For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన ఆరోగ్యాన్ని కాపాడే మందులను తయారు చేసేది వీళ్లే..

|

ఆరోగ్యం అంటే అందరికీ మోజు. ఆరోగ్యం కోసం ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ నానా పాట్లు పడుతుంటారు. హెల్త్ పట్ల ఇప్పుడిప్పుడే జనాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ చిన్నపాటి రోగమొచ్చినా వెంటనే మెడిసిన్స్ తీసుకుంటున్నారు. సో మన హెల్త్ మెరుగుదలలో మెడిసిన్స్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.

World pharmacist day

అలాంటి మెడిసిన్స్ ను ఎవరు మెరుగుపరుస్తారో, ఎవరు తయారు చేస్తారో తెలుసా? ఫార్మాసిస్టులు. ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే ఈరోజు వరల్డ్ ఫార్మాసిస్టు డే. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన ఫార్మాసిస్టు డేని ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఫార్మాసిస్టులు మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎలాంటి పాత్ర పోషిస్తారో, వైద్య ప్రపంచంలో ఫార్మాసిస్టులు ప్రజలను అర్థం చేసుకునేందుకు ఎలాంటి కార్యకలాపాలు చేపడతారో తెలుసుకుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

1) ఫార్మాసిస్టు రెండో వైద్యుడు..

1) ఫార్మాసిస్టు రెండో వైద్యుడు..

photo curtosy

ఒక ఫార్మాసిస్టు ఎప్పుడూ రెండో వైద్యుడిగా పరిగణించబడతాడు. అతను రోగులకు కావాల్సిన మందులను, ఏ రోగికి ఎంత మోతాదులో మెడిసిన్ కావాలో నిర్ధారిస్తాడు. అంతేకాదు వాటి వల్ల ప్రయోజనాలు కలిగేలా చేస్తాడు. దుష్ప్రభావాలు కలగకుండా మార్గనిర్దేశాలు చేస్తాడు. క్లినికల్ ఫలితాలను మెరుగుపరచడానికి మెడిసిన్స్ వాటి వాడే పద్ధతిని సురక్షితమైన వాడకాన్ని కూడా ప్రోత్సహిస్తాడు. అందుకే ప్రపంచ ఫార్మాసిస్టు (ఔషధ తయారీదారుడు) దినోత్సవం రోజున ఫార్మాసిస్టులకు ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోతుంది.

2) ఫార్మాసిస్టుల ప్రాముఖ్యత..

2) ఫార్మాసిస్టుల ప్రాముఖ్యత..

ప్రపంచంలోని ప్రతి ఒక్క రోగికీ అందరికీ సురక్షితమైన మరియు సమర్థవంతమైన మందులు అందించేందుకు అనుక్షణం వారు ఆరాటపడతారు. ఔషధాల వాడకాన్ని మెరుగుపరచి, రోగుల భద్రతను నిర్ధారించే మరియు పరిరక్షించే ఫార్మాసిస్టుల కీలక పాత్రను హైలెట్ చేయడానికి ఈ పేరును పెట్టారు. ఫార్మాసిస్టులు ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తారు.

3) మెడిసిన్స్ లోపాలను తగ్గించడం..

3) మెడిసిన్స్ లోపాలను తగ్గించడం..

ప్రజల ఆరోగ్య భద్రత రీత్యా మెడిసిన్స్ లోని లోపాలను తగ్గించేందుకు ఫార్మాసిస్టులు ఎక్కువగా కృషి చేస్తారు. ఫార్మాసిస్టులు వారి విస్తృత జ్ఞానం మరియు నైపుణ్యాన్ని ప్రజల ఆరోగ్యాల కోసం ఉపయోగిస్తారు. ఎందుకంటే ఏ ఒక్క రోగిని హాని కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. వారు తయారు చేసిన మెడిసిన్స్ నుండి ఉత్తమ ఫలితం వచ్చేలా చాలా కృషి చేస్తారు.

4) డాక్టర్ కంటే తక్కువ కాదు..

4) డాక్టర్ కంటే తక్కువ కాదు..

photo curtosy

చాలా మంది తమ పని సూచించిన మందులను అప్పగించడమే అనుకుంటారు. కానీ జ్ఞానం మరియు అనుభవరం పరంగా వారు డాక్టర్ కంటే ఏ మాత్రం కాదు. ఎందుకంటే ఫార్మాసిస్టులకు మెడిసిన్స్ వాటి దుష్ప్రభావాల గురించి బాగా తెలుసు. నిరుపేదలకు ఔషధాలను అందించడంలోనూ వారు ఎక్కువ బాధ్యత వహిస్తారు.

5) ఫార్మాసిస్టు డే ఎలా వచ్చిందంటే..

5) ఫార్మాసిస్టు డే ఎలా వచ్చిందంటే..

రోగులకు హాని లేదా మరణానికి మూడో ప్రధాన కారణ లోపం ఔషధ లోపం అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. లోపం తరచుగా శాశ్వత అవయవ నష్టం, పక్షవాతం లేదా మరణానికి దారి తీస్తుంది. ఔషధ లోపం మరియు వాటిని నివారించడంలో ఫార్మాసిస్టుల వల్ల కలిగే పరిణామాలను చూసిన ఈరోజును ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ 2009 ఇస్తాంబుల్ (టర్కీ)లో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లో స్వీకరించింది. కానీ అంతకుముందే 1912 సంవత్సరంలోనే సెప్టెంబర్ 25న ఫార్మాసిస్టు డే జరుపుకోవడానికి ఎంపిక చేయబడింది. అప్పటినుండి ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ ప్రారంభించబడింది.

6) ఆరోగ్య సంరక్షకుడిగా..

6) ఆరోగ్య సంరక్షకుడిగా..

ఫార్మాసిస్టులు కూడా సాంప్రదాయకంగా అచ్చం వైద్యుడి లాగే తెల్లటి కోటు ధరించి, మందులు పంపిణీ చేసే ఆరోగ్య సంరక్షక నిపుణుడిలా వారిని భావించవచ్చు. కాని ఔషధ పంపిణీకి మించి ఫార్మాసిస్టు పాత్ర విస్తరిస్తుందని మనం తెలుసుకోవాలి.

7) ఫార్మాసిస్టుందరికీ ధన్యవాదాలు..

7) ఫార్మాసిస్టుందరికీ ధన్యవాదాలు..

ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ ఫార్మాసిస్టులకు వారి ప్రోత్సాహాలకు మరియు ప్రతి ఒక్కరి జీవితంలో వారి ప్రతిభావంతమైన పాత్రకు ధన్యవాదాలు తెలుపుదాం. ఈ సందేశాన్ని సోషల్ మీడియా ఇతర చోట్ల షేర్ చేసుకుని మన చుట్టూ ఉండే ఫార్మాసిస్టులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుదాం.

English summary

World pharmacist day 2019 : date, theme and significance

A pharmacist is often regarded as a second doctor who ensures the proper delivery of the medications to the patients and guides them in understanding the benefit as well as the side effects of the same. They also promote the safe use of medicines and methods to improve clinical outcomes. On this regard, every year on 25 September, World Pharmacists Day is celebrated to highlight their key role in patients' safety and reduced medications error.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more