For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులు రోజూ ఒక కప్పు పెరుగు తింటే 'పెద్దప్రేగు క్యాన్సర్'ను నివారించవచ్చు!

|

పాల ఉత్పత్తుల్లో ప్రతి ఒక్కటీ శరీరానికి చాలా మంచిది. అయితే దీన్ని పరిమితంగా మాత్రమే వాడుకోవాలి. వెన్న, నెయ్యి వంటి పాలఉత్పత్తులను అధిక ప్రమాణంలో సేవించడం వల్ల వాటి నుండి కొవ్వు శరీరంలో చేరడం వల్ల అది ఇతర సమస్యలకు కారణం కావచ్చు. అందువల్ల ఏ ఆహారమైనా పరిమితంగా మాత్రమే తినాలి. పాలఉత్పత్తుల్లో పెరుగు కూడా ఒకటి. ఈ పెరుగులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కడుపులో మంటను తగ్గించడంతో పాటు, జీర్ణశక్తిని పెంచుతుంది. పొట్టలో కొవ్వు చేరకుండా చేస్తుంది. దీని గురించి అధ్యయనాలు ఏమి చెబుతున్నాయో మీరు తెలుసుకోండి.

పెరుగులో అధిక స్థాయిలో పోషకాలు ఉన్నాయి.
 

పెరుగులో అధిక స్థాయిలో పోషకాలు ఉన్నాయి.

పెరుగులో అధిక స్థాయిలో పోషకాలు ఉన్నాయి. మీరు మీ డైట్‌లో పెరుగును ఉపయోగించవచ్చు. పెరుగు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఆకలి పుట్టించేదిగా ఉపయోగించారు. ఇది అనేక సంస్కృతులు మరియు సంప్రదాయాలతో ముడిపడి ఉంది. పాలను పులియబెట్టడం ద్వారా పెరుగు తయారు చేస్తారు. పెరుగు క్యాన్సర్ నివారణ చేస్తుందన్న విషయం మీకు తెలుసా? ఇది విని మీరు ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అధ్యాయనాలు వెల్లడిస్తున్న సమాచారాన్ని బట్టి పెరుగు పురుషుల్లో క్యాన్సర్‌కు ముందు కణితుల పెరగకుండా ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి

వారానికి రెండుసార్లు పెరుగు తినడం వల్ల

వారానికి రెండుసార్లు పెరుగు తినడం వల్ల

వారానికి రెండుసార్లు పెరుగు తినడం వల్ల కడుపు క్యాన్సర్‌కు కారణమయ్యే అసాధారణ కణజాలాల అభివృద్ధిని నివారించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. బలంగా ఉన్న అసాధారణ కణజాలాలు క్యాన్సర్ అభివృద్ధికి ప్రధాన కారణం. అయితే కూడా పేగులో కణజాలం పెరగకుండా నిరోధించడంలో ఇది దిట్ట. ది జనరల్ గట్ ప్రతికలో ఈవిషయం ప్రచురించబడింది.

శాస్త్రీయ కోణంలో

శాస్త్రీయ కోణంలో

పెరుగు ఇంతటి ప్రాణాంతక క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా తగ్గిస్తుందని మీకు ఆశ్చర్యం కలిగవచ్చు. మీ అనుమానం లేదా ఆశ్చర్యాన్ని నివ్వుత్తి చేసే విషయంలో ఇక్కడ వివరంగా తెలపబడింది. మీరు రోజూ పెరుగు తింటే అది కడుపులో బ్యాక్టీరియా మార్పు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అయినప్పటికీ, పెరుగు తినే పరిమానాన్ని బట్టి క్యాన్సర్ పూర్వ కణితులను అభివృద్ధి చెందే ప్రమాదం తగ్గుతుందా అన్న విషయం మాత్రం అంత స్పష్టంగా లేదు. లాక్టోబాసిల్లస్ బల్గారికస్ మరియు స్ట్రెప్టోకోకస్ థర్మోఫిలస్ అనే రెండు రకాల బ్యాక్టీరియా పెరుగులో ఉన్నాయి. ఈ బ్యాక్టీరియా కడుపులో క్యాన్సర్ కు కారణమయ్యే రసాయనాలను తగ్గిస్తుంది.

వివిధ రకాల వ్యక్తులపై ఈ అధ్యయనం
 

వివిధ రకాల వ్యక్తులపై ఈ అధ్యయనం

వివిధ రకాల వ్యక్తులపై ఈ అధ్యయనం జరుపబడినది. శాస్త్రవేత్తలు వారు తీసుకునే ఆహార క్రమాన్ని కూడా పరిశీలించారు. ఈ అద్యయనం కోసం సుమారు 30000 మంది పురుషులు మరియు 55,000 మందికి పైగా మహిళలుపై పరిశోధనలు జరుపబడినది. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారికి ఎండోస్కోపీ కూడా జరపబడింది. దీని నుండి డాక్టర్లకు పొట్ట ఉదర పొరను చూడటానికి సాధ్యమైతుంది. రోజులో సంపూర్ణ ఆహారం తీసుకునే వారిలో పెరుగును తినే వారిని ప్రమాణాన్ని చేర్చారు. ఈ అధ్యయనం ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అధ్యన సమయంలో 5811 మంది పురుషుల్లో అసాధారణ కణజాలాలు కనుగొనబడ్డాయి మరియు మహిళల్లో ఎనిమిది వేలకు పైగా కణజాలాలు కనుగొనబడ్డాయి.

విశ్లేషణ

విశ్లేషణ

పెరుగు తినే పురుషుల్లో ఇతర పురుషుల కంటే అసాధారణ కణజాలం(క్యాన్సర్) వచ్చే అవకాశం 19 శాతం తక్కువ ఉంది. కానీ చాలా ప్రమాదకరమైన క్యాన్సర్ సంబంధింత అంశాలు మరియు దీనికి సంబంధించిన కొన్ని అధ్యయనాలు నిర్ధారించలేకపోయాయి. ఒకటి లేదా ఒక సెం.మీ కంటే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ ఇది ప్రమాదాన్ని తగ్గించిందని అధ్యయనాలు పేర్కొన్నారు. కాబట్టి పురుషుల రెగ్యులర్ డైట్ లో పెరుగు తినడం మంచిది. పురుషులు పెరుగును రెగ్యులర్ గా తింటే ఎటువంటి ప్రయోజనాలు పొందుతారో చూద్దాం.

ఓబేసిటి:

ఓబేసిటి:

కొన్ని పరిశోధనల ప్రకారం పెరుగుతో పాటు కొన్ని రకాల పాల ఉత్పత్తులు పురుషుల్లో ఊబకాయులు వేగంగా బరువు తగ్గించుకోవచ్చని కనుగొన్నారు.

మగవారిలో సెక్సువల్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

మగవారిలో సెక్సువల్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

కొన్ని పరిశోధల ప్రకారం రెగ్యులర్ గా పెరుగు తినే పురుషుల్లో టెస్టికల్స్ బాగా పెరిగినట్లు, దాంతో టెస్టోస్టెరాన్ లెవల్స్ మరియు వీర్యం కూడా పెరిగినట్లు వెల్లడించాయి. దీనికి కారనం పెరుగులో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అని చెబుతున్నారు.

జీర్ణశక్తిని పెంచుతుంది:

జీర్ణశక్తిని పెంచుతుంది:

పురుషుల్లో కొంత మంది జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు, అయితే వీరు హాస్పిటల్ కు వెళ్ళడం చాలా అరుదు. కాబట్టి, అనేక జీర్ణ సమస్యలను నివారించే పెరుగును న్యాచురల్ రెమెడీగా తినవచ్చు. పెరుగులో ఉన్న ప్రోబయోటిక్ బ్యాక్టీరియా జీర్ణ సంబంధిత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

కండరాలను బలోపేతం చేస్తుంది

కండరాలను బలోపేతం చేస్తుంది

కండారాలను పెంచుకోవాలి లేదా వీక్ గా న్న కండరాలను బలోపేతం చేసుకోవాలంటే హెల్తీ ప్రోటీన్ తీసుకోవాలి. అందుకు పెరుగు బాగా సహాయపడుతుంది.

English summary

Men who eat yogurt may have lower colon cancer risk

Yogurt vs curd has always been a fight. Some people prefer yogurt while others may like curd, but the best thing is both are rich in nutrients. So whatever you opt for you will be benefitted. Curd is one of the ancient appetizers in India. Many of our customs and traditions are linked to it. Also, the curd is made up of coagulating milk, meanwhile, yogurt is made up of bacterial fermentation of milk. Yogurt comes in various tastes as well which is a way to trick your children to eat it.
Story first published: Saturday, September 21, 2019, 15:39 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more