For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rift Valley Fever:RVF ఫీవర్ అంటే ఏమిటి? దాని లక్షణాలు, ట్రీట్మెంట్ ఎలాగో తెలుసుకోండి...

ఆర్వీఎఫ్ వ్యాలీ ఫీవర్ అంటే ఏమిటి? దాని లక్షణాలు, చికిత్స విధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

వైద్య నిపుణుల ప్రకారం, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(RVF) అనేది తీవ్రమైన వైరల్ నోసోకోమియల్ ఇన్ఫెక్షన్, ఇది ప్రధానంగా పెంపుడు జంతువులను ప్రభావితం చేస్తుంది. అయితే మనుషులపైనా దీని ప్రభావం పెరుగుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Rift Valley Fever:

యునైటెడ్ స్టేట్స్ లోని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రాణాంతకమైన రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(RVF) యొక్క తాజా వ్యాప్తిని కనుగొన్నారు. ఇది నేరుగా మనుషుల కణాలకు సోకుతుంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరైన వైరాలజిస్ట్ డాక్టర్ సఫ్దర్ గనై(కాశ్మీర్ కు చెందిన) ఈ వివరాలను వెల్లడించారు.

Rift Valley Fever:

రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(RVF) అనేది సబ్-సహారా ఆఫ్రికాలోని పశువులు, గేదేలు, గొర్రెలు, మేకలు, ఒంటెలను మాత్రమే ప్రభావితం చేసే బ్యాక్టీరియా వ్యాధి. ఈ వ్యాధి సోకిన జంతువుల రక్తం, శరీర ద్రవాలు లేదా కణజాలాలతో సంబంధంలోకి రావడం లేదా ఇవి సోకిన దోమల ద్వారా ప్రజలకు రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(RVF) సోకే ప్రమాదం ఉందని డాక్టర్ గనై చెప్పారు. అయితే ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తున్నట్లు ఎక్కడా నిరూపించబడలేదు. రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(RVF) జంతువులలో తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతున్నప్పటికీ, వైరస్ ఉన్న చాలా మంది వ్యక్తులు జ్వరం, బలహీనత, వెన్నులో నొప్పి, మైకం రావడం వంటి స్వల్ప లక్షణాలను అనుభవిస్తారు. అయినప్పటికీ, RVF(8-10%)ఉన్న వ్యక్తులలో కొద్ది శాతం మంది కంటికి సంబంధించిన సమస్యలు, రక్తస్రావం, మెదడువాపు వంటి చాలా తీవ్రమైన లక్షణాలను కలిగి ఉంటారు.

రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(RVF) అంటే ఏమిటి?

రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(RVF) అంటే ఏమిటి?

రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(RVF) అనేది తీవ్రమైన వైరల్ నోసోకోమియల్ ఇన్ఫెక్షన్, ఇది ప్రధానంగా పెంపుడు జంతువులను(గొర్రెలు, మేకలు, గేదెలు, ఒంటెలు వంటివి) ప్రభావితం చేయొచ్చు. అయితే మనుషులపైనా దీని ప్రభావం పెరుగుతోంది. ఆర్వీఎఫ్ వైరస్ బున్యావైరల్స్ క్రమానికి చెందిన ఫ్లెబోవైరస్ జాతికి చెందినది, అనారోగ్యానికి కారణమవుతుంది. హంటా వైరస్ లు, క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్(CCHF) వైరస్ వంటి కొన్ని బన్యావైరల్స్ ప్రజలలో అనారోగ్యానికి కారణమవుతాయి.

రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(RVF)ఎలా సంక్రమిస్తుంది?

రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(RVF)ఎలా సంక్రమిస్తుంది?

ఇది సోకిన జంతువుల రక్తం లేదా అవయవాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంపర్కం చేయడం వల్ల మానవులలో చాలా వరకు అనారోగ్యాలు సంభవిస్తాయి. పశువులను కభేళాకు తరలించే సమయంలో, జంతువుల వైద్యానికి సహాయం చేసే సమయంలో, వాటిని తరలించే సమయంలో ఎక్కువ సంక్రమణకు అవకాశం ఉంది. ఈ వైరస్ వ్యాధి సోకిన కత్తి నుండి లేదా వైరస్ సోకిన జంతువులను వధ చేసిన సమయంలో, వాటి నుండి ఏరోసోల్ ను పీల్చడం వంటి వాటి వల్ల ఈ మహమ్మారి సోకుతుంది.

రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(RVF) లక్షణాలు..

రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(RVF) లక్షణాలు..

ఈ వైరస్ కు గురైన తర్వాత RVF రెండు నుండి ఆరు రోజులలోపు డెవలప్ అవుతుంది. ఈ లక్షణాలు అనేక రకాల వ్యాధి సిండ్రోమ్ లకు కారణం కావొచ్చు. సాధారణంగా రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(RVF) లక్షణాలలో మొదటిది, తేలికపాటి అనారోగ్యం కలిగి ఉండటం. ఇందులో భాగంగా జ్వరం, బలహీనత, వెన్నునొప్పి, కళ్లు తిరగడం వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు ప్రారంభమైన తర్వాత రోగులు రెండు రోజుల నుండి ఒక వారంలోపు కోలుకుంటారు.

రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(RVF) ట్రీట్మెంట్..

రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(RVF) ట్రీట్మెంట్..

ఇప్పటివరకు రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(RVF) FDA-ఆమోదిత మందులు లేవు. RVF యొక్క చాలా సంఘటనలు చిన్నవి మరియు స్వీయ పరిమితం అయినందున దీనికి నిర్దిష్ట చికిత్స లేదు. జ్వరం మరియు శరీరం నొప్పులు చిన్న అనారోగ్యం యొక్క సాధారణ లక్షణాలను ఓవర్-ది-కౌంటర్ మందులతో నయం చేయొచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ లక్షణాలు ప్రారంభమైన వారంలోపే కోలుకుంటారు. అయితే తీవ్రమైన లక్షణాలు ఉంటే మాత్రం ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది.

FAQ's
  • రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(RVF)ఎలా సంక్రమిస్తుంది?

    ఇది సోకిన జంతువుల రక్తం లేదా అవయవాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంపర్కం చేయడం వల్ల మానవులలో చాలా వరకు అనారోగ్యాలు సంభవిస్తాయి. పశువులను కభేళాకు తరలించే సమయంలో, జంతువుల వైద్యానికి సహాయం చేసే సమయంలో, వాటిని తరలించే సమయంలో ఎక్కువ సంక్రమణకు అవకాశం ఉంది. ఈ వైరస్ వ్యాధి సోకిన కత్తి నుండి లేదా వైరస్ సోకిన జంతువులను వధ చేసిన సమయంలో, వాటి నుండి ఏరోసోల్ ను పీల్చడం వంటి వాటి వల్ల ఈ మహమ్మారి సోకుతుంది.

  • రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(RVF) అంటే ఏమిటి?

    రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(RVF) అనేది తీవ్రమైన వైరల్ నోసోకోమియల్ ఇన్ఫెక్షన్, ఇది ప్రధానంగా పెంపుడు జంతువులను(గొర్రెలు, మేకలు, గేదెలు, ఒంటెలు వంటివి) ప్రభావితం చేయొచ్చు. అయితే మనుషులపైనా దీని ప్రభావం పెరుగుతోంది. ఆర్వీఎఫ్ వైరస్ బున్యావైరల్స్ క్రమానికి చెందిన ఫ్లెబోవైరస్ జాతికి చెందినది, అనారోగ్యానికి కారణమవుతుంది. హంటా వైరస్ లు, క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్(CCHF) వైరస్ వంటి కొన్ని బన్యావైరల్స్ ప్రజలలో అనారోగ్యానికి కారణమవుతాయి.

English summary

Rift Valley Fever: What is RVF? know about symptoms & treatment in Telugu

Rift Valley Fever: What is RVF? Here's all you need to know about symptoms & treatment in Telugu. Read on
Story first published:Friday, April 15, 2022, 10:05 [IST]
Desktop Bottom Promotion