For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Stealth Omicron:ఒమిక్రాన్ BA.2 సబ్ వెర్షన్ అంటే ఏమిటి? దీని లక్షణాలేంటి.. పూర్తి వివరాలేంటో చూసెయ్యండి...

|

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా విభిన్న రూపాలు సామాన్యులతో పాటు సెలబ్రెటీలను సైతం వదలడం లేదు. దీంతో శాస్త్రవేత్తల ఆందోళనలు మరింత పెరిగాయి.

ఇప్పటికే రోజుకో కొత్త రకం వేరియంట్లు వచ్చి ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ కలవరపెడుతున్నాయి. తాజాగా ఐరోపాలో ఒమిక్రాన్ వేరియంట్ యొక్క కొత్త సబ్ వర్షన్ కనుగొన్నారు. దీన్ని 'స్టెల్త్ ఒమిక్రాన్' అని పిలుస్తున్నారు. ఈ BA.2 జాతి మరింత ప్రమాదకరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే ఇది RT-PCR టెస్టులను కూడా సులభంగా తప్పించుకుంటుంది. ఈ కారణంగానే దీనికి స్టెల్త్ అని పేరు పెట్టారు. అంటే ఇది రహస్యంగా ఉందని అర్థం. దీంతో యూరప్ దేశాల్లో కొత్త కరోనా మహమ్మారి ముప్పు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. దీని వ్యాప్తి గురించి అనేక దేశాల్లో పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల హై అలర్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

అబ్బాయిలు! మీ స్పెర్మ్ కౌంట్‌ని పెంచడానికి మరియు లైంగిక కోరికలను ప్రేరేపించడానికి 'ఈ' మసాలా సరిపోతుంది!

‘స్టెల్త్ ఒమిక్రాన్’ అంటే ఏమిటి?

‘స్టెల్త్ ఒమిక్రాన్’ అంటే ఏమిటి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఒమిక్రాన్ లో మొత్తం మూడు సబ్ వర్షన్లు ఉన్నాయి. అంటే సబ్-స్టెయిన్ Ba.1, Ba.2 మరియు Ba.3.BA.1 సబ్ వర్షన్లు ప్రపంచవ్యాప్తంగా కనుగొన్నారు. ఇప్పుడు BA.2 జాతులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. జనవరి 20వ తేదీ నాటికి డెన్మార్క్ లో BA.2 సబ్ వర్షన్లు సోకిన వారి సంఖ్య క్రియాశీల కేసులతో పోలిస్తే దాదాపు సగానికి తగ్గింది. అయితే యూకేలో ఆరోగ్య నిపుణుల ప్రకారం BA.2 స్ట్రెయిన్ త్వరలో ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్'గా ప్రకటించబడొచ్చు. ఒమిక్రాన్ కొత్త వెర్షన్ ను గుర్తించడం అంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు వాడుకలో ఉన్న టెస్టులకు ఈ కొత్త వెర్షన్ గుర్తించబడటం లేదు. అందుకే దీనికి నిపుణులు ‘స్టెల్త్' అని పేరు పెట్టారు.

స్టెల్త్ ఒమిక్రాన్ లక్షణాలివే..

స్టెల్త్ ఒమిక్రాన్ లక్షణాలివే..

* వాంతులు

* వికారంగా అనిపించడం

* అతిసారం

* కడుపు నొప్పి

* కడుపులో చిరాకుగా అనిపించడం

* వాపు

అమెరికాలో, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కూడా డయేరియాను ఓమిక్రాన్ యొక్క లక్షణంగా పేర్కొనబడింది.

భారత్ లో స్టెల్త్ కేసులున్నాయా?

భారత్ లో స్టెల్త్ కేసులున్నాయా?

బ్రిటన్ మరియు డెన్మార్క్ కాకుండా, స్వీడన్, నార్వే మరియు భారతదేశంలో కూడా BA.2 జాతులు ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి. భారతదేశం మరియు ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు కూడా ఈ కొత్త వేరియంట్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది BA.1ని ఓడించగలదని డాక్టర్లు చెప్పారు. అంటే ఈ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. యుకేలో కూడా జనవరి 10 నాటికి BA.2 సబ్ ఫార్మ్ ని గుర్తించింది.

Omicron Variant: మీరు క్లాత్ మాస్క్‌ ఉపయోగిస్తున్నారా? ఐతే వెంటనే క్లాత్ మాస్క్ ధరించడం మానేయండి...

‘స్టెల్త్ ఒమిక్రాన్’ ప్రమాదకరమా?

‘స్టెల్త్ ఒమిక్రాన్’ ప్రమాదకరమా?

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, BA.2 సబ్ వర్షన్ BA.1తో 32 జాతులను పంచుకున్నప్పటికీ, ఇది 28 కంటే ఎక్కువ ప్రత్యేకమైన ఉత్పరివర్తనాలను కలిగి ఉంటుంది. BA.1లో ఒక మ్యుటేషన్ ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ‘ఎస్' లేదా స్పైక్ జన్యువులో ఒక తొలగింపు ఇది. ఆర్టీపీసీఆర్ పరీక్షలో ఇది కనిపిస్తుంది. ఇది ఒమిక్రాన్ ని సులభంగా గుర్తించేలా చేస్తుంది. అయితే BA.2 రకంలో మ్యుటేషన్ అనేదే ఉండదు. దీంతో ఈ మహమ్మారిని కనుగొనడం చాలా కష్టమవుతుంది. BA.2 సబ్ లైన్ లోని స్పైక్ లో తొలగింపులు లేవు. ఇవి ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం ఉపయోగించే చాలా పీసీఆర్ కిట్లలో గుర్తించబడలేదు. ఇది BA.1 కంటే BA.2 వేగంగా పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి.

తొలిసారిగా ఎక్కడంటే..

తొలిసారిగా ఎక్కడంటే..

ఒమిక్రాన్ యొక్క కొత్త రూపం ప్రామాణిక ఒమిక్రాన్ రూపాంతరం వలె అదే విధంగా వ్యాప్తి చెందుతుందో లేదో తెలుసుకోవడం చాలా కష్టమని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ స్టెల్త్ వేరియంట్ జన్యుపరంగా విభిన్నంగా ఉంటుంది. అందుకే ఇది భిన్నంగా ప్రవర్తించొచ్చు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మరియు కెనడా వంటి దేశాల్లో కోవిద్ వైరస్ జన్యువులలో స్టెల్త్ వేరియంట్ మొట్టమొదట గమనించబడింది. ఇది ఇప్పటికే చాలా దేశాల్లో వ్యాపించి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

నివారణ మార్గాలు..

నివారణ మార్గాలు..

ఈ కొత్త వేరియంట్ బారిన పడకుండా ఉండాలంటే.. మిమ్మల్ని మీరు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం మీరు అప్రమత్తంగా ఉండాలి. కోవిద్ సోకినప్పుడు.. సోకనప్పుడు టెస్టు కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. ఇలాంటివి చేయడం వల్ల ఈ వేరియంట్..ఇంకా ఏదైనా కొత్త వేరియంట్ల నుండి సులభంగా తప్పించుకోవచ్చు.

English summary

Stealth Omicron : What is the Omicron BA.2 Sub Variant; Know Detection, Symptoms and Other Details in Telugu

Stealth Omicron: What is The Fast Spreading Omicron BA.2 Sub-Variant That Can Escape RT-PCR Test. Know Detection, Symptoms and Other Details in Telugu
Story first published: Monday, January 24, 2022, 13:28 [IST]
Desktop Bottom Promotion