For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజుకు ఎన్నిసార్లు, ఎంతసేపు బ్రష్ చేసుకోవాలి? డెంటిస్టులు ఏం చెబుతున్నారు?

రోజూ బ్రష్ చేసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే.. సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని అంటారు.

|

రోజూ ప్రతి ఒక్కరూ పళ్లు తోముకుంటారు. ఉదయం నిద్ర లేవగానే మొదట చేసే పని బ్రష్ చేసుకోవడమే. రాత్రంతా నిద్ర పోయిన తర్వాత పొద్దున లేవగానే నోటి నుండి దుర్వాసన వస్తుంది. అలాగే నోటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే పళ్లు, నోరు కడుక్కోవడం తప్పనిసరి.

పళ్లు తోముకోకపోతే ఏమవుతుంది?

పళ్లు తోముకోకపోతే ఏమవుతుంది?

రోజూ బ్రష్ చేసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే.. సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని అంటారు వైద్యులు. నోటిలో తయారయ్యే బ్యాక్టీరియా వల్ల గుండె సంబంధిత జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి దీర్ఘలాకి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రోజూ పళ్లు తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలని అంటారు వైద్య నిపుణులు.

బ్రషింగ్ అపోహలు?

బ్రషింగ్ అపోహలు?

బ్రష్ చేసుకోవడంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటుంది. దంతాలు తళతళ మెరిసిపోవాలంటే బ్రష్ నిండా పేస్టు పెట్టుకుని ఎక్కువ సేపు పళ్లు గట్టిగా రుద్దాలని చాలా మంది అనుకుంటారు. మరికొందరేమో టూత్ పేస్టుకు బదులు మౌత్ వాష్ వాడితే సరిపోతుందని చెబుతుంటారు. బ్రష్ సాఫ్ట్ గా ఉండాలని కొందరు, లేదు చాలా హార్డ్ గా ఉండాలని మరికొందరు చెబుతుంటారు.

అసలు పళ్లు ఎలా తోముకోవాలి?

అసలు పళ్లు ఎలా తోముకోవాలి?

పళ్లు తోముకోవడానికి మరీ సాఫ్ట్ బ్రష్ వాడొద్దని, మరీ హార్డ్ బ్రష్ కూడా వాడొద్దని డెంటిస్టులు చెబుతున్నారు. చాలా హార్డ్ గా ఉండే బ్రిజిల్స్ వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పొర తొలిగిపోతుంది. మరీ సాఫ్ట్ గా ఉండే బ్రష్ వాడితే పళ్లు సరిగ్గా శుభ్రం కావు. కాబట్టి మధ్యస్తంగా ఉండే బ్రష్ లు వాడాలని చెబుతుంటారు వైద్యులు. అలాగే ఎక్కువ సేపు తోమవద్దని సూచిస్తున్నారు డెంటిస్టులు. చాలా సేపు బ్రష్ వేస్తే పళ్లపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోతుంది. కాబట్టి 2 నుండి 3 నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలి. టూత్ పేస్టు కూడా ఎక్కువగా కాకుండా తక్కువ మొత్తంలో పెట్టుకోవాలని గుర్తుంచుకోవాలి. సరైన పద్ధతిలో పళ్లు తోముకుంటే నోరు చక్కగా శుభ్రం అవుతుంది. టూత్ పేస్టులో ఉండే ఫ్లోరైడ్ వల్ల పళ్లు శుభ్రపడతాయి.

బ్రషింగ్ కి బదులు మౌత్ వాష్ వాడొచ్చా?

బ్రషింగ్ కి బదులు మౌత్ వాష్ వాడొచ్చా?

కొందరు పళ్లు తోముకోకుండా కేవలం మౌత్ వాష్ వాడితే సరిపోతుందని అనుకుంటారు. కానీ అది ఏమాత్రం పని చేయదని చెబుతున్నారు డెంటిస్ట్ లు. బ్రష్ చేసుకున్న తర్వాత మౌత్ వాష్ వాడాలని సూచిస్తున్నారు. మౌత్ వాష్ తో పుక్కిలించడం వల్ల దంతాల మధ్య ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలు, క్రిములు తొలగిపోతాయి. అలాగో నోటి దుర్వాసన దూరం అవుతుంది. మౌత్ వాష్ లో ఉండే నూనెల వల్ల నోటిలోని క్రిములు, ఆహార పదార్థాలు పోతాయి. అలాగే మౌత్ వాష్ తో గార్గిలింగ్ చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

రోజుకు ఎన్నిసార్లు బ్రష్ చేసుకోవాలి?

రోజుకు ఎన్నిసార్లు బ్రష్ చేసుకోవాలి?

ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేచిన తర్వాత బ్రష్ చేసుకుంటారు. తర్వాత మిగతా కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. మరికొందరు ఉదయం నిద్ర లేచిన తర్వాత.. అలాగే పడుకునే ముందు బ్రష్ చేసుకుంటారు. డెంటిస్టులు చెప్పేది ఏమిటంటే.. రోజులో ఒక్క సారి కంటే రెండు సార్లు పళ్లు తోముకునే వారి దంతాలు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఉదయం చేసే బ్రషింగ్ వల్ల నోటి దుర్వాసన పోవడంతో పాటు నోరు శుభ్రం అవుతుంది. అలాగే అన్నం తిని పడుకునే ముందు బ్రషింగ్ చేయడం వల్ల పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలు తొలగిపోతాయి. క్రిములు పోతాయని వైద్యులు చెబుతున్నారు.

ఫ్లాసింగ్ వల్ల పళ్ల మధ్య గ్యాప్ ఎక్కువవుతుందా?

ఫ్లాసింగ్ వల్ల పళ్ల మధ్య గ్యాప్ ఎక్కువవుతుందా?

సన్నని దారంతో పళ్ల మధ్యలో శుభ్రం చేసుకోవడాన్ని ఫ్లాసింగ్ అంటారు. ఫ్లాసింగ్ ను రోజూ ఒక్కసారి అయినా చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీని వల్ల పళ్ల మధ్యలో గ్యాప్ వస్తుందని కొందరు అనుకుంటారు. కానీ పూర్తిగా అపోహేనని వైద్యులు చెబుతున్నారు. సరైన పద్ధతిలో ఫ్లాసింగ్ చేయడం దంత సంరక్షణకు శ్రేయస్కరం అని అంటున్నారు. పళ్లు సందుల్లో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వల్ల నోటి ఆరోగ్యం, చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు.

చిన్నపిల్లలు బ్రష్ చేసుకోవచ్చా?

చిన్నపిల్లలు బ్రష్ చేసుకోవచ్చా?

రెండేళ్లు దాటిన పిల్లలకు మాత్రమే బ్రషింగ్ చేయించాలి. మరీ చిన్న పిల్లలకు బ్రష్ చేయడం అవసరం లేదని చెబుతున్నారు వైద్యులు. వారికి కూడా పిడియాట్రిక్ టూత్ పేస్టుతోనే పళ్లను శుభ్రం చేయాలని సూచిస్తున్నారు. పెద్దలకు దంతాల శుభ్రత ఎంత ముఖ్యమో పిల్లలకూ అంతే ముఖ్యమని అంటున్నారు డెంటిస్టులు. వారు తినే ఆహారం దంతాల మధ్యలో ఇరుక్కునే అవకాశం ఉంటుందని, దానిని తొలగించుకోకపోతే క్రిములు, బ్యాక్టీరియా చేరి పాల దంతాలు పాడవుతాయని చెబుతున్నారు వైద్యులు. ఏడాది నుండి రెండేళ్ల మధ్య ఉన్న పిల్లల నోటిని నీటితో శుభ్రం చేయాలని పేర్కొంటున్నారు.

దంత సమస్యలు వస్తే డాక్టర్ ను సంప్రదించాలి

దంత సమస్యలు వస్తే డాక్టర్ ను సంప్రదించాలి

సమస్య వచ్చినప్పుడు వైద్యుల వద్దకు వెళ్లవచ్చులే అనుకుంటే పొరపాటేనని అంటున్నారు. నోటి సమస్యలు చాలా వరకు ఎలాంటి నొప్పి, లక్షణాలు లేకుండానే వస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో నిర్లక్ష్యం చేస్తే సమస్యల మరింత ముదురుతుందని వెల్లడిస్తున్నారు.

English summary

How Many Times and how often should you brush your teeth in Telugu

read on to know How Many Times and how often should you brush your teeth in Telugu
Story first published:Tuesday, July 26, 2022, 14:04 [IST]
Desktop Bottom Promotion