Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
World Kidney Day 2023: కిడ్నీలో రాళ్లు పోవాలంటే రోజూ ఎన్ని నీళ్లు తాగాలి?
రోజుకు ఎన్ని నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయో, కరిగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మానవ శరీరంలో ఏ అవయవం ప్రాముఖ్యత దానిది. దేనిని తక్కువ చేయడానికి వీల్లేదు. ఏ ఒక్క అవయవమైనా సరిగ్గా పనిచేయకపోతే అది పూర్తి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అలాగే శరీరం సక్రమంగా పని చేయడానికి ఒంట్లోని మలినాలను తొలగించడంలో మూత్రపిండాలదే కీలక పాత్ర. అయితే తినే ఆహారం, నీరు కలుషితమైనా, ఎక్కువ ఖనిజ మిశ్రమాలు శరీరంలోపలికి వెళ్లినా వాటి వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కాల్షియ, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు పేరుకుపోయి గట్టిగా రాళ్లలా మారతాయి. వీటినే కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అంటారు.

అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోవడం, విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం, అధిక బరువు, ఊబకాయం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్లతో బాధపడే వారికి చాలా మంది ఎక్కువగా నీళ్లు తాగాలని, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతుంటారు. అయితే రోజుకు ఎన్ని నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయో, కరిగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు నీళ్లేందుకు తాగాలి?:
కిడ్నీలో రాళ్లు తొలగిపోవడానికి ప్రతి వైద్యుడు చెప్పే సలహా హైడ్రేటెడ్ గా ఉండాలని చెబుతుంటారు. మానవ శరీరంలో 60-70 శాతం నీటితో నిర్మితమై ఉంటుంది. మూత్రపిండాలు రక్తం నుండి ద్రవాన్ని ఫిల్టర్ చేస్తాయి. వ్యర్థాలు మూత్రం రూపంలో శరీరం నుండి బయటకు వెళ్లిపోతాయి.
ఒక రోజులో మూత్రపిండాలు మొత్తం 3 లీటర్ల ప్లాస్మా వాల్యూమ్ ను 60 సార్లు ఫిల్టర్ చేస్తాయి. అంటే ప్రతి రోజూ దాదాపు 180 లీటర్ల ద్రవాన్ని మూత్రపిండాలు ఫిల్టర్ చేస్తాయి. ఈ 180 లీటర్లలో ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 1-2 లీటర్ల మూత్రం ఉత్పత్తి చేస్తాడు.
మూత్రం రూపంలో, చెమట రూపంలో శరీరం నుండి తొలగిపోయిన 1-3 లీటర్ల ద్రవాన్ని, భర్తీ చేయడానికి రోజూ కనీసం 2-3 లీటర్ల నీరు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు.
రోజుకు 1 లీటర్ కంటే తక్కువ మూత్రం విడుదలైనప్పుడు మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తలెత్తుతుంది. అందుకోసం మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వ్యక్తి రోజూ తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. నీరు తాగడం వల్ల మూత్రం వస్తుంది. ఎక్కువ నీరు తాగితే ఎక్కువ మూత్రం వస్తుంది. దీని వల్ల ఇప్పటికే ఏర్పడిన రాళ్లకు కొత్త లవణాలు, ఖనిజాలు అంటుకోకముందే శరీరం వాటిని మూత్రం రూపంలో బయటకు పంపేస్తుంది. అలాగే మూత్రంతో పాటు రాళ్లు కూడా బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది.

రోజు ఎంత నీటిని తాగాలి?:
సాధారణంగా, కిడ్నీలో రాళ్లు ఉంటే, ప్రతి రోజూ దాదాపు 3-4 లీటర్ల నీరు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. నీరు ఎక్కువగా తాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడవు, ఒకవేళ అప్పటికే ఏర్పడి ఉంటే అవి తొలగిపోతాయి.
రోజూ వ్యాయామం చేసే వారు, ఆరుబయట పని చేసే వారు, చెమట ఎక్కువగా చిందించే వారు ఎక్కువగా నీళ్లు తాగాల్సి ఉంటుంది. డీహైడ్రేషన్ ను నివారించడానికి వ్యాయామం చేస్తున్న సమయంలోనూ తగినంత నీరు తాగడం ముఖ్యం.

మూత్రం ఏ రంగులో ఉండాలి?:
మీరు ఎంత నీరు తాగుతున్నారు, శరీరానికి అవసరమయ్యే పరిమాణంలో తాగుతున్నారా, లేదా నీళ్లు తక్కువగా తాగుతున్నారా అనేది మూత్రం యొక్క రంగు చెప్పేస్తుంది. సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తుల మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది.
ఒకవేళ మీ మూత్రం రంగు ముదురుగా కనిపిస్తే మీరు తక్కువగా నీళ్లు తాగుతున్నారని, ఎక్కువ నీళ్లు తాగాలని అర్థం చేసుకోవాలి.
అతి వద్దు:
నీరు తాగడం శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం కీలకం. మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోవడానికి నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తుంటారని తెలిసిందే. అయితే అతి వద్దు. నీరు తాగితే మంచిదే కదా అని, కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయని అదే పనిగా నీళ్లు తాగొద్దు. నీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలపై ఎక్కువ పనిభారం పడుతుంది. ఇది మంచిది కాదు. అలాగే శరీరంలోని సోడియం కంటెంట్ ను పలుచన చేస్తుంది. అందుకే రోజూ ఎంత తాగాలో అంతే తాగాలి. మీ శరీరం చెప్పిన మాట వినాలి.

నీటికి బదులు ఇవి తాగొచ్చు:
* తాజా నిమ్మ సోడా
* దానిమ్మ రసం
* కొబ్బరి నీరు
* మిక్స్ డ్ ఫ్రూట్ జ్యూస్
* వెజిటెబుల్ జ్యూస్
* దోసకాయ, నిమ్మ డిటాక్స్ వాటర్
* పుచ్చకాయ, పుదీనా డిటాక్స్ వాటర్
కిడ్నీలో రాళ్లు ఉంటే ఇవి తాగొద్దు:
* కెఫీన్ ఎక్కువగా తీసుకోవద్దు(టీ, కాఫీ)
* కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగొద్దు(కూల్ డ్రింక్స్)
* కృత్రిమ స్వీటెనర్లతో కూడిన డ్రింక్స్
* ఆల్కహాల్ తీసుకోవద్దు



Click it and Unblock the Notifications