపుబ్బరం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మీరు గ్లాసు పాలల్లో టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా కలిపి తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

వేడి నీళ్లతో..

వేడి నీళ్లతో..

ముందుగా కొన్ని మంచి నీళ్లను తీసుకుని బాగా వేడి చేయాలి. అందులో ఒక స్పూన్ ఆముదం కలిపి తాగితే మెటబాలిజం ప్రక్రియ మెరుగయ్యేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. దీన్ని కూడా ఖాళీ కడుపుతోనే తాగాల్సి ఉంటుంది. ప్రతి వారం రెండుసార్లు ఇలా తాగడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ పనితీరు సులభమవుతుంది.

చిన్న గాయాలకు..

చిన్న గాయాలకు..

అప్పుడప్పుడు మనలో చాలా మందికి చిన్న చిన్న గాయాలవుతుంటాయి. అలాంటి సమయంలో ఆముదంలో ఉండే రిసినోలియెక్ ఆమ్లం ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి చిన్న చిన్న గాయాలు అయిన చోట వీటిని రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముందుగా ఆముదంలో కొంచెం దూదిని ముంచాలి. ఎక్కడైతే దెబ్బ తగిలుంటుందో.. అక్కడ దీన్ని రాయాలి. చిన్న చిన్న గాయాలపైనా దీన్ని రాసుకోవచ్చు. అయితే పెద్ద దెబ్బలు తగిలితే మాత్రం డాక్టర్ ను సంప్రదించడం మరచిపోవద్దు.

English summary

Health Benefits of Castor Oil in Telugu

Here are the health benefits of castor oil in Telugu. Have a look,
Desktop Bottom Promotion