For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాత్రూంలో ఇలా కూర్చుంటే క్యాన్సర్ వస్తుందట! మరెలా కూర్చోవాలి?

క్రమం తప్పకుండా మల విసర్జన చేయడం జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకం. కానీ రోజూ ఈ కార్యం చేసే సమయంలో కొంత మంది చాలా ఇబ్బంది పడతారు.

|

క్రమం తప్పకుండా మల విసర్జన చేయడం జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకం. కానీ రోజూ ఈ కార్యం చేసే సమయంలో కొంత మంది చాలా ఇబ్బంది పడతారు. సాఫీగా సాగాల్సిన ఈ పని సమస్యను, భయాన్ని, ఆందోళనను తెచ్చిపెడుతుంది. బాత్రూములో ఉన్న కొంత సమయం కూడా ప్రశాంతంగా కావాల్సిన పని.. ఇబ్బంది పెడుతుంటే అది వేరే రోగాలకూ దారి తీసే ప్రమాదం లేకపోలేదు. ఇలా దీర్ఘకాలంగా ఉంటే అది క్యాన్సర్ వచ్చేందుకు దారి తీస్తుంది.

బౌల్ క్యాన్సర్ అంటే ఏమిటి?

బౌల్ క్యాన్సర్ అంటే ఏమిటి?

బౌల్ క్యాన్సర్ అనేది పెద్ద పేగుల్లో వస్తుంది. పాశ్చాత్య దేశాల్లో ఈ క్యాన్సర్ సాధారణంగా మారింది. దీర్ఘకాలిక మలబద్దకం వల్ల బౌల్ క్యాన్సర్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. రోజూ మల విసర్జన చేయకపోవడం వల్ల, విసర్జన సమయంలో ఇబ్బంది ఎక్కువ కాలం ఉంటే అది క్యాన్సర్ వచ్చేందుకు దారి తీస్తుంది. కూర్చునే విధానం మల విసర్జనపై ప్రభావం చూపుతుంది. సరిగ్గా కూర్చుంటే శరీర బరువు కిందకి ఎక్కువగా ఉంటుంది. అలా విసర్జన సక్రమంగా ఉంటుంది. పేగు కదలికలు సులభంగా ఉంటి మల విసర్జనం జరుగుతుంది. ఇలా మల విసర్జన సక్రమంగా జరగనప్పుడు అది వివిధ సమస్యలకు దారి తీస్తుంది.

మల విసర్జనకు ఎలా కూర్చోవాలి?

మల విసర్జనకు ఎలా కూర్చోవాలి?

మల విసర్జనకు కూర్చునే విధానం బట్టి సక్రమంగా ఉంటుందా.. లేదా ఇబ్బందిగా ఉంటుందా అనేది ఆధారపడి ఉంటుంది. పేగులు నేరుగా ఉండేలా కూర్చుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా పని పూర్తి అవుతుంది. అలాగే పేరుకుపోయిన మలం అంతా విసర్జించ గలిగే వీలు కలుగుతుంది. అలా కాకుండా పేగు వంగేలా ఉన్నట్లైతే దాని వల్ల విసర్జన చేసే సమయంలో ఇబ్బంది కలుగుతుంది.

సిట్టింగ్ (వెస్టర్న్ స్టైల్ కమ్మోడ్):

సిట్టింగ్ (వెస్టర్న్ స్టైల్ కమ్మోడ్):

ఇది పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా వాడకంలో ఉంది. దీనిని వెస్టర్న్ స్టైల్ కమ్మోడ్ అని పిలుస్తారు. ఇలా కూర్చోవడం చాలా సౌలభ్యంగా ఉంటుంది. మామూలు కుర్చీపై కుర్చున్నట్లుగా ఉంటుంది. అయితే ఈ విధానంలో ఎక్కువ కాలం పాటు మల విసర్జనకు కూర్చుంటే ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్, దీర్ఘకాలిక మలబద్ధకం వంటి ఆరోగ్య పరిస్థితులకు దారి తీస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. ఇలా సిట్టింగ్ పొజిషన్ లో కూర్చోవడం వల్ల పేగులు నేరుగా ఉండలేవు. కింద కొంత వంకరంగా మారుతుంది. మల విసర్జనకు వీలుగా కండరాలు సంకోచించవు. ఇలాంటి పొజిషన్ లో విసర్జన చేయడం కష్టంగా ఉంటుంది. అలాగే పేరుకుపోయిన మలం మొత్తం విసర్జించడం కష్టంగా ఉంటుంది.

నడుము వంచి కూర్చోవడం:

నడుము వంచి కూర్చోవడం:

60-డిగ్రీల కోణంలో తుంటిని శరీరం నుండి దూరంగా ఉంచి టాయిలెట్‌పై కూర్చోవడం వల్ల... మల కండరాలు మరింత తటస్థ స్థితిలోకి రావడానికి సహాయపడతాయి. మలం బయటకు రావడానికి పట్టే ఒత్తిడిని తగ్గిస్తుంది. టాయిలెట్‌ను ఉపయోగించేందుకు చతికిలబడడం కంటే తుంటిని వంచి కూర్చోవడం మంచిదని సూచిస్తున్నారు. కానీ దీనికి ఎటు వంటి అధ్యయనాలు లేవని పలువురు అంటున్నారు.

స్క్వాటింగ్ పొజిషన్(ఇండియన్ స్టైల్):

స్క్వాటింగ్ పొజిషన్(ఇండియన్ స్టైల్):

మల విసర్జన చేసేందుకు ఇండియన్ స్టైల్ పొజిషన్ చాలా ప్రాచుర్యం పొందినది. ఇలా మోకాళ్లను వంచి, కాళ్లను దూరంగా జరిపి కూర్చోవడం వల్ల పేగులు నేరుగా ఉంటాయి. ఇలా పేగులు ఉండటం వల్ల మలం విసర్జించేందుకు సులభం అవుతుంది. మిగతా పొజిషన్ల కంటే దీని వల్ల మలం సులభంగా బయటకు వెళ్తుంది. ఈ పొజిషన్ లో బాత్రూంకు వెళ్లే వాళ్లలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మలబద్ధకం సమస్య తలెత్తదు. పేరుకు పోయిన మొత్తం మలం బయటకు వెళ్లేందుకు ఇది సరైన పొజిషన్.

పాటీ స్టూల్స్:

పాటీ స్టూల్స్:

మీరు టాయిలెట్‌ని ఉపయోగించినప్పుడు ఇవి కాళ్లను పైకి లేపుతాయి. ఇది వెస్టర్న్ స్టైల్ ను, ఇండియన్ స్టైల్ ను కలిపినట్లుగా ఉంటుంది. వెస్టర్న్ స్టైల్ కమ్మోడ్ లో కూర్చుని కింద స్టూల్ పెట్టుకుని దానిపై కాళ్లు పెట్టుకుంటే కూర్చోవడం మరింత తేలిక అవుతుంది. ఇలా కూర్చుంటే మల విసర్జన సాఫీగా సాగుతుంది.

విసర్జనను సులభం చేయడానికి మరిన్ని మార్గాలు:

విసర్జనను సులభం చేయడానికి మరిన్ని మార్గాలు:

మల విసర్జనకు ఉపయోగించే పొజిషన్ ను మార్చడంతో పాటు, మరికొన్ని మార్గాలు అన్వేషించాలి.

1. ఫైబర్ ఎక్కువగా తినాలి

1. ఫైబర్ ఎక్కువగా తినాలి

రోజుకు 25 నుండి 38 గ్రామాలు ఫైబర్ ను తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫైబర్ తీసుకోవడం వల్ల మీ పేగుల ద్వారా మలం సులభంగా బయటకు వెళ్తుంది.

2. హైడ్రేటెడ్ గా ఉండండి

2. హైడ్రేటెడ్ గా ఉండండి

విసర్జన సమయం వచ్చినప్పుడు మీ మలంలోని నీటి కంటెంట్ ముఖ్యం. డీహైడ్రేషన్ వల్ల మలబద్దానికి దారి తీసేలా మలం గట్టిగా ఏర్పడుతుంది.

3. వ్యాయామం

3. వ్యాయామం

పెద్ద పేగు సాధారణ వ్యాయామం ద్వారా ప్రేరేపించబడుతుంది. ఇది పేగులోని మలాన్ని క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. వ్యాయామం కూడా ఉదర ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది.

4. సమయపాలన పాటించాలి

4. సమయపాలన పాటించాలి

జీర్ణ క్రియ విషయానికి వస్తే మన శరీరాలు ఆటోపైలట్‌తో పనిచేస్తాయి. ప్రతి రోజూ అదే సమయంలో బాత్రూంకు వెళ్లాలి. ఇలా రోజూ చేయడం వల్ల మనకు తెలియకుండానే అదే సమయంలో మన శరీరం బాత్రూంకు వెళ్లాల్సిన సమయాన్ని గుర్తు చేస్తుంది.

మలబద్ధకం లక్షణాలు:

మలబద్ధకం లక్షణాలు:

* ముదురు రంగులో ముద్దగా ఉండే మలం బయటకు వెళ్లడం కష్టం.

* మీ పురీషనాళంలో అడ్డంకులు ఏర్పడినట్లు లేదా ఏదో ఒకటి ఉన్నట్లుగా భావించడం.

* మీ పేగు కదలికల సమయంలో ఒత్తిడిగా ఉండటం.

* పేగు కదలికల సమయంలో అధిక ఒత్తిడి లేదా నొప్పి

English summary

What is the best pooping position in telugu

read on to know What is the best pooping position in telugu
Story first published:Monday, August 1, 2022, 12:10 [IST]
Desktop Bottom Promotion